అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాకొట్టింది. స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించనంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్‌తో డిజాస్టర్ అనిపించుకుంది.
అఖిల్ కెరీర్‌లో మరో ఫ్లాప్ వచ్చి చేరింది. ఏజెంట్ సినిమా కోసం అఖిల్ సుమారు రెండేళ్లు కష్టపడ్డాడు. జిమ్‌లో గంటల కొద్దీ శ్రమించి లుక్ మొత్తం మార్చుకున్నాడు. ఈ సినిమాతో సాలిడ్ హిట్ వస్తుందనుకుంటే ఊహించని విధంగా దెబ్బ పడింది. చదవండి: అభిమానిని తోసేసిన షారూక్ ఖాన్.. మండిపడుతున్న నెటిజన్స్
దీనికి తోడు సోషల్ మీడియాలోనూ విమర్శలు, ట్రోలింగ్‌తో అఖిల్ కాస్త డిప్రెషన్‌కు వెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో దాన్నుంచి బయటపడేందుకు సింగిల్‌గా దుబాయ్‌కు వెకేషన్‌కు వెళ్లిపోయాడు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. చదవండి: VD12: రౌడీ హీరోతో శ్రీలీల.. ఘనంగా సినిమా ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment