oka lila kosam
-
పదేళ్ల తర్వాత...
హీరో నాగచైతన్య, హీరోయిన్ పూజా హెగ్డే మరోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. 2014లో విడుదలైన ‘ఒక లైలా కోసం’ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి జోడీగా నటించనున్నారని టాక్. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు నాగచైతన్య. ఆ తర్వాతి చిత్రాన్ని ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో చేయనున్నారట. నాగచైతన్య కోసం మిస్టరీ, పౌరాణిక, థ్రిల్లర్ అంశాలతో కథ రెడీ చేస్తున్నారట కార్తీక్ దండు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన పూజా హెగ్డేని కథానాయికగా తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారని భోగట్టా. ఇక 2022లో విడుదలైన ‘ఆచార్య’ సినిమా తర్వాత (‘ఎఫ్ 3’లో ప్రత్యేక పాట చేశారు) మరో తెలుగు సినిమా కమిట్ కాలేదు పూజాహెగ్డే. నాగచైతన్యతో నటించే తాజా చిత్రం ఆమెకు తెలుగులో పెద్ద కమ్‌బ్యాక్ అవుతుందని టాక్. ప్రస్తుతం బాలీవుడ్లో ‘దేవా’ అనే సినిమా చేస్తున్నారు పూజా హెగ్డే. -
ఏడేళ్ల తర్వాత జత కడుతున్న చైతూ, పూజా హెగ్డే!
ఒక్కసారి ఏడేళ్లు వెనక్కి వెళదాం. అప్పుడు వచ్చిన ‘ఒక లైలా కోసం’ సినిమాను గుర్తు చేసుకుందాం. అందులో నాగచైతన్య, పూజా హెగ్డే జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. పూజ నటించిన తొలి స్ట్రయిట్ తెలుగు సినిమా ఇది. అంతకుముందు తమిళ ‘ముగముడి’ తెలుగు అనువాదం ‘మాస్క్’లో కనిపించారీ బ్యూటీ. ఇక ఏడేళ్ల క్రితం ‘ఒక లైలా కోసం’లో జోడీగా నటించిన చైతూ–పూజ మరోసారి జోడీ కట్టనున్నారని సమాచారం. నాగచైతన్య హీరోగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డేని కథానాయికగా అనుకుంటున్నారన్నది తాజా టాక్. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. మరి.. చైతూ–పూజా మళ్లీ జంటగా కనబడతారా? వెయిట్ అండ్ సీ. -
నాకెందుకు ప్రపోజ్ చేయలేదురా బాబు: అనసూయ
ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ బుల్లితెర యాంకర్‌గా రాణిస్తునే ఇటూ వెండితెరపై అందాలు బోస్తుంది. తనదైన యాంకరింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సినిమాల్లో కూడా మహిళ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ వరుసగా సినిమా అవకాశాలను చేజిక్కించుకుంటోంది. ఇక యాంకర్‌గా బుల్లితెరపై ఆమె చేసే ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. ఆమె చేసే ఓవరాక్షన్‌కు పడిపోయే వారు ఎంతమంది ఉన్నారో తిట్టుకునేవారు కూడా అంతే ఉన్నారు. ఇక అనసూయ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. నిత్యం తన వ్యక్తిగత విషయాలతో పాటు, సినిమాకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అనసూయ. తాజాగా ఈ యాంకర్మ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. నాగచైతన్య, పూజ హెగ్డే నటించిన ‘ఒక లైలాకోసం’ సినిమాలోని హీరోయిన్ డైలాగ్‌ను అనుకరించింది. ఇందులో పూజా తన మేల్ ఫ్రెండ్స్‌కు కాల్ చేసి ‘ఎప్పుడు నాకెందుకు ప్రపోజ్ చేయలేదురా’ అని అడిగే సన్నివేశం గుర్తుంది కదా. ఆ డైలాగ్‌కు ఇప్పుడు అనసూయ తన అభినయాన్ని జోడించింది. ‘నాకెందుకు ప్రపోజ్ చేయలేదురా అంటూ సాగే ఈ ఫన్నీ డైలాగ్పై ఓ వీడియోను చేసి షేర్ చేసింది. ఇక ఇది చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ఐ లవ్ యు అనసూయ’ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు ‘మీకు పెళ్లయింది కదా ఒప్పుకుంటారా లేదో అని ప్రపోజ్ చేయలేదు’ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అటు అనసూయ టీవీ షోలతో పాటు ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా అయిపోయింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
కోలీవుడ్‌కు ఒక లైలా కోసం..
దివంగత మహా నటుడు అక్కినేని నాగేశ్వరావు కుటుంబానికి తమిళ చిత్ర పరిశ్రమకు విడదీయరాని అనుబంధం ఉందన్నది ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటా. అక్కినేని నాగేశ్వరరావు తొలి రోజుల్లోనే తమిళ చిత్రాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన వారుసుడు నాగార్జున ఇదయత్తైతిరుడాదే చిత్రంతో తమిళ ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ఇటీవల తోళా అంటూ మరోసారి దగ్గరయ్యారు. తాజాగా ఆయన వారసుడు నాగచైతన్య లైలా ఓ లైలా అంటూ తన ప్రేమించిన అమ్మాయి కోసం కోలీవుడ్‌కు రానున్నారు. అవును తెలుగులో ఆయన నటించిన మంచి రొమాంటిక్ లవ్ ఎంటర్టెయినర్ చిత్రం ఒక లైలా కోసం ఇప్పుడు తమిళ భాష మాట్లాడనుంది.తెలుగులో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని నాగార్జున అక్కినేని నిర్మించారు. ఇందులో నాగచైతన్య సరసన పూజాహెగ్డే నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రభు, సుమన్, షియాజీ షిండే, నాజర్ , బ్రహ్మానందం, ఆలీ, ఆశీష్ విద్యార్థి నటించారు. అనూప్ రూబెన్స్ సంగీత బాణీలు కట్టిన ఈ చిత్రానికి కే.విజయకుమార్ దర్శకత్వం వహించారు. రచయిత షాజీ తమిళ వెర్షన్‌కు మాటలు అందించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్.బాలాజీ తమిళంలో విడుదల చేస్తున్నారు. ఆయన చిత్రం గురించి మాట్లాడుతూ ఒక ధనవంతుల బిడ్డ అయిన నాగచైతన్య తొలి చూపులోనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడన్నారు. అయితే అతని ప్రేమను ఆ యువతి అంగీకరించదన్నారు.అయితే ఇరు కుటుంబ పెద్దలు వీరి పెళ్లికు నిశ్చితార్థం జరుపుతారన్నారు. అలాంటి పరిస్థితిలో నాగచైతన్య ఈ పెళ్లిని చెడగొడతారన్నారు. అది ఎలా?అంతగా ప్రేమించిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోడు? చివరికి వారి ప్రేమ పయనం ఎటు వైపు సాగింది ఇత్యాది పలు ఆసక్తికరమైన సంఘటనల సమాహారమే లైలా ఓ లైలా చిత్రం అని తెలిపారు. చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.