yoga trainers
-
యోగాంజలి – ఎందుకంటే సినిమా కంటే ధ్యానం ఇష్టం
‘ఔత్సాహికులకు 60 పౌండ్లు మాత్రమే. వెంటనే రిజిస్టర్ చేసుకోండి’ అంటున్న పూర్వ సినీనటి గీతాంజలి యోగా ప్రస్థానం ఆసక్తి కలిగిస్తోంది. ‘గీతాంజలి’ సినిమాతో ఒక వెలుగు వెలిగిన గిరిజా షెట్టార్ యు.కె.లో స్థిరపడింది. 35 ఏళ్ల తర్వాత ఇటీవలే ఒక కన్నడ సినిమాలో సింగిల్ మదర్‌గా నటించిన గిరిజ ‘ఆ పాత్ర స్థితి. నా స్థితి ఒకటే కనుక ఒప్పుకున్నాను’ అని చెబుతోంది. గతంలో పత్రికా రిపోర్టర్‌గా పని చేసిన గిరిజ ఇప్పుడు మనిషికి ఆరు వేల రూపాయల ఫీజుతో యోగా నేర్పిస్తోంది. ఆమె రాబడి ఎలా ఉన్నా యోగా అవసరం గురించి ఆమె చెప్తున్న విషయాలు అందరూ వినదగ్గవి.‘2023 సంవత్సరం మే నెలలో నాకు అనిపించింది ఇక మీదట నేను యోగా, ధ్యాన మార్గాలలో మార్గదర్శిగా నిలవాలని. ఆ నిర్ణయం తీసుకున్నాక ఎంతోమందికి సాయపడుతున్నాను’ అంటున్నారు గిరిజ. ‘గీతాంజలి’ (1989) సినిమాతో నేటికీ మరపు రాని ఈ నటి చాలా యేళ్లుగా యు.కెలో స్థిరపడినా, రకరకాల ఉద్యోగాలు చేసినా 55 ఏళ్ల వయసులో యోగా టీచర్‌గా నూతన ప్రస్థానం సాగిస్తున్నారు. భారతీయ సినిమాలు చూడటమే మానేసిన గిరిజ అందుకు కారణం ఏమంటారంటే ‘చూశానంటే మనసు పాడవుతుంది. ఆ సినిమాలలో నేను చాలా చేసి ఉండే అవకాశం ఉందప్పుడు. అవన్నీ వదులుకొని వచ్చినందుకు ఒక్కోసారి అది సరైన నిర్ణయం కాదని అనిపిస్తుంది’ అంటారు.2024 సెప్టెంబర్ 5న విడుదల అయిన ‘ఇబ్బని తబ్బిద ఇలెయాలి’ అనే కన్నడ సినిమా లో సింగిల్ మదర్‌గా నటించారు గిరిజ (ప్రైమ్‌టైమ్‌లో ఉంది). ‘నేను ఉన్న స్థితి ఆ పాత్ర స్థితి ఒక్కటే కనుక నిర్మాత రక్షిత్ శెట్టి అడిగాక అంగీకరించాను’ అంటారామె. అయితే సినిమాల మీద కంటే ఆమె ధ్యాస, ఆసక్తి కేవలం యోగా గురువుగా తాను చేయవలసిన సేవ మీదే ఉన్నట్టుగా ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.గీతాంజలి గర్ల్తెలుగు మూలాలు ఉన్న కన్నడ తండ్రికి, యు.కె.కు చెందిన క్రిస్టియన్ తల్లికి జన్మించిన గిరిజ తన 17వ ఏట వరకూ యు.కె.లోనే పెరిగారు. ఆ తర్వాత ఇండియా వచ్చి పదేళ్లపాటు ఉన్నారు. ఆ సమయంలోనే గీతాంజలిలో నాగార్జున పక్కన నటించి గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ను పొందారు. ఆ తర్వాత కేవలం రెండు మూడు సినిమాలు చేసిన గిరిజ వివాహం చేసుకుని లండన్‌లో స్థిరపడ్డారు. కొన్నాళ్లు ఒక బిజినెస్ పత్రికకు, మరికొన్నాళ్లు మరో పత్రికకు రిపోర్టర్‌గా పని చేశారు. సముద్రయాన కార్మికుల మానవ హక్కుల కోసం కూడా పని చేశారు. ఆమె ముందు నుంచి యోగ సాధకురాలు. అంతేకాకుండా యోగాలో పీహెచ్డీ చేశారు. రాజయోగ ను ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. వివిధ దేశాలలో యోగాకోర్సులు కూడా చేశారు. వీటన్నింటి భూమికతో ఆమె తాను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలని ఇప్పుడు యోగా టీచర్‌గా మారారు.ఆమె చెప్తున్న విషయాలు→ మీలో చెడు భావాలు, నెగెటివిటీ ఉన్నాయంటే మీలోని దైవత్వం సుషుప్తి లో ఉన్నట్టే. మీలోని దివ్యత్వాన్ని మీరు మేల్కొలిపితే ఈ మలినాలు పోతాయి.→ మీలోని మంచి లక్షణాలను మీరు తరచూ గుర్తు చేసుకోవాలి. లేకపోతే మీలోని మంచి లక్షణాలను మీరు చూడటం మొదలెడితే ఇతరులలోని మంచి లక్షణాలు కూడా కనిపించడం మొదలెడతాయి.→ మొత్తం మీరే చేయాలేమో అన్న భావనతో అలసిపోవద్దు. మీరు చేయాల్సింది చేయండి మీతోపాటు విశ్వాత్మ కూడా దానికోసం పాటుపడుతుంది. అది గ్రహింపులోకి వస్తే మీరు అలసిపోరు. నేను పత్రికలో పనిచేసేటప్పుడు డెడ్‌లైన్ సమయంలో పేజీలు ఖాళీగా ఉంటే చాలా టెన్షన్ పడేదాన్ని. కాని సమయానికి అన్నీ ఆటోమేటిక్‌గా పూర్తయ్యేవి. అంటే మనతోపాటుగా మన ఆత్మ, విశ్వాత్మ కూడా పని చేస్తున్నాయన్న మాట. → ధ్యానం మీ స్వభావానికి రక్షణ కల్పిస్తుంది. మీ ఆత్మకు రక్షణ కల్పిస్తుంది. మిమ్మల్ని అనుక్షణం చూసుకునే ఆప్తుని తోడు ఉంటే ఎలా ఉంటుందో యోగ, ధ్యానాలు మీకు తోడైతే అలాంటి భావన కలుగుతుంది.→ చెడు చాలా పరిమితం. మంచి అనంతం. ఆ అనంతమైన మంచిని మనలో నిత్యం జాగృతం చేసుకుంటూ ఉంటే మంచి జీవనం తప్పకుండా మనకు చేరువ అవుతుంది.యోగా ఒక రక్షణ‘నేను కోవిడ్ సమయంలో తీవ్రంగా అనారోగ్యం బారిన పడ్డాను. వైరస్ నా బ్రెయిన్ వరకూ వెళ్లనుందని అర్థమైంది. అయినా, నేను భయపడలేదు. నా యోగతో, ధ్యానంతో కోవిడ్ నుంచి బయటపడ్డాను. శరీరం, మనసు ప్రశాంతతను కోల్పోకుండా ఉంటే చాలా విజయాలు సాధించవచ్చు. యోగా శరీరాన్ని, ధ్యానం మనసును అలజడుల నుంచి కాపాడుతాయి. అంతేకాదు, అంతర్గత శత్రువులను నెమ్మదింప చేస్తాయి. నేను రోజుకు మూడుగంటలు ధ్యానం చేస్తాను. మీరు కనీసం అరగంట అయినా చేయండి. లేదంటే నిద్ర లేవగానే కనీసం పది నిమిషాలు చేయండి. ‘ఓ విశ్వాత్మా... ఈ జగత్తులో నన్ను ఒక సంపదగా గ్రహించు’ అని వేడుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఓపిక పట్టాలి... కాలం చాలా గాయాలను మాన్పుతుంది... మీరు దానికి అనుమతిస్తే’ అంటారు గిరిజ. -
భారత సంతతి యెగా గురువు హఠాన్మరణం..శిష్యులుగా హాలివుడ్ స్టార్స్, ప్రముఖులు..
ప్రఖ్యాత యోగా గురువు శరత్ జోయిస్ అమెరికాలో మరణించారు. ఆయన హాలీవుడ్ స్టార్స్, సెలబ్రిటీలకు యోగా పాఠాలు చెప్పిన ప్రఖ్యాత గురువు. 53 ఏళ్ల వయసులో కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన అష్టాంగ యోగ వ్యవస్థాపకుడు కృష్ణ పట్టాభి జోయిస్ మనవడు. తన తాత కనుగొన్న యోగా శైలిని ప్రాచుర్యంలోకి తెచ్చి, దానిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అష్టాంగ యోగా గురువు శరత్. ఆయన సెప్టెంబర్ 29, 1971న మైసూర్లో జన్మించారు. శరత్ కుటుంబం అష్టాంగ యోగా అభ్యాసం, సంరక్షణ భోధనకు అంకితమయ్యింది. 2009లో తన తాత మరణంతో ఆయన వారసత్వాన్ని శరత్ కొనసాగించారు. అలా అనతి కాలంలో ప్రభావవంతమైన యోగా గురువుల్లో ఒకరిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన వర్జీనియా యూనివర్సిటీలోని కాంటెంప్లేటివ్ సైన్సెస్ సెంటర్లో శరత్ బోధిస్తున్నారు. ఆయన యోగా సెంటర్ ప్రకారం.. కొత్త బ్యాచ్ క్లాస్‌లను స్టార్ట్ చేయడానికి డిసెంబర్లో తన స్వగ్రామానికి రావాల్సి ఉండగా..అంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల, శిష్యులు, తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.షార్లెట్స్విల్లేలోని వర్జీనియా విశ్వవిద్యాలయం సమీపంలో హైకింగ్ చేస్తున్నప్పుడు(సరదాగా కాసేపు ప్రకృతిలో గడిపేందుకు చేసే సుదీర్ఘ నడక) శరత్‌కు గుండెపోటు రావడంతో మరణించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయనకు తల్లి సరస్వతి జోయిస్, తండ్రి రంగస్వామి, భార్య శృతి జోయిస్, కుమారుడు సంభవ్ జోయిస్, కుమార్తె శ్రద్ధా జోయిస్ ఉన్నారు. శరత్ హాలీవుడ్ స్టార్స్ మడోన్నా, గ్వినేత్ పాల్ట్రోతో (Gwyneth Paltrow)సహా ఎంతో మంది సెలబ్రిటీలకు యోగాను బోధించారు. అంతేగాదు హిల్లరీ క్లింటన్ కూడా ఒకనొక సందర్భంలో తాను మానసికంగా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నానని ఆ సమయంలో యోగా గురువు శరత్ నాసికా శ్వాస, నాడి శోధన ప్రాణాయామం అనే టెక్నిక్ తనకు ఎంతో ఉపయోగపడిందని ఆమే స్వయంగా తెలిపారు. View this post on Instagram A post shared by 𝙎𝙝𝙖𝙧𝙖𝙩𝙝 𝙅𝙤𝙞𝙨, 𝙋𝘼𝙍𝘼𝙈𝘼𝙂𝙐𝙍𝙐 (@sharathjoisr) (చదవండి: హింసాత్మక ఘర్షణలు.. ఆలయంలో ఇండియన్ కాన్సులేట్ కార్యక్రమం రద్దు) -
మిస్ ఇండియా ‘యోగాసన్’
సాక్షి, హైదరాబాద్: మాజీ మిస్ ఇండియా, ప్రముఖ అంతర్జాతీయ యోగా ట్రైనర్ సిమ్రాన్ అహుజా సిటీలో సందడి చేశారు. రానున్న ప్రపంచ యోగా దినోత్సవ నేపథ్యంలో కొన్ని ప్రధాన యోగాసనాలు వేసి ఔత్సాహికులను అలరించారు. నగరంలోని కంట్రీ క్లబ్ వేదికగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను సిమ్రాన్ అహుజా, క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ చైర్మన్ వై.రాజీవ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. మంగళవారం నిర్వహించిన ప్రారం¿ోత్సవంలో ‘మహిళా సాధికారత కోసం యోగా’ అనే థీమ్‌తో పాటు కంట్రీ క్లబ్ వీఐపీ ప్లాటినం గ్లోబల్ కార్డ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిమ్రాన్ అహుజా మాట్లాడుతూ.. భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడంలో యోగా కీలక పాత్ర పోషించిందని, ఇతర దేశాల వారు సైతం యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం గర్వకారణమని అన్నారు. దేశ ప్రాధాన్యతగా యోగాను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడంలో ప్రధాని మోదీ కృషి ఎనలేనిదని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా యోగా సాధన చేస్తూ మంచి ఆరోగ్య ఫలితాలను పొందానని వై.రాజీవ్ రెడ్డి తెలిపారు. పటిష్ట ఆరి్థక వ్వవస్థతో పాటు యోగా వంటి విలువైన సాంస్కృతిక వారసత్వ సంపదను కలిగిన అగ్రదేశంగా భారత్ నిలుస్తుందని అన్నారు. కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి వినూత్న ఫిట్నెస్ కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప అనుభూతినిస్తుందన్నారు. -
సెంథిల్ భార్య మరణం.. ప్రభాస్ వీడియో వైరల్!
టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య రూహీ అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్త విన్న టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె మృతికి పలువురు సినీతారలు సంతాపం తెలిపారు. తాజాగా ఆమె గురించి ప్రభాస్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. రూహీ యోగా ట్రైనర్ కావడంతో ఆమె సలహాలను పాటించేవాడినని అన్నారు. షూటింగ్ తర్వాత అలసటగా ఉన్న సమయంలో యోగ టిప్స్ పాటిస్తూ రిలాక్స్ అయ్యేవాడినని తెలిపారు. ఆమె తనకు మంచి స్నేహితురాలు అని.. యోగాతో మనం యాక్టివ్‌గా ఉండేందుకు తోడ్పడుతుందని ప్రభాస్ అన్నారు. తన సలహాలతో బాహుబలి పార్ట్-2 లో చాలా హెల్ప్ అయిందని ప్రభాస్ మాట్లాడారు. తాజాాగా ఆమె మరణంతో ప్రభాస్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. బాహుబలి సినిమా సమయంలో అనుష్క, ప్రభాస్‌కు యోగా ట్రైనర్‌గా పనిచేశారు. అంతే కాకుండా ఇలియానాకు కూడా యోగా ట్రైనింగ్ ఇచ్చారు. సెంథిల్ కుమార్ ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రాలకు సినిమాటోగ్రఫర్‌గా సేవలందించారు. ఆర్ఆర్ఆర్, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్, మగధీర, అరుంధతి, యమదొంగ, ఛత్రపతి, ఈగ, సై వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలలో వీరిద్దరూ కలిసి పనిచేశారు. Yoga exponent #Roohi has passed away due to health issues. May her soul rest in peace! Stay strong, anna @DOPSenthilKumar. Throwback video of #Prabhas talking about #SenthilKumar's wife, #Roohi.pic.twitter.com/nJs78SUa5W — Hail Prabhas (@HailPrabhas007) February 15, 2024 -
రెక్కలిచ్చిన ఆసనం
మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పెద్దయ్యాక ఇది అవ్వాలి, అది అవ్వాలి అని రకరకాల కలలు కంటాము. ఎంతో ఇష్టమైన కలను నిజం చేసుకునేందుకు ఎదురైన అడ్డంకులన్నింటిని దాటుకుని సాధిస్తాం. హమ్మయ్య చేరుకున్నాం అని కాస్త సంతోషపడేలోపు అనుకోని కుదుపులు కెరీర్‌ను పూర్తిగా నాశనం చేస్తాయి. తిరిగి కోలుకోలేని దెబ్బకొడతాయి. అచ్చం ఇలానే జరిగింది అన్షుక పర్వాణి జీవితంలో. తనకెంతో ఇష్టమైన కెరీర్‌ను వదిలేసినప్పటికీ... యోగా ఇచ్చిన ధైర్యంతో యోగానే కెరీర్‌గా మలుచుకుని సెలబ్రెటీ యోగా ట్రైనర్‌గా రాణిస్తోంది పర్వాణి. ముంబైకి చెందిన అన్షుక పర్వాణి విద్యావంతుల కుటుంబంలో పుట్టింది. అన్షుకకు చిన్నప్పటినుంచి ఆస్తమా ఉంది. అయితే మందులు మింగడం అంటే ఇష్టం ఉండేది కాదు. దీంతో డాక్టర్స్ అయిన తాతయ్య, నాయనమ్మలు... ‘‘రోజూ స్విమ్మింగ్ చేస్తుంటే నీ ఊపిరి తిత్తులు బలంగా మారతాయి’’ అని ప్రోత్సహించేవారు. మందులు మింగే బాధ ఉండదని, అన్షుక ఎంతో ఆసక్తిగా స్విమ్మింగ్ నేర్చుకుని రోజూ ఈతకొట్టేది. ఈతలో పట్టుసాధించి జాతీయస్థాయి ఛాంపియన్ షిప్స్‌లో గోల్డ్‌మెడల్ గెలిచింది. స్విమ్మింగ్‌తోపాటు విమాన ప్రయాణం అన్నా అన్షుకకు చాలా ఇష్టం. ఈ ఇష్టంతోనే పైలట్ కావాలని కలలు కనేది. పైలట్ అయ్యి, ప్రపంచమంతా తిరిగిరావాలని... కష్టపడి కమర్షియల్ పైలట్ అయ్యింది. ► ఎగరలేకపోయింది అది 2008.. అన్షుక అనుకున్నట్టుగానే పైలెట్‌గా గాలిలో తేలిపోతున్న రోజులవి. ఒకరోజు బైక్ యాక్సిడెంట్లో అనుష్క కాళ్లు, తల, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. ఎటూ కదల్లేని పరిస్థితి. కొన్ని నెలలపాటు బెడ్‌కే పరిమితమైంది. దీంతో కమర్షియల్ పైలట్ ఉద్యోగానికి ఫిట్ కాదని జాబ్ నుంచి తొలగించారు. ఒకపక్క గాయాలతో గుచ్చుకుంటోన్న శరీరం, మరోపక్క విమానం నడపలేని పరిస్థితి అన్షుకను కలచివేసింది. ఇదే సమయంలో తల్లిదండ్రులు అండగా ఉండి, తమ సంపూర్ణ సహకారం అందించడంతో... ఫిజియోథెరపీ, యోగాలతో కొన్ని వారాలలోనే కోల్పోయిన మనోధైర్యాన్ని కూడదీసుకుంది. ఎలాగైనా లేచి నడవాలి అని నిర్ణయించుకుని ఆసనాలను కఠోరంగా సాధన చేసేది. తన తల్లి యోగా టీచర్ కావడం, చిన్నప్పటి నుంచి ఆస్తమాను ఎదుర్కోవడానికి యోగాసనాలు వేసిన అనుభవంతో ఎనిమిది నెలల్లోనే కోలుకుని తిరిగి నడవగలిగింది. ► యోగ శక్తిని తెలపాలని... యోగాతో సాధారణ స్థితికి వచ్చిన అన్షుక.. తిరిగి పైలట్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ యోగాపై ఏర్పడిన నమ్మకం, ఆసక్తితో ‘యోగాను ఎందుకు కెరీర్‌గా ఎంచుకోకూడదు? ఎగరలేక కిందపడిపోయిన తనని తిరిగి లేచి నyì చేలా చేసిన ఈ యోగా శక్తిని అందరికీ తెలియచేయాలి’ అనుకుని.. తొమ్మిది నెలల పాటు యోగాలో శిక్షణ తీసుకుని సర్టిఫికెట్ అందుకుంది. యోగాను మరింత లోతుగా తెలుసుకునేందుకు ముంబై యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. పీజీ చేస్తూనే వివిధ రకాల సంప్రదాయ యోగాలను సాధన చేసి ఔపోసన పట్టింది. ఈ క్రమంలోనే పైలట్స్, బాలే, జుంబాను నేర్చుకుని సర్టిఫికెట్ పొందింది. 2015లో బాంద్రాలో యోగా ఇన్స్టిట్యూట్ను నెలకొల్పింది. సంప్రదాయ యోగాసనాలకు కొన్ని టెక్నిక్స్‌ను జోడించడంతో మంచి ఫలితాలు వచ్చేవి. దీంతో అన్షుక యోగా సెంటర్ బాగా పాపులర్ అయ్యింది. ► అన్షుక యోగా స్టూడియో! యోగాపై పెరిగిన అవగాహనతో సెలబ్రెటీలు సైతం తమ ఫిట్నెస్కోసం యోగాను ఎంచుకుంటున్నారు. అన్షుక ట్రైనింగ్ బావుండడంతో.. మలైకా అరోరా, హూమా ఖురేషి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కరీనా కపూర్, ఆలియాభట్, దీపికా పదుకోన్, రకుల్æప్రీత్ సింగ్, మిస్బా గుప్తా, అనన్య పాండే, జాహ్నవీ కపూర్, సోనాల్ చౌహాన్ వంటి సెలబ్రెటీలు అన్షుక దగ్గర యోగాలో శిక్షణ తీసుకున్నారు. ఎంతమంది సెలబ్రెటీలకు యోగా ట్రైనర్‌గా పనిచేసినా నాకు ఎలాంటి ఒత్తిడీ ఉండదు. శిక్షణ ఇవ్వడమంటే ఇష్టం. ట్రైనింగ్ ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే, నేను మనసా వాచా కర్మణ్యా పనిచేస్తున్నాను. ఎవరికైనా సలహాలు, సూచనలు ఇచ్చినప్పుడు అవి కచ్చితత్వంతోనూ, సత్యంతోనూ ఉంటేనే వాటికి విలువ ఉంటుంది. అందుకే నేను యోగాసనాలు వేసి, వేయించి, దాని శక్తిని అందరికీ తెలిసేలా చేస్తున్నాను. అందుకే నా శిక్షణకు ఆదరణ లభిస్తోంది. -
రెండో పెళ్లి చేసుకున్న గజిని చిత్ర నిర్మాత..!
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన, తన ప్రియురాలు ఐరా త్రివేదిని పెళ్లి చేసుకున్నారు. పలువురు బాలీవుడ్ తారలతో పాటు అమిర్ ఖాన్, హృతిక్ రోషన్ తదితరులు కూడా వివాహానికి హాజరయ్యారు. గతంలో మసాబా గుప్తాను పెళ్లాడిన మధు ఆమె విడాకులు తీసుకున్నారు. తాజాగా రెండో పెళ్లితో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఐరా త్రివేది తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్ నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ( ఇది చదవండి: సుశాంత్ ఆత్మహత్యపై కంగనా సంచలన ఆరోపణలు..!) ముంబయిలో జరిగిన ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. శనివారం జరిగిన మెహందీ వేడుకలో అమీర్, హృతిక్, రాజ్‌కుమార్ రావు, పాత్రలేఖ పాల్గొన్న సంగతి తెలిసిందే. మధు మంతెన గతంలో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాను వివాహం చేసుకున్నారు. వీరు 2019లో విడిపోయారు. మసాబా ఇటీవలే సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకున్నారు. కాగా మధు మంతెన బాలీవుడ్లో క్వీన్, అగ్లీ, గజిని తదితర చిత్రాలను నిర్మించారు. (ఇది చదవండి: ఘనంగా బుల్లితెర నటి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!) View this post on Instagram A post shared by Ira Trivedi (@iratrivedi) -
అర్పిత.. స్ఫూర్తి ప్రదాత
మొన్నటి ఒలింపిక్స్‌లో భారతీయ క్రీడాకారులు ఒక బంగారు పతకంతోపాటు, ఇతర పతకాలను తీసుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతోన్న పారా ఒలింపిక్స్‌లోనూ మేమేం తక్కువ కాదన్నట్లు ... పారా ఒలింపిక్ క్రీడాకారులు మరింత కసితో ఆడుతూ ప్రతి ఆటలో పతకాన్ని ఖాయం చేస్తున్నారు. వైకల్యాలకు ఎదురొడ్డి పోరాడుతూ పతకాల సంఖ్యను పెంచుతున్నారు. అయితే వీళ్లలా ఆ స్థాయికి వెళ్లనప్పటికీ, రెండు కాళ్లు కోల్పోయిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన అర్పితా రాయ్ మొక్కవోని ధైర్యంతో కృత్రిమ కాళ్లతో నడవడం నేర్చుకుని యోగా ట్రైనర్‌గా మారి ఎందరికో స్ఫూర్తినిస్తోంది. అది 2006 ఏప్రిల్ 22 కోల్‌కతాలో కొన్ని వస్తువులు కొనేందుకు తన ఫ్రెండ్ బైక్ మీద కూర్చుని వెళ్తోంది అర్పితా రాయ్. బ్యారక్‌పూర్‌లోని తన ఇంటి నుంచి 30 కిలోమీటర్లు వెళ్లాక.. ఒక సెకను లో అర్పిత జీవితం అనూహ్యంగా తలకిందులైపోయింది. ఒక పెద్ద లారీ వచ్చి వారి బైక్‌ను గుద్దింది. ఆ స్పీడుకు అర్పిత కిందపడిపోవడం... ఆమె కాళ్ల మీద నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో... ఆమె కాళ్లు నలిగిపోయాయి. ఆ దరిదాపుల్లో ఉన్న వారు వచ్చి రోడ్డుకు అవతలివైపు ఉన్న ఆసుపత్రిలో అర్పితను చేర్చారు. అక్కడ పెయిన్ కిల్లర్స్ మాత్రమే ఇచ్చి, శస్త్రచికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించమన్నారు. వేరే ఆసుపత్రిలో ఆపరేషన్ చేస్తే కాళ్లు వస్తాయని డాక్టర్లు చెప్పినప్పటికీ ... అర్పిత తల్లిదండ్రుల వద్ద ఆ సమయంలో ఆపరేషన్‌కు సరిపడా డబ్బులు లేక, వాటిని సమకూర్చుకోవడానికి 12 రోజుల సమయం పట్టింది. దీంతో కాళ్లకు ఇన్ఫెక్షన్ సోకి రెండు కాళ్లను తీసేశారు. అంతేగాక ఎనభైశాతం శరీరానికి గ్యాంగ్రిన్ సోకడంతో నాలుగు నెలలపాటు ఆసుపత్రిలోనే ఉంది. తన కాళ్లమీద తాను నిలబడి ధైర్యంగా బతకాల్సిన 20 ఏళ్ల అమ్మాయి రెండు కాళ్లనీ కోల్పోయింది. అయినప్పటికీ కృత్రిమ కాళ్లను అమర్చుకుని తను ఎవరి మీదా ఆధారపడ కూడదని నిర్ణయించుకుంది. ఈ దుర్ఘటన జరిగి ఇప్పటికీ పదిహేనేళ్లు. ఇప్పుడు అర్పిత కృత్రిమ కాళ్లతో నడవడమేగాక, యోగా కూడా చేస్తుంది. రోజూ గంట నిల్చొని... ఆపరేషన్ తరువాత రోజూ గంటపాటు నిలుచోమని డాక్టర్లు చెప్పారు. ఇలా చేయడం వల్ల శరీర ఆకృతి కరెక్టు వస్తుందని చెప్పడంతో అలా చేసేందుకు ప్రయత్నించేది. దాని వల్ల అర్పితకు చాలా నొప్పిగా అనిపించేది. అయినప్పటికీ అంతటి నొప్పిని ఓర్చుకుని, అనేక ప్రయత్నాల తరువాత తన కాళ్ల మీద తను నిలబడింది. నడవడం నేర్చుకున్న తరువాత 2007లో కాల్ సెంటర్లో ఉద్యోగంలో చేరింది. రెండున్నరేళ్లు పనిచేసి, పెళ్లి అవడంతో ఉద్యోగం మానేసింది. యోగా ట్రైనర్‌గా... కాల్ సెంటర్లో పనిచేసేటప్పుడు సహోద్యోగులు చూసే చూపులు తనని తీవ్రంగా ఇబ్బంది పెట్టేవి. మెట్టు ఎక్కాల్సి వచ్చినప్పుడు కూడా కష్టంగా అనిపించేది. ఈ క్రమంలోనే యోగా చేయడం ద్వారా శరీరాన్ని బ్యాలెన్స్‌గా ఉంచడమేగాక, ఫిట్‌గా ఉండవచ్చని భావించి 2015లో యోగా చేయడం ప్రారంభించింది. తొలిదినాలలో యోగా చేయడం బాగా కష్టంగా అనిపించినప్పటికీ కఠోర శ్రమపడి నేర్చుకుంది. ఆసనాలు పర్ఫెక్ట్గా వేయడం వచ్చాక... 2019 లో తనే ఒక ఇన్‌స్ట్రక్టర్‌గా మారింది. కరోనా రాకముందు 25 మందికి ఆసనాలు వేయడం నేర్పించేది. వీరిలో వికలాంగులు కూడా ఉన్నారు. యోగా ట్రైనర్‌గా అర్పితకు మంచి గుర్తింపు రావడంతో తన యోగా క్లాసుల వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం ప్రారంభించింది.‘రాయ్ అర్పితా యోగా’ పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి తన యోగా ట్రైనింగ్ సెషన్స్‌తో కూడిన వీడియోలను పోస్ట్ చేస్తోంది. ఈ వీడియోలకు ప్రోత్సాహంతో కూడిన కామెంట్లు వస్తుండడంతో అర్పిత మరింత ఉత్సాహంతో దాదాపు ఆరేళ్లుగా యోగా తరగతులు చెబుతూ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. -
ఆమె వేసే ఆసనాలు చూస్తే.. షాక్ అవ్వాల్సిందే!
యోగా అంటే మనకు గుర్తొచ్చేది రాందేవ్ బాబా. కానీ, బాలీవుడ్ సెలబ్రెటీలకు యెగా నేర్పించే గురువు దీపికా మెహతాను చూస్తే.. మతి పోతుంది. ఇక యోగా అంటే దీపికా మెహతానే గుర్తొచ్చేలా ఉంది. అంతలా ఆసనాలు వేస్తూ.. సోషల్ మీడియాలో వేల మంది ఫాలోవర్స్‌ను సంపాదించింది. కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, ఐశ్వర్య బచ్చన్‌లాంటి ప్రముఖులెందరికో యోగాను నేర్పిస్తున్నారు దీపికా మెహతా. ఈమె వేసే ఆసనాలు వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూస్తే మీకు కూడా వెంటనే ఫిట్‌నెస్‌పై శ్రద్ద వచ్చి.. యోగాను నేర్చుకుంటారు. ఈమెను సెలబ్రెటీలు కూడా ఫాలో అవుతుంటారు. అలియా భట్, మలైకా అరోరా, కరీనా కపూర్ లాంటి సెలబ్రెటీలు ఆమెను అనుసరిస్తుంటారు. -
యోగానే జీవితం
రామారెడ్డి(ఎల్లారెడ్డి): యోగా అనగానే చాలా మంది శరీరాన్ని అసాధ్యమైన భంగిమల్లోకి తిప్పడం అని అనుకుంటారు.. కానీ అది మనిషిని తను చేరుకోగల అత్యున్నత స్థితికి చేరవేసే ఒక సాధనం, సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానం తెలియదు. తనువు, మనస్సు సహా అన్నింటితో ఐక్యం అయితే అదే యోగా. ఉరుకుల పరుగుల జీవితానికి సాంత్వన చేకూర్చే యోగాను దేశ, విదేశాల్లో ఎందరికో నేర్పుతున్నారు బండి రాములు. రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన బండి రాములు.. 37 సంవత్సరాల పాటు బహ్రెయిన్‌లో వేల మందికి యోగా శిక్షణ ఇచ్చారు. ప్రముఖ యోగా శిక్షకుడిగా ప్రసిద్ధి చెందిన ఆయన.. జీవన విధానంలో యోగాను భాగంగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. చిన్ననాటి నుంచి యోగానే.. రాములుకు చిన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కొందరి సలహా మేరకు ఆయన యోగా సాధన చేసి, సమస్యను దూరం చేసుకన్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన జీవితంలో యోగా భాగమై పోయింది. బ్రహ్మంగారి జీవిత చరిత్ర నుంచి యోగా ప్రాముఖ్యతను గ్రహించి బండిరాములు ఈ దిశగా ప్రయత్నం చేసి యోగాను సంపూర్ణంగా నేర్చుకున్నారు. పుణేకు చెందిన ప్రముఖ యోగా గురువు బీకేఎస్ అయ్యంగర్ దగ్గర శిష్యరికం చేశారు. స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి యోగాపై ఆసక్తి కల్పించారు. ఆ తర్వాత బహ్రెయిన్ దేశానికి వెళ్లి అక్కడ 37 సంవత్సరాల పాటు ఎంతో మంది దేశ, విదేశీయులకు యోగా శిక్షణ ఇచ్చాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో యోగా శిక్షణ శిబిరాలు నిర్వహించారు. విద్యార్థులకు పరీక్షల సమయంలో మానసిక ప్రశాంతత కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మరింత ప్రాచుర్యం కల్పించాలి యోగా సాధనతో అనేక రకాలుగా మేలు జరుగుతుంది. నాకు ఎలాంటి ప్రతిఫలం రాకున్నా అందరికీ యోగా నేర్పిస్తున్నాను. ప్రభుత్వం యోగాకు మరింత ప్రాముఖ్యతనిచ్చి, ప్రాచుర్యం కల్పించాలి. మానసిక ప్రశాంతతకు ఉపయోగపడే యోగాను కేవలం ‘యోగా డే’కే పమితం చేస్తున్నారు. ఉరుకులు పరుగులతో కూడిన నేటి జీవితాలకు ఉపశమనం కలిగించేది యోగానే. తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న సగటు జీవికి సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కల్పించే యోగాకు ప్రభుత్వాలు మరింత ప్రాచుర్యం కల్పించాలి. – బండి రాములు, యోగా శిక్షకుడు -
ముస్లిం యోగా శిక్షకుల నియామకంపై దుమారం
న్యూఢిల్లీ: 'వరల్డ్ యోగా డే' సందర్భంగా ముస్లింలను యోగా శిక్షకులు, టీచర్లుగా నియమించకపోవడంపై వివాదం చెలరేగింది. తాత్కాలిక ప్రాతిపదికన ఎంపికచేసిన శిక్షకుల్లో ముస్లిం అభ్యర్థులకు చోటు దక్కకపోవడంతో.. ఒక విధానం ప్రకారమే ముస్లింలను యోగా టీచర్లుగా నియమించడం లేదంటూ వచ్చిన ఆరోపణలను కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ తోసిపుచ్చారు. ఇది తమ ప్రతిష్ఠను దిగజార్చేందుకు కొంతమంది చేస్తున్న ప్రచారమని ఖండించారు. ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. దీనిపై పూర్తి విచారణకు ఆదేశిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గత ఏడాది అక్టోబర్ 15న జరిగిన ప్రపంచ యోగా దినం కోసం ఉద్దేశించిన నియామకాల్లో ముస్లిం అభ్యర్థులకు మొండిచేయి చూపారంటూ అంతర్జాతీయ పత్రిక ది హఫింగ్టన్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. సుమారు 711 మంది అభ్యర్థులలో.. ఒక్క ముస్లిం టీచర్‌ను కూడా ఎంపిక చేయలేదని ఆ పత్రిక పేర్కొంది. దీనిపై జర్నలిస్టు పుష్పా శర్మ సమాచార హక్కు చట్టం ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. దరఖాస్తు చేసుకున్న ముస్లిం అభ్యర్థుల సంఖ్య, ఎంపికైన అభ్యర్థుల సంఖ్య తదితర వివరాలు కావాలని కోరారు. 3,841 ముస్లిం అభ్యర్థులలో ఒక్కరూ ఎంపిక కాలేదని సమాధానం వచ్చింది. దీంతో వివాదం చెలరేగింది. కాగా ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతిలకు సంబంధించిన మంత్రిత్వశాఖ ఆయూష్. ఈ శాఖ ప్రధానంగా సంప్రదాయ ఔషధాలకు ప్రోత్సాహాన్నిస్తుంది.