ప్రఖ్యాత యోగా గురువు శరత్ జోయిస్ అమెరికాలో మరణించారు. ఆయన హాలీవుడ్ స్టార్స్, సెలబ్రిటీలకు యోగా పాఠాలు చెప్పిన ప్రఖ్యాత గురువు. 53 ఏళ్ల వయసులో కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన అష్టాంగ యోగ వ్యవస్థాపకుడు కృష్ణ పట్టాభి జోయిస్ మనవడు. తన తాత కనుగొన్న యోగా శైలిని ప్రాచుర్యంలోకి తెచ్చి, దానిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అష్టాంగ యోగా గురువు శరత్.
ఆయన సెప్టెంబర్ 29, 1971న మైసూర్‌లో జన్మించారు. శరత్ కుటుంబం అష్టాంగ యోగా అభ్యాసం, సంరక్షణ భోధనకు అంకితమయ్యింది. 2009లో తన తాత మరణంతో ఆయన వారసత్వాన్ని శరత్ కొనసాగించారు. అలా అనతి కాలంలో ప్రభావవంతమైన యోగా గురువుల్లో ఒకరిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన వర్జీనియా యూనివర్సిటీలోని కాంటెంప్లేటివ్ సైన్సెస్ సెంటర్‌లో శరత్ బోధిస్తున్నారు. ఆయన యోగా సెంటర్ ప్రకారం.. కొత్త బ్యాచ్ క్లాస్‌లను స్టార్ట్ చేయడానికి డిసెంబర్‌లో తన స్వగ్రామానికి రావాల్సి ఉండగా..అంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల, శిష్యులు, తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
షార్లెట్స్‌విల్లేలోని వర్జీనియా విశ్వవిద్యాలయం సమీపంలో హైకింగ్ చేస్తున్నప్పుడు(సరదాగా కాసేపు ప్రకృతిలో గడిపేందుకు చేసే సుదీర్ఘ నడక) శరత్‌కు గుండెపోటు రావడంతో మరణించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయనకు తల్లి సరస్వతి జోయిస్, తండ్రి రంగస్వామి, భార్య శృతి జోయిస్, కుమారుడు సంభవ్ జోయిస్, కుమార్తె శ్రద్ధా జోయిస్ ఉన్నారు. శరత్ హాలీవుడ్ స్టార్స్ మడోన్నా, గ్వినేత్ పాల్ట్రోతో (Gwyneth Paltrow)సహా ఎంతో మంది సెలబ్రిటీలకు యోగాను బోధించారు.
అంతేగాదు హిల్లరీ క్లింటన్ కూడా ఒకనొక సందర్భంలో తాను మానసికంగా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నానని ఆ సమయంలో యోగా గురువు శరత్ నాసికా శ్వాస, నాడి శోధన ప్రాణాయామం అనే టెక్నిక్ తనకు ఎంతో ఉపయోగపడిందని ఆమే స్వయంగా తెలిపారు.
(చదవండి: హింసాత్మక ఘర్షణలు.. ఆలయంలో ఇండియన్ కాన్సులేట్ కార్యక్రమం రద్దు)
Comments
Please login to add a commentAdd a comment