First Indian
-
కోటి రెమ్యూనరేషన్ అందుకున్న ఇండియన్ తొలి హీరో ఎవరు.. ఏ సినిమాకు? (ఫోటోలు)
-
చరిత్ర సృష్టించిన అందాల రాణి
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ (MGI) 2024 టైటిల్‌ను సాధించి రాచెల్ గుప్తా (20) చరిత్ర సృష్టించింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన పోటీలో ఈ కిరీటాన్నిదక్కించుకున్న తొలి భారతీయురాలిగా నిలిచింది. సుమారు 70కిపైగా దేశాలకు చెందిన అందాల రాణులను వెనక్కి నెట్టి భారతదేశానికి టైటిల్‌ను అందించింది. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పంజాబ్‌లోని జలంధర్‌లో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు సంబరాల్లో మునిగిపోయారు. రేచల్ విజయం యవద్దేశం గర్వించేలా చేసిందని కుటుంబ సభ్యుడు తేజస్వి మిన్హాస్ హర్షం వ్యక్తం చేశారు.బ్యాంకాక్ MGI హాల్లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలో రాచెల్ గ్ర్యాండ్ ఫినాలెలో ఫిలిప్పీన్స్‌కి చెందిన సిజె ఓపియాజాను ఓడించి బంగారు కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తర్వాత అంతర్జాతీయ పోటీలో చోటు దక్కించుకుంది. అలాగే 2022లో 'మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ది వరల్డ్' కిరీటాన్ని కూడా గెలుచుకుంది. ఇకపై రాచెల్ ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించే ప్రపంచ రాయబారిగా ఉండనుంది. ఈ టైటిల్ దక్కించుకున్న తొలి భారతీయురాలిగా రికార్డ్ సృష్టించడమే కాదు, 'అత్యధిక ప్రపంచ అందాల పోటీల కిరీటాలు గెల్చుకున్న తొలి ఇండియన్ లారాదత్తా సరసన చేరింది. కాగా రాచెల్ ఆమె మాడెల్, నటి వ్యాపారి. ఇన్‌స్టాగ్రామ్‌లో 10లక్షలకు పైగా ఫాలోవర్లు ఆమె సొంతం. -
70 దేశాలను ఓడించి అందాల రాణిగా రాచెల్ గుప్తా : తొలి ఇండియన్‌గా చరిత్ర
-
జిమ్నాస్టిక్స్‌లో వెలిగిన దీపం
ఆరేళ్ల వయసులోనే ఆ అమ్మాయి జిమ్నాస్టిక్స్ వైపు ఆకర్షితురాలైంది. అయితే ఆమె పాదం కింది భాగం చూస్తే సమతలంగా ఉంది. ఈ ఆటకు ఇలాంటి పాదం పనికి రాదని, జంప్ చేసే సమయంలో ఇబ్బంది కలుగుతుందని స్థానిక కోచ్‌లు చెప్పేశారు. కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కోచ్‌గా ఉన్న బిశ్వేశ్వర్ నంది మాత్రం ఆ అమ్మాయిలో చురుకుదనాన్ని గుర్తించాడు. తాను ఆమె లోపాన్ని ఎలాగైనా సరిదిద్ది మరీ ఆటలో తీర్చిదిద్దుతానని ఆమె తండ్రికి మాటిచ్చాడు. అక్కడి నుంచి మొదలైన ఆ చిన్నారి ప్రస్థానం ఆపై భారత జిమ్నాస్టిక్స్ చరిత్రలో అత్యుత్తమ ప్లేయర్‌గా నిలిచే వరకు సాగింది. ఆ అమ్మాయే దీపా కర్మాకర్. 16 ఏళ్ల సుదీర్ఘ శ్రమ తర్వాత తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దీప.. ఎన్నో అరుదైన రికార్డులను, గతంలో ఎవరికీ సాధ్యం కాని మరెన్నో ఘనతలను నమోదు చేసింది.ఓడినా విజేతగా నిలిచి..ప్రొడునోవా వాల్ట్.. జిమ్నాస్టిక్స్‌లో అత్యంత కఠినమైన, ప్రమాదకరమైన ఈవెంట్. ప్రపంచ జిమ్నాస్టిక్స్ చరిత్రలో ఐదుగురు మాత్రమే ఈ ఈవెంట్‌ను విజయవంతంగా పూర్తి చేయగలిగారు. వారిలో దీప కూడా ఉంది. 2016 రియో ఒలింపిక్స్‌లో ఆమె ఈ విన్యాసాన్ని చేసి చూపించింది. తన సత్తాను చాటింది. అప్పటి వరకు మన దేశం నుంచి.. ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో మహిళల విభాగంలో ఎవరూ కనీసం అర్హత కూడా సాధించలేకపోయారు. అది దీపకు మాత్రమే సాధ్యమైంది. ఆపై ఫైనల్‌కు కూడా చేరిన ఆమె తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. కానీ దురదృష్టవశాత్తు 0.15 పాయింట్ల తేడాతో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది. అయితేనేమి.. ఆమె ఘనతను అందరూ గుర్తించారు. అందుకే పతకాలు గెలుచుకున్నవారితో సమానంగా ఆమెకూ అభినందనలు, ప్రశంసలు, ప్రోత్సాహకాలు లభించాయి. ఒలింపిక్ పతకం గెలవకపోయినా ఆటలో తన 17 ఏళ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలంతో దీప కన్నీళ్లపర్యంతమైంది. ఈ క్రమంలో సహజంగానే ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ.. దీపను వరించాయి. జాతీయ స్థాయిలో..త్రిపుర రాజధాని అగర్తలా దీప స్వస్థలం. తండ్రి ప్రోత్సాహంతో ఆటల వైపు ఆసక్తి చూపించిన ఆమె బిశ్వేశ్వర్ నంది అండగా నిలవడంతో పూర్తి స్థాయిలో జిమ్నాస్టిక్స్‌పై దృష్టి సారించింది. కఠోర శ్రమ, ప్రాక్టీస్ తర్వాత తన సమతల పాదం లోపాన్నీ అధిగమించిన దీపకు ఆపై ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. స్థానికంగా చిన్న చిన్న టోర్నీల్లో విజయాలు సాధించిన తర్వాత 15 ఏళ్ల వయసులో దీప పేరు తొలిసారి పెద్ద స్థాయికి చేరింది. బెంగాల్‌లోని జల్పాయీగుడీలో జరిగిన జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో ఆమె విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆమె తన సాధనకు మరింత పదును పెట్టింది. ఫలితంగా సీనియర్ టీమ్‌లోకి పిలుపు వచ్చింది. రెండేళ్ల తర్వాత న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్టులో దీపకు చోటు దక్కింది. అయితే పోటీల్లో పాల్గొనే అవకాశం మాత్రం రాలేదు. కానీ తర్వాతి ఏడాది జాతీయ క్రీడల్లో త్రిపుర తరఫున పాల్గొని అందుబాటులో ఉన్న నాలుగు స్వర్ణాలనూ దీప గెలుచుకోవడం విశేషం. విమర్శలను దాటి..అంతర్జాతీయ స్థాయికి వచ్చేసరికి దీప ఏం చేసినా అది భారత్ తరఫున మొదటి ఘనతగానే నమోదైంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించిన దీప ఈ క్రీడల్లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా నిలిచింది. తర్వాతి ఏడాదే ప్రతిష్ఠాత్మక ఆసియా చాంపియన్‌షిప్‌లో కూడా ఆమె కాంస్యం గెలుచుకుంది. ఆ తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తూ ఐదో స్థానం సాధించింది. ఇదే ఆమెను రియో ఒలింపిక్స్ దిశగా తీసుకెళ్లింది. ‘నా గురించి విమర్శలు వచ్చిన ప్రతిసారి వారికి నా ఆటతోనే సమాధానం ఇచ్చాను. 2014లో ప్రొడునోవా మొదలుపెట్టినప్పుడు నన్ను బఫెలో అంటూ చాలా మంది ఆట పట్టించారు. వెంటనే కామన్వెల్త్ పతకం సాధించి చూపించాను. వయసు అయిపోయింది, ఆటలో దమ్ము లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు 31 ఏళ్ల వయసులో ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి చూపించాను. ఇలాంటి ముగింపు ఇవ్వాలనే ఇంతకాలం ఆగాను. ఇప్పుడు సంతృప్తిగా ఉంది’ అంటూ దీప తన రిటైర్మెంట్ సమయంలో వెల్లడించింది. వండర్‌ఫుల్‌గా ముగించి..తన ఆత్మకథ స్మాల్ వండర్‌లో ఆమె తన కెరీర్‌లోని పలు మలుపుల గురించి చెప్పుకుంది. రియో ఒలింపిక్స్ తర్వాత ఒక్కసారిగా స్టార్ ప్లేయర్ హోదా వచ్చినా ఆ తర్వాత పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. వరుస గాయాలతో ఆమె దాదాపు రెండేళ్ల పాటు ఆటకు దూరం కావాల్సి వచ్చింది. పైగా పెద్ద స్థాయి వ్యక్తుల నుంచి మద్దతు దక్కకపోవడంతో ట్రయల్స్‌లో అగ్ర స్థానంలో నిలిచినా పలు సాకులు వెతికి ఆమెను ఆసియా క్రీడలకు పంపకుండా ఫెడరేషన్ నిలిపివేసింది. ఇలాంటి కఠిన సమయాల్లో తాను మానసికంగా మరింత దృఢంగా తయారైంది. విరామం తర్వాత 2018లో రెండు పెద్ద విజయాలతో ఆమె తన సత్తా చాటింది. రెండు వరల్డ్ కప్‌లలో వరుసగా స్వర్ణం, కాంస్యం గెలిచి ఘనంగా పునరాగమనం చేసింది. ఆస్తమా, దగ్గు కోసం వాడే హైజినమైన్ మందును అనుకోకుండా తీసుకొని నిషేధానికి గురైనప్పుడు ఆమెకు ఎక్కడా కనీస మద్దతు లభించలేదు. ఈ ఘటన తర్వాత మళ్లీ తానేంటో నిరూపించుకోవాలనే పట్టుదల ఆమెలో కనిపించింది. 30 ఏళ్లు దాటినా.. అదే జిమ్నాస్టిక్స్ బార్‌పై తీవ్రంగా సాధన చేసింది. 2024 మేలో తాష్కెంట్లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్ బరిలోకి దిగి స్వర్ణ పతకంతో మెరిసి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది. ఈ టోర్నీకి ముందు ‘నేను ఇంకా బతికే ఉన్నానని చాటాలనిపించింది. అందుకే పోటీ పడుతున్నా’ అని భావోద్వేగంతో చెప్పిన దీప సగర్వంగా తన కెరీర్‌ను ముగించి భవిష్యత్ తరాలకు జిమ్నాస్టిక్స్‌లో వెలుగుల దారి చూపించింది. -
Paris Olympics 2024: ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత బృందం పతాకధారిగా మనూ భాకర్
పారిస్ ఒలింపిక్స్‌లో తన అద్భుత ప్రదర్శన ద్వారా దేశానికి రెండు పతకాలు అందించిన స్టార్ షూటర్ మనూ భాకర్‌కు మరో గౌరవం దక్కింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కిన మనూ... ‘పారిస్’ క్రీడల ముగింపు వేడుకల్లో పతాకధారిగా వ్యవహరించ నుంది. ఈనెల 11న జరగనున్న ముగింపు వేడుకల్లో మనూ.. జాతీయ జెండా చేబూని భారత బృందాన్ని నడిపించనుంది. ‘ముగింపు వేడుకల్లో మనూ ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనుంది. దీనికి భాకర్ పూర్తి అర్హురాలు’ అని భారత ఒలింపిక్ సంఘం తెలిపింది. ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో స్టార్ షట్లర్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ ఆచంట శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించారు. ముగింపు వేడుకల్లో ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనున్న పురుష అథ్లెట్ పేరు తర్వాత ప్రకటించనున్నారు. -
ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్ టీటీ ప్లేయర్!(ఫొటోలు)
-
నాసా ఏరో స్పేస్ ఇంజనీర్‌గా తొలి భారతీయ యువతి!
అమెరికాలోని నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్)లో ఉద్యోగం... ఈ కల చాలా మందికే ఉండి ఉంటుంది. ఈ కలను సాకారం చేసుకున్న తొలి భారతీయ యువతి అక్షత కృష్ణమూర్తి. నాసా అనగానే మనకు అంతరిక్షంలోకి వెళ్లి గ్రహాలను అధ్యయనం చేసిన రాకేశ్ శర్మ గుర్తు వస్తారు. అలాగే కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ కూడా గుర్తుకు వస్తారు. కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ ఇద్దరూ భారతీయ సంతతికి చెందిన వారే కానీ భారత పౌరసత్వం ఉన్న వాళ్లు కాదు. అమెరికా పౌరసత్వమే వారి అంతరిక్ష పథాన్ని సుగమం చేసింది. ఇక అక్షత విషయానికి వస్తే... ఆకాశానికి ఆవల బెంగళూరుకు చెందిన అక్షతా కృష్ణమూర్తికి చిన్నప్పటి నుంచి ఆకాశానికి ఆవల ఏముంటుంది అనే ఆలోచనే. ఆమె బాల్యం ఆకాశంలో నక్షత్రాలను చూడడంతో, చుక్కల్లో చందమామ వెలుగుతో సంతృప్తి చెందలేదు. అంతరిక్షం అంటే మనకు కనిపించేది మాత్రమే కాదు, ఇంకా ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. బాల్యంలో మొదలైన ఆసక్తిని పెద్దయ్యేవరకు కొనసాగించింది. తన పయనాన్ని అంతరిక్షం వైపుగా సాగాలని కోరుకుంది. అందుకోసం తీవ్రంగా శ్రమించింది, నేడు నాసాలో ఏరో స్పేస్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించింది. ఆ వివరాలను తెలియచేస్తూ ‘‘ఇది కేవలం అదృష్టం అని కానీ, కాకతాళీయంగా జరిగిపోయిందని చెప్పను. పూర్తిగా పదిహేనేళ్ల కఠోర శ్రమతోనే, అంతకు మించిన ఓర్పుతోనే సాధ్యమైంది’’ అంటుంది అక్షత. అలాగే అంతరిక్షంలో కెరీర్‌ని వెతుక్కోవాలంటే పాటించాల్సిన కొన్ని సూత్రాలను కూడా పంచుకుంది. నక్షత్రశాల నుంచి అంతరిక్షం వరకు... ‘‘నాసాలోని జెట్ ప్రోపల్షన్ లాబొరేటరీలో స్పేస్ మిషన్లకు ‘ప్రిన్సిపల్ నావిగేటర్ అండ్ స్పేస్ సిస్టమ్స్ ఇంజనీర్’గా విధులు నిర్వర్తిస్తున్నాను. నాసా–ఇస్రో సంయుక్తంగా నిర్వహించిన సింథటిక్ ఆపెర్చర్ రాడార్ మిషన్‌లో ఫేజ్ లీడ్‌గానూ, మార్స్ 2020 మిషన్‌లో రోబోటిక్స్ సిస్టమ్స్ ఇంజనీర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాను. నేను చదివింది స్టేట్ బోర్డ్ సిలబస్‌లోనే. మాది సంపన్న కుటుంబం కూడా కాదు. అయితే చిన్నప్పుడు నా వీకెండ్ ఎంజాయ్మెంట్లో ప్లాలానిటేరియం విజిట్స్, బెంగుళూరులో ఎయిర్షోస్ ఎక్కువగా ఉండేవి. నా ఆసక్తిని గమనించిన మా అమ్మానాన్న నేనడిగిన ప్రతిసారీ తీసుకెళ్లేవారు. హబుల్ టెలిస్కోప్ గురించి తెలుసుకోవడం నా జీవితంలో గొప్ప మలుపు. బహుశా 2000 సంవత్సరంలో అనుకుంటాను. నాకప్పుడు పదేళ్లు. వ్యోమగాములు అంతరిక్షంలో నడవడం గురించి తెలిసి చాలా ఆనందం కలిగింది. అంతరిక్షం నుంచి భూమిని చూడాలనే కోరిక కూడా. కెరీర్ గురించిన ఆలోచనలకు స్పష్టమైన రూపం వచ్చింది కూడా అప్పుడే. అంతరిక్షంలోకి వెళ్లే మార్గాల గురించి అధ్యయనం చేయగా చేయగా వ్యోమగాముల్లో ఎక్కువమంది ఎమ్ఐటీలోనే చదివారని తెలిసింది. నేను అదే సంస్థలో చదవాలని నిర్ణయించుకున్నాను. దాంతో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో చేరాను. బెంగళూరులోని ఆర్ కాలేజ్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ 2010 బ్యాచ్‌లో నేను మాత్రమే అమ్మాయిని. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయీలో ఏరోస్పేస్లో మాస్టర్స్ చేశాను. పీహెచ్‌డీకి ఎమ్ఐటీ (మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుంచి స్కాలర్‌షిప్‌తో సీటు వచ్చింది. అయితే యూఎస్‌లో అంతరిక్షంలో ఉద్యోగం రావాలంటే ఆ దేశ పౌరసత్వం ఉండాలి కనీసం గ్రీన్‌కార్డ్ అయినా ఉండాలి. సెమినార్లలో నేను సమర్పించిన పేపర్లకు ప్రశంసలు వచ్చినప్పటికీ ఉద్యోగం వచ్చేది కాదు. అయినా నా పరిశోధనలను మాత్రం ఆపలేదు. ప్రొఫెసర్లకు వారితో కలిసి పని చేసే అవకాశం ఇవ్వమని వినతులు పోస్ట్ చేయడం కూడా ఆపలేదు. నా అప్లికేషన్ ఎప్పుడూ వెయిల్ లిస్టులోనే ఉండేది. వీసా సమయం పూర్తి కావస్తున్న సమయంలో ఒక పేపర్ ప్రెజెంటేషన్ సారా సీగర్ అనే ఆస్ట్రో ఫిజిసిస్ట్ దృష్టిని ఆకర్షించింది. అలా ఒక ఏడాదికి ఇంటర్న్‌షిప్‌కి అవకాశం వచ్చింది. ఆ ఏడాది పూర్తవుతున్న సమయంలో మరో పీహెచ్‌డీకి అప్లయ్ చేశాను. నాసా – ఇస్రో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో కూడా పని చేశాను. మొత్తం మీద మూడవ ప్రయత్నంలో నాసాలో ఫుల్‌టైమ్ ఉద్యోగినయ్యాను. మేధ ఉంది– పాదు లేదు మనదేశంలో అంతరిక్షంలో పరిశోధన చేయగలిగిన మేధ ఉంది. మొక్క ఎదగాలంటే అందుకు అనువైన పాదు ఉండాలి. అలాంటి పాదును తల్లిదండ్రులు బాల్యంలోనే వేయాలి. అలాంటి ప్రోత్సాహం మన దగ్గర ఉండాల్సినంతగా లేదనే చెప్పాలి. అందుకే లక్ష్యాన్ని సాధించడంలో నాకు ఎదురైన సవాళ్లతోపాటు అవకాశాలను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నాను. నేను సూచించేదేమిటంటే... స్కూల్లో సైన్స్ ప్రాజెక్టుల్లో పాల్గొనాలి. అంతరిక్షంలో కూడా ఆస్ట్రో ఫిజిక్స్, ఆ్రస్టానమీ, టెక్నాలజీ, ఇంజినీరింగ్ వంటి చాలా విభాగాలుంటాయి. మన ఆసక్తి ఎందులో అనేది తెలుసుకోవాలి. అంతరిక్షరంగంలో స్థిరపడాలంటే బాచిలర్స్ సరిపోదు. బాచిలర్స్లో సైన్స్, ఇంజినీరింగ్‌తోపాటు పీహెచ్డీ తప్పనిసరి. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, కోడింగ్ వంటి నైపుణ్యాలను కూడా మెరుగుపరుచుకోవాలి. అంతరిక్షానికి సంబంధించి వీలైనంత ఎక్కువ సదస్సులు, సమావేశాల్లో పాల్గొనాలి. నిపుణులను సంప్రదిస్తూ మన సందేహాలను నివృత్తి చేసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇవన్నీ అంతరిక్షయానాన్ని సుగమం చేసే మార్గాలు’’ అంటోంది అక్షత. View this post on Instagram A post shared by Dr. Akshata Krishnamurthy | NASA Rocket Scientist (@astro.akshata) (చదవండి: వీల్‌చైర్‌కి పరిమితమైన వెనక్కి తగ్గలేదు..వ్యాపారవేత్తగా..!) -
Suman Kumari: స్నైపర్ గురి
800 మీటర్ల దూరం.. అంటే ముప్పావు కిలోమీటరు నుంచి కూడా గురి తప్పకుండా కాల్చే రైఫిళ్లు స్నైపర్లు. వీటిని ఉపయోగించే వారిని కూడా స్నైపర్లు అనే అంటారు. ఇంతకాలం మగవాళ్లే స్నైపర్లుగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమారి అత్యంత కఠినమైన శిక్షణ పొంది మన దేశ తొలి మహిళా స్నైపర్‌గా అర్హతను పొందింది. 1984 ‘ఆపరేషన్ బ్లూస్టార్’ తర్వాత రాజీవ్ గాంధీ హయాంలో 1988లో ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’ పేరుతో స్వర్ణదేవాలయంలో మిగిలి ఉన్న సిక్కు వేర్పాటువాదులను ఏరివేసే మిలటరీ చర్య జరిగింది. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ సమయంలో ఇరువర్గాల్లోనూ ప్రాణనష్టం ఎక్కువ. కాని ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’లో మిలటరీ సిబ్బంది ప్రాణనష్టం జరక్కుండా సిక్కు వేర్పాటువాదులను అణిచివేయగలిగారు. దీనికి కారణం స్వర్ణ దేవాలయాన్ని మారణాయుధాలతో పై నుంచి కాపలాకాస్తున్న ఐదుగురు వేర్పాటువాదులను చాలా దూరం నుంచి కాల్చి చంపడం. మొదటిసారి ‘స్నైపర్స్’ ఉపయోగం వల్ల కలిగిన ప్రయోజనం అది. స్నైపర్ అంటే శత్రునిర్మూలన ఏదో సినిమాలో ‘నన్ను చూడాలంటే నీ జీవితం సగం తగలడిపోయి ఉండాలి’ అని బ్రహ్మానందం అంటాడు. స్నైపర్ రంగంలో దిగాడంటే శత్రువు జీవితం ముగింపు దశలో ఉందని అర్థం. స్నైపర్లు శత్రువును బంధించడానికి కాదు. నిర్మూలించడానికి. మనదేశంలో ముందు నుంచి కూడా అత్యాధునిక ఆయుధాల పట్ల కాకుండా సంప్రదాయ ఆయుధాల పట్ల మొగ్గు ఉండటం వల్ల స్నైపర్లను ఆదరించింది లేదు. కిలోమీటరు నుంచి ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకూ కూడా శత్రువును కాల్చి చంపగల స్నైపర్ రైఫిల్స్‌ను ఎలా ఉపయోగించాలో తెలియడానికి ఆ కాలంలో మన మిటలరీ యోధులు ఇజ్రాయిల్, ఫ్రాన్స్ వెళ్లాల్సి వచ్చేది. 1980లలోనే కొద్దిగా స్నైపర్స్ ఉపయోగం తెలిసింది. ఇటీవల సరిహద్దుల వెంబడి వివిధ దేశాల దాడులను ప్రతిఘటించడానికి స్నైపర్లు సమర్థంగా ఉపయోగపడుతున్నాయని వాటిని ఉపయోగించే నిపుణులను తయారు చేస్తున్నారు. మధ్యప్రదేశ్– మహౌలోని ‘ఇన్ఫాంట్రీ స్కూల్’లో, ‘ఇండోర్‌లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్’ కేంద్రంలో స్నైపర్స్ శిక్షణ ఇస్తున్నారు. ఇంతవరకూ మగవాళ్లకే సాగిన ఈ శిక్షణ సుమన్ కుమారి వల్ల స్త్రీలకు కూడా ఇవ్వడం మొదలైంది. పంజాబ్‌లో చూసి హిమాచల్ ప్రదేశ్‌లో మండి జిల్లాకు చెందిన సుమన్ కుమారి 2021లో బి.ఎస్.ఎఫ్.లో ఇన్స్పెక్టర్ హోదాలో చేరింది. పంజాబ్‌లో ఆమెకు విధులు కేటాయించారు. అక్కడ ఉండగా సరిహద్దు దేశాల నుంచి శత్రువులు స్నైపర్లతో మనవారి మీద దాడులు చేయడం సుమన్ గమనించింది. మన వద్ద తగినంత మంది స్నైపర్లు లేరని కూడా అవగాహన చేసుకుంది. అంతే. తనకు తానే స్నైపర్‌గా శిక్షణ తీసుకునేందుకు అనుమతి అడిగింది. ‘సాధారణంగా స్నైపర్‌గా తీసుకునే శిక్షణ కఠినమైనది. మగవారే వెనకాడుతారు. శిక్షణలో సగం మంది వెనుతిరుగుతారు. కాని సుమన్ 8 వారాల పాటు శిక్షణను సమర్థంగా పూర్తి చేసింది. 56 మంది ఉన్న బ్యాచ్‌లో ఆమె మాత్రమే మహిళ. శిక్షణ బాగా పూర్తి చేసిన వారిని ‘ఆల్ఫా’ అని, ‘బ్రేవో’ అని నైపుణ్యాన్ని బట్టి విభజిస్తాం. కాని సుమన్ ప్రతిభ అంతకు మించింది. అందుకే ఆమెకు ఇన్స్ట్రక్టర్ హోదా ఇచ్చాం. దాని అర్థం ఆమె స్నైపర్ మాత్రమే కాదు స్నైపర్ శిక్షకురాలు కూడా’ అని ఒక మిలటరీ అధికారి తెలియచేశారు. ఎప్పుడెప్పుడు హైజాక్‌లు, కిడ్నాప్‌లు, టెర్రరిస్ట్ అటాక్‌లు, ముఖ్య నేతలను బందీలుగా పట్టుకోవడం, సరిహద్దులు దాటి శత్రువులు రావడం వంటి సందర్భాలలో స్నైపర్లు రంగంలో దిగుతారు. పరిసరాలకు తగినట్టుగా పై తొడుగులు (కామూఫ్లాజ్) ధరించి శత్రువుకు వీలైనంత దగ్గరగా వెళ్లి తూటాతో సమాధానం చెప్పడమే వీరు చేసేపని. సుమన్ సేవలు ఇకపై దేశానికి రక్షణ ఇస్తాయి. ‘నేను స్నైపర్ కావడం స్త్రీలకు స్ఫూర్తినిస్తుందనే అనుకుంటున్నాను. మిలటరీలోకి మరింతమంది మహిళలు రావాలని కోరుకుంటున్నాను’ అందామె. -
చెమట, స్టెరాయిడ్స్ బాధలతో సొంత కాస్మొటిక్ బ్రాండ్: ఈమె తొలి గ్రామీ విన్నర్ కూడా!
2024 గ్రామీ అవార్డుల్లో మన భారతీయ సంగీత దిగ్గజాలకు చెందిన దిస్ మూమెంట్ (శక్తి ఆల్బమ్) అవార్డు గెల్చుకోవడం విశేషంగా నిలిచింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు, పలువురు లెజెండ్స్ కూడా జాకీర్ హుస్సేన్, శంకర్‌మహదేవన్ బృందంపై ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ వేదికపై తమదైన ముద్ర వేయడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. దిగ్గజ స్వరకర్త, రవిశంకర్ మన దేశానికి తొలి గ్రామీ అవార్డును అందించిన ఘనతను సాధించారు. మరి గ్రామీ అవార్డును గెలుచుకున్న తొలి మహిళ ఎవరో తెలుసా? ఇపుడిదే నెట్టింట ఆసక్తి కరంగా మారింది. మరి ఆమె ఎవరు? ఏ విభాగంలో గ్రామీ గెల్చుకుంది అనే వివరాలను ఒకసారి చూద్దాం. 25 ఏళ్లకేగ్రామీ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ మహిళ, చెన్నైకి చెందిన గాయని తన్వీషా. 2010లో లాస్ ఏంజిల్స్‌లోని స్టేపుల్స్ సెంటర్లో జరిగిన 52వ గ్రామీ అవార్డుల్లో ఆమె ఈ అవార్డును గెల్చుకున్నారు. బాలీవుడ్ మూవీ స్లమ్‌డాగ్ మిలియనీర్ పాట " జై హో "కోసం స్పానిష్ సాహిత్యాన్ని అందించినందుకు ఉత్తమ పాట అవార్డు దక్కించుకున్నారు. ప్రముఖ గాయకుడు, స్వరకర్త, AR రెహమాన్, గీత రచయిత గుల్జార్‌తో అవార్డును పంచుకుంది. ఈ అవార్డు తన్వి కెరీర్‌కు పెద్ద మైలురాయిగా నిలిచింది. గ్రామీతో పాటు, ఆమె లండన్‌లో 2009లో BMI అవార్డును కూడా అందుకుంది. తన్వీషా డిసెంబర్ 1, 1985న తమిళనాడులో జన్మించింది. చాలా తక్కువ వ్యవధిలో భారతీయ సంగీత పరిశ్రమలో బాగా పాపులర్ అయిన తన్వీషా అనుకోకుండా సింగర్‌గా మారింది. రెహమాన్‌తో యువ మూవీ ‘ఫనా’తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత మాత్రమే సంగీతంలో శిక్షణ తీసుకొని మరింత రాటు దేలింది. తమిళం, హిందీ , తెలుగు భాషల్లో ప్రముఖ గాయనిగా పేరు తెచ్చుకుంది. ఎళుతు చిత్రం కోసం "యక్కై తిరి" మొదలు ఫనా, పప్పు కాన్ట్ డ్యాన్స్, రెహ్నా తూ, బూమ్ బూమ్ రోబోడా, మవ్వాలి కవ్వాలి, కేదా కారి లాంటి పాటలతో బాగా పేరు తెచ్చుకుంది. అలాగే స్పానిష్ , పోర్చుగీస్ భాషలతో పాటు అరబిక్‌లో కూడా పాడింది. గ్రామీ అవార్డు తరువాత యువన్ శంకర్ రాజా , అమిత్ త్రివేది లాంటి దిగ్గజ సంగీత దర్శకుల వద్ద అవకాశాలు దక్కించుకుంది. అంతేకాదు అనేక అంతర్జాతీయ వేదికలపై కూడా మెరిసింది. ఐకానిక్ అమెరికన్ రాపర్ స్నూప్ డాగ్‌తో కలిసి స్నూప్ డాగ్ మిలియనీర్ పాట, జెరెమీ హాకిన్స్, చే పోప్, డేవిడ్ బాటియో లాంటి మరెన్నో అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లతో పాపులర్ అయింది. స్కిన్‌కేర్ బ్రాండ్ తాన్షా స్టూడియోస్‌కు నాంది తన్వి షా అద్భుతమైన ప్రతిభావంతులైన గాయని మాత్రమే కాదు, తాన్షా స్టూడియోస్ అనే స్కిన్‌కేర్ బ్రాండ్‌ను నిర్వహిస్తున్న వ్యాపారవేత్త కూడా. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. చెమట, దుర్వాసనకు సంబంధించిన సమస్యలతో బాధపడేదట తన్వీ. దీని చికిత్సకు స్టెరాయిడ్లను వాడాలని వైద్యులు సూచించడంతో ఎలాంటి హాని లేని కొత్త బ్రాండ్ సృష్టించాలనే ఆలోచన వచ్చింది. దీంతో సహజ చర్మ సంరక్షణకోసం సల్ఫేట్లు, పారాబెన్స్, అల్యూమినియం లాంటి ప్రమాదకర రసాయనాలు లేని తాన్షాను బ్రాండ్‌ను తీసుకొచ్చింది. -
Safeena Husain: ఆర్మీ ఆఫ్ జెండర్ చాంపియన్స్
పేదరికంలో పుట్టిన దిల్లీకి చెందిన సఫీనా హుసేన్ చదువును నమ్ముకొని ఉన్నత స్థాయికి చేరింది. లండన్‌లో చదువుకున్న సఫీనా అమెరికాలో ఉద్యోగం చేసింది. ఆ తరువాత మన దేశానికి తిరిగి వచ్చి పేదింటి ఆడపిల్లలు బడి బాట పట్టడానికి ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. ఎన్నో రాష్ట్రాలలో వేలాదిమంది ఆడపిల్లలు చదువుకోగలిగేలా చేసింది. తాజాగా... ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో కృషి చేస్తున్న వారికి ‘వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఫర్ ఎడ్యుకేషన్, ఖతర్’ వారు ఇచ్చే ‘వైజ్’ప్రైజ్‌కు ఎంపికైంది. ఈ ప్రైజుకు ఎంపికైన ఫస్ట్ ఇండియన్ సఫీనా హుసేన్ గురించి... ‘అబ్బాయిని స్కూలుకు పంపిస్తున్నారు కదా. మరి అమ్మాయిని ఇంటిపనులకే పరిమితం చేస్తున్నారేమిటి?’ అని అడిగినప్పుడు ఆ ఇంటిపెద్ద నవ్వుతూ ఇచ్చిన సమాధానం.... ‘ఆడపిల్లలకు చదువెందుకు. ఏదో ఒకరోజు పెళ్లి చేయాల్సిందే కదా’ ఇంచుమించు ప్రతి ఇంటి నుంచి ఇలాంటి సమాధానమే వినిపించింది. ‘ఆడపిల్లలకు విద్య’ అనే నినాదం ప్రాధాన్యతకు నోచుకోని ఎన్నో ప్రాంతాలను చూసింది సఫీనా. దీనికి పేదరికం ఒక కారణం అయితే, ఆర్థికస్థాయి బాగున్నా ‘ఆడపిల్లకు చదువెందుకు’ అనే నిర్లిప్తత మరోకారణం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటి ఆడపిల్ల బడికి వెళ్లాలనే లక్ష్యంతో ‘ఎ డ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది సఫీనా. ‘ఒక సమస్య గురించి మాట్లాడేటప్పుడు దానితో మమేకం కావాలి’ అంటున్న సఫీనాకు పేదరికం అనేది అపరిచిత సమస్య కాదు. దిల్లీలోని ఒక పేదకుటుంబంలో పుట్టింది. ఎన్నో కష్టాల మధ్య కూడా ‘చదువు’ అనే ఆయుధాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆ కుటుంబం నుంచి లండన్‌లో చదువుకున్న తొలి వ్యక్తి అయింది. లండన్ నుంచి అమెరికాకు వెళ్లి స్వచ్ఛంద సేవారంగంలో పని చేసిన సఫీనా 2005లో స్వదేశానికి తిరిగి వచ్చింది. ‘చదువుకోవడం వల్ల నేను ఎంతో సాధించాను. దేశదేశాలు తిరిగాను. చదువుకోకపోతే నా పరిస్థితి ఊహకు కూడా అందనంత దయనీయంగా ఉండేది’ అనుకున్న సఫీనా హుసేన్ పేదింటి ఆడపిల్లల చదువు కోసం తన వంతుగా ఏదైనా చేయాలనుకుంది. ప్రభుత్వ సంస్థల నుంచి వివరాలు సేకరించింది. చదువుకు సంబంధించి జెండర్–గ్యాప్ ఉన్న 26 జిల్లాల గురించి తెలుసుకుంది. అందులో తొమ్మిది రాజస్థాన్‌లో ఉన్నాయి. రాజస్థాన్‌లో ఆడపిల్లల చదువుకు దూరంగా ఉన్న ప్రాంతాలను మొదట ఎంపిక చేసుకుంది సఫీనా బృందం. గ్రామానికి చెందిన స్వచ్ఛంద సేవకులతో ‘ఆర్మీ ఆఫ్ జెండర్ చాంపియన్స్’ను ఏర్పాటు చేసి ‘దయచేసి మీ అమ్మాయిని స్కూల్‌కు పంపించండి’ అంటూ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ‘ఆడపిల్లలకు చదువు’ అనే అంశంపై గ్రామ సమావేశాలు ఏర్పాటు చేశారు. సఫీనా ఆమె బృందం కృషి వృథా పోలేదు. ఎన్నో గ్రామాల్లో ఎంతోమంది ఆలోచన తీరులో మార్పు వచ్చింది. తమ ఇంటి ఆడపిల్లలను స్కూలుకు పంపించడం ప్రారంభించారు. చాలా బడులలో ఆడపిల్లల కోసం టాయిలెట్ సదుపాయాలు లేవు. అలాంటి బడులలో ప్రత్యేక టాయిలెట్లు నిర్మించేలా చేశారు. బడిలో అకాడమిక్ పాఠాలు మాత్రమే కాకుండా లైఫ్స్కిల్స్కు సంబంధించిన పాఠాలు కూడా చెప్పేవారు. ‘ఆడపిల్లలకు చదువు దూరం కావడం అనేది ఆర్థిక సమస్యతో ముడిపడి ఉన్న అంశం కాదు. అది పితృస్వామిక భావజాలానికి సంబంధించింది. మేము పనిచేసిన కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఇంటి ఆడపిల్ల కంటే గొర్రెలు, మేకలను విలువైన ఆస్తిగా భావించడం చూశాం. ముందు వారి ఆలోచన తీరులో మార్పు తీసుకు రావాలనుకున్నాం. అది అంత తేలిక కాదని తెలిసినా రంగంలోకి దిగాం. ప్రభుత్వ సంస్థల నుంచి లోకల్ వాలెంటీర్స్ వరకు కలిసి పనిచేశాం. అయితే మేము నిరాశతో వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి రాలేదు’ అంటుంది సఫీనా. ‘ఆడపిల్లలకు చదువు అందని ప్రాంతాలు ఏమిటి?’ అనే అంశంపై ఒకప్పుడు ప్రభుత్వ సంస్థల డాటాపైన ఆధారపడిన సఫీనా బృందం ఇప్పుడు డాటా ఎనాలటిక్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలాంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. జియో–ట్యాగ్డ్ టార్గెట్ విలేజెస్ నుంచి మొబైల్ ఫోన్స్‌లో డాటా సేకరిస్తున్నారు. తమ పనితీరును మరింత మెరుగుపరుచుకొని ఉత్తమఫలితాలు సాధించడానికి వారికి ఇది ఉపయోగపడుతుంది. గతాన్ని గట్టిగా గుర్తు పెట్టుకున్న సఫీనా హుసేన్ ఎన్నో రాష్ట్రాలలో ఎంతోమంది పేదింటి అమ్మాయిల ఉజ్వల భవిష్యత్ కోసం ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ద్వారా కృషి చేస్తోంది. అయినా వెనకడుగు వేయలేదు ‘ఎడ్యుకేట్ గర్ల్స్’తో తొలి అడుగులు వేసినప్పుడు ‘మీలాగే చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు’ అని నిరుత్సాహపరిచారు కొందరు. అయితే అలాంటి మాటలను మేము సీరియస్‌గా తీసుకోలేదు. ‘ఫలితం వచ్చేవరకు మా ప్రయత్నం’ అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. బయటి వాళ్లు చెప్పే మాటల కంటే తమ ఊరి వాళ్లు చెప్పే మాటలకే గ్రామస్థులు ప్రాధాన్యత ఇస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో స్థానికులతో కలిసి ఆర్మీ ఆఫ్ జెండర్ ఛాంపియన్స్‌ను ప్రారంభించి ఆడపిల్లల విద్యకు సంబంధించి ఇంటింటి ప్రచారం నిర్వహించాం. – సఫీనా హుసేన్, ఫౌండర్, ఎడ్యుకేట్ గర్ల్స్ -
Disha Naik: ఎయిర్పోర్ట్ ఫైర్‌ఫైటర్
గోవాకు చెందిన దిశా నాయక్ చరిత్ర సృష్టించింది. విమానాశ్రయాల్లో అగ్ని ప్రమాదాలను నివారించే భారీ వాహనం ‘క్రాష్ ఫైర్ టెండర్’ను నడిపే తొలి భారతీయ వనితగా గోవా ఎయిర్‌పోర్ట్‌లో ప్రమోట్ అయ్యింది. గోవా వాసులు సరే, విమానయాన రంగం కూడా ఆమెను ప్రశంసగా చూస్తోంది. అగ్నిప్రమాదాలు ప్రాణాంతకం. ఎయిర్‌పోర్ట్‌లో జరిగే అగ్ని ప్రమాదాలు మరీ తీవ్రం. సెకన్ల వ్యవధిలో చావు బతుకులు నిర్ణయమవుతాయి సరిగ్గా స్పందించకపోతే. అందుకే ప్రత్యేకంగా ‘ఏరోడ్రోమ్ రెస్క్యూ అండ్ ఫైర్‌ఫైటింగ్’ (ఏ.ఆర్.ఎఫ్.ఎఫ్.) సర్వసమయాల్లోనూ సిద్ధంగా ఉంటుంది ప్రతి ఎయిర్‌పోర్ట్‌లో. అయితే ఈ విభాగంలో స్త్రీల ప్రాతినిధ్యం చాలా తక్కువ. 2021 వరకు గోవాలో ఒక్క మహిళ కూడా ఈ విభాగంలో లేదు. దిశా నాయక్ ఈ ఉద్యోగంలో చేరి గోవాలో తొలి ఎయిర్పోర్ట్ ఫైర్‌ఫైటర్‌గా నిలిచింది. ఇప్పుడు ఆమె ‘క్రాష్ ఫైర్ టెండర్’ నడిపే ఫైర్‌ఫైటర్‌గా ప్రమోట్ అయ్యింది. దాంతో మన దేశంలో క్రాష్ ఫైర్ టెండర్‌ను ఆపరేట్ చేసే తొలి సర్టిఫైడ్ ఉమన్ ఫైర్‌ఫైటర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. క్రాష్ ఫైర్ టెండర్ (సి.ఎఫ్.టి.) అంటే? ఇది హైటెక్ ఫైర్ ఇంజిన్. అగ్నిమాపక దళంలో కనిపించే ఫైర్ ఇంజిన్‌కు, దీనికి చాలా తేడా ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌లో, విమానాలు ల్యాండ్ అయ్యేటప్పుడు ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే మంటలార్పేలా ఈ ఫైర్ ఇంజిన్‌ను తయారు చేస్తారు. దీనిని నడపడానికి, మంటలు ఆర్పేలా ఆపరేట్ చేయడానికి తీవ్రశిక్షణ అవసరం. సాధారణంగా మగవారు రాణించడానికే కొంత శ్రమ పడతారు. అలాంటిది దిశా నాయక్ అన్ని పరీక్షలు పాసై సి.ఎఫ్.టి.ని ఆపరేట్ చేసే మహిళా ఫైర్‌ఫైటర్ అయ్యింది. యూనిఫామ్ ఉండే ఉద్యోగం చేయాలని.. గోవాలోని పెర్నెమ్కు చెందిన దిశా నాయక్‌కు బాల్యం నుంచి యూనిఫామ్ ఉండే ఉద్యోగం చేయాలని కోరిక. అయితే చదువు పూర్తయ్యాక అలాంటి ఉద్యోగం ఏమీ దొరకలేదు. 2021లో గోవాలోని ‘మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్’లో ఫైర్‌ఫైటర్ ఉద్యోగాలకు పోస్టులు పడ్డాయి. ఎయిర్పోర్ట్ అగ్నిమాపక దళం లో అప్పటికి ఎవరూ అమ్మాయిలు లేకపోయినా దిశా అప్లై చేసింది. ‘మా అమ్మాయి చిన్నప్పటి నుంచి చాలా చురుకు. మోటర్ సైకిల్ నడిపేది. రన్నింగ్ బాగా చేసేది. ఆమె ఫైర్‌ఫైటర్‌గా చేరతానంటే రాణిస్తుందనే నమ్మకంతోనే ప్రోత్సహించాం’ అంటారు తల్లిదండ్రులు. వారి ప్రోత్సాహంతో జూన్ నెలలో ఉద్యోగంలో చేరింది దిశా. అంచెలంచెలుగా ఎదిగి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి దిశాలోని చురుకుదనం, అంకితభావం పై అధికారులు గమనించారు. కేవలం సహాయక సిబ్బందిగా ఉండటం కంటే క్రాష్ ఫైర్ టెండర్‌ను నడిపేందుకు ఆమె ఆసక్తి చూపడం గమనించి ఆమెను ట్రైనింగ్‌కి పంపారు. తమిళనాడులోని నమక్కల్‌లో ఆరునెలల పాటు శిక్షణ తీసుకుంది దిశ. ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిప్రమాదాలు సంభవించే తీరు, ఏ ప్రమాదంలో సి.ఎఫ్.టి.ని ఎలా ఉపయోగించాలి... అక్కడ ఆమెకు నేర్పించారు. తిరిగి వచ్చాక ఉన్నతాధికారులు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి ఆమె ప్రావీణ్యాన్ని నిర్థారించి సి.ఎఫ్.టి ఆపరేటర్‌గా ప్రమోట్ చేశారు. ‘ఆమె అన్నిరకాల పరీక్షల్లో ఉత్తమంగా నిలిచింది’ అని తెలిపారు. అన్నివిధాలా సిద్ధంగా ‘అగ్నిప్రమాదం జరిగినప్పుడు వెంటనే సంఘటనాస్థలికి చేరుకోవడం కంటే చేరుకున్నాక ఏం చేయాలన్నదే ఎక్కువ ముఖ్యం. ఎయిర్పోర్ట్ ఫైర్‌ఫైటర్‌గా పని చేసేవారికి ఎయిర్‌పోర్ట్‌లోని అన్ని ప్రవేశమార్గాలు, కీలకమైన ద్వారాలు, ముఖ్యస్థానాలు మైండ్‌లో ప్రింట్ అయి ఉండాలి. ప్రమాదం జరిగితే ఎక్కడికి చేరి ఎలా కాపాడాలన్నదే ముఖ్యం. ఈ ఉద్యోగంలో క్షణాల్లో యూనిఫామ్‌లోకి మారి వెహికిల్‌లో కూచోవాలి. శారీరక బలంతో పాటు మానసిక బలం ప్రదర్శించాలి. సాంకేతిక జ్ఞానం కూడా తప్పనిసరి’ అని తెలిపింది దిశ. -
లాంచ్‌కు ముందే రూ.10 కోట్ల కారు కొన్న చెన్నై వాసి - ఫోటోలు వైరల్
Rolls Royce Spectre Delivery: ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజురోజుకి పెరిగిపోతున్న తరుణంలో బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'రోల్స్ రాయిస్' (Rolls Royce) గత ఏడాది గ్లోబల్ మార్కెట్లో 'స్పెక్టర్' పేరుతో ఓ ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించింది. కంపెనీ ఈ కారుని భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయకముందే ఫస్ట్ డెలివరీ ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారుని.. సంస్థ చెన్నైకి చెందిన భాష్యం కన్స్ట్రక్షన్స్కు చెందిన భాష్యం 'యువరాజ్'కు డెలివరీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమారు రూ. 10 కోట్లు ఖరీదైన ఈ కారుని కొన్న మొదటి భారతీయ కస్టమర్‌గా రికార్డ్ క్రియేట్ చేశారు. రోల్స్ రాయిస్ స్పెక్టర్ దాని మునుపటి మోడల్ కార్లకంటే చాలా భిన్నంగా ఉంటుంది. డీఆర్ఎల్లతో కూడిన ఎల్ఈడీ హెడ్‌లైట్స్, స్టైలిష్ ఎల్ఈడీ టైల్లైట్స్ వంటి వాటితో పాటు.. షార్ప్ స్లాంటెడ్ రూఫ్ డిజైన్ పొందుతుంది. సైడ్ ప్రొఫైల్‌లో 23 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు కొత్త 'స్పిరిట్' సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫారమ్‌తో కూడిన ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే పొందుతుంది. ఇది కనెక్టెడ్ కార్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. డ్యాష్‌బోర్డ్ ప్యానెల్ 'స్పెక్టర్' నేమ్‌ప్లేట్‌తో చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. దీని చుట్టూ దాదాపు 5,500 స్టార్స్ లాంటి ఇల్యూమినేషన్లు ఉన్నాయి. ఇదీ చదవండి: కొన్న ఏడాదిలో అమ్మేస్తే.. మస్క్ రూల్స్ మామూలుగా లేదుగా!! రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారు 593 పీఎస్ పవర్, 900 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 520 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. సుమారు 3 టన్నుల బరువున్న ఈ కారు కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. View this post on Instagram A post shared by Rolls-Royce Motor Cars Chennai (@rollsroycechennai) -
అనూష షా...విల్ పవర్ ఉన్న సివిల్ ఇంజనీర్
‘నా వృత్తిలో నేను రాణిస్తే చాలు. అదే పదివేలు’ అని సంతృప్తి పడి, సర్దుకుపోయేవాళ్లే ఎక్కువమంది కనిపిస్తారు. ‘నా వృత్తి వల్ల పర్యావరణానికి ఏ మేరకు హాని జరుగుతోంది?’ అని ఆలోచించేవాళ్లు అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన వ్యక్తి... అనూష షా. పచ్చటి ప్రకృతి ప్రపంచంలో పుట్టి పెరిగిన అనూషకు పర్యావరణ విలువ తెలుసు. సివిల్ ఇంజనీర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న అనూష వృత్తి విజయాలను చూసి ΄÷ంగిపోవడం కంటే వృత్తికి సామాజిక బాధ్యతను జోడించడానికే అధికప్రాధాన్యత ఇచ్చింది. తన వంతుగా వివిధ వేదికలపై పర్యావరణ హిత ప్రచారాన్ని విస్తృతం చేసింది. తాజాగా... బ్రిటన్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ (ఐసీయి)కి అధ్యక్షురాలిగా ఎంపికైంది అనూష షా. రెండు శతాబ్దాల చరిత్ర ఉన్న ప్రతిష్ఠాత్మకమైన ‘ఐసీయి’ అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన తొలి భారతీయురాలిగా అనూష షా చరిత్ర సృష్టించింది... ‘వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్’లో అనూష షాకు రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. డిజైనింగ్, మేనేజింగ్లో, ప్రాజెక్ట్స్–ప్రొగ్రామ్‌లను లీడ్ చేయడంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ‘నిర్మాణం వల్ల నిర్మాణం మాత్రమే జరగడం లేదు. ప్రకృతికి ఎంతో కొంత నష్టం జరుగుతుంది’ అనేది ఒక సామాజిక సత్యం. దీన్ని దృష్టిలో పెట్టుకొని వృత్తికి సామాజిక బాధ్యత కూడా జోడించి ముందుకు వెళుతోంది అనూష. ‘నా వృతి వల్ల నాకు ఆర్థికంగా మేలు జరగడం మాట ఎలా ఉన్నా, చేటు మాత్రం జరగవద్దు’ అంటోంది అనూష. అందుకే తన వృత్తిలో పర్యావరణ హిత విధానాలను అనుసరిస్తోంది. ‘సివిల్ ఇంజనీరింగ్‌ను పీపుల్–పాజిటివ్ ప్రొఫెషన్‌గా చూడాలనేది నా కల. మౌలిక వసతులు, ప్రకృతికి మధ్య ఉండే అంతఃసంబంధాన్ని అర్థం చేసుకోవడంలో మొదట్లో మేము విఫలమయ్యాం. ఆ తరువాత మాత్రం ప్రకృతికి హాని జరగని విధానాలను అనుసరించాం’ అంటుంది అనూష. అందమైన కశ్మీర్లో పుట్టి పెరిగిన అనూషకు ప్రకృతి విలువ తెలుసు. కశ్మీర్‌లోని దాల్ సరస్సు సంరక్షణ కోసం దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ కోసం ఇరవై మూడు సంవత్సరాల వయసులో కన్సల్టింగ్ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా పనిచేసింది. ఆ తరువాత కామన్వెల్త్ స్కాలర్‌షిప్‌తో బ్రిటన్ వెళ్లి ‘వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్’లో ఎంఎస్సీ చేసింది. ‘΄్లాన్ ఫర్ ఎర్త్’ అనే క్లైమెట్ ఛేంజ్ కన్సెల్టెన్సీని మొదలు పెట్టి పర్యావరణ సంరక్షణకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. వివిధ పరిశ్రమలకు సంబంధించిన ‘నెట్‌జీరో అండ్ క్లైమెట్ ఛేంజ్’ బృందాలతో సమావేశమై విలువైన సూచనలు ఇచ్చింది. చర్చాకార్యక్రమాల్లో పాల్గొన్నా, వ్యాసాలు రాసినా, టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినా, సమావేశాల్లో ఉపన్యాసం ఇచ్చినా...ప్రతి అవకాశాన్ని పర్యావరణ హిత ప్రచారానికి ఉపయోగించుకుంది. ‘మన గురించి మాత్రమే కాదు భవిష్యత్ తరాల గురించి కూడా ఆలోచించాలి. ఉన్నతమైన విలువలతో ప్రయాణించినప్పుడే మన గమ్యస్థానం చేరుకోగలం’ అంటుంది అనూష. ‘క్లైమెట్ చేంజ్ ఇన్ ఇంజనీరింగ్’ అంశానికి సంబంధించి అనూష చేపట్టిన అవగాహన కార్యక్రమాలకు గానూ ‘యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్’ నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించింది. కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటన్ నుంచి ముంబైకి వచ్చింది అనూష. ఆ సమయంలో తన స్వస్థలం కశ్మీర్‌ను వరదలు ముంచెత్తాయి. ఎంతోమంది చనిపోయారు. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఇది అనూషను బాగా కదిలించింది. ‘విషాదం నుంచి కూడా నేర్చుకోదగినవి చాలా ఉంటాయి. ఇది అలాంటి విషాదమే’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అనూష. ‘ముందుచూపు, ముందు జాగ్రత్త ఉన్న వాళ్ల వైపే అదృష్టం మొగ్గు చూపుతుంది’ అనేది అనూష షాకు బాగా ఇష్టమైన మాట. ‘మన వల్ల ఏమవుతుంది అనే భావన కంటే ఔట్ ఆఫ్ బాక్స్‌లో ఆలోచించి, ధైర్యంగా ముందుకు వెళ్లడం వల్లే ఎక్కువ మేలు జరుగుతుంది. సంకల్పబలం ఉన్న చోట అద్భుతమైన ఫలితాలు వస్తాయి’ అనేది ఆమె బలంగా చెప్పే మాట. -
Shiseido: మహాలక్ష్మి మహా ఘనత
‘శ్రీ’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన తమన్నా భాటియా ఆ తరువాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ‘మిల్కీ బ్యూటీ’గా పేరు గాంచింది. ‘100 పర్సంట్ లవ్’ సినిమాలో వీర వెంకట సత్య సాయి నాగ దుర్గ శేష అవతార సీతా మహాలక్ష్మి’ పాత్రతో ఫస్ట్ క్లాస్ మార్కులు కొట్టేసింది. తాజాగా మన మహాలక్ష్మి సరికొత్త రికార్డ్ సృష్టించింది. జపాన్‌కు చెందిన ప్రసిద్ధ బ్యూటీ అండ్ కాస్మెటిక్స్ మల్టీ నేషనల్ కంపెనీ ‘షిసైడో’కు ఫస్ట్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్‌గా అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఈ ఘనత గురించి తమన్నాను ఆకాశానికి ఎత్తుతూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ‘అందంతో పాటు ఆత్మవిశ్వాసం ఉండాలి’ అంటుంది తమన్నా. ఆమె విజయపరంపరకు ఇదే ప్రధాన కారణం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. -
తుది దశలో టాటా-విస్ట్రాన్ డీల్
న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ల తయారీ సంస్థ విస్ట్రాన్‌కు చెందిన కర్ణాటక ప్లాంటును టాటా గ్రూప్ కొనుగోలు చేసే అంశం తుది దశలో ఉన్నట్లు సమాచారం. అనుబంధ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ ద్వారా టాటా గ్రూప్ ఈ డీల్‌ను కుదుర్చుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ పూర్తయితే యాపిల్ ఐఫోన్లను తయారు చేసే తొలి భారతీయ సంస్థగా టాటా నిలవనుంది. అలాగే, ఈ ప్లాంటులో ఐఫోన్లతో పాటు ఇతరత్రా కొత్త యాపిల్ ఉత్పత్తులను కూడా అసెంబుల్ చేసే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రస్తుతం తైవాన్‌కు చెందిన విస్ట్రాన్‌తో పాటు ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ వంటి సంస్థలు యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. -
భారత్‌లో మొదటి టెస్లా కార్ ఇతనిదే..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీలలో టెస్లా ఒకటి. దాని వ్యవస్థాపకుడు, సీఈవో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఎలాన్ మస్క్‌ను కలిశారు. భారత్ ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ మార్కెట్‌గా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా ఇప్పటికీ దేశంలో అధికారికంగా లేదు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత ఎలాన్ మస్క్ టెస్లా భారత్‌కు వస్తున్నట్లు ప్రకటించారు. అయితే టెస్లా అధికారికంగా భారతదేశంలోకి రానప్పటికీ, భారతీయ రోడ్లపైకి టెస్లా కార్లు ఎప్పుడో వచ్చేశాయి. దేశంలో మొదటి టెస్లా కారును ఓ వ్యక్తి 2017లో దిగుమతి చేసుకున్నారు. ఆయనేం ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీ లేదా గౌతమ్ సింఘానియా కాదు. టెస్లాను కొనుగోలు చేసిన మొదటి భారతీయుడు ఎస్సార్ గ్రూప్ సీఈఓ ప్రశాంత్ రుయా. టెస్లా మోడల్ X SUV బ్లూ కలర్ కార్‌ను ఆయన దిగుమతి చేసుకున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని నడుపుతూ ఆయన చాలా సార్లు కనిపించారు. ఎస్సార్‌ను స్థాపించిన రుయా కుటుంబంలోని రెండవ తరానికి చెందినవారు ప్రశాంత్ రుయా. ఎస్సార్ గ్లోబల్ ఫండ్ లిమిటెడ్‌లో ఆయన ఏకైక పెట్టుబడిదారు. ఎస్సార్ సంస్థను 1969లో ప్రశాంత్ రుయా తండ్రి శశి రుయా, మేనమామ రవి రుయాలు స్థాపించారు. ఇదీ చదవండి: అవును.. భారత్‌కు టెస్లా వచ్చేస్తోంది! స్పష్టం చేసిన ఎలాన్ మస్క్ -
Zoya Agarwal: అబ్బురపరిచే సాహసికి... అరుదైన గౌరవం
మ్యూజియం అంటే వస్తు,చిత్ర సమ్మేళనం కాదు. అదొక ఉజ్వల వెలుగు. అనేక రకాలుగా స్ఫూర్తిని ఇచ్చే శక్తి. అలాంటి ఒక మ్యూజియంలో కెప్టెన్ జోయా అగర్వాల్ సాహసాలకు చోటు దక్కింది... శాన్ఫ్రాన్సిస్కో(యూఎస్)లోని ఏవియేషయన్ మ్యూజియం వైమానికరంగ అద్భుతాలకు వేదిక. అక్కడ ప్రతి వస్తువు, ప్రతి చిత్రం, పుస్తకం...ప్రపంచ వైమానికరంగ వైభవానికి సంబంధించి ఎన్నో విషయాలను చెబుతుంది. అలాంటి మ్యూజియంలో ఇప్పుడు మన దేశానికి చెందిన జోయా అగర్వాల్ సాహస చరిత్రకు చోటుదక్కింది. ఈ ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియంలో చోటు సంపాదించిన తొలి భారతీయ మహిళా పైలట్‌గా చరిత్ర సృష్టించింది జోయా. ఇప్పుడు ఆమె అద్భుత సాహసాన్ని చిత్రాల నుంచి వస్తువుల వరకు రకరకాల మాధ్యమాల ద్వారా తెలుసుకోవచ్చు. స్ఫూర్తి పొందవచ్చు. దిల్లీలో జన్మించిన జోయాకు చిన్నప్పటి నుంచి సాహసాలు అంటే ఇష్టం. పైలట్ కావాలనేది ఆమె కల. అయితే తల్లిదండ్రులు భయపడ్డారు. ‘పైలట్ కావడానికి చాలా డబ్బులు కావాలి. అంత స్తోమత మనకు ఎక్కడ ఉంది తల్లీ’ అని కూడా అన్నారు. అయితే అవేమీ తన మనసును మార్చలేకపోయాయి.ఏవియేషన్ కోర్స్ పూర్తయినరోజు తన ఆనందం ఎంతని చెప్పాలి! మొదటి అడుగు పడింది. ఒక అడుగు అంటూ పడాలేగానీ దారి కనిపించడం ఎంతసేపని! తొలిసారిగా దుబాయ్‌కి విమానాన్ని నడిపినప్పుడు జోయా సంతోషం ఆకాశాన్ని అంటింది. పైలట్ కావాలనుకొని అయింది. ఆ తరువాత కెప్టెన్ కూడా అయింది....ఇక చాలు అని జోయా అక్కడితో ఆగిపోయి ఉంటే ప్రపంచ వైమానికరంగ చరిత్రలో ఆమెకు అంటూ ఒక పుట ఉండేది కాదు. కోవిడ్ కోరలు చాచిన కల్లోల సమయంలో ‘వందే భారత్ మిషన్’లో భాగంగా విమానం ద్వారా విదేశాల్లో ఉన్న ఎంతోమంది భారతీయులను స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చి ‘శభాష్’ అనిపించుకుంది. ఇక అతిపెద్ద సాహసం గత సంవత్సరం చేసింది. నలుగురు మహిళా పైలట్లను కూర్చోబెట్టుకొని ఉత్తరధ్రువం మీదుగా 17 గంటల పాటు విమానం నడిపి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని జోయాను ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధిగా నియమించడం అరుదైన గౌరవం. ‘అంకితభావం మూర్తీభవించిన సాహసి కెప్టెన్ జోయా అగర్వాల్. ఆమె విజయాలు, సాహసాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తాయి. వారి కలను నెరవేర్చుకునేలా చేస్తాయి. మ్యూజియంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చరిత్ర, విజయాలు ఈ తరానికే కాదు, భవిష్యత్తరాలకు కూడా ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి’ అంటున్నారు శాన్ఫ్రాన్సిస్కో ఎవియేషన్ మ్యూజియం అధికార ప్రతినిధి. ‘ఇది కలా నిజమా! అనిపిస్తుంది. ఈ గుర్తింపు నా దేశానికి, నాకు గర్వకారణం’ అంటుంది జోయా. జోయా అగర్వాల్ ప్రతిభ, సాహసం కలగలిసిన పైలట్ మాత్రమే కాదు యువతరాన్ని కదిలించే మంచి వక్త కూడా. ‘రాత్రివేళ ఆరుబయట కూర్చొని ఆకాశాన్ని చూస్తున్న ఎనిమిది సంవత్సరాల బాలికను అడిగేతే, తాను కచ్చితంగా పైలట్ కావాలనుకుంటుంది’ అంటుంది జోయా అగర్వాల్. అయితే అలాంటి బాలికలు తమ కలను నెరవేర్చుకోవడానికి జోయాలాంటి పైలట్ల సాహసాలు ఉపకరిస్తాయి. తిరుగులేని శక్తి ఇస్తాయి. -
తెలుగు మహిళ తొలి యాత్రా కథనం
తెలుగువారి ఘన చరిత్ర తెలుగువారు ప్రత్యేకంగా చెప్పుకోరు. ఇంటి గడప దాటడం కూడా మహా వింత అయిన రోజుల్లో, సముద్రం దాటడం అంటే కుల భ్రష్టత్వం అని భావించే రోజుల్లో 1873లో తెలుగు మహిళ పోతం జానకమ్మ ఇంగ్లండ్, పారిస్‌లను చుట్టి ఆ విశేషాలను యాత్రాకథనంగా రాశారు. 1876లో ఇంగ్లిష్‌లో వెలువడ్డ ఈ పుస్తకం ఒక విలువైన డాక్యుమెంట్‌గా నిలిచి ఉంది. బహుశా భారతీయ మహిళల్లోనే యాత్రా కథనం రాసిన తొలి మహిళ పోతం జానకమ్మ. ఇన్నాళ్లకు ఈ పుస్తకం తెలుగులో రానుంది. అందులో ఏముంది? జానకమ్మ ఎవరు? ‘సాక్షి’కి ప్రత్యేకం. తెలుగు కథకు ఆద్యుడు గురజాడ అప్పారావు అని చాలాకాలం భావించినా ఆయన కంటే ముందే భండారు అచ్చమాంబ తెలుగులో కథలు రాశారు అని పరిశోధకులు తేల్చారు. కాని ఈ పరిశోధన తెలుగు స్త్రీల కృషిని విశద పరిచింది. చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, వ్యాపారవేత్తలుగా ఎదగడానికి సమాజ చట్రాలను దాటి సంఘర్షించిన, కొత్త మార్గాలు తెరిచిన తెలుగు మహిళలు ఎందరో ఉన్నారు. ఆ వరుసలో పోతం జానకమ్మ కూడా ఇప్పుడు పరిచయం అవుతున్నారు. 1838లో మద్రాసు నుంచి ఏనుగుల వీరాస్వామయ్య ప్రకటించిన ‘కాశీ యాత్రా చరిత్ర’ విఖ్యాతం. అయితే ఆయన చేసిన యాత్ర స్వదేశానికి పరిమితం. కాని 1873లో అదే మద్రాసు నుంచి పోతం జానకమ్మ చేసిన ‘జానకమ్మ ఇంగ్లాండ్ యాత్ర’ అంతే విశిష్టమైనది. అయితే కాశీ యాత్రకు లభించినంత ప్రచారం ఈ పుస్తకానికి లభించలేదు. ఎవరీ జానకమ్మ పోతం జానకమ్మ అచ్చ తెలుగు ఆడపడుచు. మద్రాసులో (చెన్నై) ఆమె వ్యాపారవేత్త రాఘవయ్యతో జీవించారు. ఈ రాఘవయ్య తమ్ముడు వెంకటాచల చెట్టి లండన్‌లో పత్తి దళారిగా పని చేస్తే, మరో తమ్ముడు జయరాం అక్కడే చదువుకున్నట్టు తెలుస్తోంది. పోతం జానకమ్మ చదువుకున్న మహిళ. ఇంగ్లిష్ కూడా మాట్లాడటం వచ్చు. ఆమె ప్రధానంగా చిత్రకళా ప్రియురాలు. దేశాలు, ప్రాంతాలు చూడాలనే ఆమె అభిలాషను భర్త గౌరవించాడు. ప్రోత్సహించాడు. భర్తతో కలిసి జానకమ్మ 1871లో ఇంగ్లాండ్‌కు వెళ్లాలనుకుని ప్రయత్నం చేస్తే ఆ సంవత్సరం ఓడలో ‘కుటుంబాలు వెళ్లడం లేదని’ మానుకున్నారు. 1873లో ఆమె ప్రయత్నం సఫలమైంది. ఆ సంవత్సరం ‘ఇండియన్ ఫైనాన్స్ కమిషన్’కు మహజర్లు సమర్పించడానికి మన దేశం నుంచి వ్యాపారవేత్తల బృందం లండన్ వెళ్లింది. బహుశా ఆ బృందంలో జానకమ్మ బృందం చేరి ఉంటుంది. 1873 జూలై 20న మద్రాసు ఓడరేవు నుంచి లండన్ బయలుదేరి వెళ్లిన జానకమ్మ 1874 ఫిబ్రవరిలో తిరిగి వచ్చారు. తన యాత్రానుభవాన్ని తెలుగులో రాసి ‘ఆంధ్ర భాష సంజీవని’ లో ప్రచురించారు. పుస్తకాన్ని ఆమె తెలుగులోనే రాసినా అనువాదమయ్యి మొదట ఇంగ్లిష్‌లోనే 1876లో వెలువడింది. దీనిని జానకమ్మ నాటి మద్రాసు యాక్టింగ్ గవర్నర్ విలియం రోజ్ రాబిన్సన్ భార్య ఎలిజిబత్ రాబిన్సన్కు అంకితం ఇచ్చింది. అంటే బ్రిటిష్ అధికార కుటుంబాలతో ఆమె పరిచయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో ముద్రణ అత్యంత ఖరీదు కనుక కాపీ వెల రెండున్నర రూపాయి పెట్టారు (సగటు కుటుంబం నెల ఖర్చు). ఆమె ఉండగా తెలుగులో పుస్తకం రాకపోవడం బాధాకరమే. 150 పేజీల ఈ పుస్తకంలో జానకమ్మ హైందవ ధర్మాల పట్ల తన నిష్ఠను వ్యక్తం చేస్తూనే ఆధునిక దృష్టి, స్త్రీ పురుష సమభావన దృష్టి, భారతీయుల పరిమితులపై విమర్శనా దృష్టి వ్యక్తం చేసింది. యాత్రాకథనంలో చాలా చోట్ల చిన్న పిల్లలా ఆశ్చర్యపోవడం ఉన్నా ఆమె ఆలోచనాపరురాలైన స్త్రీగా ఈ యాత్రనంతటినీ దర్శించడం విశేషం. ఈ పుస్తకాన్ని ఇప్పుడు నెల్లూరుకు చెందిన ప్రముఖ చరిత్ర పరిశోధకులు పురుషోత్తం కాళిదాసు అనువాదం చేశారు. రచయిత పి.మోహన్ ప్రచురణకర్తగా ఉన్నారు. మరో వారం రోజుల్లో వెలువడనుంది. పుస్తకంలో ఏముంది? కొన్ని పేరాగ్రాఫ్‌లు అక్కడక్కడ నుంచి ఎంచినవి ► 1873– జూలై 20వ తేదీ వేకువజాము. కెప్టెన్ ముర్రే సారథ్యంలో సౌతాంప్టన్ వెళ్లే ఓడ కలకత్తా నుంచి మద్రాస్ వచ్చేసిందని తెలుపుతూ మూడు తుపాకులు పేలడంతో మేం ప్రయాణానికి హడావుడిగా సిద్ధమయ్యాం. బంధుమిత్రుల ఆశీస్సులు తీసుకున్నాం. సహ ప్రయాణికులతో కలిసి రేవు నుంచి ఓడలోకి చేరవేసే మసూలా బోట్లు ఎక్కాం. మా సుదీర్ఘమైన ప్రయాణంలో ఏయే కష్టాలు ఎదురవుతాయోనని దిగాలు పడుతూ విషాద వదనాలతో ఉన్నాం. ముప్పై రోజులో ఇంకా ఎక్కువరోజులో ఎటు చూసినా సముద్ర జలాలు తప్ప మరేం కనిపించవు. ► నేను ఇంగ్లండ్ పర్యటన తల పెట్టగానే ఆ ప్రయత్నం మానిపించడానికి, నన్ను భయపెట్టడానికి మావాళ్లు ఎన్ని తెలివితక్కువ అపోహలు కల్పించారని. వాళ్లకు నచ్చజెప్పడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. మొత్తానికి యూరప్ చూడాలనే కోరికను నెరవేర్చుకొన్నాను. అక్కడకు వెళ్లాక విక్టోరియా రాణి ఏలుబడిలో లేని దేశాలను కూడా చూసి రావాలనే కోరిక కలిగింది. మాతో వచ్చిన బృందంతో కలిసి ఫ్రాన్స్ రాజధాని పారిస్ చూడటానికి బయల్దేరాం. మా పర్యటన ఏర్పాటు చేసిన థామస్ కుక్ అండ్ సన్స్ కంపెనీ ద్వారా టికెట్లు కొని నవంబర్ నెలలో అందరం న్యూ హేవన్ మీదుగా ఇంగ్లిష్ చానల్లో డియప్ మీదుగా పయనమయ్యాం. ► ఇంగ్లండ్ వెళ్లక పూర్వం బ్రిటిష్ ప్రజల గురించి అనేక అసంబద్ధ ఆలోచనలు నా బుర్రలో ఉండేవి. అక్కడి సామాజిక, రాజకీయ సమూహాల్లో మెలిగాక నా అభిప్రాయాలు మారాయి. పొరపాటేమిటంటే ఆంగ్లేయులు హిందూ దేశాన్ని తమదిగా భావించకపోవడం. ఏదో కొంతకాలమిక్కడ గడపడానికి వచ్చామనుకొంటారు కాబట్టే తరచూ తమ విధులను యాంత్రికంగా నిర్వర్తిస్తారు. ► మన హిందూ దేశస్తులు ఓడలు నిర్మించి సముద్రాల మీద విదేశాలకు వెళ్లి అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలను తెలుసుకొని ఆ దేశాలతో మైత్రి చేసినట్లు గ్రంథస్తమైన ఆధారాలు లేవు. పైపెచ్చు మనవాళ్లు సముద్ర యానాన్ని, విదేశాలకు వెళ్లి రావడాన్ని నిషేధించారు కూడా. ఇటువంటి నిషేధాల వల్ల మన పూర్వీకులకు ఏం మేలు జరిగిందో ఏమో కానీ మనకిప్పుడు అపారమైన కీడు మాత్రమే కలుగుతోంది. ► సందర్భం, అవసరం వస్తే ఆంగ్లేయ మహిళలు శాస్త్రీయ విషయాల గురించి మాట్లాడతారు. ఎప్పుడో తప్ప వాళ్లు పోచికోలు కబుర్లతో కాలం వెళ్ళబుచ్చరు. ఆ దేశంలో దంపతుల మధ్య ప్రేమ చాలా గొప్పది. మగవాళ్లు స్త్రీలను హీనంగా చూడరు. ఏ విషయంలోనైనా తమతో సమానంగా చూస్తారు. హిందూ దేశ స్త్రీల కంటే ఇక్కడి స్త్రీలు మంచిస్థితిలో ఉన్నారు. మన దేశంలో పురుషులు స్త్రీలను బానిసల్లా చూస్తున్నారు. ► ఎర్ర సముద్రం అంతటా చిన్న చిన్న కొండలు, గుట్టలు తల పైకెత్తుకొని కనిపిస్తాయి. ఓడ ప్రయాణం చెయ్యక ముందు సముద్రంలో కొండలు, గుట్టలు ఉంటాయన్న వాస్తవం నాకు తెలియదు. పర్వతాలకు రెక్కలుండి ఎగిరే కాలంలో అవి ఊళ్ల మీద పడి నాశనం చేసేవి. ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు ఖండిస్తున్నపపుడు మైనాక పర్వతం సముద్రుణ్ణి శరణుగోరి సాగరగర్భంలో దాగిందన్న రామాయణ గాథ ఈ సందర్భంలో నా మనసులో మెదిలింది. ► మేం లండన్‌లో ఉన్నప్పుడు లార్డ్ బైరన్ రాసిన నాటకం మాన్‌ఫ్రెడ్‌ను ప్రదర్శించారు. నాటకం సాగుతున్నప్పుడు తరచూ సందర్భానికి అనువుగా నేపథ్య దృశ్యాలను మార్చేవాళ్లు. ఆ దృశ్యాలు చాలా సహజంగా ఉండేవి. ► ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఏ ఒడిదొడుకులూ లేకుండా మమ్మల్ని క్షేమంగా వెనక్కి చేర్చిన దైవానికి కృతజ్ఞతలు చెప్పుకొన్నాం. ఈ ప్రయాణాన్ని ఎంతో ఇష్టపడ్డాను. పర్యటనలో ఎన్నో నేర్చుకున్నాను. నేను సంపాదించుకున్న జ్ఞానంతో, ఎరుకతో మరొకసారి అవకాశం లభిస్తే ఆ అద్భుతమైన పశ్చిమ దేశాలకు వెళ్లి అవి కళల్లో, శాస్త్ర విజ్ఞానంలో, పారిశ్రామిక ఉత్పత్తుల్లో సాధించిన విశేష ప్రగతిని అర్థం చేసుకోవడానికి అవసరమైన ఆత్మస్థయిర్యం నాకు చేకూరింది. -
బ్రిటిషర్లతో పోరాడిన తొలి భారతీయ రాణి: ఖడ్గధారి భరతనారి
భారత్‌లో వ్యాపార నిమిత్తం అడుగుపెట్టిన పరాయి దేశస్థులు దక్షిణ భారతంలో మొదట పట్టు సాధించారు. ఈ క్రమంలో వీరి పోకడలను వ్యతిరేకిస్తూ పలువురు విముక్తి పోరాటాలు చేశారు. అయితే భారతీయులంతా సంఘటితంగా తొలిసారి పోరాడింది 1857 తొలి స్వాతంత్య్ర సంగ్రామం లోనే! ఈ తొలి సంగ్రామం కన్నా ముందు నుంచే వేర్వేరు ప్రాంతాల్లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సామాన్యుల నుంచి మహారాజుల వరకు తమకు సాధ్యమైన రీతిలో స్వేచ్ఛ కోసం పోరాడారు. అలా తమిళనాట బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా 1780 ల్లోనే మహారాణి వేలునాచియార్ వీర పోరాటం చేశారు. క్రూరమైన ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన తొలి భారతీయ రాణిగా వేలు నాచియార్ ఖ్యాతిగాంచారు. ఆమె వీరత్వానికి, సాహసానికి గుర్తుగా తమిళులు ఆమెను వీరమంగై (వీరవనిత) అని కీర్తించారు. ఆర్కాట్ నవాబు మోసం తమిళనాడులోని రామ్నాడ్ రాజ్యానికి చెందిన రాణి సకందిముతల్‌కు, చెల్లముత్తు విజయరఘునాథ సేతుపతి మహారాజుకు 1730లో రాణి వేలు నాచియార్ జన్మించారు. మగ సంతతి లేకపోవడంతో నాచియార్‌ను రాజుగారు మగపిల్లాడిలా పెంచారు. ఆమెకు అన్నిరకాల విద్యలతో పాటు ఖడ్గయుద్ధ రీతులను, దండాయుధ పోరాట విధానాలను నేర్పారు. వీటితో పాటు భారతీయ రణవిద్యలైన వలరి, సిలంబం వంటివాటిలో నాచియార్ నైపుణ్యం సాధించారు. విలువిద్యలో, అశ్వవిద్యలో ఆమెకు సాటిలేరు. రాణిగా రాణించాలంటే కేవలం స్థానిక భాషపై పట్టు ఉంటే సరిపోదని భావించిన రాజుగారు తన కూతురుకు ఉర్దూ, ఫ్రెంచ్, ఇంగ్లీష్ నేర్పించారు. 1746లో నాచియార్‌కు శివగంగ సంస్థానాధిపతి రాజా ముత్తువదుగనతపెరియ ఉదయతేవర్‌తో వివాహమైంది. వీరికి ఒక కూతురు జన్మించింది. అయితే నాచియార్ వైవాహిక జీవితం మూణ్నాళ్ల ముచ్చటైంది. అప్పటి ఆర్కాట్ నవాబు బ్రిటిషర్లతో చేతులు కలిపి స్వదేశీ సంస్థానాలపై విరుచుకు పడ్డాడు. శివగంగ సంస్థానంపై నవాబు భారీగా పన్నులు విధించి వసూలు చేయడానికి ఈస్టిండియా కంపెనీ అధికారులను పంపాడు. అయితే రాజా ఉదయ్‌తేవర్ ఈ పన్నులను వ్యతిరేకించారు. 1772 యుద్ధంలో బ్రిటిషర్లు, ఆర్కాట్ నవాబు కలిసి అతడిని హతమార్చారు. దీంతో కూతురు వెలాచ్చితో కలిసి నాచియార్ విరుపాచ్చికి చెందిన పలయకారర్ గోపాల నాయకర్ వద్ద ఎనిమిదేళ్లు ఆశ్రయం పొందారు. నాచియార్, ఆమె దండనాయకులను గోపాల్ ఎంతగానో ఆదరించాడు. ఈ సమయంలో తిరిగి సంస్థానం స్వాధీనం చేసుకోవడం గురించి రాణి నిరంతరం ఆలోచిస్తూ ఉండేవారు. తొలి సూసైడ్ బాంబర్ 1780లో ఆమెకు కాలం కలిసివచ్చింది. ఆర్కాట్ నవాబుకు వ్యతిరేకంగా హైదర్ఆలీ యుద్ధం ప్రకటించాడు. ఇదే అదనుగా శివగంగను స్వాధీనం చేసుకునేందుకు నాచియార్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆమెతో పాటు అనేకమంది మహిళా సైనికులు స్థానిక రాజరాజేశ్వరి ఆలయానికి విజయదశమి సందర్భంగా చేరుకున్నారు. అంతా పండుగ వేడుకల్లో ఉన్నప్పుడు రాణి ఒక్కమారుగా బ్రిటిషర్లపైకి దాడికి దిగారు. అయితే ఎంత వ్యూహాత్మకంగా ముందుకు కదిలినా.. బ్రిటిషర్ల ఆయుధ సంపత్తి అపారంగా ఉండడంతో రాణికి పోరాటం కష్టంగా మారింది. ఇదే సమయంలో రాణి మహిళా దళపతి కుయిలి మహా సాహసానికి ఒడిగట్టింది. ఒంటి నిండా చమురు పోసుకొని ఆయుధగారం వద్దకు చేరుకున్న కుయిలీ తనను తాను కాల్చుకుంది. దీంతో భారీ విస్ఫోటనంతో ఆయుధాలన్నీ ధ్వంసమయ్యాయి. ఇలా చరిత్రలో తొలి సూసైడ్ బాంబర్‌గా కుయిలీ నిలిచింది. అంతకుముందు కూడా రాణి నాచియార్‌ను కుయిలీ పలుమార్లు కాపాడింది. కుయిలీని తన దత్తపుత్రికగా నాచియార్ పేర్కొనేవారు. అనంతర కాలంలో ‘ఉడైయాల్‘ అనే స్త్రీసేనను పోరాటంలో మరణించిన తన దత్తపుత్రిక పేరుతో స్థాపించారు నాచియార్. హైదర్ఆలీతో రాణి చేతులు కలిపిన సంగతి గ్రహించిన ఆర్కాట్ నవాబు చివరకు చేసేది లేక ఆమెకే శివగంగ సంస్థానాన్ని అప్పగించారు. ఈ నేపథ్యంలో మరుదు సోదరులు, కూతురుతో కలిసి ఆమె శివగంగ ఆస్థానానికి తిరిగి వచ్చారు. వెల్లై మరుదును సేనాధిపతిగా, చిన్న మరుదును మంత్రిగా నియమించుకొని పాలన సాగించారు. తన ధైర్యసాహసాలతో వీరవనిత అనే నామాన్ని సార్ధకపరచుకొన్నారు నాచియార్. యుద్ధానంతరం క్రమంగా ఆమె మురుదు సోదరులకు పరిపాలనాధికారం అప్పగించారు. 1796లో నాచియార్ మరణించారు. ఆమె సాహసానికి గుర్తుగా నాచియార్‌ను ‘జోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియా‘ అని కీర్తిస్తారు. – దుగ్గరాజు శాయి ప్రమోద్ (చదవండి: మార్గరెట్ బూర్కి–వైట్: తను లేరు, తనిచ్చిన లైఫ్ ఉంది) -
ప్రియాంక చోప్రా అరుదైన ఘనత.. తొలి భారతీయ నటిగా
Priyanka Chopra Feature Across Over 30 International Magazine Covers: గ్లోబల్ స్టార్ ప్రియాంక వరల్డ్‌వైడ్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న ప్రియాంక హాలీవుడ్లో అడుగు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక అప్పటినుంచి భారతదేశం పేరును మరింత ఎత్తుకి తీసుకెళ్లింది. తాను ఎక్కడికి వెళ్లినా తనతోపాటే ఇండియా ఉంటుందని ప్రియాంక చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లిన తన అస్థిత్వాన్ని, గుర్తింపును ఎవరూ తక్కువ చేయకుండా ఉన్నతంగా ఎదుగుతూవస్తోంది. తాజాగా ప్రియాంక అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటివరకూ ఆమె ముఖ చిత్రాన్ని 30కిపైగా అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్ ఫొటోలపై ప్రచురించారు. ఇలా గ్లోబల్ మ్యాగజైన్ కవర్లలో ఇన్నిసార్లు కనిపించిన తొలి భారతీయ నటిగా ప్రియాంక (Priyanka Chopra Becomes The First Indian Actor) గుర్తింపు పొందింది. ఇటీవల వానిటీ ఫెయిర్ అనే అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్‌పై దేశీ బ్యూటీ ఫొటోను పబ్లిష్ చేశారు. 'హాలీవుడ్‌ను షేక్ చేస్తున్న గ్లోబల్ స్టార్, స్టీరియోటైప్‌లను బద్దలు కొట్టడంతోపాటు నిక్ జోనాస్‌తో కలిసి స్థిరపడింది.' అనే శీర్షికతో వానిటీ ఫెయిర్ కవర్ పేజీపై ప్రియాంక ఫొటోను ప్రింట్ చేశారు. ఇలా సంవత్సరాలుగా అనేక గ్లోబల్ మ్యాగజైన్ల కవర్ ఫొటోలపై తళుక్కుమన్న ప్రియాంక భౌగోళిక సరిహద్దులు దాటి అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. దీంతో గ్లోబల్ స్టార్ నుంచి ఇంటర్నేషనల్ స్టార్‌గా ప్రియాంక పేరు గడించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదనిపిస్తోంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) ఇదీ చదవండి: ప్రియాంక చోప్రా: ఇండియాను నా నుంచి విడదీయలేరు.. ఎందుకంటే -
చరిత్ర సృష్టించిన పశ్చిమ గోదావరి జాహ్నవి.. స్పేస్ కావాలి!
ఓ పాపాయి నేను డాక్టర్ని అవుతాను... అంటే! మన దగ్గర కావలసినన్ని కాలేజీలున్నాయి. మరో పాపాయి ‘ఇంజినీరింగ్ ఇష్టం’ అంటే... లెక్కకు మించిన విద్యాసంస్థలున్నాయి. ‘నేను ఆస్ట్రోనాట్ అవుతాను’ అంటే... ఎలా చదవాలో చెప్పేవాళ్లే లేరు. ‘స్పేస్ ఎడ్యుకేషన్’కి తగిన స్పేస్ మన దగ్గర లేదు. ఒక కల్పనాచావ్లా... మరో సునీతా విలియమ్స్ గురించి చెప్పుకుని సంతోషపడుతున్నాం ఇప్పటికీ. భారత సంతతికి చెందిన వారని సంతృప్తిపడుతున్నాం. మనదేశం నుంచి తొలిసారిగా ఒక అమ్మాయి ముందుకొచ్చింది. ‘నేను అంతరిక్షంలో అడుగుపెడతాను’ అంటున్న... ఈ తెలుగమ్మాయి పేరు జాహ్నవి దంగేటి. ‘చందమామ రావే’ అంటూ సాగిన బాల్యం. ‘అంతరిక్షంలో విహరిస్తా’ అంటూ రెక్కలు విచ్చుకున్నది. జాహ్నవి దంగేటిది పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు. బీటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది. యూఎస్‌కు చెందిన నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు భారతదేశం నుంచి పార్టిసిపేషన్ లేని ప్రోగ్రామ్‌లో ఆమె పాల్గొన్నది. జాహ్నవి రికార్డు ఒక్క భారతదేశానికే కాదు ఆసియా ఖండానికి కూడా రికార్టే. రాకెట్ నడిపింది! జాహ్నవి గత నవంబర్ పన్నెండున యూఎస్‌కి వెళ్లి, అక్కడి అలబామాలోని నాసాకు చెందిన ‘స్పేస్ అండ్ రాకెట్ సైన్స్ సెంటర్’లో ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్‌లో శిక్షణ పూర్తి చేసుకుని 22వ తేదీన తిరిగి వచ్చింది. పదిరోజుల్లో ఆమె జీరో గ్రావిటీ, మల్టీ యాక్సెస్ ట్రైనింగ్, అండర్‌వాటర్ రాకెట్ లాంచ్ చేయడంతోపాటు ఎయిర్ క్రాఫ్ట్‌ను నడపడం కూడా నేర్చుకుంది. జాహ్నవి మిషన్ కంట్రోలర్‌కి ఫ్లైట్ డైరెక్టర్‌గా వేర్వేరు దేశాలకు చెందిన పదహారు మంది యువతతో కూడిన బృందానికి నేతృత్వం వహించింది. ‘సెస్నా 171 స్కైహాక్’ అనే చిన్న రాకెట్‌ను విజయవంతంగా లాంచ్ చేసింది. ‘భూమి మీద నుంచి గాల్లోకి ఫ్లై అవడం, దాదాపు అరగంట సేపు ఆకాశంలో విహరించడం, తిరిగి జాగ్రత్తగా ల్యాండ్ చేయడం’ మరిచిపోలేని అనుభూతి అన్నది ఈ అమ్మాయి. ‘ఆస్ట్రోనాట్‌గా పూర్తి స్థాయి శిక్షణ తీసుకోవాలనే కోరిక బలపడడంతోపాటు ఆస్ట్రోనాట్ కాగలననే నమ్మకం కూడా కలిగింది. పైలట్ ఆస్ట్రోనాట్ అయి తీరుతాను’ అని చెప్పింది. అమ్మమ్మ పెంపకం! జాహ్నవి అమ్మానాన్నలు ఉద్యోగరీత్యా కువైట్‌లో ఉండడంతో ఆమె అమ్మమ్మ లీలావతి దగ్గరే పెరిగింది. అమ్మమ్మ చందమామ కబుర్లు చెబుతూ పెంచింది. అలా ఆకాశంలో విహరించాలనే కోరికకు బీజం పడింది. అమ్మాయిలకు స్వీయరక్షణ సామర్థ్యం ఉండాలని జాహ్నవి తండ్రి ఆలోచన ఆమెను ఐదవ తరగతిలో కరాటే క్లాసులో చేర్చింది. అందులో నేషనల్, ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించింది. అంతరిక్షం కల మాత్రం ఆమెను వెంటాడుతూనే వచ్చింది. అందుకు ఉపకరించే స్కిల్స్ కోసం అన్వేషణ ఆమె మదిలో సాగుతూనే ఉండేది. స్విమ్మింగ్, స్కూబా డైవింగ్‌లో కూడా తర్ఫీదు పొందింది. వివక్ష తప్పలేదు... కానీ! ఆడపిల్లలు డైనమిక్‌గా ఉంటే సమాజం ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటుంది. తీర్పులు ఇస్తూనే ఉంటుంది. వద్దన్నా వినకుండా సలహాలు ఇస్తూనే ఉంటుంది. ఇవన్నీ తనకూ తప్పలేదని చెప్పింది జాహ్నవి. ‘‘పాలకొల్లు వంటి చిన్న పట్టణంలో చాలామందికి నేను చేస్తున్నవన్నీ విచిత్రాలుగానే తోచాయి. మెడిసినో, కంప్యూటర్ ఇంజనీరింగో చేసి ఉద్యోగం చూసుకోకుండా ఇవెందుకు? అన్నారు. ఇంతడబ్బు ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బు కట్నంగా ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు కదా! అని కూడా అన్నారు. ఇవన్నీ వాళ్లకు ‘స్పేస్’ మీద అవగాహన లేకపోవడం వల్ల అన్న మాటలే. అందుకే ప్రతి పట్టణంలోనూ స్పేస్ మ్యూజియం కానీ అంతరిక్ష పరిజ్ఞానానికి సంబంధించిన యాక్టివిటీ సెంటర్ కానీ పెడితే బావుంటుంది. అమ్మాయిలను రొటీన్ కోర్సులకు పరిమితం చేయకుండా వాళ్లకు ఇష్టమైన కోర్సుల్లోకి వెళ్లడానికి ప్రోత్సహించమని పెద్దవాళ్లను కోరుకుంటున్నాను. మా క్లాసులో 33 మంది అబ్బాయిలుంటే నేను మాత్రమే అమ్మాయిని. ఈ విషయంలో మా అమ్మానాన్నలు గ్రేట్ అని అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది’’ అని చెప్పింది జాహ్నవి. అంతరిక్షమే హద్దు! ‘‘స్కూబా డైవింగ్ అని చెప్తే ఇంట్లో వాళ్లు పంపించరేమోనని స్విమ్మింగ్ అని చెప్పి వైజాగ్‌కు వెళ్లాను. ఆ తర్వాత గోవాకు వెళ్లి ట్రైనింగ్ సెషన్స్‌లో పాల్గొని లైసెన్స్ తీసుకున్నాను. అండమాన్‌లో స్కూబా డైవింగ్‌లో అడ్వాన్స్డ్ కోర్సు పూర్తి చేశాను. అంతరిక్షంలో జీరో గ్రావిటీలోనే ఉండాలి. నీటి అడుగున కూడా గ్రావిటీ ఉండదు. ఆ ఎక్స్‌పీరియెన్స్ కోసమే స్కూబా డైవింగ్ కోసం అంత పట్టుపట్టాను. ఈ మధ్యలో ఓసారి నా ఆలోచనలు ఏవియేషన్ పైలట్ వైపు మళ్లాయి. కానీ నాన్న ‘నీ లక్ష్యం అంతకంటే పెద్దది, దాని మీద నుంచి దృష్టి మరల్చవద్దు’ అన్నారు. ఇక అంతరిక్షం అనే కల నాతోపాటు పెరిగి నాలో స్థిరపడిపోయింది. ఇంజినీరింగ్‌కి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీని ఎంచుకోవడంలో ఉద్దేశం కూడా అంతరిక్షం కలను సాకారం చేసుకోవడానికే. ఇప్పటికే ఆన్లైన్లో నాసా నిర్వహించిన ఐదు ప్రోగ్రామ్‌లలో పాల్గొన్నాను. గత ఏడాది ‘పీపుల్స్ చాయిస్’ అవార్డు కూడా వచ్చింది. అయితే ఇప్పటి వరకు నాసా నుంచి నేను సాధించిన అన్నింటిలో ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్. నేను ఇవన్నీ చేస్తున్న సమయంలోనే ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ నుంచి ఫోన్ వచ్చింది. ఆగస్టులో ఆ పురస్కారం అందుకున్నాను. నేనేం సాధించినా ప్రశంసలు దక్కాల్సింది మా అమ్మమ్మకే’’ అన్నది జాహ్నవి అమ్మమ్మను అల్లుకుంటూ... ‘నాసా’ సెంటర్లో, అమ్మమ్మ లీలావతితో జాహ్నవి. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: రియాజ్, ఏలూరు -
తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన సజ్జన్ జిందాల్..!
వరల్డ్ స్టీల్ అసోసియేషన్(డబ్ల్యూఎస్‌ఏ) ఛైర్మన్‌గా జేఎస్‌డబ్ల్యూ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్‌ను ఎన్నుకున్నారు. ప్రతిష్ఠాత్మక వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ఛైర్మన్‌గా నియమితులైన తొలి భారతీయుడిగా సజ్జన్ జిందాల్ నిలిచారు. సజ్జన్ ఒక ఏడాదిపాటు ఈ సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ వైస్ఛైర్మన్లుగా హెచ్‌బీఐఎస్ గ్రూప్‌కు చెందిన యూ యాంగ్, పోస్కో జియాంగ్ వూ చోయ్ సెలక్ట్ అయ్యారు. చదవండి: అరేవాహ్...! జాతీయ రికార్డును కొల్లగొట్టిన మహీంద్రా ఎక్స్‌యూవీ..! ఎగ్జిక్యూటివ్ కమిటీలో భాగంగా టాటా స్టీల్ సీఈఓ టీవీ నరేంద్రన్, ఆర్సెలార్ మిట్టల్ చీఫ్ ఎల్ఎన్ మిట్టల్ ఎంపికైనారు. ఈ సంస్థకు ట్రెజరరీగా బ్లూస్కోప్ స్టీల్‌కు చెందిన మార్క్ వాసెల్లా, ఇంటర్నేషనల్ స్టెయిన్లెస్ స్టీల్ ఫోరమ్ ఛైర్మన్‌గా టియోటియో డి మాలో (అపెరామ్) ఎన్నికయ్యారు. అంతేకాకుండా బోర్డు సభ్యులు 16 మందితో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీని నియామకం కూడా జరిగింది. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ సభ్యుల పదవి కాలం ఒక సంవత్సరం పాటు కొనసాగనుంది. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ఉక్కు పరిశ్రమకు కేంద్ర బిందువుగా పనిచేస్తోంది. స్టీల్‌రంగంలో ప్రభావితం చేసే అన్ని ప్రధాన వ్యూహాత్మక సమస్యలపై పరిష్కారాలను డబ్ల్యూఎస్‌ఏ చూపిస్తోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా స్టీల్ ధరలను నియంత్రిస్తోంది. దీనిని 1967లో స్థాపించారు. ఈ సంస్థలో ఉన్న సభ్యులు ప్రపంచవ్యాప్తంగా సుమారు 85 శాతం ఉక్కును ఉత్పత్తి చేస్తున్నారు. చదవండి: పేరు వాడితే...! రూ. 7500 కోట్లు కట్టాల్సిందే...! -
Anshu Malik: తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా అన్షు కొత్త రికార్డు!
ఓస్లో (నార్వే): టోక్యో ఒలింపిక్స్‌లో నిరాశ పరిచినా... ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ రెజ్లర్ అన్షు మలిక్ అదరగొట్టింది. గతంలో ఏ భారతీయ మహిళా రెజ్లర్‌కు సాధ్యంకాని ఘనతను 20 ఏళ్ల అన్షు సాధించింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా అన్షు రికార్డు నెలకొల్పింది. 57 కేజీల విభాగంలో అన్షు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో అన్షు 11–0 పాయింట్లతో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో సొలోమియా వినిక్ (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. 3 నిమిషాల 53 సెకన్లలో అన్షు విజయం ఖాయమైంది. ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతి అంటే ప్రత్యర్థిపై కనీసం 10 పాయింట్ల ఆధిక్యం సంపాదించిన వెంటనే బౌట్‌ను ముగించి ఈ ఆధిక్యం సాధించిన రెజ్లర్‌ను విజేతగా ప్రకటిస్తారు. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో అన్షు 5–1తో దావాచిమెగ్ ఎర్కెమ్బాయర్ (మంగోలియా)పై, తొలి రౌండ్లో 4 నిమిషాల 5 సెకన్లలో 15–5 పాయింట్లతో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో నీలూఫర్ రైమోవా (కజకిస్తాన్)పై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్, 2020 టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత హెలెన్ లూయిస్ మరూలిస్ (అమెరికా)తో అన్షు తలపడుతుంది. ప్రపంచ చాంపియన్‌ను ఓడించి... మరోవైపు 59 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సరితా మోర్ కాంస్య పతకం కోసం పోటీపడనుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో సరితా మోర్ 0–3 పాయింట్ల తేడాతో యూరోపియన్ చాంపియన్ నిలిచిన బిల్యానా జికోవా డుడోవా (బల్గేరియా) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు ప్రిక్వార్టర్ ఫైనల్లో సరితా 8–4తో ప్రపంచ చాంపియన్ లిండా మొరైస్ (కెనడా)పై సంచలన విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో సరితా 3–1తో సాండ్రా (జర్మనీ)పై గెలిచింది. ఇనెటా (లిథువేనియా), సారా జోనా లిండ్‌బోర్గ్ (స్వీడన్) మధ్య బౌట్ విజేతతో నేడు జరిగే కాంస్య పతక పోరులో సరితా మోర్ తలపడుతుంది. 72 కేజీల విభాగంలో దివ్యా కక్రాన్ కాంస్య పతకం రేసులో నిలిచింది. దివ్య క్వార్టర్ ఫైనల్లో 0–10తో మసాకో ఫురూచి (జపాన్) చేతిలో ఓడిపోయింది. అయితే మసాకో ఫైనల్ చేరడంతో దివ్యా ‘రెపిచాజ్’ రౌండ్లో నేడు దావానసన్ (మంగోలియా)తో ఆడుతుంది. ఈ బౌట్లో దివ్య గెలిస్తే కాంస్య పతకం కోసం అనా కార్మెన్ షెల్ (జర్మనీ)తో పోటీపడుతుంది. ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం ఖాయం చేసుకున్న ఆరో భారతీయ మహిళా రెజ్లర్ అన్షు మలిక్. గతంలో అల్కా తోమర్ (2006లో; 59 కేజీలు), బబితా ఫొగాట్ (2012లో; 51 కేజీలు), గీతా ఫొగాట్ (2012లో; 55 కేజీలు), పూజా ధాండా (2018లో; 57 కేజీలు), వినేశ్ ఫొగాట్ (2019లో; 53 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. కిరణ్‌కు నిరాశ మహిళల 76 కేజీల విభాగంలో భారత్‌కు త్రుటిలో కాంస్య పతకం చేజారింది. కాంస్య పతక బౌట్లో భారత రెజ్లర్ కిరణ్ 1–2తో సమర్ హంజా (ఈజిప్‌్ట) చేతిలో ఓడిపోయింది. ఈ టోరీ్నలో భారత్‌కు నాలుగోసారి కాంస్య పతకం చేజారింది. పురుషుల ఫ్రీస్టయిల్లో రవీందర్ (61 కేజీలు), రోహిత్ (65 కేజీలు), మహిళల విభాగంలో పింకీ (55 కేజీలు) కూడా కాంస్య పతక బౌట్లలో ఓడిపోయారు. -
అర్పిందర్‌కు కాంస్యం
ఒస్ట్రావా (చెక్ రిపబ్లిక్): అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్యల సంఘం (ఐఏఏఎఫ్) కాంటినెంటల్ కప్‌లో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా అర్పిందర్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్‌లో అర్పిందర్ 16.59 మీటర్ల దూరం దూకి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా ఈటెను 80.24 మీటర్లు విసిరి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
దూసుకొచ్చిన ఆర్ఐఎల్
సాక్షి, ముంబై: ఒకవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస రికార్డు గరిష్టాలతో దూసుకుపోతోంది. మరోవైపు కొర్పొరేట్ దిగ్గజం, ముకేశ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనతను సాధించింది. మార్కెట్‌క్యాప్‌లో 8లక్షలకోట్లనుదాటి ఆకర్షణీయంగా నిలిచింది. దేశంలో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా నిలిచింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఆర్ఐఎల్ షేరు 1.28శాతం పుంజుకుని 52వారాల గరిష్టాన్ని టచ్ చేసింది. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలేజేషన్ 8,00,128 కోట్ల రూపాయలను అధిగమించింది. ఈ క్రమంలో ఈ రేసులో ముందున్న టెక్ దిగ్గజం టీసీఎస్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ కంపెనీగా నిలిచింది. . టీసీఎస్ మార్కెట్ క్యాప్ విలువ రూ. 7,77,870కోట్లుగా ఉంది.