Pujahegde
-
సెన్సార్ పూర్తి.. ఇక సంక్రాంతికి సంబరాలే
సాక్షి, హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకొంది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బృందం... యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ‘సెన్సార్ పూర్తయింది. గతంలో ఎన్నడూలేనివిధంగా ఈ సంక్రాంతికి భారీ సంబరాలతో మేం సిద్ధమవుతున్నాం. పండుగ సరదాల కోసం మేం మిమ్మల్ని మీ కుటుంబంతో సహా థియేటర్లకు ఆహ్వానిస్తున్నాం. డోన్ట్ మిస్’ అంటూ గీతా ఆర్ట్స్ తన ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. అయితే, వినూత్నంగా రిలీజ్ చేసిన సెన్సార్ సర్టిఫికేట్ పోస్టర్లోనూ సినిమా విడుదల తేదీని చిత్రయూనిట్ వెల్లడించలేదు. ఈ నెల 12న సినిమా విడుదల కానున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే, కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో, తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లోనూ రిలీజ్ డేట్ లేదు. జస్ట్ సంక్రాంతి రిలీజ్ అని మాత్రమే మెన్షన్ చేశారు. దీంతో విడుదల తేదీపై కొంత సందిగ్ధం నెలకొందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ ‘మ్యూజికల్ కాన్సెర్ట్’ (ప్రీ రిలీజ్ వేడుక) జనవరి 6వ తేదీన యుసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్లో జరగనుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు సంబంధించి కర్టెన్ రైజర్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఈ వీడియోలో పోతన భాగవతంలో రచించిన ‘అల వైకుంఠపురములో..’ పాటను గాయనీమణులు ఆలపించారు. చదవండి: అల.. వైకుంఠపురములో.. ‘దోశ స్టెప్పు’ -
జూలైలో జాయినింగ్
వాల్మీకి సెట్లో హీరోయిన్ లేకుండా వరుణ్ తేజ్ షూటింగ్ చేస్తున్నారు. ఈ వాల్మీకి జోడీ జూలైలో ఎంట్రీ ఇస్తారని లేటెస్ట్గా తెలిసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ‘వాల్మీకి’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజాహెగ్డే కథానాయిక. తమిళ నటుడు అధర్వ మురళి కీలక పాత్రలో నటిస్తారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మింస్తున్న ఈ చిత్రం తమిళ సూపర్‌హిట్ ‘జిగర్దండ’ సినిమాకి రీమేక్. ఇందులో వరుణ్ తేజ్ తొలిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోందట. జూలై నుంచి ‘వాల్మీకి’ టీమ్‌లో జాయిన్ అవుతారట పూజా హెగ్డే. మరోవైపు ఈ సినిమాను సెప్టెంబర్ 6న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం
‘మహర్షి’ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతోంది. దాంతో ప్రమోషనల్ కార్యక్రమాల స్పీడ్ పెంచింది చిత్రబృందం. ఇటీవలే ఫస్ట్ సాంగ్, టీజర్‌ను రిలీజ్ చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్గా సెకండ్ సాంగ్ ‘నువ్వే సమస్తం... నువ్వే సిద్ధాంతం..’ను శుక్రవారం రిలీజ్ చేసింది. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయిక. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో కీలక సన్నివేశాల్లో వచ్చే ‘నువ్వే సమస్తం. నువ్వే సిద్ధాంతం..’ సాంగ్ ఉత్తేజ గీతంలా అనిపిస్తోంది. హీరోను ఎలివేట్ చేసేలా ఈ సాంగ్ కనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా యాజిన్ నిజర్ పాడారు. మే9న ‘మహర్షి’ రిలీజ్ కానుంది. -
ప్రకాశంలో పూజా సందడి
ఒంగోలు (ప్రకాశం): స్థానిక గుంటూరు రోడ్డులో నూతనంగా నిర్మించిన రవిప్రియ మాల్ అండ్ మల్టీప్లెక్స్‌ను ప్రముఖ సినీనటి పూజాహెగ్డే బుధవారం ప్రారంభించారు. పూజాహెగ్డేతో పాటు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మాల్ చైర్మన్ కంది రవిశంకర్, అతని కుటుంబ సభ్యులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. తొలుత మాల్ అండ్ మల్టీప్లెక్స్ ముందువైపు ఏర్పాటుచేసిన వాటర్ ఫౌంటైన్‌ను పూజాహెగ్డే ప్రారంభించారు. అనంతరం ప్రధాన భవనాన్ని మంత్రి శిద్దా రాఘవరావు, గ్రౌండ్‌ఫ్లోర్‌లోని మాక్స్షాపింగ్ మాల్, ఫుడ్‌కోర్టును ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, కేఎఫ్‌సీ సెంటర్‌ను మాజీ మంత్రి మానుగుంట మహీధరరెడ్డి, క్రీమ్స్టోన్ను మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు ప్రారంభించారు. తదుపరి మొదటి అంతస్తులో 65 అడుగుల భారీ స్క్రీన్‌తో నిర్మితమైన స్క్రీన్–1 థియేటర్‌ను బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించగా, స్క్రీన్–2ను ఎమ్మెల్సీ కరణం బలరాం, స్క్రీన్–3ని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గేమ్‌జోన్‌ను ప్రారంభించారు. అభిమానులను చూస్తుంటే ఆనందంగా ఉంది : పూజాహెగ్డే పూజా హెగ్డే రాకతో రెండు గంటల ముందు నుంచే ఆ ప్రాంతానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. మాల్ ఎదురుగా రోడ్డు పక్కన, డివైడర్లపై బారులుదీరి ఆమెను చూసేందుకు, ఫొటోలు తీసేందుకు ఉత్సాహం చూపారు. భారీ బందోబస్తు మధ్య డప్పులతో పూజా హెగ్డేకు స్వాగతం పలికారు. మాల్ ప్రారంభం అనంతరం పూజాహెగ్డే మాట్లాడుతూ అభిమానులను చూస్తుంటే తనకెంతో ఆనందంగా ఉందన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన రవిశంకర్ గ్రూప్ వారికి కృతజ్ఞతలు ప్రకటించారు. త్వరలోనే తాను నటించిన అరవింద సమేత విడుదలవుతుందని, ఆదరించాలని కోరారు. కేవలం కేకలు కాకుండా ఈలలు వేసి అభిమానాన్ని చాటాలంటూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. లవ్యూ సోమచ్ అంటూ గాలిలోకి ముద్దులు విసిరి కుర్రకారును గిలిగింతలు పెట్టారు. ఐదేళ్ల క్రితమే మాల్ నిర్మించాలనుకున్నాం : చైర్మన్ రవిశంకర్ ఐదేళ్ల క్రితం 2013లోనే ఒంగోలులో మాల్ అండ్ మల్టీప్లెక్స్ నిర్మించాలని తాము భావించినట్లు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ వెల్లడించారు. అది ఇప్పటికి కార్యరూపం దాల్చిందని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రాండ్లు అయిన మ్యాక్స్, కేఎఫ్‌సీ, క్రీమ్‌స్టోన్, పిజ్జాహట్లు, థియేటర్లతో పాటు పిల్లలకు అవసరమైన గేమ్‌జోన్ వంటి వాటిని మాల్లో ఏర్పాటు చేశామన్నారు. అన్నింటినీ సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం తాను, తన గ్రూప్ ఉన్నతంగా ఉండటానికి ఒంగోలు, పరిసర ప్రాంతాల ప్రజల ఆశీర్వాదమే కారణమన్నారు. అందుకే ఈ మల్టీప్లెక్స్‌ను ఒంగోలు ప్రజలకు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయత కలిగిన కార్నివాల్స్ సినిమా గ్రూప్ స్క్రీన్లు మూడింటిని సినిమాలకు ఏర్పాటు చేశామన్నారు. మాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంది సాయినాథ్ మాట్లాడుతూ 65 అడుగుల పూర్తిస్థాయి స్క్రీన్‌పై సినిమా చూడటం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కేవలం ఒంగోలు ప్రేక్షకులకే సాధ్యమన్నారు. హైదరాబాద్‌లోని ఐమాక్స్‌లో సైతం కొన్ని సినిమాలను మాత్రమే పూర్తిస్థాయి స్క్రీన్‌పై చూడటం సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో రవిశంకర్ గ్రూప్ డైరెక్టర్లు ప్రియదర్శిని, విష్ణుమోహన్, విజయసాయి పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
డబ్బు కోసం ఏది పడితే అది చేయను
‘‘ఈ బిళ్లలు మింగండి. ఎంచక్కా సన్నబడిపోండి’ అనే యాడ్ చూస్తే.. లావుగా ఉన్నవాళ్లల్లో చాలామంది ఎట్రాక్ట్ అయిపోతారు. ఏముంది? ఓ మందు బిళ్లే కదా.. మింగేస్తే పోలా? అనుకుంటారు. డబ్బు గురించి ఆలోచించకుండా కొనేస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా ఆలోచించరు. కానీ, ప్రమోట్ చేసేవాళ్లు మంచివాళ్లైతే ఆలోచిస్తారు. పూజా హెగ్డే ఈ కేటగిరీలోకే వస్తారు. ఓ ప్రముఖ ఉత్పత్తిదారులు ‘వెయిట్ లాస్ పిల్’ను ప్రమోట్ చేయమని పూజా హెగ్డేని సంప్రదించారు. భారీ పారితోషికం ఇవ్వడానికి రెడీ అయ్యారు. కానీ, పూజా ఆ ఆఫర్‌ని తిరస్కరించారు. డబ్బు కోసం ఏది పడితే అది చేయనని తెగేసి చెప్పారు. ‘‘స్ట్రిక్ట్ డైట్, యోగ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో అయితే బరువు తగ్గటం పెద్ద కష్టం కాదు. వెయిట్ లాస్‌కు నేచురల్ పద్ధతిని ఫాలో అవ్వడమే మంచిది. టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల బరువు తగ్గుతారని మిస్ గైడ్ చేయడం నాకిష్టం లేదు. ఆరోగ్యం పట్ల అందరూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఈ రోజుల్లో హెల్త్ ఈజ్ వెల్త్ అని గుర్తించుకోవాలి. ఎట్లీస్ట్ 45 మినిట్స్ డైలీ వ్యాయామం చేసేలా లైఫ్‌స్టైల్‌ను చేంజ్ చేసుకోవాలి. అప్పుడే హెల్త్ పరంగా గుడ్ రిజల్ట్ ఉంటుంది’’ అని పేర్కొన్నారు పూజా. -
ఫ్లాప్‌ల కోసం 15 నిమిషాలు
నటి పూజాహెగ్డే గుర్తుందా? ముఖముడి చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన బాలీవుడ్ బ్యూటీ ఈ అమ్మడు. ఇక్కడ ఆ ఒక్క చిత్రంతోనే సరిపెట్టుకున్న పూజా టాలీవుడ్లో కొన్ని చిత్రాలు చేసింది. అయితే అక్కడ కూడా పెద్దగా విజయాలు వరించలేదు. దీంతో రాశిలేని నటి అనే ముద్ర వేశారట. అందుకే అపజయాల కోసం రోజూ 15 నిమిషాలు కేటాయించి ఆ సమయంలో చింతిస్తుందట. వింతగా ఉంది కదూ. ఇంకా ఈ ముద్దుగుమ్మ ఏమి చెబుతుందో చూద్దాం. ‘భవిష్యత్‌లో ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. రేపేమి జరుగుతుందో కూడా చెప్పలేం. అదే విధంగా చిత్ర విజయం ఒక్కరి వల్ల సాధ్యం కాదు. చేసే పనికి సంపూర్ణంగా న్యాయం చేయడమే మన కర్తవ్యం. విజయం అనేది చూసే ప్రేక్షకులు నిర్ణయిస్తారు. అందువల్ల నేను అపజయాలకు భయపడను. అయితే వాటి గురించి చింతించడానికి రోజు 15 నిమిషాలు కేటాయిస్తున్నాను. ఇతర సమయాన్ని వృత్తిపై పెడుతున్నాను. ఇది నాకు నేనుగా విధించుకున్న విధి విధానం. నా కఠిన శ్రమకు ఎప్పటికైనా విజయం వెతుక్కుంటూ వస్తుందనే నమ్మకం ఉంది’ అని అంది. -
కోలీవుడ్‌కు ఒక లైలా కోసం..
దివంగత మహా నటుడు అక్కినేని నాగేశ్వరావు కుటుంబానికి తమిళ చిత్ర పరిశ్రమకు విడదీయరాని అనుబంధం ఉందన్నది ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటా. అక్కినేని నాగేశ్వరరావు తొలి రోజుల్లోనే తమిళ చిత్రాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన వారుసుడు నాగార్జున ఇదయత్తైతిరుడాదే చిత్రంతో తమిళ ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ఇటీవల తోళా అంటూ మరోసారి దగ్గరయ్యారు. తాజాగా ఆయన వారసుడు నాగచైతన్య లైలా ఓ లైలా అంటూ తన ప్రేమించిన అమ్మాయి కోసం కోలీవుడ్‌కు రానున్నారు. అవును తెలుగులో ఆయన నటించిన మంచి రొమాంటిక్ లవ్ ఎంటర్టెయినర్ చిత్రం ఒక లైలా కోసం ఇప్పుడు తమిళ భాష మాట్లాడనుంది.తెలుగులో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని నాగార్జున అక్కినేని నిర్మించారు. ఇందులో నాగచైతన్య సరసన పూజాహెగ్డే నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రభు, సుమన్, షియాజీ షిండే, నాజర్ , బ్రహ్మానందం, ఆలీ, ఆశీష్ విద్యార్థి నటించారు. అనూప్ రూబెన్స్ సంగీత బాణీలు కట్టిన ఈ చిత్రానికి కే.విజయకుమార్ దర్శకత్వం వహించారు. రచయిత షాజీ తమిళ వెర్షన్‌కు మాటలు అందించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్.బాలాజీ తమిళంలో విడుదల చేస్తున్నారు. ఆయన చిత్రం గురించి మాట్లాడుతూ ఒక ధనవంతుల బిడ్డ అయిన నాగచైతన్య తొలి చూపులోనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడన్నారు. అయితే అతని ప్రేమను ఆ యువతి అంగీకరించదన్నారు.అయితే ఇరు కుటుంబ పెద్దలు వీరి పెళ్లికు నిశ్చితార్థం జరుపుతారన్నారు. అలాంటి పరిస్థితిలో నాగచైతన్య ఈ పెళ్లిని చెడగొడతారన్నారు. అది ఎలా?అంతగా ప్రేమించిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోడు? చివరికి వారి ప్రేమ పయనం ఎటు వైపు సాగింది ఇత్యాది పలు ఆసక్తికరమైన సంఘటనల సమాహారమే లైలా ఓ లైలా చిత్రం అని తెలిపారు. చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.