ఇంతవరకు ఎన్నో వెయిట్‌లాస్ స్టోరీలు చదివాం. వాళ్లంతా బరువు తగ్గి.. ఎలా స్లిమ్‌గా మారి శెభాష్ అనిపించుకున్నారో చూశాం. కానీ ఇలాంటి అందమైన వెయిట్‌లాస్ స్టోరీని మాత్రం చదివి ఉండరు. ఈ మహిళ అధిక బరువుకి చెక్‌పెట్టి అందాల రాణిగా గెలుపు సాధించింది అందర్నీ ఆశ్చర్యపరిచింది పైగా "గెలుపు" అంటే ఇది అని చాటిచెప్పింది. ఎందరికో స్ఫూర్తినిచ్చింది.
అమెరికాలోని సీటెల్‌లో నివశిస్తున్న 39 ఏళ్ల భారత సంతతి మహిళ చాందినీ సింగ్ యూఎస్‌ఏ ఆధారిత పిల్లల పాదరక్ష కంపెనీ సహ వ్యవస్థాపకురాలు. ఆమె పీసీఓఎస్ సమస్యలతో గర్భం దాల్చడంలో పలు కాంప్లీకేషన్స్‌ని ఎదుర్కొంది. ఏదోలా ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక ఒక్కసారిగా ఆరోగ్య సమస్యలు చుట్టిముట్టాయి. మూడోనెల నుంచి బెడ్‌రెస్ట్ పేరుతో మంచానికే పరిమితమైపోయింది.
దీంతో ఒక్కసారిగా బరువు పెరిగిపోయింది. ఆ తర్వాత అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ తోసహ ప్రీ డయాబెటిక్ వంటి సమస్యలను ఫేస్ చేసింది. చివరికి డెలివరి అయ్యి.. కోలుకునేందుకు చాలా సమయమే పట్టింది. కానీ దీని కారణంగా అధిక బరువుతో పాటు ఆయా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇలానే ఉంటే భవిష్యత్తులో తన ఆరోగ్యం మరింత దారణంగా దిగజారిపోతుందేమోనన్న భయం మొదలైంది చాందినీలో. ఇక అప్పుడే గట్టిగా నిర్ణయించుకుంది ఎలాగైన బరువు తగ్గాలని.
తన ఫిట్‌నెస్ లక్ష్యాలు చేరుకునేలా క్రమ తప్పకుండా వ్యాయామాలు, ఆరోగ్యకరమైన డైట్‌ని ఫాలో అయ్యింది చాందినీ. అయితే మొదటి రెండు నెలల్లో తన బరువులో పెద్ద మార్పులు కనిపించకపోయినా..బరువు తగ్గాలనే ఆలోచనకు మాత్రం బ్రేక్ వేయలేదు. డైట్‌ని, వర్కౌట్లని కొనసాగిస్తూ ఉండేది. మరికొన్ని వర్కౌట్ల సెషన్లను పెంచుకునేది. ఒకవేళ రెండు నుంచి ఐదు రోజులు వ్యాయామాలు స్కిప్ అయినా కేలరీలు ఏదో రకంగా ఖర్చు అయ్యేలా చూసుకుంది. అలా సుమారు 48 కిలోల మేర తెలియకుండా బరువు కోల్పోయింది.
ప్రస్తుతం ఆమె 70 కిలోల బరువుతో ఉంది. అలాగే ఆమె ఇంతకు ముందు ఫేస్ చేసిన అనారోగ్య సమస్యలన్ని తగ్గుముఖం పట్టాయి. పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతంగా ఉంది. అయితే చాందీని వేగంగా బరువు తగ్గడం కంటే నిదానంగా బరవు తగ్గితేనే ఆరోగ్యకరం అంటోంది. తాను ఇంట్లో వండే భారతీయ భోజనానికే ప్రాధాన్యత ఇచ్చానని, జంక్ ఫుడ్‌ని పూర్తిగా దూరం పెట్టానని చెప్పారు.
ముఖ్యంగా రెస్టారెంట్లలో తినడం తగ్గించినట్లు చెప్పుకొచ్చింది. ఇక్కడితో ఆమె వెయిట్ లాస్‌జర్నీ పూర్తి కాలేదు. ఆమె స్లిమ్‌గా మారి.. యూఎస్‌ఏ 2024 అందాల పోటీల్లో పాల్గొని కిరీటాన్ని దక్కించుకుంది. బరువు తగ్గి ఆరోగ్యాన్ని కాపడుకోవడమే గాక అందలా రాణిగా మెరవచ్చు అని చాటి చెప్పింది. ఇక్కడ బరువు తగ్గడం అనేది అందం, ఆరోగ్యం అని చెప్పకనే చెప్పింది చాందినీ.
(చదవండి: హాట్‌టాపిక్‌గా టెక్ మిలియనీర్ డైట్ ! కేవలం భారతీయ వంటకాలే..)
Comments
Please login to add a commentAdd a comment