flop
-
నా సినిమా ఫ్లాఫ్ అయితే వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా సర్ఫీరా మూవీతో ప్రేక్షకులను పలరించాడు. ఈ చిత్రం సూర్య నటించిన సూపర్‌హిట్ మూవీ సూరారైపోట్రుకు రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాకు కూడా సుధా కొంగర దర్శకత్వం వహించారు. జూలై 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన సర్ఫీరా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. ఈ సందర్భంగా అక్షయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. మన సినిమాలు ఫ్లాఫ్ అయినప్పుడు ఎలా ఉండాలో అమితాబ్‌ను చూసి నేర్చుకున్నట్లు వెల్లడించారు. కాగా.. ఏప్రిల్ 10న విడుదలైన బడే మియాన్ చోటే మియాన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో సెలెక్టివ్‌గా పనిచేసే వ్యక్తులను నేను చూశా. వారి సినిమాలు కూడా కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఇక్కడ సినీ పరిశ్రమలో ఫ్లాప్‌లు వస్తే మనకు అవకాశాలు ఇవ్వడం మానేస్తారు. కొందరు వ్యక్తులు నా సినిమాల వైఫల్యాలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలా చూడటం వాళ్లకు ఇష్టం. కానీ నేను నా శ్రమను నమ్ముకున్నా. అయితే ఇలాంటి వాటిని తప్పకుండా ఖండించాలి. అయితే నేను అమితాబ్ బచ్చన్ నుంచి ఓ విషయం నేర్చుకున్నా. ఫ్లాఫ్ వచ్చినా మన పనిని మాత్రం ఆపకూడదు. మన పనితో పాటు అదృష్టాన్ని నమ్ముకోవాలని ఆయన సలహా ఇచ్చారు.' అని అన్నారు. అయితే తాను ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదని తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అసహనం వ్యక్తం చేశారు. 'బడే మియాన్ చోటే మియాన్' షూటింగ్ కోసం 80 రోజులు కేటాయించినట్లు అక్షయ్ కుమార్ వెల్లడించాడు. కాగా.. అక్షయ్ నటించిన 'బడే మియాన్ చోటే మియాన్', 'రామ్ సేతు', 'రక్షా బంధన్', 'బచ్చన్ పాండే', 'సెల్ఫీ' బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయాయి. -
వరుస ప్లాప్‌లు.. ఏం పర్లేదు శ్రీలీల ఈస్ బ్యాక్
-
Year End 2023: హిట్లు తక్కువ..ఫ్లాపులెక్కువ
స్ట్రయిట్ చిత్రాలు 236... డబ్బింగ్ సినిమాలు 70... మొత్తం 306 చిత్రాలను 2023 ఇచ్చింది. మరి జయాపజయాల శాతం ఎంత? అంటే... ఎప్పటిలానే విజయాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు... అపజయాలు లెక్కలేనన్ని. అయితే విజయం సాధించినవాటిలో ఎమోషనల్‌గా సాగేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ విధంగా ఈ ఏడాది భావోద్వేగాలకు ప్రేక్షకులు ప్రాధాన్యం ఇచ్చారనుకోవచ్చు. ఇక ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు..’ పాటకిగాను కీరవాణి, చంద్రబోస్‌లకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు దక్కడం ఓ రికార్డ్. తెలుగు నుంచి జాతీయ తొలి ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్‌కి దక్కడం మరో ఆనందం. ఇలా కొన్ని ఆనందాలను ఇచ్చింది 2023. కె. విశ్వనాథ్, జమున, కైకాల సత్యనారాయణ, చంద్రమోహస్ వంటి వారిని దూరం చేసి, విషాదాన్ని మిగిల్చింది. ఇక... ఈ ఏడాది లెస్ హిట్.. మోర్ ఫట్‌గా సాగింది తెలుగు సినిమా. ఆ విశేషాల్లోకి... స్టార్ హీరోలు కొందరు ‘హిట్ హిట్ హుర్రే’ అంటూ మంచి విజయాలు అందుకున్నారు. వారితో పాటు కొందరు మీడియమ్ రేంజ్, చిన్న రేంజ్ హీరోలకూ 2023 విజయానందాన్నిచ్చింది. ఆ హిట్స్ గురించి తెలుసుకుందాం. సంక్రాంతి అంటే సినిమాల పండగ. అలా ఈ ఏడాది పండగకి అన్నదమ్ముల సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో వచ్చిన బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ మంచి వసూళ్లు రాబట్టాయి. చిరంజీవి హీరోగా, రవితేజ ఓ కీలక పాత్రలో ‘వాల్తేరు వీరయ్య’కు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించగా, ‘వీరసింహారెడ్డి’ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. సంక్రాంతికి మంచి హిట్ అందుకున్న బాలకృష్ణ దసరా పండక్కి ‘భగవంత్ కేసరి’తోనూ మరో హిట్ సాధించారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఈ ఏడాది ఓ హిట్.. ఓ ఫట్ పడ్డాయి. ‘సలార్: సీజ్ఫైర్’తో ప్రభాస్‌కి సూపర్ డూపర్ హిట్ దక్కింది. స్నేహం ప్రధానాంశంగా ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ ఏడాది నానీకి బాగా కలిసొచ్చింది. శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాని హీరోగా నటించిన మాస్, ఎమోషనల్ మూవీ ‘దసరా’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే శౌర్యువ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నాని హీరోగా నటించిన ఎమోషనల్ మూవీ ‘హాయ్ నాన్న’ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ, సమంతల వెండితెర ప్రేమకథ ‘ఖుషీ’ కూడా ప్రేక్షకులను ఖుషీ చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపోందిన ఈ ఎమోషనల్ లవ్‌స్టోరీ మంచి వసూళ్లు రాబట్టుకుంది. తమిళ స్టార్ ధనుష్ తెలుగులో చేసిన స్ట్రయిట్ ఫిల్మ్ ‘సార్’. తెలుగు, తమిళ భాషల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపోందిన ఈ పీరియాడికల్ యాక్షన్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. నాలుగేళ్లుగా హీరోయిన్ గా తెలుగు వెండితెరపై కనిపించని అనుష్కా శెట్టి ఈ ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టితో కలిసి ఈ సినిమాతో రొమాంటిక్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రానికి పి. మహేశ్‌బాబు దర్శకుడు. అలాగే కుర్ర హీరోల్లో సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ హిట్‌తో జోష్‌గా ఉన్నారు. హారర్ థ్రిల్లర్‌గా కార్తీక్ దండు దర్శకత్వంలో ‘విరుపాక్ష’ రూపోందింది. గత ఏడాది హిట్ అందుకోలేకపోయిన శ్రీవిష్ణు ‘సామజవరగమన’ అంటూ ప్రేక్షకులను నవ్వించి ఈ ఏడాది సూపర్ హిట్ సాధించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఆకట్టుకుంది. అలాగే కుర్ర హీరో ఆనంద్ దేవరకొండ ‘బేబీ’తో పెద్ద హిట్ అందుకున్నారు. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ మూవీకి సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. హాస్య నటుడు వేణు కెరీర్ డైరెక్షన్ ఈ ఏడాది మరో మలుపు తిరిగింది. వేణు తొలిసారి దర్శకత్వం వహించిన ‘బలగం’ సినిమా సూపర్‡హిట్‌గా నిలిచింది. తెలంగాణలోని కాకిముట్టుడు సంప్రదాయం, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపోందిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ‘బలగం’ విడుదలయ్యేటప్పుడు చిన్న చిత్రమైనా వసూళ్లతో పెద్ద సినిమాగా మారింది. రెండేళ్ల క్రితం ‘మా ఊరి పోలిమేర’తో మంచి హిట్ అందుకున్నారు ‘సత్యం’ రాజేశ్. అయితే ఆ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమా సీక్వెల్ ‘మా ఊరి పోలిమేర 2’తో ఈ ఏడాది థియేటర్స్‌లో సక్సెస్ అందుకున్నారు ‘సత్యం’ రాజేశ్. ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. ఇక 2023కి ముగింపు పలుకుతూ శుక్రవారం (డిసెంబర్ 29) విడుదలైన చిత్రాల్లో కల్యాణ్‌రామ్ ‘డెవిల్’కి ప్రేక్షకాదరణ లభిస్తోంది. స్వీయదర్శకత్వంలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంకా స్ట్రయిట్ హిట్ చిత్రాల్లో కార్తికేయ ‘బెదురులంక 2012’, ‘అల్లరి’ నరేశ్ ‘ఉగ్రం’, పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’, నవీన్ చంద్ర ‘మంత్ ఆఫ్ మధు’, సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌ల ‘మ్యాడ్’, తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ వంటివి ఉన్నాయి. అనువాద చిత్రాల్లో రజనీకాంత్ ‘జైలర్’, విజయ్ ‘వారసుడు’, ‘లియో’, మణిరత్నం ‘పోన్నియిన్ సెల్వన్ 2’, విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు 2’, టొవినో థామస్ ‘2018’, షారుక్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’, రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ వంటివి మంచి వసూళ్లు రాబట్టాయి. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన కొన్ని చిత్రాలతో పాటు ఏ అంచనాలు లేకుండా విడుదలైన చిత్రాలు పరాజయాన్ని చవి చూశాయి. ఫట్ అయిన ఆ చిత్రాల గురించి.. ‘వాల్తేరు వీరయ్య’చిత్రంతో హిట్ సాధించిన చిరంజీవికి ‘భోళా శంకర్’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’ రీమేక్‌గా మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ రూపోందింది. ఆల్రెడీ వేరే భాషలో హిట్టయిన సినిమా కాబట్టి ఇక్కడ కూడా ఆ ఫలితాన్ని ఆశించారు. కానీ అది నెరవేరలేదు. ఇక ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన చిత్రం ‘ఆది పురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో రూపోందిన ఈ పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో నెలకొన్నాయి. రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాల నేపథ్యంలో రూపోందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో పరాజయంగా నిలిచింది. రవితేజ సోలో హీరోగా నటించిన (‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో కీలక పాత్ర చేశారు) ‘రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు బోల్తా కొట్టాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’, వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ రూపోందాయి. ‘కస్టడీ’ చిత్రం రూపంలో ఈ ఏడాది నాగచైతన్యకు పరాజయం ఎదురైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ రూపోందింది. హీరో రామ్–దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘స్కంద అంచనాలను అందుకోలేకపోయింది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్’ కూడా నిరాశనే మిగిల్చింది. ఈ ఏడాది వరుణ్ తేజ్ వ్యక్తిగతంగా ఫుల్ హ్యాపీ. లావణ్యా త్రిపాఠీని పెళ్లి చేసుకుని, లైఫ్‌లో కొత్త చాప్టర్‌ని మొదలుపెట్టారు. అయితే కెరీర్ పరంగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’ నిరాశపరిచింది. నితిన్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్లో రూపోందిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’ ఆర్డినరీ సినిమా అనిపించుకుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగ మార్తాండ’ ఎమోషనల్ మూవీ అనిపించుకుంది. టాక్ బాగున్నా వసూళ్లు ఆశించిన విధంగా రాలేదు. హీరోయిన్ సమంత, నటుడు దేవ్ మోహన్ కాంబినేషన్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇవే కాదు.. గోపీచంద్ ‘రామబాణం’, కల్యాణ్ రామ్ ‘అమిగోస్’, నిఖిల్ ‘స్పై’, వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’, సుధీర్ బాబు ‘హంట్, మామా మశ్చీంద్ర’ వంటి సినిమాలతో పాటు మరికొన్ని ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. -
నా సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం ఏంటి అంటే...
-
ఐపీఎల్ 2023లో ఫ్లాప్ అయిన టాప్-5 విదేశీ ఆటగాళ్లు
రెండు నెలలుగా అభిమానులను అలరించిన ఐపీఎల్ 16వ సీజన్ ఈ వారంతో ముగియనుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, లక్నోసూపర్జెయింట్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం(మే 23న) క్వాలిఫయర్-1లో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ అమితుమీ తేల్చుకోనున్నాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెడితే.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఇక ఎలిమినేటర్ పోరులో లక్నో, ముంబై తలపడనున్నాయి. ఈ విషయం పక్కనబెడితే ఐపీఎల్ 16వ సీజన్ విదేశీ ఆటగాళ్లకంటే దేశవాలీ ఆటగాళ్లనే ఎక్కువగా వెలుగులోకి తీసుకొచ్చింది. తక్కువ ధరకే అమ్ముడయిన చాలా మంది ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రింకూ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, అథర్వ టైడే, తుషార్ దేశ్‌పాండే, యశస్వి జైశ్వాల్, మతీషా పతీరానా సహా చాలా మంది ఉన్నారు. వీరిని మినహాయిస్తే ఐపీఎల్ 2023 సీజన్‌కు కోట్లు పెట్టి కొనుక్కున్న విదేశీ ఆటగాళ్లలో చాలా మంది దారుణంగా విఫలమయ్యారు. కొందరు గాయాలతో సీజన్‌కు దూరంగా ఉంటే.. అవకాశాలు ఇచ్చినా ఆడడంలో ఫెయిలయ్యారు. మరి ఐపీఎల్ 16వ సీజన్లో అత్యంత ఎక్కువ ధర పలికి ఫ్లాప్ షో కనబరిచిన టాప్-5 విదేశీ ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం. బెన్ స్టోక్స్(సీఎస్కే): Photo: IPL Twitter ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సీఎస్కే తరపున రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్‌లో ఒక ఓవర్ వేసి 18 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. అసలు సీజన్ ఆరంభానికి ముందు బెన్ స్టోక్స్ సీఎస్కేకు కీలకంగా మారతాడని అంతా అనుకున్నారు. కానీ గాయం కారణంగా అతను రెండు మ్యాచ్‌లకు మాత్రమే పరిమితమయ్యాడు. తర్వాత కోలుకున్నప్పటికి స్టోక్స్‌ను జట్టులోకి తీసుకోవడానికి మొగ్గు చూపలేదు. అలా రెండు మ్యాచ్‌లకు మాత్రమే పరిమితమైన స్టోక్స్ ఐర్లాండ్‌తో టెస్టుమ్యాచ్ కోసం స్వదేశానికి వెళ్లిపోయాడు. ఐపీఎల్ మినీ వేలంలో సీఎస్కే బెన్ స్టోక్స్‌ను రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. జోఫ్రా ఆర్చర్(ముంబై ఇండియన్స్): Photo: IPL Twitter జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో జోఫ్రా ఆర్చర్ ముంబై ఇండియన్స్ బౌలింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తాడని అనుకున్నారు. కీలకంగా మారడం అటుంచి తన ప్రదర్శనతో జట్టుకు భారమయ్యాడు. సీజన్లో కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఆర్చర్ 9.50 ఎకానమీతో పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆ తర్వాత గాయంతో ఐపీఎల్ నుంచే వైదొలిగాడు. ఈ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిన వారిలో ఆర్చర్ ఒకడిగా మిగిలిపోయాడు. హ్యారీ బ్రూక్(ఎస్ఆర్హెచ్): Photo: IPL Twitter ఐపీఎల్ ఆరంభానికి ముందు హ్యారీ బ్రూక్‌పై మంచి అంచనాలున్నాయి. ఎస్ఆర్హెచ్ ఏరికోరి బ్రూక్‌ను రూ. 13.35 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ తన ధరకు బ్రూక్ ఏ విధంగానూ న్యాయం చేయలేకపోయాడు. ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ సాయంతో కేవలం 190 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. తొలి అంచె పోటీల్లో అన్ని మ్యాచ్‌లు ఆడిన బ్రూక్ తర్వాత అంచె పోటీల్లో కేవలం మూడు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. టెస్టుల్లోనే విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగిన బ్రూక్ ఐపీఎల్లో మాత్రం ఫ్లాప్ షో చేశాడు. కగిసో రబాడ(పంజాబ్ కింగ్స్): Photo: IPL Twitter కగిసో రబాడ అంతర్జాతీయ క్రికెట్లో సౌతాఫ్రికా తరపున టాప్ బౌలర్. అతని వైవిధ్యమైన పేస్‌తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టాడు. అలాంటి రబాడ ఐపీఎల్లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌లాడిన రబాడ ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. సామ్ కరన్(పంజాబ్ కింగ్స్): Photo: IPL Twitter ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా సామ్ కరన్ చరిత్ర సృష్టించాడు. రూ. 18.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది. సీజన్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్న సామ్ కరన్.. ధావన్ గైర్హాజరీలో పలు మ్యాచ్‌ల్లో పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 276 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు తీశాడు. ప్రదర్శన పరంగా సామ్ కరన్ అందరిలో కాస్త బెటర్‌గా కనిపిస్తున్నప్పటికి.. అతనికి వెచ్చించిన ధర ప్రకారం ఈ ప్రదర్శన ఫ్లాప్ అని చెప్పొచ్చు. చదవండి: 'నాలుగేళ్ల వయసులో వాడేంటో తెలిసింది... ఇది ఊహించిందే!' -
'ఏజెంట్ ఫ్లాప్'..డిప్రెషన్లోకి అఖిల్? ఒంటరిగా దుబాయ్‌కి..
అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాకొట్టింది. స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించనంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్‌తో డిజాస్టర్ అనిపించుకుంది. అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్ వచ్చి చేరింది. ఏజెంట్ సినిమా కోసం అఖిల్ సుమారు రెండేళ్లు కష్టపడ్డాడు. జిమ్‌లో గంటల కొద్దీ శ్రమించి లుక్ మొత్తం మార్చుకున్నాడు. ఈ సినిమాతో సాలిడ్ హిట్ వస్తుందనుకుంటే ఊహించని విధంగా దెబ్బ పడింది. చదవండి: అభిమానిని తోసేసిన షారూక్ ఖాన్.. మండిపడుతున్న నెటిజన్స్ దీనికి తోడు సోషల్ మీడియాలోనూ విమర్శలు, ట్రోలింగ్‌తో అఖిల్ కాస్త డిప్రెషన్‌కు వెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో దాన్నుంచి బయటపడేందుకు సింగిల్‌గా దుబాయ్‌కు వెకేషన్‌కు వెళ్లిపోయాడు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. చదవండి: VD12: రౌడీ హీరోతో శ్రీలీల.. ఘనంగా సినిమా ప్రారంభం -
ఈ ఒక్క కారణం వల్లే ఏజెంట్ మూవీ ప్లాప్ అయ్యిందా ?
-
నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్ అయిందని... ఈ నిర్ణయం వల్ల దేశానికి రూ. 5 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నోట్ల రద్దుతో నకిలీ కరెన్సీ తగ్గకపోగా 54 శాతం పెరిగినట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయన్నారు. పెద్ద నోట్ల రద్దు, దాని పర్యవసానాలపై ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటిౖకైనా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, కృష్ణమోహన్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీలు దండే విఠల్, దేశపతి శ్రీనివాస్‌లతో కలసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు విఫలమని కేంద్రమే అంగీకరించిందన్నారు. బీజేపీ చెప్పేదొకటి.. చేసేదొకటి అనేందుకు పెద్దనోట్ల రద్దు నిర్ణయమే ఉదాహరణని ఎద్దేవా చేశారు. ప్రధానిపై నమ్మకంతో అప్పట్లో నోట్ల రద్దు నిర్ణయాన్ని తాము సమర్థించామని, అయితే చెప్పిన లక్ష్యం ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు. ఏ ప్రణాళిక, ఆలోచన లేకుండా ప్రధాని పెద్ద నోట్లను రద్దు చేశారని... ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. నగదు చెలామణి పెరిగింది.. పెద్ద నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్ కాబట్టే దీనిపై బీజేపీ నేతలు మాట్లాడటం లేదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. చెలామణిలో ఉన్న నగదుపై కేంద్రం చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆయన విమర్శించారు. 2014కు ముందు దేశ జీడీపీలో 11 శాతం నగదు ఉండేదని, అదిప్పుడు 13 శాతానికి పెరిగిందన్నారు. అలాగే గతంతో పోలిస్తే పెద్ద నోట్ల వాడకం రెట్టింపయ్యిందని చెప్పారు. రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసి తెచ్చిన రూ. 2 వేల నోటు వల్ల పెద్ద నోట్ల వాడకం విపరీతంగా పెరిగిందన్నారు. కొత్త నోట్ల ముద్రణకు మోదీ ప్రభుత్వం రూ. 21 వేల కోట్లు ఖర్చు పెట్టిందని... ఈ మొత్తంతో ఒక ప్రాజెక్టు పూర్తయి ఉండేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. పట్టుకున్న నల్లధనమే రూ. 40 వేల కోట్లు.. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం ఉండదని చెప్పిన ప్రధాని మాటలు అపహాస్యమయ్యాయని హరీశ్‌రావు విమర్శించారు. 592 కేసుల్లో రూ. 40 వేల కోట్ల నల్లధనం పట్టుకున్నారని చెప్పారు. బీజేపీ వేసే ప్రతి అడుగు పేదలపై పిడుగులా మారిందని, నీతి ఆయోగ్ నేతి బీరకాయలో నెయ్యి చందంగా మారిందని ఎద్దేవా చేశారు. అప్పులు చేయడం.. తప్పులు చేయడం బీజేపీ విధానంగా మారిందని, కేంద్రం ప్రతిరోజూ చేస్తున్న అప్పు రూ. 4,618 కోట్లని ఆయన పేర్కొన్నారు. మోదీ హయాంలో రూ. కోటీ ఏడు లక్షల కోట్ల అప్పు తెచ్చారని వివరించారు. పెద్ద నోట్ల మార్పు కోసం క్యూలలో నిలబడి 108 మంది మరణించారని, నోట్ల రద్దు కారణంగా 62 లక్షల మంది ఉపాధి కోల్పోయారన్నారు. బీజేపీ తొమ్మిదేళ్ల పాలనలో రూ. 100 లక్షల కోట్లు అప్పు చేసిందని, దేశంలో అవినీతి, ఆకలి పెరిగిపోతోందని పేర్కొన్నారు. నోట్ల రద్దుతో 50 రోజుల్లో అంతా బాగుంటుందని భరోసా ఇచ్చిన పెద్దలు... ఇప్పుడు 2 వేల రోజులైనా ఏం మార్పు తెచ్చారని హరీశ్ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ధరలు మూడింతలు పెరిగాయని ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో మాదకద్రవ్యాల రవాణా, ఉగ్రవాదం పెరిగాయని ఆరోపించారు. -
నారా లోకేష్ ఫ్లాప్ షో.. యువగళం ‘గండాలు’
సాక్షి టాస్క్‌ఫోర్స్, తిరుపతి: గండాలు.. కన్నీటి సుడిగుండాల మధ్య లోకేష్ పాదయాత్ర సాగుతోంది. నాయకులకే కాదు.. అటు కార్యకర్తలు, అధికారులకు సైతం ప్రాణ సంకటంగా మారింది. తమపైనే ఆధారపడ్డ కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది. యువగళం పాదయాత్ర ప్రారంభమైన మొదటి రోజే తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోగా.. 14వ రోజు మరో రూపంలో గండం ఎదురైంది. తోపులాటలో విధుల్లో ఉన్ హెడ్‌కానిస్టేబుల్ గుండె ఆగిపోయింది. ఇక అరుపులు.. కేకలు, తోపులాటల మధ్య మరో కార్యకర్త త్రిశూలంపై పడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. మున్ముందు ఎన్ని అనర్థాలు ఎదురవుతాయో.. ఎంతమంది ప్రాణాలు పోతాయోనని నాయకులు, కార్యకర్తల గుండెల్లో గుబులు పట్టుకుంది. మునిగిపోతున్న నావను తెడ్డేసి పైకిలేపాలని టీటీడీ అధిష్టానం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇందులో భాగంగానే యువగళం పేరుతో పార్టీ పేరునూ స్పష్టంగా పలకలేని నారా లోకేష్‌బాబును పాదయాత్రకు దింపింది. ఆయన పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి తరచూ అపశ్రుతులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర గుండెపోటుతో కర్ణాటక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా గురువారం గంగాధరనెల్లూరు నియోజకవర్గానికి పాదయాత్ర చేరుకోగా.. అక్కడ టీడీపీ కార్యకర్తలు, నాయకుల తోపులాటలో పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ రమేష్(56) ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. చికిత్స కోసం చిత్తూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. రోడ్డుపై బైఠాయించి.. కార్యకర్తలను పురమాయించి లోకేష్ యువగళం పాదయాత్ర గురువారం గంగా ధరనెల్లూరు మండలం.. సమిసిరెడ్డిపల్లికి చేరుకుంది. అక్కడ రహదారిపై బహిరంగ సభకు పోలీ సులు అనుమతించకపోవడంతో లోకేష్ రగిలిపోయారు. సమిసిరెడ్డిపల్లి రహదారిపైనే సభ పెట్టేందుకు కార్యకర్తలను పురమాయించారు. కార్యకర్త నుంచి మైక్ తీసుకునేందుకు ప్రయత్నం చేయగా.. లంచ్ బ్రేక్ ఏర్పాటు చేసిన ప్రాంతానికి వెళ్లి ప్రసంగించాలని డీఎస్పీ శ్రీనివామూర్తి సూచించారు. అయినా లోకేష్ వినకుండా రోడ్డుపై బైఠాయించారు. కార్యకర్తలందర్నీ రోడ్డుకు అడ్డుగా కూర్చోమని ఆదేశించారు. రాకపోకలకు ఇబ్బంది అవుతుందని పోలీసులు పలుమార్లు ప్రాధేయపడినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఒకానొక దశలో పోలీసులపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తిరగబడి దాడిచేసేందుకు యత్నించారు. తనకు చట్టం తెలుసంటూ పోలీసులపై లోకేష్ ఊగిపోయారు. మీ అంతుచూస్తానంటూ చిందులేశారు. ఈ పరిస్థితుల్లో అక్కడే విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జనం లేరు.. తరలించాలి సారూ! గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో లోకేష్ యాత్ర ప్రారంభం కాగా.. ఆ పార్టీ అగ్రనేతలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం అటు ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. గతంలో పార్టీ లేదు.. బొక్కలేదు అన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇప్పుడు ‘చిత్తూరు జిల్లాలో యువగళం యాత్రకు జనం రాకపోవడంతో అధినేత, నేను చాలా బాధపడ్డాం’’ అని చెప్పడం సంచలనంగా మారింది. చదవండి: ఆ విషయాన్ని మాత్రం ‘ఈనాడు’ ఎందుకు చెప్పదు? జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి చిట్టిబాబుకు ఫోన్‌చేసి యాత్రకు జనాన్ని తరలించాలని.. ఎంత డబ్బయినా పెట్టి 300 వాహనాల వరకు ఉండేలా జాగ్రత్తపడాలని సూచించారు. వీరి మధ్య సాగిన సంభాషణకు సంబంధించిన ఆడియో లీక్ అవ్వడంతో టీడీపీ శ్రేణులు షాక్‌కు గురయ్యారు. లోకేష్ పాదయాత్ర డొల్లతనం బయటపడిందని జనం చర్చించుకుంటున్నారు. టీడీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు గంగాధరనెల్లూరు మండలం, పోటుకృష్ణమ్మపల్లికి చెందిన లోకనాథం (47) లోకేష్ పాదయాత్రలో పాల్గొని తీవ్రంగా గాయపడ్డాడు. ముత్యాలమ్మ గుడి వద్ద పాదయాత్ర సాగుతుండగా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పక్కనే ఉన్న త్రిశూలంపై లోకనాథం పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే టీడీపీ నేతలు గుట్టుచప్పుడు కాకుండా అతన్ని చిత్తూరుకు తీసుకెళ్లారు. లోకనాథం ఫొటోలు తీయడానికి, అతని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించిన మీడియాను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. లోకనాథం పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. రహస్య సమాచారం మేరకు లోకనాథం ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారం. -
లైగర్ ఫ్లాప్‌పై తొలిసారి స్పందించిన పూరీ
-
లైగర్ ఫ్లాప్‌పై తొలిసారి స్పందించిన పూరీ, ఏమన్నాడంటే
విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్చించిన చిత్రం లైగర్. పాన్ ఇండియా మూవీగా రూపొందిన లైగర్ భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బొల్తా పడింది. దీంతో ఈ మూవీ నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు లైగర్ నష్టాలను మిగిల్చింది. ఇదిలా ఉంటే విడుదలకు ముందు బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన పూరీ విడుదల అనంతరం సినిమా గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. చదవండి: ‘బాహుబలి’ ఆఫర్ వదులుకున్నందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి మూవీ పరాజయంపై ఇంతవరకు ఆయన నేరుగా స్పందించింది లేదు. ఈ నేపథ్యంలో చిరుతో ఇన్స్టాగ్రామ్ వేదికగా లైవ్‌లో పాల్గొన్న పూరీ ఈ సందర్భంగా లైగర్ ఫ్లాప్‌పై స్పందించాడు. కాగా గాడ్ ఫాదర్ బ్లాక్‌బస్టర్ హిట్ నేపథ్యంలో పూరీ జగన్నాథ్-చిరంజీవి ఇన్‌స్ట్రాగ్రామ్ లైవ్ ద్వారా ముచ్చటించారు. ఈ నేపథ్యంలో చిరు, పూరీని ఇలా ప్రశ్నించాడు. పూరీ మీరు అనుకున్న రిజల్ట్ రాకపోతో ఎలా తీసుకుంటారు? అని అడగ్గా.. ‘దెబ్బ తగినప్పుడు హీలింగ్ టైమ్ ఉంటుంది చూశారా.. అది తక్కువగా పెట్టుకోవాలి. ఆస్తులు పోవచ్చు లేదా యుద్ధాలు జరగోచ్చు ఏం జరిగినా హీలింగ్ టైమ్ నెలకు మించి ఉండకూడదు. ఒక నెలలో వేరే పనిలో పడిపోవాలి అంతే. కొన్నిసార్లు నమ్మిన వాళ్లు కూడా ఫ్లిప్ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు’ అన్నాడు. చదవండి: వెండితెర ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం ఫేం ‘వంటలక్క’, ఫస్ట్‌లుక్ రిలీజ్ అనంతరం ‘నేను లైగర్ సినిమా తీశాను. మూడేళ్లు సినిమాకి పనిచేస్తూ ఎంతో ఎంజాయ్ చేశాను. మంచి సెట్స్ వేశాం. కాస్ట్ అండ్ క్రూ, మైక్ టైసన్ ఇలా అంతా ఎంతో ఆనందంగా చేశాం. కానీ, సినిమా ఫ్లాప్ అయ్యింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా రిజల్ట్ కోసం ఆదివారం వరకు వేచి చూశా. ఆ తర్వాత మూవీ ప్లాప్ అని అర్థమైంది. ఆ మరుసటి రోజు సోమవారం జిమ్‌కు వెళ్లి 100 స్క్వాడ్స్ చేశా. ఒత్తిడి మొత్తం పోయింది. నా జీవితం నేను బాధగా ఉన్న రోజుల కంటే నవ్వుతూ ఉన్న రోజులే ఎక్కువ’ అంటూ పూరీ సమాధానం ఇచ్చాడు. ఇక ప్రస్తుతం తాను ముంబైలో కొత్త కథలు రాసే పనిలో ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. కాగా గాడ్ ఫాదర్లో పూరీ జర్నలిస్ట్‌గా కీ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. -
చంద్రబాబు చోడవరం మినీ మహానాడు సభకు స్పందన కరువు
-
Mamata Banerjee: మోదీ సమావేశం సూపర్ ఫ్లాప్
కోల్‌కతా: దేశంలో కోవిడ్ పరిస్థితిపై గురువారం జరిగిన వర్చువల్ సమావేశంలో కొన్ని రాష్ట్రాల సీఎంల పట్ల మోదీ వ్యవహరించిన తీరుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ప్రధానంగా జిల్లా కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన ఈ సమావేశం ఒక సర్వసాధారణమైన ‘సూపర్ ఫ్లాప్’ అని మమత అభివర్ణించారు. సమావేశం ముగిసిన తర్వాత మమత మీడియాతో మాట్లాడారు. మోదీతో వర్చువల్ సమావేశానికి రాష్ట్రాల ముఖ్యమంత్రు లను ఆహ్వానించారుగానీ బీజేపీయేతర పాలిత రాష్ట్రాల సీఎంలకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేద ని, ఆ సీఎంల ప్రతిష్టను మోదీ ఆటబొమ్మల స్థాయికి దిగజార్చారని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంలను మాట్లాడనీయకుండా వారిని మోదీ అవమానించారని మమత ఆరోపిం చారు. మోదీ అభద్రతాభావంతోనే ఇలా ప్రవర్తిస్తున్నారని మమత వ్యాఖ్యానించారు. అయితే, మమత వ్యాఖ్యలపై మాజీ తృణమూల్ సీనియర్ నేత, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే సువేంధు అధికారి స్పందించారు. ‘మోదీ పూర్తిగా కోవిడ్ సంబంధ విషయాలు చర్చించిన సమావేశాన్ని మమత రాజకీయమయం చేశారు. గతంలో ఎన్నోసార్లు ప్రధానితో భేటీల నుంచి మమత ఉద్దేశపూర్వకంగా తప్పుకుని, ఇప్పుడేమో మోదీ–కలెక్టర్ల భేటీలో మాట్లాడే అవకాశం రాలేదంటున్నారు ’ అని సువేంధు వ్యాఖ్యానించారు. వారి కోసం 20 లక్షల డోస్‌లు ఇవ్వండి బెంగాల్‌లోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 20 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను కేటాయించాలని మోదీని మమత కోరారు. ఈ మేరకు మమత గురువారం మోదీకి ఒక లేఖ రాశారు. బ్యాంకింగ్, రైల్వే, బొగ్గు, ఎయిర్‌పోర్టులు తదితర ఫ్రంట్‌లైన్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా డోస్‌లు రాష్ట్రానికి పంపాలని మమత కోరారు. -
శర్వానంద్‌కే ఎందుకిలా జరుగుతోంది!
టాలీవుడ్లో విభిన్న కథలు ఎంచుకోవడంలో యువ కథానాయకుడు శర్వానంద్ ఎప్పుడూ ముందుంటాడు. తన సినిమాలకు మంచి టాక్ వస్తున్నప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు. ఇటీవల తను నటించిన ‘శ్రీకారం’ చిత్రం విడుదలవగా, మొదటి ఆటతోనే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. విమర్శకులు సైతం యువతకు ప్రేరణ అని, వారు తప్పక చూడాలని మెచ్చుకున్నారు. ఇంకేముంది హిట్ ఖాయమని చిత్ర యూనిట్ సభ్యులంతా సంబరపడిపోయారు. కానీ అనుకొన్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్న చందంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. వస్తే వరుస హిట్లు, లేదా వరుస ఫ్లాపులు శర్వానంద్ కెరీర్‌ను చూస్తే 'రన్ రాజా రన్', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'శతమానం భవతి' సినిమాల వరుస హిట్లతో అతడి మార్కెట్ బాగానే పెరిగింది. మధ్యలో ‘రాధ’ నిరాశ పరిచినా.. ‘మహానుభావుడు’తో మళ్లీ హిట్ ట్రాక్‌లో పడ్డాడని అనుకున్నారంతా! ఇంకేముంది సినిమాలు తీయడానికి నిర్మాతలు క్యూ కట్టారు. కానీ మహానుభావుడు తర్వాత ఆ హవాను కొనసాగించలేకపోయాడు. ప్రేమ కథా చిత్రంగా విడుదలైన ‘పడి పడి లేచే మనసు’ శర్వా కెరీర్లోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమా అయింది. తర్వాత ‘రణరంగం’ కూడా అంతగా ఆడలేదు. తమిళ రీమేక్ ‘జాను’ పర్వాలేదనిపించింది. తర్వాత వచ్చిన ‘శ్రీకారం’ అయినా అతడిని పరాజయాల బాట నుంచి బయట పడేస్తుందని అంతా అనుకున్నారు. ఈ సినిమా మంచి టాకే తెచ్చుకునప్పటికీ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. దీనికి ప్రధాన కారణం చిన్న సినిమా అనుకున్న ‘జాతిరత్నాలు’ పెద్ద దెబ్బే కొట్టిందని చెప్పాలి. ప్రస్తుతం శ్రీకారం కలెక్షన్లను చూస్తే బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవని సినీ పండితులు అంటున్నారు. ఏదేమైనా శర్వా కెరీర్లో మరో డిజాస్టర్‌గా ‘శ్రీకారం’ మిగలనుంది. శర్వా చేసిన చివరి నాలుగు చిత్రాలను పరిశీలిస్తే అవేవీ కూడా చెత్త సినిమాలు అనడానికి వీల్లేదు. మంచి కథనే ఎంచుకొని అభిరుచి ఉన్న దర్శకులతోనే సినిమాలు చేశాడు. ఆయా సినిమాల ప్రోమోలు కూడా ఆసక్తి రేకెత్తించడంతో శర్వాకు ఈసారి హిట్టు ఖాయం అన్న ఫీలింగే కలిగించింది ప్రతి సినిమా కూడా. కానీ ఏదీ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. మరి తన తదుపరి సినిమాతోనైనా శర్వా బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి. ( చదవండి: విజయంతో పాటు గౌరవం తెచ్చింది: శ్రీకారం డైరెక్టర్ ) -
ప్లాన్.. ఫ్లాప్
పక్కా ప్లాన్ వేశారు.. అనుకున్నట్టుగానే దారిదోపిడీకి వెంబడించారు.. అదునుచూసి స్కెచ్ వేసిన వ్యక్తిని దొరికించుకున్నారు.. ఉన్నకాడికి డబ్బులను దోచుకున్నారు.. పారిపోతూ చివరికి ఇట్టే పట్టుబడ్డారు. వారి ప్లాన్‌ను పోలీసులు పసిగట్టి ప్లాఫ్ చేయడంతో బాధితుడికి న్యాయం జరిగింది. దోపిడీ చేయాలనే ఆలోచన వచ్చింది ఎక్కడో ఉండే దారిదోపిడీ దొంగలకు కాదు.. సదరు వ్యక్తి వద్ద పనిచేసిన పాత డ్రైవర్‌కే. మహబూబ్నగరక్రైం/జడ్చర్ల: అడ్డ దారిన సంపాదించాలనుకున్న కొంద రు దుండగులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఎంత చలాకీగా వ్యవహరించి దోపిడీకి పాల్పడినా చివరకు పోలీసుల చక్రబంధనంతో ఇట్టే చిక్కారు. ఈ సంఘటన జడ్చర్ల కావేరమ్మపేట అర్అండ్బీ అతిథిగృహం సమీపంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సంఘటన జరిగిన మూడు గంటల్లోనే పోలీసులు దొంగలను పట్టుకున్నారు. మంగళవారం ఎస్పీ అను రాధ తన కార్యాలయంలో దోపిడీకి సం బంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. నేరచరిత్ర ముఠాతో దోస్తీ.. హైదరాబాద్‌లోని గౌలిగూడకు చెందిన రామావత్ మోర్ వృత్తిరీత్యా సైకిల్ విడిభాగాల హోల్‌సేల్ వ్యాపారి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లోని రిటైల్ వ్యాపారులకు విడిబాగాలను సరఫరా చేసి ప్రతీనెల వచ్చి డబ్బులు వసూలు చేసేవాడు. వ్యాపారివద్ద సంతోష్ సుబాన్‌జీ అనే వ్యక్తి కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో మూడేళ్ల క్రితం యజమాని అతన్ని తొలగించాడు. అయితే సంతోష్ సోదరుడు అంబదాస్ సుభాన్‌జీ, అతని బంధువు వెంకటేశ్ బిలాదార్కు ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగనోట్ల కేసులో నేరచరిత్ర కలిగి ఉన్న దినేష్ మాన్, గణేష్‌తో పరిచయం ఏర్పడింది. వీరందరూ కలిసి ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు దారి దోపిడీలను వృత్తిగా ఎంచుకున్నారు. అందులో ఒకరిద్దరికి దారి దోపిడీలు చేసిన అనుభవం ఉంది. యజమాని నడవడిక ఆధారంగా స్కెచ్ సైకిల్ విడిభాగాల వ్యాపారి రామావత్ను టార్కెట్ చేయడానికి అతని పాత డ్రైవర్ సంతోష్ తన బృందానికి చెప్పాడు. ప్రతీనెలా ఆయన ఎక్కడెక్కడకు వెళ్తాడు.. ఎంతెంత డబ్బులు వసూలు చేస్తాడు.. ఎక్కడెక్కడ ఆగుతాడనే పూర్తి వివరాలను సేకరించి దోపిడీ చేయాలని స్కెచ్ వేశారు. వెంకటేశ్‌కు చెందిన క్వాలిస్ (టీఎస్ 12 ఈఈ 6736)తో పాటు ఓ బైక్‌పై సోమవారం ఉదయం నుంచే రామావత్ మోర్ కారును వెంబడించారు. జడ్చర్ల నుంచి వనపర్తికి వెళ్లిన సమయంలో అక్కడ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద బైక్‌ను పార్క్ చేసి పెబ్బేర్ వెళ్లే రహదారిలో ఉన్న ఓ దుకాణంలో రెండు కత్తులను కొనుగోలు చేశారు. క్వాలిస్‌లో వెళ్లడానికి కుదరక పోవడంతో బైక్‌పై వెళ్లి పని పూర్తిచేసేలా వ్యూహం రచించారు. కానీ బైక్ అవసరం లేక వనపర్తిలోనే ఉంచారు. రామావత్ కర్నూల్ వెళ్లిన తర్వాత డబ్బు పెద్దమొత్తంలో వసూలయ్యాక దోపిడీ చేయాలనుకున్నారు. వారు అనుకున్నట్టుగానే వ్యాపారి కలెక్షన్ పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. ఆందోళన కలిగిస్తున్న దోపిడీలు జాతీయ రహదారిపై ప్రయాణమంటే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాలతో పాటు దొంగతనాలు, దోపిడీలకు ఈ రహదారి కేరాఫ్‌గా మారడంతో ప్ర యాణికులు భయపడుతున్నారు. డబ్బులు దోచుకోవడానికి దుం డగులు హత్యలు చేయ డానికి సైతం వెనకాడటం లేదు. చాలామంది కిడ్నాప్‌లు, దోపిడీలు చేయడానికి జాతీయ రహదారినే ఎం చుకోవడం సర్వత్రా కలవరపాటుకు గురిచేసింది. కత్తులతో బెదిరించి... కారు వెంబడించిన దొంగల ముఠా వ్యాపారి ఎక్కడ వాహనం దిగుతాడోనని అదును కోసం వేచిచూశారు. అంతలోనే జడ్చర్ల అతిథిగృహం వద్ద రామావత్ మూత్ర విసర్జనకు కారు ఆపాడు. ఇదే చాన్స్ అనుకుని వెంటనే క్వాలిస్‌లో వచ్చిన దుండగులు కత్తులతో బెదిరిస్తూ అతని వద్దనున్న రూ.3.84 లక్షల క్యాష్ బ్యాగ్‌తో పాటు కారును కూడా తీసుకుని హైదరాబాద్ వైపు పారిపోయాడు. పాత డ్రైవర్ సంతోష్ తన పాత యజమాని ఎక్కడ గుర్తిస్తాడోనన్న అనుమానంతో క్వాలిస్‌లోనే ఉండిపోయాడు. వారు అలా వెళ్లేసరికి వ్యాపారి వెంటనే జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు జాతీయ రహదారితో పాటు ఇతర రోడ్లపై తనిఖీలు చేపట్టారు. ఎస్పీ అనురాధకు సమాచారం ఇవ్వగా ఆమె కూడా హుటాహుటిన జడ్చర్లకు చేరుకుని తనిఖీల్లో పాల్గొన్నారు. గొల్లపల్లి సమీపంలో కారును వదిలి అంతా క్వాలిస్‌లో కల్వకుర్తి వైపు వెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. దోపిడీ రెండోసారి.. సారి కర్ణాటక రాష్ట్రంలో డబ్బు వసూలు చేసుకుని వస్తుండగా దో పి డీ చేయించాడు. ఈ ఘటనలో సంతోష్ నేరుగా పాల్గొనకపోయినా జ డ్చర్ల దగ్గర జరిగిన సంఘటనలో నేరుగా పాల్గొని పట్టుబడ్డాడు. సొత్తు స్వాధీనం.. దుండగుల అరెస్ట్ దొంగలను అరెస్ట్ చేసిన అనంతరం వారి నుంచి క్వాలిస్, షిఫ్ట్ కారుతో పాటు నాలుగు సెల్ఫోన్లు, రూ.3.84లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఎస్పీ అనురాధ తన కార్యాలయంలో విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. అలాగే, కేసును ఛేదించిన మిడ్జిల్ ఎస్ఐ సైదులు, ఏఎస్ఐ జహంగీర్, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, రాజు, విష్ణులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ భాస్కర్, జడ్చర్ల సీఐ బాలరాజు పాల్గొన్నారు. గతంలో జరిగిన సంఘటనలు కొన్ని.. ♦ ఇదే రహదారిపై పోలేపల్లి సెజ్ సమీపంలో మూడేళ్ల క్రితం డబ్బుల కోసం లారీలను ఆపి దోపిడీకి పాల్పడడడమే కాక లారీ డ్రైవర్‌ను తుపాకీతో కాల్చిన సంఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. ♦ దశాబ్ధం క్రితం ఇదే రహదారిపై కుక్కల రాజు అనే ఘరానా దోపిడీదారుడు తన ముఠాతో జడ్చర్ల సమీపంలో హైటెక్ బస్సును దోచుకున్నాడు. ♦ 2010లో మల్లెబోయిన్పల్లి సమీపంలో జాతీయరహదారిపై లారీని ఆపి కొందరు దోపిడీకి పాల్పడ్డారు. ♦ 2011 అక్టోబర్‌లో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకువచ్చి సెజ్ దగ్గర జాతీయరహదారి పక్కనే పెట్రోల్ పోసి సజీవ దహనానికి పాల్పడ్డారు. ♦ మత ప్రచారకుడు కే.ఏ.పాల్ సోదరుడు డేవిడ్ రాజును కూడా అడ్డాకుల సమీపంలో జాతీయ రహదారి పక్కనే హత్య చేశారు. ♦ ఆగిఉన్న వాహనాల నుంచి డీజిల్ దొంగిలించిన సంఘటనలైతే లెక్కకు మించి చోటు చేసుకుంటున్నాయి. -
అ‘మృత’ హస్తం
జూలై 1 నుంచి ఏడు ప్రాజెక్టుల్లో పథకం అమలు – ఒక్క కేంద్రానికీ చేరని వంట పాత్రలు – లబోదిబోమంటున్న అంగన్వాడీ కార్యకర్తలు - ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు – శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీత సొంత జిల్లాలోనే ఈ దుస్థితి ఇది అనంతపురంలోని ఓబుళదేవరనగర్–1 అంగన్వాడీ కేంద్రంలోని వంట గది. ఇక్కడ మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య పిల్లలు 16 మంది, గర్భిణులు 22 మంది, బాలింతలు ఏడుగురున్నారు. ‘అన్న అమృతహస్తం’ పథకం ప్రారంభమైతే మొత్తం 45 మందికీ కేంద్రంలోనే వంట చేసి ఆహారం అందించాలి. కానీ ఇక్కడ వంట చేయడానికి పాత్రలు లేవు. చిన్న పాటి కుక్కర్, గిన్నె మాత్రమే ఉన్నాయి. ఆహారం ఎలా వండి వడ్డించాలో అర్థం కాని పరిస్థితి. ఇది అనంతపురంలోని ఓబుళదేవరనగర్–2 అంగన్వాడీ కేంద్రంలోని వంట గది. ఇక్కడ పిల్లలు 18 మంది, గర్భిణులు 17 మంది, బాలింతలు 15 మంది ఉన్నారు. మొత్తంగా 42 మందికి అన్నం వండి వడ్డించాలి. ఇక్కడా ఇదే సమస్య. గతంలో పంపిణీ చేసిన పెద్ద గిన్నె ఉన్నా... కుక్కర్, గ్లాసులు, ప్లేట్లు లేవు. అనంతపురం టౌన్ : తాంబూలాలిచ్చేశాం.. తన్నుకుచావండి అన్నట్లుంది సర్కారు తీరు. వంట వండేందుకు పాత్రల్లేవ్.. అన్నం వడ్డించేందుకు కంచాల్లేవ్.. నీళ్లు తాగేందుకు గ్లాసుల్లేవ్.. ఇలా అన్నీ సమస్యలే. కానీ ‘అన్న అమృతహస్తం’ మాత్రం కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఉన్నతాధికారుల ఆదేశం. దీంతో అంగన్వాడీ కార్యకర్తల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. గతంలో ఇలా.. ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో కనీసం 10 నుంచి 20 మంది బాలింతలు, గర్భిణులు ఉంటారు. వారికి పోషకాహారం అందించి రక్తహీనత లేకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి నెలా ఇంటికి రేషన్ అందించేవారు. నెలకు 16 గుడ్లు, కిలో కంది పప్పు, మూడు కిలోల బియ్యం, 456 గ్రాముల నూనె ఇచ్చే వారు. ఈ పౌష్టికాహారం సక్రమంగా వినియోగించడం లేదని ప్రభుత్వ పరిశీలనలో తేలింది. దీంతో కేంద్రాల్లోనే భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. జూలై 1 నుంచి ‘అన్న అమృతహస్తం’ ప్రారంభం జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) కింద 17 ప్రాజెక్టులుండగా ఇప్పటికే పది ప్రాజెక్టుల్లో ‘అన్న అమృతహస్తం’ పథకాన్ని అమలు చేస్తున్నారు. తాజాగా ఏడు ప్రాజెక్టుల్లో జూలై 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు అన్న తేడా లేకుండా అందరికీ ఆయా కేంద్రాల్లోనే భోజనం అందించాలని నిబంధన విధించారు. గతంలో టేక్ హోం రేషన్ పేరుతో అందించే పౌష్టికాహారానికి స్వస్తి పలికి సంపూర్ణ పోషకాలు ఉండే భోజనం వడ్డించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి 125 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, 16 గ్రాముల నూనె, రోజుకో గుడ్డు అందిస్తారు. ఒక రోజు సాంబారు, ఒక రోజు రసం, ఒక రోజు ఆకుకూరను మెనూలో చేర్చారు. తరచి చూస్తే అన్నీ సమస్యలే పథకం మంచిదే అయినా ఆచరణలో మాత్రం ‘ఆదిలోనే హంసపాదు’ ఎదురయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ ఖర్చులు కూడా రాకపోవడంతో సిబ్బంది సతమతమవుతున్నారు. చాలాచోట్ల మౌలిక సదుపాయాలు లేవు. ప్రభుత్వం చెల్లించే అద్దెకు సరైన భవనాలు లభించక చిన్న గదుల్లోనే కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇక పోషకాహారంలో నాణ్యత కొరవడుతోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చౌక దుకాణాల నుంచి వచ్చే బియ్యం, పప్పు, గుడ్డు నిర్దేశిత బరువు కన్నా తక్కువగా ఉంటున్నాయి. అవీ అరకొరే అందుతున్నాయి. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలకు వంట చేసేందుకు కట్టెల ఖర్చు కింద నెలకు రూ.250 చెల్లిస్తున్నారు. ఇదెంత మాత్రం సరిపోవడం లేదని సిబ్బంది అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇపుడు కొత్తగా ‘అన్నా అమృతహస్తం’ కింద గర్భిణులు, బాలింతకలకు కూడా వండి పెట్టాలంటే తమకు తలకుమించిన భారమవుతుందని సిబ్బంది చెబుతున్నారు. మంత్రికి చెప్పినా ఫలితం శూన్యం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత దృష్టికి ఈ సమస్యలన్నీ తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాగైనా పథకాన్ని అనుకున్న సమయానికే కచ్చితంగా అమలు చేయాలని మంత్రి చెబుతున్నారనీ, అందువల్ల కనీసం వంట పాత్రలనైనా సరఫరా చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. అన్న అమృతహస్తం పథకం అమలు చేసేందుకు మూడు నెలల బిల్లులు అడ్వాన్స్‌గా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ‘అన్న అమృతహస్తం’ అమలు చేసే ప్రాజెక్టులు ప్రాజెక్టు మెయిన్ సెంటర్లు మినీ సెంటర్లు అనంతపురం అర్బన్ 122 0 చెన్నేకొత్తపల్లి 144 28 ధర్మవరం 298 62 కూడేరు 243 27 శింగనమల 228 39 తాడిపత్రి 299 45 ఉరవకొండ 203 13 మొత్తం 1537 214 -
ఫ్లాప్‌ల కోసం 15 నిమిషాలు
నటి పూజాహెగ్డే గుర్తుందా? ముఖముడి చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన బాలీవుడ్ బ్యూటీ ఈ అమ్మడు. ఇక్కడ ఆ ఒక్క చిత్రంతోనే సరిపెట్టుకున్న పూజా టాలీవుడ్లో కొన్ని చిత్రాలు చేసింది. అయితే అక్కడ కూడా పెద్దగా విజయాలు వరించలేదు. దీంతో రాశిలేని నటి అనే ముద్ర వేశారట. అందుకే అపజయాల కోసం రోజూ 15 నిమిషాలు కేటాయించి ఆ సమయంలో చింతిస్తుందట. వింతగా ఉంది కదూ. ఇంకా ఈ ముద్దుగుమ్మ ఏమి చెబుతుందో చూద్దాం. ‘భవిష్యత్‌లో ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. రేపేమి జరుగుతుందో కూడా చెప్పలేం. అదే విధంగా చిత్ర విజయం ఒక్కరి వల్ల సాధ్యం కాదు. చేసే పనికి సంపూర్ణంగా న్యాయం చేయడమే మన కర్తవ్యం. విజయం అనేది చూసే ప్రేక్షకులు నిర్ణయిస్తారు. అందువల్ల నేను అపజయాలకు భయపడను. అయితే వాటి గురించి చింతించడానికి రోజు 15 నిమిషాలు కేటాయిస్తున్నాను. ఇతర సమయాన్ని వృత్తిపై పెడుతున్నాను. ఇది నాకు నేనుగా విధించుకున్న విధి విధానం. నా కఠిన శ్రమకు ఎప్పటికైనా విజయం వెతుక్కుంటూ వస్తుందనే నమ్మకం ఉంది’ అని అంది. -
అటకెక్కిన ఆరోగ్య రక్ష
► ‘జవహర్ బాల ఆరోగ్య రక్ష’పై అధికారుల నిర్లక్ష్యం ► బాలల వైద్యసేవలకు మంగళం జిల్లాలోని పాఠశాలలు : 3,865 మొత్తం విద్యార్థులు : 3,42,604 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు జబ్బు చేస్తే మంచి ఆస్పత్రుల్లో చూపించే ఆర్థిక స్తోమత వారి తల్లిదండ్రులకు లేదు. ఇలాంటి వారికి వైద్యసేవలు అందించాలన్న ఉద్దేశంతో 2010 నవంబర్ 10న ‘జవహర్ బాల ఆరోగ్య రక్ష’ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించి..అవసరమైతే మందులు, చికిత్స అందించాలనేది ఈ పథకం ప్రధానోద్దేశం. దీంతోపాటు చిన్నారుల విద్యా ప్రగతిపైనా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పథకం ఉద్దేశం మంచిదే అయినా..దీని అమలులో మాత్రం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,865 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3,42,604 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉపాధి కోసం వలస వెళ్లే తల్లిదండ్రులు పిల్లల ఆలనా పాలనా సరిగా చూసుకోలేరు. అలాంటి పిల్లలు అపరిశుభ్ర వాతావరణంలో ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించలేరు. ఇలాంటి పిల్లలు సాధారణంగా అనారోగ్యం పాలవుతుంటారు. దీనివల్ల పాఠశాలలకు సరిగా హాజరుకాలేరు. ఈ నేపథ్యంలో వారికి వైద్య సేవలు అందించడంతో పాటు పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు ప్రభుత్వం ‘జవహర్ బాల ఆరోగ్య రక్ష’ పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద ప్రత్యేకంగా ఆరోగ్యరక్ష కార్డులు జారీ చేస్తోంది. 1 నుంచి 10వ తరగతి వరకు ప్రతినెలా ప్రతి విద్యార్థి ఆరోగ్య వివరాలు అందులో నమోదు చేయాలి. ప్రారంభంలో ఆర్భాటంగా కార్డులు అందజేసిన అధికారులు అనంతరం వాటి గురించి పట్టించుకోలేదు. మొదట్లో అడపాదడపా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఇప్పడేమో ఆస్పత్రులకే పరిమితమయ్యారు. ఇక ప్రత్యేక కమిటీలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియడం లేదు. ప్రస్తుతం విద్యార్థులు జబ్బు బారిన పడితే తల్లిదండ్రులు ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించాల్సి వస్తోంది. కమిటీ విధులు ఇవీ.. ఆరోగ్య రక్ష పథకం ఆషామాషీగా ఏర్పాటు చేయలేదు. మండల స్థాయిలో ఎంపీడీఓ చైర్మన్‌గా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, ఎంఈఓలు సభ్యులుగా ఓ కమిటీని నియమించారు. – ఈ కమిటీ షెడ్యూల్ ప్రకారం ప్రతి పాఠశాలనూ సందర్శించి, పిల్లలకు వైద్య పరీక్షలు సరిగా జరిగేలా చూడాలి . –పిల్లలకు సంబంధించిన ఆరోగ్య వివరాలు కార్డులో నమోదు చేయాలి. – ప్రతి మంగళవారం ఆరోగ్య దినంగా పాటించేలా చూడాలి. ప్రత్యేక చికిత్స అవసరమైన విద్యార్థులను రెఫరల్ ఆస్పత్రికి తరలించాలి. – వైద్య పరీక్షల విషయంలో ఉపాధ్యాయులు, హెచ్ఎంలు కూడా బాధ్యత తీసుకుని సమీక్షించాలి. – పాఠశాలలో ఆరోగ్య పరీక్షలు జరిగేటప్పడు తల్లిదండ్రులను కూడా పిలిపించి, విద్యార్థికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి. – తరగతి పరీక్షల్లో సాధించిన మార్కులు, గ్రేడుల వివరాలు రికార్డుల్లో నమోదయ్యాయో, లేదో పరిశీలించాలి. ఏ పరీక్షలూ చేయలేదు మా వద్ద ఆరోగ్యరక్ష కార్డులు ఉన్నాయి. అయితే.. మాకు ఎలాంటి పరీక్షలూ చేయలేదు. తలనొప్పో.. జర్వమో వస్తే టౌన్‌కు పోయి బాగు చేయించుకుంటున్నాం. – నారాయణస్వామి, 5వ తరగతి, బ్రహ్మదేవమర్రి, ముదిగుబ్బ మండలం ఒక్కనాడూ డాక్టర్ రాలేదు స్కూళ్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు డాక్టర్లు ఎవరూ మా స్కూల్‌కు రాలేదు. ఇప్పటికైనా వైద్యులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలి. టౌన్‌కు పోయి వైద్యం చేయించాలంటే మా వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. – ప్రభాకర్, బ్రహ్మదేవమర్రి, ముదిగుబ్బ మండలం -
‘ఉపాధి’ ఉత్తిదే!
– కరువులోనూ ఆదుకోని పథకం – కుటుంబానికి ‘వంద’.. అందనంత దూరమే! – పనుల్లేక వలస బాటలో కూలీలు – ‘భృతి’ విషయాన్ని మరచిన వైనం అనంతపురం టౌన్ : జాబ్‌కార్డు ఉండి పని కావాలని అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ పథకంలో పని చూపించాలన్నది చట్టంలోని నిబంధన. ఈ పథకానికి నిధుల కొరత లేదు. నమోదైన వారందరికీ పనులు కల్పించాలి. పథకంలో నిర్దేశించిన పనులు పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పని చేయాలి. కానీ జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉంది. క్షేత్రస్థాయిలో పని కావాలని అడుగుతున్నా అధికారులు కల్పించడం లేదు. తమకు అనుకూలమైన వారికి మాత్రమే పనులు చూపుతూ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. కొన్నిచోట్ల లేని కూలీలను ఉన్నట్లు చూపి అక్రమాలకు పాల్పడుతున్నారు. పనుల్లేక వలసబాట ప్రతి కుటుంబానికి వంద రోజులు పని చూపించాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి ఈ పథకాన్ని తీసుకొచ్చినా.. అది కాగితాలకే పరిమితం అవుతోంది. ఏటా జిల్లాలో కరువు నెలకొంటున్నా కూలీల ఉపాధికి ఏ మాత్రమూ ‘హామీ’ ఇవ్వలేకపోతున్నారు. దీంతో బయట వ్యవసాయ పనులు లేక.. ఉపాధి దొరకక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి చూపలేని పక్షంలో భృతి కింద డబ్బు ఇవ్వాల్సిన ఉన్నా ఏ ఒక్కరికీ ఇస్తున్న పాపానపోవడం లేదు. ఈ క్రమంలో కూలీలు వలస బాట పడుతున్నారు. ఒక్క కుందుర్పి మండలంలోనే వేలాది కుటుంబాలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు వలస వెళ్లాయి. ఈ మండలంలోని బెస్తరపల్లి, ఎనుములదొడ్డి, తూముకుంట, కరిగానిపల్లి, ఎర్రగుంట, మలయనూరు, నిజవల్లి, జంబగుంపల తదితర గ్రామాల్లో పెద్దఎత్తున వలసబాట పట్టారు. ఇప్పుడు ముసలీముతక తప్ప ఎవరూ ఇళ్ల వద్ద ఉంటున్న పరిస్థితి లేదు. కానీ అధికారుల కళ్లకు ఇవేమీ కన్పించకపోవడం గమనార్హం. మరుగున పడుతున్న ప్రణాళికలు ఉపాధి పథకం సిబ్బంది ఏడాదికి ఒకసారి గ్రామాల్లో సభలు నిర్వహించి పథకం కింద చేపట్టాల్సిన పనులు గుర్తించాలి. ఆయా పనులను ఏడాదిలో పూర్తి చేసేలా, అడిగిన ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలి. కానీ..ఈ ప్రక్రియ పక్కాగా చేపట్టడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో మొత్తం 98,502 పనులు గుర్తించారు. ఇప్పటి వరకు 29,414 పనులను మాత్రమే పూర్తి చేశారు. ఒక్కో కుటుంబానికి 48 రోజుల చొప్పున మాత్రమే పని చూపించారు. జిల్లాలో 7,85,225 జాబ్‌కార్డులు ఉండగా.. 15,395 కుటుంబాలకే వంద రోజుల పని కల్పించారు. జిల్లాలో గత ఆరేళ్లుగా అమలు తీరును పరిశీలిస్తే లక్ష్యంలో సగం పనిదినాలు కూడా చూపించని దుస్థితి నెలకొంది. నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉపాధి పనులు కల్పించాలని కోరితే తప్పకుండా చూపాల్సిందే. ఈ విషయంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటాం. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, సంబంధిత పీఓలపై కఠినంగా వ్యవహరిస్తాం. – నాగభూషణం, డ్వామా పీడీ ఆరేళ్లుగా పథకం అమలు తీరిది.. ఏడాది జాబ్‌కార్డులు ఒక కుటుంబానికి ఏడాదిలో చూపిన పని దినాల శాతం వంద రోజులు పూర్తి చేసిన కుటుంబాలు 2011–12 7,08,405 82.48 78,174 2012–13 7,30,303 73.11 74,729 2013–14 7,47,020 64.27 61,617 2014–15 7,61,069 54.05 41,833 2015–16 7,81,124 75.74 93,615 2016–17 7,85,225 48.27 (ఆగస్టు వరకు) 15,395 -
టీఆర్ఎస్ది నిరంకుశ పాలన
ఇందూరు : టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగిస్తుందని టీపీపీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ ఆరోపించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యమాలు, ధర్నాలు, ఆందోళనలు ఉండవని కేసీఆర్ చెప్పారని తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజలు, నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు రోడ్డెకుతున్నారని, ఇదేనా టీఆర్ఎస్ పరిపాలన అని ప్రశ్నించారు. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందని, ఉద్యోగాల పేరిట మోసం చేస్తుందన్నారు. అలాగే ఎంసెట్ పేపర్ లీకేజీ విషయంలో ప్రభుత్వ పాత్ర ఉందని ఆరోపించారు. మల్లన్న సాగర్ భూ నిర్వసితులపై లాఠీచార్జి జరిగిన సందర్భంగా బాధితులను పరామర్శించడానికి వెళుతున్న కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి అడ్డు తడిలినట్టేనన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శేఖర్ గౌడ్, కుద్దుస్, బంటు రాము, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.