సెంథిల్ భార్య మరణం.. ప్రభాస్ వీడియో వైరల్! | Prabhas Comments About Cinematographer Senthilkumar Wife Roohi, Throwback Video Goes Viral - Sakshi
Sakshi News home page

Prabhas: 'రూహీ మంచి స్నేహితురాలు'.. ప్రభాస్ వీడియో వైరల్!

Feb 16 2024 3:56 PM | Updated on Feb 16 2024 4:31 PM

Prabhas talking About Senthilkumar Wife Ruhi in His Films - Sakshi

టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్  సెంథిల్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య రూహీ అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోన కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్త విన్న టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె మృతికి పలువురు సినీతారలు సంతాపం తెలిపారు.  

తాజాగా ఆమె గురించి ప్రభాస్‌ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. రూహీ యోగా ట్రైనర్ కావడంతో ఆమె సలహాలను పాటించేవాడినని అన్నారు. షూటింగ్‌ తర్వాత అలసటగా ఉన్న సమయంలో యోగ టిప్స్‌ పాటిస్తూ రిలాక్స్ అయ్యేవాడినని తెలిపారు. ఆమె తనకు మంచి స్నేహితురాలు అని.. యోగాతో మనం యాక్టివ్‌గా ఉండేందుకు తోడ్పడుతుందని ప్రభాస్ అన్నారు.  తన సలహాలతో బాహుబలి పార్ట్‌-2 లో చాలా హెల్ప్ అ‍యిందని ప్రభాస్ మాట్లాడారు. 

తాజాాగా ఆమె మరణంతో ప్రభాస్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. బాహుబలి సినిమా సమయంలో అనుష్క, ప్రభాస్‌కు యోగా ట్రైనర్‌గా పనిచేశారు. అంతే కాకుండా ఇలియానాకు కూడా యోగా ట్రైనింగ్ ఇచ్చారు.  సెంథిల్ కుమార్ ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రాలకు సినిమాటోగ్రఫర్‌గా సేవలందించారు.  ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి: ది బిగినింగ్‌, బాహుబలి: ది కన్‌క్లూజన్‌, మగధీర, అరుంధతి, యమదొంగ, ఛత్రపతి, ఈగ, సై వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలలో వీరిద్దరూ కలిసి పనిచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement