సాక్షి, హైదరాబాద్: మాజీ మిస్ ఇండియా, ప్రముఖ అంతర్జాతీయ యోగా ట్రైనర్ సిమ్రాన్ అహుజా సిటీలో సందడి చేశారు. రానున్న ప్రపంచ యోగా దినోత్సవ నేపథ్యంలో కొన్ని ప్రధాన యోగాసనాలు వేసి ఔత్సాహికులను అలరించారు. నగరంలోని కంట్రీ క్లబ్ వేదికగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను సిమ్రాన్ అహుజా, క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ చైర్మన్ వై.రాజీవ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
మంగళవారం నిర్వహించిన ప్రారం¿ోత్సవంలో ‘మహిళా సాధికారత కోసం యోగా’ అనే థీమ్‌తో పాటు కంట్రీ క్లబ్ వీఐపీ ప్లాటినం గ్లోబల్ కార్డ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిమ్రాన్ అహుజా మాట్లాడుతూ.. భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడంలో యోగా కీలక పాత్ర పోషించిందని, ఇతర దేశాల వారు సైతం యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం గర్వకారణమని అన్నారు. దేశ ప్రాధాన్యతగా యోగాను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడంలో ప్రధాని మోదీ కృషి ఎనలేనిదని అన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా యోగా సాధన చేస్తూ మంచి ఆరోగ్య ఫలితాలను పొందానని వై.రాజీవ్ రెడ్డి తెలిపారు. పటిష్ట ఆరి్థక వ్వవస్థతో పాటు యోగా వంటి విలువైన సాంస్కృతిక వారసత్వ సంపదను కలిగిన అగ్రదేశంగా భారత్ నిలుస్తుందని అన్నారు. కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి వినూత్న ఫిట్నెస్ కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప అనుభూతినిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment