బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా సర్ఫీరా మూవీతో ప్రేక్షకులను పలరించాడు. ఈ చిత్రం సూర్య నటించిన సూపర్‌హిట్ మూవీ సూరారైపోట్రుకు రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాకు కూడా సుధా కొంగర దర్శకత్వం వహించారు. జూలై 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన సర్ఫీరా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. ఈ సందర్భంగా అక్షయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. మన సినిమాలు ఫ్లాఫ్ అయినప్పుడు ఎలా ఉండాలో అమితాబ్‌ను చూసి నేర్చుకున్నట్లు వెల్లడించారు. కాగా.. ఏప్రిల్ 10న విడుదలైన బడే మియాన్ చోటే మియాన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే.
అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో సెలెక్టివ్‌గా పనిచేసే వ్యక్తులను నేను చూశా. వారి సినిమాలు కూడా కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఇక్కడ సినీ పరిశ్రమలో ఫ్లాప్‌లు వస్తే మనకు అవకాశాలు ఇవ్వడం మానేస్తారు. కొందరు వ్యక్తులు నా సినిమాల వైఫల్యాలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలా చూడటం వాళ్లకు ఇష్టం. కానీ నేను నా శ్రమను నమ్ముకున్నా. అయితే ఇలాంటి వాటిని తప్పకుండా ఖండించాలి. అయితే నేను అమితాబ్ బచ్చన్ నుంచి ఓ విషయం నేర్చుకున్నా. ఫ్లాఫ్ వచ్చినా మన పనిని మాత్రం ఆపకూడదు. మన పనితో పాటు అదృష్టాన్ని నమ్ముకోవాలని ఆయన సలహా ఇచ్చారు.' అని అన్నారు.
అయితే తాను ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదని తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అసహనం వ్యక్తం చేశారు. 'బడే మియాన్ చోటే మియాన్' షూటింగ్ కోసం 80 రోజులు కేటాయించినట్లు అక్షయ్ కుమార్ వెల్లడించాడు. కాగా.. అక్షయ్ నటించిన 'బడే మియాన్ చోటే మియాన్', 'రామ్ సేతు', 'రక్షా బంధన్', 'బచ్చన్ పాండే', 'సెల్ఫీ' బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment