beauty queen
-
ఆహా.. అందాల రాణులు.. అస్సలు తగ్గేదే లే!
-
బరువు తగ్గి.. అందాల పోటీలో కిరీటాన్ని దక్కించుకుంది!
ఇంతవరకు ఎన్నో వెయిట్‌లాస్ స్టోరీలు చదివాం. వాళ్లంతా బరువు తగ్గి.. ఎలా స్లిమ్‌గా మారి శెభాష్ అనిపించుకున్నారో చూశాం. కానీ ఇలాంటి అందమైన వెయిట్‌లాస్ స్టోరీని మాత్రం చదివి ఉండరు. ఈ మహిళ అధిక బరువుకి చెక్‌పెట్టి అందాల రాణిగా గెలుపు సాధించింది అందర్నీ ఆశ్చర్యపరిచింది పైగా "గెలుపు" అంటే ఇది అని చాటిచెప్పింది. ఎందరికో స్ఫూర్తినిచ్చింది. అమెరికాలోని సీటెల్‌లో నివశిస్తున్న 39 ఏళ్ల భారత సంతతి మహిళ చాందినీ సింగ్ యూఎస్ఏ ఆధారిత పిల్లల పాదరక్ష కంపెనీ సహ వ్యవస్థాపకురాలు. ఆమె పీసీఓఎస్ సమస్యలతో గర్భం దాల్చడంలో పలు కాంప్లీకేషన్స్ని ఎదుర్కొంది. ఏదోలా ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక ఒక్కసారిగా ఆరోగ్య సమస్యలు చుట్టిముట్టాయి. మూడోనెల నుంచి బెడ్‌రెస్ట్ పేరుతో మంచానికే పరిమితమైపోయింది. దీంతో ఒక్కసారిగా బరువు పెరిగిపోయింది. ఆ తర్వాత అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ తోసహ ప్రీ డయాబెటిక్ వంటి సమస్యలను ఫేస్ చేసింది. చివరికి డెలివరి అయ్యి.. కోలుకునేందుకు చాలా సమయమే పట్టింది. కానీ దీని కారణంగా అధిక బరువుతో పాటు ఆయా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇలానే ఉంటే భవిష్యత్తులో తన ఆరోగ్యం మరింత దారణంగా దిగజారిపోతుందేమోనన్న భయం మొదలైంది చాందినీలో. ఇక అప్పుడే గట్టిగా నిర్ణయించుకుంది ఎలాగైన బరువు తగ్గాలని. తన ఫిట్నెస్ లక్ష్యాలు చేరుకునేలా క్రమ తప్పకుండా వ్యాయామాలు, ఆరోగ్యకరమైన డైట్‌ని ఫాలో అయ్యింది చాందినీ. అయితే మొదటి రెండు నెలల్లో తన బరువులో పెద్ద మార్పులు కనిపించకపోయినా..బరువు తగ్గాలనే ఆలోచనకు మాత్రం బ్రేక్ వేయలేదు. డైట్‌ని, వర్కౌట్లని కొనసాగిస్తూ ఉండేది. మరికొన్ని వర్కౌట్ల సెషన్లను పెంచుకునేది. ఒకవేళ రెండు నుంచి ఐదు రోజులు వ్యాయామాలు స్కిప్ అయినా కేలరీలు ఏదో రకంగా ఖర్చు అయ్యేలా చూసుకుంది. అలా సుమారు 48 కిలోల మేర తెలియకుండా బరువు కోల్పోయింది. ప్రస్తుతం ఆమె 70 కిలోల బరువుతో ఉంది. అలాగే ఆమె ఇంతకు ముందు ఫేస్ చేసిన అనారోగ్య సమస్యలన్ని తగ్గుముఖం పట్టాయి. పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతంగా ఉంది. అయితే చాందీని వేగంగా బరువు తగ్గడం కంటే నిదానంగా బరవు తగ్గితేనే ఆరోగ్యకరం అంటోంది. తాను ఇంట్లో వండే భారతీయ భోజనానికే ప్రాధాన్యత ఇచ్చానని, జంక్ ఫుడ్‌ని పూర్తిగా దూరం పెట్టానని చెప్పారు. ముఖ్యంగా రెస్టారెంట్లలో తినడం తగ్గించినట్లు చెప్పుకొచ్చింది. ఇక్కడితో ఆమె వెయిట్ లాస్జర్నీ పూర్తి కాలేదు. ఆమె స్లిమ్‌గా మారి.. యూఎస్ఏ 2024 అందాల పోటీల్లో పాల్గొని కిరీటాన్ని దక్కించుకుంది. బరువు తగ్గి ఆరోగ్యాన్ని కాపడుకోవడమే గాక అందలా రాణిగా మెరవచ్చు అని చాటి చెప్పింది. ఇక్కడ బరువు తగ్గడం అనేది అందం, ఆరోగ్యం అని చెప్పకనే చెప్పింది చాందినీ. (చదవండి: హాట్‌టాపిక్‌గా టెక్ మిలియనీర్ డైట్ ! కేవలం భారతీయ వంటకాలే..) -
చరిత్ర సృష్టించిన అందాల రాణి
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ (MGI) 2024 టైటిల్‌ను సాధించి రాచెల్ గుప్తా (20) చరిత్ర సృష్టించింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన పోటీలో ఈ కిరీటాన్నిదక్కించుకున్న తొలి భారతీయురాలిగా నిలిచింది. సుమారు 70కిపైగా దేశాలకు చెందిన అందాల రాణులను వెనక్కి నెట్టి భారతదేశానికి టైటిల్‌ను అందించింది. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పంజాబ్‌లోని జలంధర్‌లో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు సంబరాల్లో మునిగిపోయారు. రేచల్ విజయం యవద్దేశం గర్వించేలా చేసిందని కుటుంబ సభ్యుడు తేజస్వి మిన్హాస్ హర్షం వ్యక్తం చేశారు.బ్యాంకాక్ MGI హాల్లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలో రాచెల్ గ్ర్యాండ్ ఫినాలెలో ఫిలిప్పీన్స్‌కి చెందిన సిజె ఓపియాజాను ఓడించి బంగారు కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తర్వాత అంతర్జాతీయ పోటీలో చోటు దక్కించుకుంది. అలాగే 2022లో 'మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ది వరల్డ్' కిరీటాన్ని కూడా గెలుచుకుంది. ఇకపై రాచెల్ ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించే ప్రపంచ రాయబారిగా ఉండనుంది. ఈ టైటిల్ దక్కించుకున్న తొలి భారతీయురాలిగా రికార్డ్ సృష్టించడమే కాదు, 'అత్యధిక ప్రపంచ అందాల పోటీల కిరీటాలు గెల్చుకున్న తొలి ఇండియన్ లారాదత్తా సరసన చేరింది. కాగా రాచెల్ ఆమె మాడెల్, నటి వ్యాపారి. ఇన్‌స్టాగ్రామ్‌లో 10లక్షలకు పైగా ఫాలోవర్లు ఆమె సొంతం. -
70 దేశాలను ఓడించి అందాల రాణిగా రాచెల్ గుప్తా : తొలి ఇండియన్‌గా చరిత్ర
-
మిస్ యూనివర్స్ స్టేట్ గ్రాండ్ ఫినాలే.. బ్యూటీ క్వీన్స్ క్యాట్ వాక్ (ఫోటోలు)
-
అందానికే అసూయ పుట్టించే బ్యూటీ క్వీన్ (ఫోటోలు)
-
Sreeleela: సమ్మర్ స్పెషల్ లుక్‌లో శ్రీలీల (ఫోటోలు)
-
బ్యూటీ క్వీన్‌గా కిరీటాన్ని గెలుచుకుంది..కానీ అంతలోనే..
ఒక్కోసారి ఆకాశాన్ని అందుకునే గొప్ప విజయాన్ని అందుకుంటాం. అందరిచేతే ఆహా ఓహో అనిపించుకుంటాం. ఇక్కడ గెలిస్తే సరిపోదు..ఆ విజయాన్ని నిలబెట్టుకునేలా మనం బిహేవ్ చేయాల్సి కూడా ఉంటుంది. లేదంటే ఈ బ్యూటీ క్వీన్‌లా అందరిముందే అబాసుపాలయ్యే గెలుపు కూడా నీరుగారిపోతుంది. అసలేం జరిగిందంటే..మలేషియాకు చెందిన అందాల భామ వీరూ నికా టెరిన్సిప్ 2023లో ఉండక్ న్గడౌ జోహోర్ టైటిల్‌ని గెలుచుకుంది. అయితే ఆమె ఇటీవల సెలవులకు ధాయ్‌లాండ్‌లో గడపడానికి వెళ్లింది. అక్కడకు వెళ్లడమే శాపమై టైటిల్‌ని కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకంటే..అక్కడ ఆమె కొంతమంది మగవాళ్లతో కలిసి కురచ దుస్తులు ధరించి డ్యాన్సులు చేసింది. అందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో వివాదాస్పదంగా మారి సదరు బ్యూటీ క్వీన్ విమర్శలపాలయ్యింది. ఈ వార్త కాస్త కడజాండుసున్ కల్చరల్ అసోసియేషన్‌కి చేరండంతో.. ఈ వీడియోపై సీరియస్ అవ్వుతూ ఆమె ఆ టైటిల్‌ను అందుకునే అర్హత లేదని స్పష్టం చేసింది. వెంటనే కిరీటాన్ని వెనక్కి ఇచ్చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు సదరు కడజాండుసున్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జోసెఫ్ పైరిన్ కిటింగన్ మాట్లాడుతూ..అందాల రాణి ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడం ఏ మాత్ర సబబు కాదని అన్నారు. హుమినోడున్ రాష్ట్రానికి చెందిన అందాల రాణిగా టైటిల్ గెలుచుకుంది. అంటే.. ఆమె అపారమైన జ్ఞానానికి, సంస్కారానికి ప్రసిద్ధి అని అర్థం. పైగా పబ్లిక్ ఫిగర్. అందరూ ఆమెను ఆదర్శంగా తీసుకునే స్థాయిలో ఉంది. అలాంటి అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడూ పద్ధతిగా నడుచుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఆమె సాధారణ వ్యక్తి అయితే ఇదేం అంత పెద్ద సమస్యగా ఉండేది కాదని కూడా కిటింగన్ అన్నారు. అంతేగాదు ఆమె తన కుటుంబంతో కలిసి వ్యక్తిగత విహారయాత్రకు వెళ్లిందని మాకు అర్థమయ్యింది. కానీ ఇలాంటివి సహించేవి మాత్రం కావని అన్నారు. ఆ వీడియో నెట్టింట వైరల్ కాకుండా ఉంటే ఆమెకి ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదన్నారు అయినా అందరికీ ఇదొక హెచ్చరికలా ఉంటుందన్నారు. మళ్లీ ఇలాంటి దుస్సాహసాలకు ఎవ్వరూ యత్నించరని కిటింగన్ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా బ్యూటీ క్వీన్.. నా స్వంత ఇష్టంతోనే ఈ ఉండుక్ న్గడౌ అందాల పోటీలకు వెళ్లాను. అయినా ఈ టైటిల్ ఏమి ఒక వ్యక్తి పరిపూర్ణ విజయాన్ని నిర్ణయిస్తుందని భావించను. అయినప్పటికీ వారి నిర్ణయాన్ని గౌరవించి వెనక్కి ఇచ్చేస్తాను ఈ టైటిల్‌ని. అలాగే ఇదంతా నా అజాగ్రత్త వల్లే జరిగిందని ఒప్పుకుంటున్నా. అందుకు నన్ను క్షమించండి. ప్రతి ఒక్కరూ ఈ సంఘటనను నుంచి చాలా నేర్చుకుంటారని ఆశిస్తున్నా. అయినా ఈ విషయాన్ని భూతద్దంలా చూడొద్దు. దయచేసి ఇతర సమస్యలపై దృష్టిసారించండి. అలాగే ఈ ఘటనకు పూర్తి బాధ్యత నాదే, దీనికి నా స్నేహితులు, తల్లిదండ్రులను బాధ్యులుగా చెయ్యొద్దు. నా వివరణను యాక్సెప్ట్ చెయ్యడం, చెయ్యకపోవడం మీ ఇష్టం. గుండెల్లోంచి వస్తున్న మాటలు ఇవి. అయినా ఇంతవరకు ఓపిగ్గా విన్నందుకు ధన్యవాదాలు. అని పోస్ట్‌లో పేర్కొంది. అందాల భామ వీరూ నికా టెరిన్సిప్. (చదవండి: రంజాన్ రోజు షీర్ కుర్మా చేయడానికి రీజన్ ఏంటో తెలుసా..!) -
Srinidhi Shetty Latest Photos: ట్రెడిషనల్ & ట్రెండీ లుక్‌లో కవ్వించేస్తోన్న కేజీఎఫ్ బ్యూటీ
-
అమ్మని ఒప్పించడానికి చాలా కష్టపడ్డా.. ఇప్పుడు అందరూ హ్యాపీ!
‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయిలు ఆత్మవిశ్వాసం వదులుకోకూడదని, కలల్ని విజయాలుగా మలచుకోవాలని’’ అంటోంది హైదరాబాద్ వాసి ప్రజ్ఞ అయ్యగారి... అంతర్జాతీయ పోటీల్లో టైటిల్ గెలుస్తానని అదే ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. కుష్టువ్యాధి బాధితులకు బాసటగా ససాకవా లెప్రసి ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్ ఫోరమ్ ఆఫ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ పేరిట నిర్వహించిన సదస్సుకు బ్రెజిల్ సుందరి లెటికా సెజర్తో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే... సికింద్రాబాద్‌లో మా కుటుంబం నివసిస్తోంది. హిమాయత్‌నగర్‌లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తున్నాను. గ్లామర్ రంగంలో రాణిస్తూనే సస్టెయినబుల్ ఫ్యాషన్‌కు సంబంధించి డిజైనర్‌గా రాణించాలనేదే నా లక్ష్యం. నొప్పించకుండా ఒప్పించాను గ్లామర్ రంగంలోకి ప్రవేశిస్తానని చెప్పడానికి కూడా సంకోచించాల్సినంత సంప్రదాయ కుటుంబం మాది. మా బంధుమిత్రుల్లో ఎవరూ ఈ రంగంలో అడుగుపెట్టింది లేదు. అయితే నాలో ఒకసారి ఈ ఆలోచన వచ్చి, గట్టిగా నిర్ణయించుకున్న తర్వాత... రెండేళ్లపాటు మా ఇంట్లోవాళ్లని దశలవారీగా ఒప్పిస్తూ వచ్చాను. దీనిలో భాగంగా ఎంతో మంది బ్యూటీక్వీన్ల విజయగాధలను వివరించాను. నాన్న త్వరగానే ఒప్పుకున్నా, అమ్మని ఒప్పించడానికి మరింత కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం అందరూ హ్యాపీ. ఒకడుగు వెనక్కు కేవలం 17 ఏళ్ల వయసులో మిస్ వరల్డ్ అయిన మానుషి చిల్లర్ నాకు స్ఫూర్తి. గత మిస్ ఇండియాలో కాంటెస్ట్ చేసి గెలుపొందకపోయినా, ఆ తర్వాత ఆగస్టులో జరిగిన లివా మిస్ దివా సుప్రానేషనల్ గెలిచాను. తద్వారా వచ్చే జులై–ఆగస్టు మధ్య పోలండ్‌లో జరిగే మిస్ సుప్రా ఇంటర్నేషనల్‌కు పోటీపడుతున్నా (ఈ పోటీల్లో ఇప్పటికి భారత్ రెండుసార్లు మాత్రమే ఈ కిరీటం గెలుచుకుంది. ఇందులో కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఒకరు) ఇటు నృత్యం అటు చెస్ హాబీల విషయానికి వస్తే.. పుస్తకాలు బాగా చదువుతాను. హాబీలకు మించింది నా భరతనాట్య అభిరుచి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రదర్శనలు ఇచ్చాను. అలాగే చదరంగంలో కూడా ఇంటర్ స్కూల్ టోర్నమెంట్స్‌లో ఆడిన అనుభవం ఉంది. నువ్వు కలగన్నావంటే గెలుస్తావన్నట్టే అన్న ఆంగ్లోక్తిని నమ్ముతాను... అందుకే కలలు కంటున్నాను... గెలుపును నమ్ముతున్నాను’’ అని చెబుతున్న ప్రజ్ఞ కలలు నెరవేరాలని కోరుకుందాం. (క్లిక్: ఈ పని చేయలేక నాలుగు రోజుల్లో పారిపోతుందన్నారు.. కానీ) -
రూ.13 కోట్లు విలువైన ‘వైన్’ చోరీ.. మెక్సికన్ బ్యూటీ క్వీన్ జంట అరెస్ట్!
మాడ్రిడ్: అత్యంత విలువైన పాతకాలపు వైన్ బాటిళ్ల చోరీని తొమ్మిది నెలల తర్వాత ఛేదించారు పోలీసులు. 1.7 మిలియన్ డాలర్లు(సుమారు రూ.13.57 కోట్లు) విలువైన ప్రఖ్యాత వైన్ బాటిళ్ల చోరీ కేసులో మాజీ మెక్సికన్ బ్యూటీ క్వీన్, రోమానియా డచ్ వ్యక్తిని పోలీసులు క్రోయేషియాలో అరెస్ట్ చేశారు. ఈ విలువైన మద్యం బాటిళ్లు 9 నెలల క్రితం స్పెయిన్‌లో మాయమయ్యాయి. దొంగలను పట్టుకునేందుకు యూరప్ మొత్తం జల్లెడపట్టినట్లు చెప్పారు పోలీసులు. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది స్పెయిన్ జాతీయ పోలీసు విభాగం. ‘2021, అక్టోబర్ 21న పశ్చిమ నగరం కేసర్స్లో 1.65 మిలియన్ యూరోలు విలువ కలిగిన 45 వైన్ బాటిళ్లు చోరీకి గురయ్యాయి. అందులో 19వ శతాబ్దానికి చెందిన ఓ ప్రత్యేకమైన బాటిల్ సైతం ఉంది. దాని విలువ 3.10 లక్షల యూరోలు. వాటిని ప్రముఖ హోటల్ రెస్టారెంట్ ఈఐ అట్రియోలోని సెల్లార్ నుంచి పక్కా ప్రణాళికతో ఎత్తుకెళ్లారు.’ అని తెలిపారు. పోలీసుల ప్రకటన ప్రకారం.. స్పానిష్ డైలీ ఈఐ పైస్‌కు చెందిన 29 ఏళ్ల మెక్సికన్ యువతి.. అట్రియోలోని వెయిటర్స్‌ను రూమ్ సర్వీస్ అంటూ దారి మళ్లించింది. ఆ సమయంలోనే ఆమెతో ఉన్న 47 ఏళ్ల వ్యక్తి వైన్ బాటిళ్లు ఉన్న సెల్లార్లోకి వెళ్లాడు. తన వద్ద ఉన్న మాస్టర్ కీతో బాక్సులను తెరిచి మూడు బ్యాగుల్లో నింపాడు. వాటిని టవల్స్‌లో చుట్టారు. ఆ మరుసటి రోజు ఉదయం 5.30 గంటల ప్రాంతంలో బ్యాగులతో సెక్యూరిటీని తప్పించుకుని హోటల్ నుంచి వెళ్లిపోయారు. హోటల్లోని సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు నమోదయ్యాయి. ప్రాథమికంగా ఓ గ్యాంగ్ పక్కా ప్రణాళికతో చేసినట్లు పోలీసులు భావించారు. ఈ చోరీ జరగక ముందు ఇరువురు మూడు సార్లు అట్రియో హోటల్‌కి వచ్చారు. అందరిలాగే వారికి సైతం వైన్ బాటిళ్లు ఉన్న సెల్లార్‌ను చూపించారు హోటల్ సిబ్బంది. చోరీకి గురైన వాటిలో 200 ఏళ్ల నాటి బాటిల్.. చోరీకి గురైన వాటిలో 1806 నాటికి చెందిన ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ బోర్డియాక్స్ యక్వెమ్ బాటిల్ ఉంది. దాని విలువ భారీగా ఉంటుందని ఎల్ అట్రియో సహ యజమాని సొమెలియర్ జోస్ పోలో చెప్పారు.‘ఆ బాటిల్ నా వ్యక్తిగత చరిత్రలో భాగం. ఆ బాటిల్ అట్రియో, కేసర్స్, ఇక్కడి ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైన్ ప్రేమికుల చరిత్రలో ఒకటి.’ అని పోలో పేర్కొన్నారు. చోరీ చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే దొంగలిద్దరు స్పెయిన్ దాటి వెళ్లారు. నెలల తరబడి వారికోసం యూరప్ మొత్తం గాలింపు చేపట్టారు పోలీసులు. ఇటీవలే మొంటెనెగ్రో నుంచి సరిహద్దు దాటేందుకు ప్రయత్నించగా పట్టుబడ్డారు. వారిని పట్టుకునేందుకు నెదర్లాండ్స్, క్రొయేషియా, రొమానియా పోలీసులతో పాటు ఇంటర్‌పోల్ సాయం కూడా తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసినప్పటికీ చోరీకి గురైన వైన్ మాత్రం తిరిగి స్వాధీనం చేసుకోలేదు. ఇదీ చదవండి: బాప్రే!.. ఆ జంట దొంగలించిన వైన్ బాటిల్స్ ఖరీదు రూ.3 కోట్లా! -
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే ఫొటోలు
-
జంబలకిడి పంబ.. వర్కవుట్ కాలేదు!
ఆంథోనీ నగోర్నీ.. అందాల పోటీలలో పాల్గొని విజేతగా కూడా నిలిచింది. కానీ కాసేపటి తర్వాత జడ్జీలు ఆమెకు ఇచ్చిన టైటిల్‌ను వెనక్కి తీసేసుకున్నారు. ఎందుకంటే.. ఈ పోటీలలో పాల్గొనడం కోసమే అంతకుముందు వరకు అబ్బాయి అయిన అతడు తన స్నేహితురాలి సాయంతో అమ్మాయిగా మారిపోయాడు!! ఆ విషయం జడ్జీలకు తెలిసిపోవడంతో టైటిల్ ఊడలాక్కున్నారు. సఖాలిన్ యూనివర్సిటీలో చదివే ఆంథోనీ.. ఆన్లైన్ పోటీ ద్వారా ఈ అందాల పోటీలోకి అడుగుపెట్టాడు. స్థానికంగా ఉండే ఓ లోదుస్తుల స్టోర్స్ వాల్లు బికినీలో అందమైన ఫొటో తీయించుకుని పంపాలని అడిగారు. ఆంథోనీ స్నేహితురాలు ఈ విషయంలో అతడికి సాయం చేసింది. జుట్టు నీట్‌గా కట్ చేసి, మేకప్ వేసి అతడిని మంచి 'అందగత్తె'గా తయారుచేసి మరీ ఫొటోలు తీయించి పంపించింది. మిస్ అవకాడో అనే పేరుతో అతడు ఆన్లైన్ అందాల పోటీలో పాల్గొన్నాడు. అయితే ఎలా తెలిసిందో గానీ, జడ్జీలకు ఈ విషయం తెలిసిపోయింది. దాంతో వాళ్లు తమ నిర్ణయాన్ని మార్చుకుని.. అతడిని పోటీ నుంచి బహిష్కరించడమే కాక అతడు విజేత కాదని కూడా ప్రకటించారు. ఆ అబ్బాయి చూడ్డానికి అచ్చం అమ్మాయిలాగే ఉన్నాడని, ఫొటోలు అప్లోడ్ చేయడం సులభం కావడంతో అతడు చేసేశాడని లోదుస్తుల స్టోర్స్ యజమానులు చెప్పారు. ఇప్పుడు అతడు విజేత కాకపోవడంతో మరో ముగ్గురు అమ్మాయిలకు బహుమతి మొత్తాన్ని పంచుతున్నారు. ఆంథోనీ అమ్మాయిగా తీయించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. అతడికి టైటిల్ ఇవ్వలేదని తెలిసి.. చాలామంది అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. -
సెక్స్‌రాకెట్‌లో దొరికిపోయిన బ్యూటీ క్వీన్
వియత్నాం: ఆమె ఓ అందమైన యువతి. విశ్వవిద్యాలయంలో గొప్ప విద్యనభ్యసించింది. అదొక్కటే కాదు స్థానికంగా జరిగిన అందమైన యువతుల పోటీల్లో తొలి రన్నరప్‌గా నిలిచింది. కానీ, ఆ గతాన్ని మరుగునపడేసేంత చెత్త పనిచేసింది. సెక్స్‌రాకెట్‌లో పోలీసులకు దొరికిపోయింది. ఆమె మరో యువతి కలిసి ఓ హోటల్లో మరో ఇద్దరు విఠులతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి ఇప్పుడు కటకటాలపాలయింది. వివరాల్లోకి వెళితే.. తారన్ డక్ థై లియాన్ అనే యువతి 2014 తాను చదువుతున్న యూనివర్సిటీలో నిర్వహించి బ్యూటీ క్వీన్ కాంటెస్ట్‌లో పాల్గొని తొలి రన్నరప్‌గా నిలిచింది. అయితే, ఇటీవల ఆమె తన అనుచరురాలు డోవాన్ ఎన్‌గోక్ మిన్హా(26) కలిసి వియత్నాంలోని క్వాంగ్ నిన్స్ ప్రావిన్స్‌లోని ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో లియాన్‌కు మూడున్నర జైలు శిక్ష పడగా.. ఆమె అనుచరురాలుకి రెండు సంవత్సరాల మూడు నెలల శిక్షపడింది. అంతేకాదు, వీరు 2,900 డాలర్ల మొత్తాన్ని కోర్టుకు సరెండర్ చేయాలని ఆదేశించింది. -
అందాన్ని ఎరవేసి.. దోచేయబోయింది!
ఒక వ్యక్తిని తన అందచందాలతో రెచ్చగొట్టి, అతడివద్ద ఉన్న ఖరీదైన రోలెక్స్ వాచీతో పారిపోయేందుకు ప్రయత్నించిన కొలంబియా బ్యూటీ క్వీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కెనడాకు చెందిన మల్హి అనే వ్యక్తి తన బావమరిది ఇస్తున్న బ్యాచిలర్స్ పార్టీ కోసం మియామీ వచ్చాడు. అక్కడ ఓషన్ డ్రైవ్ సమీపంలో బార్ వద్ద అతడు లిలియానా వనెగాస్ అనే అందాల రాణిని చూశాడు. అతడు తెల్లవారుజామున 4 గంటల సమయంలో టాక్సీ కోసం చూస్తుండగా ఈమె అక్కడకు వచ్చి, హోటల్ గదిలో ఏమైనా మద్యం తాగావా అని అడిగింది. అంత అందగత్తె వచ్చి తనతో మాట్లాడటంతో ఆరోజు తాను చాలా లక్కీ అనుకున్నానని, కానీ హోటల్ గదికి ఆమెను తీసుకెళ్లాక అసలు ముట్టుకోనివ్వలేదని చెప్పాడు. ఉదయం 7 గంటల సమయంలో ఆమె ఉన్నట్టుండి బూట్లు వేసుకుని తన రోలెక్స్ వాచీ తీసుకుని తలుపు వద్దకు పరుగెత్తుకు వెళ్లిందని, దాంతో తాను కూడా ఆమె వెంటపడి, పట్టుకున్నానని తెలిపాడు. ఆ మహిళ.. తన బోయ్ఫ్రెండుకు ఫోన్ చేసి అతడు తన తెల్లటి మెర్సిడిస్ కారులో రాగానే అందులో పారిపోదామనుకుందని, అయితే ఈలోపే మల్హి వెంటపడి పట్టుకోవడంతో కథ అడ్డం తిరిగిందని పోలీసులు చెప్పారు. ఇంతకుముందు కూడా ఈమె దాదాపు రూ. 17 లోల విలువ చేసే వాచీ, మరొకొన్ని విలువైన వస్తువులను ఓ జంట నుంచి కొట్టేసిందని పోలీసులు తెలిపారు. తర్వాత వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు పోలీసులు ఈమె ఫొటో చూపించగా వెంటనే గుర్తుపట్టారు. -
బ్యూటీక్వీన్‌ను కాల్చి చంపేశాడు!
కొన్నేళ్ల క్రితమే అమెరికాకు వలస వెళ్లిన ఫిలిప్పినా బ్యూటీక్వీన్ గ్లాడిస్ టోర్డిల్ను ఆమె మాజీ భర్త యూలాలియో టార్డిల్ కాల్చి చంపేశాడు. ఈ ఘటన అమెరికాలోని ప్రిన్స్ జార్జ్ కౌంటీ స్కూల్లో జరిగింది. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లున్నారు. ఇద్దరూ హైస్కూళ్లలో చదువుతున్నారు. ప్రస్తుతం తల్లిని కోల్పోవడంతో వారిని ఫోస్టర్కేర్లో ఉంచారు. పికిటెనపోస్ ఇంటర్నేషనల్ సంస్థలోని మిడ్వెస్ట్ ఈస్ట్‌కోస్ట్ విభాగంలో గ్లాడిస్ చురుగ్గా పనిచేస్తున్నారు. ఒకవైపు తండ్రి వదిలేయడం.. మరోవైపు తల్లి చనిపోవడంతో ఇద్దరు అమ్మాయిలు ఇటు ఆర్థికంగాను, అటు మానసికంగాను తీవ్రంగా దెబ్బతిన్నారు. చిట్టచివరి క్షణాల్లో గ్లాడిస్ను కాపాడేందుకు అటువైపు వెళ్లే వ్యక్తి ప్రయత్నించినా.. ఉపయోగం లేకపోయింది. స్కూలు పార్కింగ్ ప్రదేశంలో ఆమెపై కాల్పులు జరిగాయి. గతంలో బ్యూటీక్వీన్ కిరీటాన్ని గెలుచుకున్న గ్లాడిస్.. ప్రస్తుతం ప్రిన్స్ జార్జ్ కౌంటీ పబ్లిక్ స్కూల్లో కెమిస్ట్రీ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఫోనిక్స్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేశారు. గ్లాడిస్తో పాటు మరో ఇద్దరిని కూడా కాల్చిచంపిన ఆమె మాజీ భర్త యూలాలియో టార్డిల్ను పోలీసులు అరెస్టు చేశారు. -
‘ఆ కిరీటం కోసం 4 రోజులు పస్తులున్నా’
అందాల పోటీలో గెలువడమంటే మాటలు కాదు. అందుకే, ఈ పోటీలో గెలిచేందుకు తాను నాలుగురోజులు కడుపు మాడ్చుకున్నట్టు ప్రకటించి ఓ మోడల్ దుమారం రేపింది. నాటల్య షువాలోవా ఇటీవల రష్యాలో జరిగిన అందాల పోటీలో గెలుపొంది.. ‘సెక్సీయెస్ట్ గర్ల్ ఇన్ రష్యా’గా నిలిచింది. నాలుగు వేల మందితో పోటీపడిన ఆమె ‘మిస్ మాక్సిమ్ 2016’ కిరీటాన్నీ దక్కించుకుంది. ఈ సందర్భంగా 21 ఏళ్ల విద్యార్థిని, మోడల్ అయిన నాటల్య మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో కొన్ని విస్మయకర విషయాలు తెలిపింది. అందాల పోటీలో గెలిచేందుకు నాలుగు రోజులు అన్నం తినలేదని, అందంగా సన్నగా ఫర్ఫెక్ట్ ఫిగర్‌తో కనిపించేందుకు కడుపుమాడ్చుకున్నానని చెప్పింది. పోటీలో గెలువడంతో ఇప్పుడు ఎంత కావాలంటే అంత తింటానని పేర్కొంది. ఈ ముద్దుగుమ్మ తీరుపై ఆన్లైన్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందాల పోటీలో గెలువాలంటే కడుపు మాడ్చుకోవాలనే తప్పుడు సంకేతాల్ని ఆమె ఇస్తున్నదని, కడుపు మాడ్చుకొని అందాల రాణి అనిపించుకోవాల్సిన ఖర్మ ఏం పట్టిందని నెటిజన్లు మండిపడుతున్నారు. -
అందాల రాశిని హత్య చేసి 30 ఏళ్లు జైలు పాలు
కారాకస్: వెనెజులా సుందరి మోనికా స్పేర్ (29) హత్య కేసులో ముగ్గురు వ్యక్తులకు ముప్పై ఏళ్ల జైలు శిక్షపడింది. వారికి కఠినకారాగార శిక్ష విధిస్తూ ఉత్తర కారాబోబోలోని కోర్టు తీర్పు చెప్పింది. 'ఒక దొంగతనానికి పాల్పడే క్రమంలో వారు చేసింది ఉద్దేశ పూర్వక హత్యే' అని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. మోనికా స్పేర్ 2004లో మిస్ వెనిజులా అందాల పోటీలో పాల్గొని కిరీటాన్ని దక్కించుకుంది. అదే మిస్ యూనివర్స్ పోటీలో కూడా పాల్గొంది. అనంతరం పలు టీవీ కార్యక్రమాల్లో కూడా నటించింది. ఆమె ఒక రోజు తన భర్త హెన్రీ బెర్రీ (39) కూతురుతో కలిసి ఓ టూర్‌కి వెళ్లి తిరిగొస్తుండగా ఓ ఎజెన్సీ ప్రాంతంలో ముగ్గురు దొంగలు వారి వాహనాన్ని ఆపేశారు. వారికి సహాయం చేద్దామని ఓ ట్రక్కు డ్రైవర్ ప్రయత్నించినా అప్పటికే ఆ ముగ్గురు వారి కారుపై విచ్చల విడిగా కాల్పులు జరిపి వారిని దోచుకొని వెళ్లారు. ఈ కాల్పుల్లో మోనికా, ఆమె భర్త మరణించగా కూతురుకు గాయాలయ్యాయి. ఈ కేసును విచారించిన కోర్టు అంతకు ముందు ఇందులో కొంత పాత్ర ఉన్న 15, 17 ఏళ్ల ఇద్దరు యువకులకు నాలుగేళ్ల జైలు శిక్షను విధించడంతోపాటు మరో ముగ్గురుకి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో మహిళకు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. -
అంతుచిక్కని అందగత్తె కథ
* ఆమె ఓ అందాల రాణి. * ఈజిప్టు తలరాతనే మార్చింది. * మరి ఎందుకు అదృశ్యమైంది? డిసెంబర్ 6, 1913... ఈజిప్ట్... అమర్నా ప్రాంతంలోని ఎడారి అంతా సందడి సందడిగా ఉంది. ఆర్కియాల జిస్టుల బృదం పెద్ద పెద్ద యంత్రాలు పెట్టి నేలను తవ్వుతోంది. అందరూ కలిసి దేని దేని కోసమో తీవ్రంగా అన్వేషిస్తున్నారు. అంతలో ఉన్నట్టుండి ఓ కేక వినిపించింది... ‘‘సర్... ఓసారి ఇలా రండి’’ అంటూ. మరో చోట దేనినో పరిశీలిస్తోన్న జర్మన్ ఆర్కియాలజిస్టు లుడ్విగ్ బోర్షార్ట గబగబా అటువైపు నడిచాడు. అక్కడున్న తన అసిస్టెంట్ చేతిలో ఉన్నదాన్ని చూసి ఆశ్చర్యపోయాడతను. లైమ్‌స్టోన్‌తో చేసిన మహిళ శిల్పం అది. శిల్పమే అయినా అందులో జీవకళ ఉట్టి పడుతోంది. తల నుంచి ఛాతి వరకు మాత్రమే ఉందా శిల్పం. దాన్ని చూస్తుంటే... ఆమె చాలా అందగత్తె అయి ఉంటుందని అనిపిస్తోంది. ‘‘వండర్ఫుల్. ఈమె ఎవరో రాణి అనిపిస్తోంది. అంటే మనం అనుకుంటు న్నట్టు ఈ నేల కింద ఏదో సామ్రాజ్యం ఉండే ఉంటుంది’’ అన్నాడు లుడ్విగ్ హుషారుగా. వెంటనే అతడు ఆ విగ్రహం ఎవరిదో తెలుసుకునే ప్రయత్నాలు మొదలెట్టాడు. ఆ ప్రయత్నం చివరికి ఓ పెద్ద చరిత్రనే వెలికి తీస్తుందని అతనికప్పుడు తెలియదు. తనకు దొరికిన శిల్పం ఓ రాణిదని, ఆమె ఒకప్పుడు ఈజిప్టును తన కనుసన్నల్లో నడిపిందని, ఆమె ఈజిప్టు చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన మహిళ అని అంత కన్నా తెలియదు. ఇంతకీ ఎవరామె? ఈజిప్టులోని థీబ్స్... పద్నాలుగో శతాబ్దం... రాజప్రాసాదం ముందు జనం నిలబడి ఉన్నారు. రాజుగారు తమతో ఏదో చెప్పాలనుకుంటున్నారన్న కబురు అంది వాళ్లంతా వచ్చారు. ఆయనేం చెప్పబోతున్నారోనని ఆతృతగా ఎదురు చూస్తూ నిలబడ్డారు. కొన్ని నిమిషాల తర్వాత ఫరో అకనాటన్ బయటకు వచ్చాడు. అందరూ ఆయనకు నమస్కరించారు. అభివాదం ఆయనకు చేశారే కానీ, ఆయన పక్కన ఉన్న రాణి మీదే ఉన్నాయి అందరి కళ్లూ. అతిలోక సౌందర్యరాశి దిగి వచ్చిందా అన్నట్టు ఉంది... అకనాటన్ భార్య నెఫర్‌తితీ. కలువ రేకులను పక్కపక్కనే అమర్చినట్టుగా ఉన్న కళ్లు, చక్కగా చెక్కినట్టుగా ఉన్న నాసిక, లేత గులాబీ రంగులో మెరిసిపోతోన్న పెదవులు, బంగారు మేనిఛాయ... పోత పోసిన అందం ఆమె! వెండి తీగెలతో ఎంబ్రాయిడరీ చేసిన దుస్తుల్లో దేవకన్యలాగా కనిపిస్తోంది. ఫరో పక్కన ఆమె నిలబడిన తీరు ఎంతో హుందాగా ఉంది. ‘‘ఫరో మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలని అనుకుంటున్నారు. దాని కోసమే మిమ్మల్నందరినీ ఇక్కడికి పిలిపించారు.’’ రాణి నెఫర్‌తితీ గంభీరమైన స్వరంతో మాట్లాడుతుంటే అందరూ చెవులు రిక్కించి వింటున్నారు. ‘‘ఇప్పటి వరకూ థీబ్స్నే రాజగనరిగా భావిస్తున్నాం. అయితే ఇప్పుడీ రాజనగరిని ఇక్కడి నుంచి తరలించాలని, నైలు నైదికి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్నా ప్రాంతంలో సరికొత్తగా నిర్మించాలని అనుకుంటున్నాం. ఈ విషయం తెలియజేయడానికే మిమ్మల్ని పిలిపించాం.’’ అందరూ ముఖాలు చూసుకున్నారు. ఇంత అర్జంటుగా రాజనగరిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కాలేదు. కొందరు మౌనంగా తలాడించారు. కొందరు మాత్రం ముఖాలు మాడ్చుకున్నారు. ఈ రాణి ఎప్పుడూ ఇంతే... ఎప్పుడూ ఏవో కొత్త కొత్త ప్రణాళికలు వేస్తూ ఉంటుంది, ఎంతసేపూ తమ సుఖం, సౌఖ్యం చూసుకుంటుంది, ఇంకెంత విలాసంగా బతుకుదామా అని ఆలోచిస్తుంది అని మనసుల్లోనే గొణుక్కుంటూ అక్కడ్నుంచి కదిలారు. ఒక్కసారి ఏదైనా అనుకున్నదంటే ఆగదు నెఫర్‌తితీ. అందుకే రాజనగరిని కొద్ది రోజుల్లోనే అక్కడ్నుంచి మార్చేసింది. కొత్త ప్రదేశంలో, కొత్త కొత్త హంగులతో, కొన్ని ఎకరాల స్థలంలో నిర్మింపజేసింది. ఆ నిర్మాణ శైలికి, వైభవానికి ప్రజల కళ్లు చెదిరిపోయాయి. ఇతర దేశాల రాజులు, స్నేహితులు, బంధువులందరినీ పిలిచి విందు చేసింది నెఫర్‌తితీ. వచ్చినవాళ్లంతా ఆమె ప్లానింగ్‌ని పొగిడారు. ఏం చేసినా అద్భుతంగా చేస్తావని ప్రశంసలతో ముంచెతారు. నెఫర్‌తితీ కన్నా ఆమె భర్త అకనాటన్ ఎక్కువ మురిసిపోయాడు. ఆమె తన భార్యగా దొరకడమే తన అదృష్టం అనుకున్నాడు. అనుకుని ఊరుకోలేదు... ఆ విషయాన్ని అందరి ముందూ సగర్వంగా వెల్లడించాడు కూడా. అతనెప్పుడూ అంతే. నెఫర్‌తితీ అంటే అతడికి ప్రాణం. ఆమె మాటంటే వేదం. ఆమె ఏం చేయమన్నా చేస్తాడు. నడవ మన్నట్టే నడుస్తాడు. నెఫర్‌తితీ అన్న పేరుకు ‘అందగత్తె వచ్చింది’ అని అర్థం. ఆ పేరుకు తగ్గట్టు గానే అద్భుతమైన అందం నెఫర్తితీది. ఆమెని చూసిన ఏ ఒక్కరూ చూపు తిప్పుకో లేకపోయేవారు. ఇతర దేశాల రాజులు సైతం ఆమె మీద మోహపడేవారు. అంత అందాన్ని సొంతం చేసుకున్న అకనాటన్ని చూసి అసూయ పడేవారు. అవన్నీ చాలా గర్వంగా అనిపించేవి అకనాటన్కి. తనెంతో అదృష్టవంతుడినని పొంగి పోతుండేవాడు. ఆమె అడుగలకు మడుగు లొత్తేవాడు. పేరుకి అతడు రాజు అయినా, పాలన సాగించేది మాత్రం నెఫర్తితీయే. ఆలోచనలన్నీ ఆమెవే. వాటిని అతడు తు.చ. తప్పకుండా పాటిస్తాడంతే. అంతగా అకనాటన్ జీవితంలో, ఈజిప్టు పాలనలో ప్రధాన పాత్ర పోషించింది నెఫర్‌తితీ. అలాంటి ఆమె... ఒకరోజు ఉన్నట్టుండి మాయమైపోయింది. భర్తతో పాటు ఎవ్వరికీ కనిపించకుండా పోయింది. ఎంతకీ అర్థం కాని ఓ మిస్టరీగా చరిత్రలో మిగిలిపోయింది. అసలామె ఏమైంది? అకనాటన్ ఈజిప్టును పదిహేడేళ్ల పాటు పాలించాడు. అయితే పన్నెండో యేడు నడుస్తున్నప్పుడే నెఫర్‌తితీ అదృశ్యమైంది. ఆమె కోసం ఎంతో వెతికారు. కానీ ఎక్కడా కనిపించలేదు. ఆమె ఏమయ్యింది అన్న ప్రశ్నకు అకనాటన్ కూడా సమాధానం చెప్పలేకపోయాడు. తనను ఎవరైనా ఎత్తుకుపోయారా, ఎక్కడైనా దాచిపెట్టారా లేక చంపేశారా... ప్రశ్నలు బోలెడు పుట్టాయి. సమాధానం ఒక్కటి కూడా దొరకలేదు. దాంతో అకనాటన్తో పాటు మెల్లమెల్లగా జనం నెఫర్తితీని మర్చిపోయారు. అకనాటన్ వేరే పెళ్లి చేసుకున్నాడు. ప్రజలంతా ఆమెనే రాణిగా అంగీకరించారు. కాలం మారింది. రాజరికం అంతమయ్యింది. ఈజిప్టు రాజుల గాథలు చరిత్ర పుటల్లోకి చేరాయి. అయితే ఏ ఒక్క పుటలోనూ నెఫర్‌తితీ గురించి లేకపోవడం అన్నిటికంటే పెద్ద మిస్టరీ. 1913లో ఆర్కియాలజిస్టు లుడ్విగ్ బృందానికి నెఫర్‌తితీ శిల్పం దొరికి నప్పుడు అది ఎవరిదో కూడా అర్థం కాలేదు. ఆ శిల్పం ఎవరిదో తెలుసుకోవా లని పరిశోధనలు మొదలయ్యాయి. మరో ప్రముఖ ఆర్కియాలజిస్టు ఫ్లెచర్ ద్వారా అసలు నిజం బయటకు వచ్చింది. ఈజిప్టు రాజుల చరిత్రపై నిశితమైన పరిశోధన చేసింది ఫ్లెచర్. ఆమె నెఫర్‌తితీ శిల్పాన్ని పూర్తిగా పరిశీలించింది. దాన్ని చూస్తూనే అది ఒక రాణి శిల్పం అని చెప్పేసింది ఫ్లెచర్. తలపై ఉన్న కిరీటం, హెయిర్ స్టయిల్, కంఠాభరణాల డిజైన్ వంటి వాటిని బట్టి కచ్చితంగా ఎవరో రాణియే అని నిర్ధారించింది. నాటి నుంచీ ఆ రాణి ఎవరో కనిపెట్టేందుకే కృషి చేసింది. ఎంతో కష్టపడితే అప్పుడు ఆమెకు నెఫర్‌తితీ గురించి తెలిసింది. తర్వాత కొన్నాళ్లకి ఈజిప్టులో పరిశోధనలు జరుపుతున్నప్పుడు ఓ సమాధిలో మూడు మమ్మీలు కనిపిం చాయి ఫ్లెచర్కి. వాటిలో ఒకటి ఓ యువ కుని మమ్మీ, రెండోది ఓ చిన్నపిల్ల మమ్మీ, మూడోది ఓ మధ్య వయస్కురాలి మమ్మీ. ఆ మూడో మమ్మీ నెఫర్తితీదే అనిపిం చింది ఫ్లెచర్కి. అయితే ఆ మమ్మీ పరిస్థితి ఘోరంగా ఉంది. తలపై జుత్తు లేదు. ఒంటిలో కత్తిపోట్లు ఉన్నాయి. ముఖాన్ని పచ్చడి చేసేశారు. పళ్లు విరగ్గొట్టేశారు. అంటే ఆమెను ఎవరో అత్యంత దారుణంగా చంపారని అర్థమయ్యింది. దాంతో నెఫర్‌తితీ పట్ల ఏం జరిగివుంటుందో అర్థమైంది. ఈజిప్టు చరిత్రలో నెఫర్‌తితీ అంత అందగత్తెయే కాదు, అంత శక్తిమంతమైన మహిళ మరొకరు లేరు. తను చెప్పిందే వేదంగా, చేసిందే చట్టంగా అందరూ భావించేట్టుగా చేసిందామె. భర్త చాటున ఉంటూనే పాలన తన మాట చొప్పున జరిగేలా చేసింది. రాజనగరిని తనకు నచ్చిన చోటికి మార్పించింది. తనకు నచ్చినట్టుగా నిర్మించింది. అంతవరకూ ఈజిప్టులో ఉన్న దేవుళ్లందరినీ కాదని ఓ కొత్త దేవుడిని సృష్టించింది. అందరూ ఆ దేవుడికే మొక్కాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా ప్రతి విషయంలోనూ ఆమె అన్నదే జరిగేది. అదే ఆమెను ఎంతో మందికి శత్రువుల్ని చేసిందంటారు ఫ్లెచర్. ఈజిప్టు పాలనలో ఓ మహిళ ఇంతగా ఎప్పుడూ కల్పించుకున్నది లేదు. ఇంతగా ఆధిపత్యం చెలాయించిందీ లేదు. దాంతో నెఫర్‌తితీ ప్రవర్తన కొందరికి మింగుడు పడలేదు. ఆమె పద్ధతి చాలామందికి నచ్చలేదు. దాంతో తనపై పగబట్టారు. ఆమెను ఎలాగైనా అంతం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆమెను చంపేసి రహస్యంగా సమాధి చేశారు. ఆమెను ఎవరూ గుర్తు పట్టకూడదని ముఖాన్ని ఛిద్రం చేశారు. పళ్లు విరగ్గొట్టారు. ఆమె పేరు ఎక్కడా కనిపించకుండా చేశారు. ఆమె చిత్రాల్ని, విగ్రహాల్ని తీసి పారేశారు. మొత్తంగా ఆమెను ఈజిప్టు చరిత్ర నుంచి తుడిచిపెట్టేశారు. కానీ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. అందుకే నెఫర్‌తితీ పేరు తుడిచి పెట్టుకుపోలేదు. ఆమె శిల్పం దొరికిన తర్వాత, ఆమె గురించి పరిశోధనలు మొదలయ్యాయి. ఆ మమ్మీ నెఫర్తితీదేనా, ఫ్లెచర్ చెప్పినట్టే నెఫర్‌తితీ హత్యకు గురయ్యిందా అన్నది చెప్పడం నేటికీ కష్టంగానే ఉంది. దాన్ని నిర్ధారించ డానికే ఫ్లెచర్ ఇంకా కష్టపడుతోంది. మరి నిజం ఎప్పటికి నిర్ధారణ అవుతుందో! -
శాండల్ వుడ్ బ్యూటి క్వీన్ ఎవరు?
-
అదే అసలు కిక్..
చిట్‌చాట్ జీవితం ప్లాన్ చేసుకోకుండా సాగితేనే మజాగా ఉంటుందంటోంది మిస్ యూనివర్సల్ ‘పీస్ అండ్ హ్యుమానిటీ’ రుహి సింగ్. అలా అన్ప్లాన్డ్గా ఉంటేనే లైఫ్‌లో కిక్ ఎంజాయ్ చేయగలమని చెబుతోంది. బంజారాహిల్స్ తాజ్‌కృష్ణలో ప్రారంభమైన ఖ్వాయిష్ ఎగ్జిబిషన్ అండ్ సేల్‌ను రుహిసింగ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ బ్యూటీ క్వీన్‌తో సిటీప్లస్ చిట్‌చాట్.. ..:: శిరీష చల్లపల్లి నేను పుట్టింది, పెరిగింది జైపూర్‌లో. కొన్నాళ్లు ముంబైలో ఉన్నాను. నాకు హైదరాబాద్‌కు రావడం సంతోషంగా ఉంది. ఇదొక రాయల్ సిటీ. నేను 2011 నుంచి బ్యూటీ ఫీల్డ్‌లో అనేక కాంపిటీషన్స్‌లో పాల్గొంటున్నాను. 2012లో మిస్ ఇండియా ఫైనలిస్ట్‌గా కూడా ఎంపికయ్యాను. 145 దేశాలు పోటీ చేసిన మిస్ యూనివర్సల్ ‘పీస్ అండ్ హ్యుమానిటీ’లో బ్యూటీ కిరీటం దక్కించుకోవడం ఆనందంగా ఉంది. బ్రేక్‌ఫాస్ట్ విత్ బిర్యానీ.. నా ఫిట్నెస్ మంత్రం లైఫ్‌స్టైలే. నేను పెద్ద ఫుడీని. బట్టర్, చీస్, నెయ్యి, గ్రిల్డ్ మీట్ ఇవన్నీ నా మెనూలో ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్‌కి బిర్యానీ తింటాను. ఎంత తింటానో అంత వర్కవుట్ చేస్తాను. ఉదయాన్నే జిమ్, సాయంత్రాలు ఎరోబిక్స్ చేస్తుంటాను. ట్రెక్కింగ్‌కి కూడా వెళ్తుంటాను. నా కాళ్లు ఒక దగ్గర ఉండవు. రోజంతా బిజీగా ఉంటాను. అందుకే ఎంత తిన్నా నా ఫిట్‌నెస్‌లో తేడా రాదు. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం టాంగో డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాను. నాగ్ మూవీలో చాన్స్ వస్తే.. తొందర్లోనే నేను వెండితెరపై కనిపించబోతున్నాను. బాలీవుడ్ సినిమాకు సైన్ చేశాను. టాలీవుడ్లో నటించాలని ఆశగా ఉంది. అందుకే తెలుగు కూడా నేర్చుకుంటున్నాను. పూరి జగన్నాథ్ సినిమాలో చేయాలని ఉంది. నాగార్జున సినిమాలో చాన్స్ వస్తే వదులుకోను. నా లైఫ్‌లో ఏదీ ప్లాన్ చేసుకోలేదు. నేను ఇలా కిరీటంతో ఉంటానని ఐదేళ్ల కిందట అనుకోలేదు. ఇంకో ఐదేళ్ల తర్వాత ఎలా ఉంటానో ఊహించలేను. అందుకే నేనేం ప్లాన్ చేసుకోను. అప్పుడే ఎక్సైటెడ్‌గా ఉంటుంది. -
ఆనందమే అందం
ఐదు పదులు దాటినా తరగని అందం.. ఆత్మవిశ్వాసం నిండిన చూపు, కట్టిపడేసే చిరునవ్వు.. ఒకప్పటి మిస్ ఇండియా, మిస్ ఇంటర్నేషనల్ రన్నరప్.. క్రీడాకారిణి, నటి, రాజకీయ, సామాజికవేత్త... ఇలా విభిన్న రంగాలలో మేటి అయినా తల్లిగా, నానమ్మగా తాను ఎక్కువ సంతృప్తిని పొందుతున్నానని చెప్పే స్త్రీమూర్తి నఫీసా అలీతో కాసేపు... - ఓ మధు అథ్లెట్.. బ్యూటీక్వీన్, పొలిటీషియన్.. ఇవన్నీ ఎలా సాధ్యపడ్డాయి? అథ్లెట్ కావటం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ గ్యారంటీగా ఉంటుంది. చదువు ఇంటెలిజెన్స్‌ని పెంచుకోవడానికి సహకరిస్తుంది. అలాగే సహజంగా మన పుట్టుక కొన్ని అవకాశాలు కల్పిస్తుంటుంది. పెరిగిన వాతావరణం కొంత హెల్ప్ చేస్తుంది. అలా అదృష్టవశాత్తు అవన్నీ నాకు అమరాయి. మనకున్న పాజిబిలిటీస్ నుంచి ముందుకు సాగటమే జీవితమంటే. అందుకే నా జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆనందంగా గడుపుతున్నా. ఫిట్‌గా ఉండటానికి ఏం చేస్తుంటారు? వాతావరణ కాలుష్యం, జీవన శైలి మార్పులు అనారోగ్యానికి ఆహ్వానం పలుకుతుంటాయి. వాటిని తట్టుకుని ఫిట్‌గా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడలో ప్రవేశం కలిగి వుండాలి. అథ్లెట్ కావడం వల్ల అనారోగ్యం పాలు కారని చెప్పలేం. కాని అనారోగ్యం పాలైనా తొందరగా కోలుకునేందుకు ఉపకరిస్తుంది. అందుకే, అందరూ జీవితంలో తప్పకుండా ఏదో ఒక క్రీడతో కనెక్ట్ కావాలి. వయసు పెరిగే కొద్దీ అనారోగ్యాలు పలకరిస్తుంటాయి. వీటిని తట్టుకోవడానికి, నియంత్రించడానికి మనం ఫిట్‌గా ఉండటం ద్వారా ప్రయత్నించాలి. క్రీడాకారిణులు రాణించాలంటే? నేను స్వతహాగా క్రీడాకారిణిని. అవకాశం కల్పిస్తే ఎంతోమంది మంచి క్రీడాకారిణులు దేశానికి ఎన్నో పతకాలు తీసుకురాగలరు. ఇటీవల కామన్వెల్త్, ఒలింపిక్ క్రీడల్లో మన క్రీడాకారిణులు రాణిస్తున్నారు. అయితే అందరికీ సమానావకాశాలు రావటం లేదనేది వాస్తవమే. స్ఫూర్తి ఉన్న వారందరికీ అవకాశాలు కల్పించే అంశంలో కొంత బ్యాలెన్స్ రావలసి ఉంది. తగిన శిక్షణావకాశాల్ని మెరుగుపరిస్తే ఫలితం ఉంటుంది. రాజకీయాలు, సినిమాలు, సేవ.. వీటిలో మీరు ఎక్కువ ఎంజాయ్ చేసింది ఏది? నేను నా మదర్‌హుడ్‌ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నాను. నేను అమ్మమ్మనయ్యా. అథ్లెట్ కావటం వల్ల నా గ్రాండ్ చిల్డ్రన్‌తో పరుగెడుతూ అలసట లేకుండా ఆడుకోగలుగుతున్నాను. అదినాకెంతో సంతోషాన్నిస్తుంది. చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్‌గా ఎన్నో సేవలు అందించారు. వాటి గురించి కొన్ని వివరాలు... చదువంటే పుస్తకాలే కాదు. వినోదం ద్వారా కూడా పిల్లలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. చక్కటి సినిమాలు చూసే అవకాశం పిల్లలకు ఉండాలని నెహ్రూ ఆశించే వారు. పిల్లల సృజనకు కావలసిన వాతావరణం సృష్టించాలన్నదే ఆయన ఆంతర్యం. ఇందుకోసం మేం బాలల చిత్రోత్సవాలను నక్సల్ ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో సైతం ప్రదర్శించాం. సందేశాత్మక, స్ఫూర్తిదాయక చిత్రాలను చూడటం ద్వారా పిల్లల్లో లక్ష్యాల కల్పన, వివిధ విషయాలపై అవగాహన కలుగుతాయి. హైదరాబాద్ గురించి? గతంలో హైదరాబాద్‌లో ఫిలిం ఫెస్టివల్స్ నిమిత్తం చాలాసార్లు వచ్చాను. ఇక్కడి వారితో నాకు ప్రత్యేక అనుబంధం వుంది. హైదరాబాద్ కల్చర్, హెరిటేజ్ ఇండియాలోనే యూనిక్ అనిపిస్తుంది. చార్మినార్ దగ్గరుండే చిన్న చిన్న బజారుల్లో కొత్తకొత్తగా తయారు చేసే వస్తువులను షాపింగ్ చేస్తుంటాను. హైదరాబాద్ వచ్చి బిర్యాని పట్ల నాకున్న ప్యాషన్‌కు న్యాయం చెయ్యకుండా వెళ్లింది లేదు. హుస్సేన్‌సాగర్, పురాతన కట్టడాలు, సాలార్జంగ్ మ్యూజియం నాకు నచ్చిన స్పాట్స్. ఒక మాట... కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల్లోని ప్రతిభను కనబర్చనివ్వరు. దీనివల్ల పిల్లల్లో ఉన్న టాలెంట్ బయటకు రాకుండాపోతుంది. అదే విదేశాలలో పిల్లలను చూస్తే వీల్ చెయిర్లో ఉన్న పిల్లలు కూడా ఎంతో ప్రొడక్టివ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. పిల్లల భవిష్యత్తు వారి ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. దానిని గుర్తించటమే పెద్దవారిగా మన బాధ్యత. -
అందాల రాణి.. మోనికా గిల్
మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 2014గా మిస్ ఇండియా యూఎస్ మోనికా గిల్ ఎంపికైంది. దుబాయ్‌లో వైభవంగా జరిగిన ఈ అందాల పోటీలో ఎన్నారై భామ కిరీటాన్ని అందుకుంది. రెండో స్థానంలో మిస్ ఇండియా స్విట్లర్లాండ్, మూడో స్థానంలో మిస్ ఇండియా బహ్రైన్ నిలిచారు. వివిధ దేశాల్లో ఉంటున్న భారత సంతతి యువతులలో అందగత్తెలను ఎంపిక చేసేందుకు ఈ పోటీ ప్రతియేటా నిర్వహిస్తారు. అలాగే ఈసారి 17 నుంచి 27 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 40 మంది యువతులు ఈ కిరీటం కోసం పోటీపడ్డారు. అబుదాబిలోని అల్ రహా బీచ్ రిసార్టులో ఫైనల్ పోటీలు జరిగాయి. మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 2013 విజేత నేహల్ భగోటియా ఈసారి విజేతగా నిలిచిన గిల్‌కు కిరీటం అలంకరించింది. వినికిడిలోపం ఉన్నా కూడా.. ఈ పోటీలలో గెలిచి, తొలిసారి అందాల కిరీటాన్ని అందుకున్న బధిర యువతిగా గత సంవత్సరం నేహల్ చరిత్ర సృష్టించింది. ఈసారి ఆస్ట్రేలియ, అమెరికా, ఇంగ్లండ్, కెనడా, కెన్యా, ఒమన్, ఖతార్, కువైట్, బహ్రైన్, స్వీడన్, నెదర్లాండ్స్.. ఇలా పలు దేశాల నుంచి అందగత్తెలు దుబాయ్‌లో జరిగిన ఫైనల్స్‌లో పాల్గొన్నారు. విజేతకు దాదాపు 4.81 లక్షల రూపాయల నగదు బహుమతితో పాటు పలు రకాల బహుమతులు కూడా అందజేస్తారు. -
అందాలపోటీ విజేత వద్ద బాంబులు
ఆమె అందగత్తెల పోటీలో విజేత. అందంతో అందరినీ చంపేస్తుందనుకుంటే.. బాంబులతో చంపబోయిందంటూ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆమెపై న్యాయవాదులు ఆరోపణలు కూడా నమోదుచేశారు. ఉటా అందగత్తెల పోటీలో విజేతగా నిలిచిన కెండ్రా మెక్ కెన్జీ గిల్ అనే యువతిని, ఆమెతో పాటు మరో ముగ్గురిని కూడా ఇటీవల అరెస్టు చేశారు. ఈ నలుగురి మీద ఒకే రకమైన ఆరోపణలు ఉన్నట్లు న్యాయవాది బ్లేక్ నకమురా తెలిపారు. వీరందరి వయసు సుమారు 18 సంవత్సరాలే. వీరిని గత శనివారం చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీళ్లు కొన్ని ప్రమాదకర రసాయనాలు నిండిన ప్లాస్టిక్ సీసాలు కలిగి ఉన్నారు. వాటిని తమకు తెలిసినవాళ్లమీద విసురుతున్నారు. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. వాళ్లు ప్రమాదకర పదార్థాలను చుట్టుపక్కల ఇళ్లు, ప్రజల మీద విసురుతుండటంతో వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి పదార్థాలు కలిగి ఉంటే కనిష్ఠంగా ఏడాది నుంచి గరిష్ఠంగా 15 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. మిస్ రివర్టన్ పోటీలలో ఇటీవలే గిల్ గెలిచింది.