ప్రియాంక చోప్రా అరుదైన ఘనత.. తొలి భారతీయ నటిగా | Priyanka Chopra Becomes The First Indian Actor See Why | Sakshi
Sakshi News home page

Priyanka Chopra: ప్రియాంక చోప్రా అరుదైన ఘనత.. 30కిపైగా

Published Mon, Jan 17 2022 7:45 PM | Last Updated on Mon, Jan 17 2022 7:58 PM

Priyanka Chopra Becomes The First Indian Actor See Why - Sakshi

Priyanka Chopra Feature Across Over 30 International Magazine Covers: గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక వరల్డ్‌వైడ్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న ప్రియాంక హాలీవుడ్‌లో అడుగు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక అ‍ప్పటినుంచి భారతదేశం పేరును మరింత ఎత్తుకి తీసుకెళ్లింది. తాను ఎక్కడికి వెళ్లినా తనతోపాటే ఇండియా ఉంటుందని ప్రియాంక చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లిన తన అస్థిత్వాన్ని, గుర్తింపును ఎవరూ తక్కువ చేయకుండా ఉన్నతంగా ఎదుగుతూవస్తోంది. తాజాగా ప్రియాంక అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటివరకూ ఆమె ముఖ చిత్రాన్ని 30కిపైగా అంతర్జాతీయ మ్యాగజైన్‌ కవర్‌ ఫొటోలపై ప్రచురించారు. 

ఇలా గ్లోబల్‌ మ్యాగజైన్ కవర్‌లలో ఇన్నిసార్లు కనిపించిన తొలి భారతీయ నటిగా ప్రియాంక (Priyanka Chopra Becomes The First Indian Actor) గుర్తింపు పొందింది. ఇటీవల వానిటీ ఫెయిర్ అనే అంతర్జాతీయ మ్యాగజైన్‌ కవర్‌పై దేశీ బ్యూటీ ఫొటోను పబ్లిష్‌ చేశారు. 'హాలీవుడ్‌ను షేక్‌ చేస్తున్న గ్లోబల్‌ స్టార్, స్టీరియోటైప్‌లను బద్దలు కొట్టడంతోపాటు నిక్‌ జోనాస్‌తో కలిసి స్థిరపడింది.' అనే శీర్షికతో వానిటీ ఫెయిర్ కవర్‌ పేజీపై ప్రియాంక ఫొటోను ప్రింట్‌ చేశారు. ఇలా సంవత్సరాలుగా అనేక గ్లోబల్‌ మ్యాగజైన్‌ల కవర్‌ ఫొటోలపై తళుక్కుమన్న ప్రియాంక భౌగోళిక సరిహద్దులు దాటి అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. దీంతో గ్లోబల్‌ స్టార్‌ నుంచి ఇంటర్నేషనల్‌ స్టార్‌గా ప్రియాంక పేరు గడించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదనిపిస్తోంది. 


 


ఇదీ చదవండి:  ప్రియాంక చోప్రా: ఇండియాను నా నుంచి విడదీయలేరు.. ఎందుకంటే  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement