
‘శ్రీ’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన తమన్నా భాటియా ఆ తరువాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ‘మిల్కీ బ్యూటీ’గా పేరు గాంచింది. ‘100 పర్సంట్ లవ్’ సినిమాలో వీర వెంకట సత్య సాయి నాగ దుర్గ శేష అవతార సీతా మహాలక్ష్మి’ పాత్రతో ఫస్ట్ క్లాస్ మార్కులు కొట్టేసింది. తాజాగా మన మహాలక్ష్మి సరికొత్త రికార్డ్ సృష్టించింది.
జపాన్‌కు చెందిన ప్రసిద్ధ బ్యూటీ అండ్ కాస్మెటిక్స్ మల్టీ నేషనల్ కంపెనీ ‘షిసైడో’కు ఫస్ట్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్‌గా అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఈ ఘనత గురించి తమన్నాను ఆకాశానికి ఎత్తుతూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ‘అందంతో పాటు ఆత్మవిశ్వాసం ఉండాలి’ అంటుంది తమన్నా. ఆమె విజయపరంపరకు ఇదే ప్రధాన కారణం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా.