కోలీవుడ్‌కు ఒక లైలా కోసం.. | Kollywood for a Laila .. | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌కు ఒక లైలా కోసం..

Published Fri, Aug 12 2016 1:08 AM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

కోలీవుడ్‌కు ఒక లైలా కోసం..

కోలీవుడ్‌కు ఒక లైలా కోసం..

దివంగత మహా నటుడు అక్కినేని నాగేశ్వరావు కుటుంబానికి తమిళ చిత్ర పరిశ్రమకు విడదీయరాని అనుబంధం ఉందన్నది ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటా. అక్కినేని నాగేశ్వరరావు తొలి రోజుల్లోనే తమిళ చిత్రాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన వారుసుడు నాగార్జున ఇదయత్తైతిరుడాదే చిత్రంతో తమిళ ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ఇటీవల తోళా అంటూ మరోసారి దగ్గరయ్యారు. తాజాగా ఆయన వారసుడు నాగచైతన్య లైలా ఓ లైలా అంటూ తన ప్రేమించిన అమ్మాయి కోసం కోలీవుడ్‌కు రానున్నారు. అవును తెలుగులో ఆయన నటించిన మంచి రొమాంటిక్ లవ్ ఎంటర్‌టెయినర్ చిత్రం ఒక లైలా కోసం ఇప్పుడు తమిళ భాష మాట్లాడనుంది.తెలుగులో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని నాగార్జున అక్కినేని నిర్మించారు. ఇందులో నాగచైతన్య సరసన పూజాహెగ్డే నటించారు.


ఇతర ముఖ్య పాత్రల్లో ప్రభు, సుమన్, షియాజీ షిండే, నాజర్ , బ్రహ్మానందం, ఆలీ, ఆశీష్ విద్యార్థి నటించారు. అనూప్ రూబెన్స్ సంగీత బాణీలు కట్టిన ఈ చిత్రానికి కే.విజయకుమార్ దర్శకత్వం వహించారు. రచయిత షాజీ తమిళ వెర్షన్‌కు మాటలు అందించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్.బాలాజీ తమిళంలో విడుదల చేస్తున్నారు. ఆయన చిత్రం గురించి మాట్లాడుతూ ఒక ధనవంతుల బిడ్డ అయిన నాగచైతన్య తొలి చూపులోనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడన్నారు. అయితే అతని ప్రేమను ఆ యువతి అంగీకరించదన్నారు.అయితే ఇరు కుటుంబ పెద్దలు వీరి పెళ్లికు నిశ్చితార్థం జరుపుతారన్నారు. అలాంటి పరిస్థితిలో నాగచైతన్య ఈ పెళ్లిని చెడగొడతారన్నారు. అది ఎలా?అంతగా ప్రేమించిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోడు? చివరికి వారి ప్రేమ పయనం ఎటు వైపు సాగింది ఇత్యాది పలు ఆసక్తికరమైన సంఘటనల సమాహారమే లైలా ఓ లైలా చిత్రం అని తెలిపారు. చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement