మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ (MGI) 2024 టైటిల్‌ను సాధించి రాచెల్ గుప్తా (20) చరిత్ర సృష్టించింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన పోటీలో ఈ కిరీటాన్నిదక్కించుకున్న తొలి భారతీయురాలిగా నిలిచింది. సుమారు 70కిపైగా దేశాలకు చెందిన అందాల రాణులను వెనక్కి నెట్టి భారతదేశానికి టైటిల్‌ను అందించింది. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పంజాబ్‌లోని జలంధర్‌లో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు సంబరాల్లో మునిగిపోయారు. రేచల్ విజయం యవద్దేశం గర్వించేలా చేసిందని కుటుంబ సభ్యుడు తేజస్వి మిన్హాస్ హర్షం వ్యక్తం చేశారు.
బ్యాంకాక్ MGI హాల్‌లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్‌నేషనల్ పోటీలో రాచెల్ గ్ర్యాండ్ ఫినాలెలో ఫిలిప్పీన్స్‌కి చెందిన సిజె ఓపియాజాను ఓడించి బంగారు కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తర్వాత అంతర్జాతీయ పోటీలో చోటు దక్కించుకుంది. అలాగే 2022లో 'మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ది వరల్డ్' కిరీటాన్ని కూడా గెలుచుకుంది.
ఇకపై రాచెల్ ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించే ప్రపంచ రాయబారిగా ఉండనుంది. ఈ టైటిల్ దక్కించుకున్న తొలి భారతీయురాలిగా రికార్డ్ సృష్టించడమే కాదు, 'అత్యధిక ప్రపంచ అందాల పోటీల కిరీటాలు గెల్చుకున్న తొలి ఇండియన్ లారాదత్తా సరసన చేరింది. కాగా రాచెల్ ఆమె మాడెల్, నటి వ్యాపారి. ఇన్‌స్టాగ్రామ్‌లో 10లక్షలకు పైగా ఫాలోవర్లు ఆమె సొంతం.
Comments
Please login to add a commentAdd a comment