
ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోలు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నారు.

కోటి రూపాయలు అంటేనే చాలా పెద్ద అమౌంట్ అని భావించే రోజుల్లో ఓ స్టార్ హీరో మొదటిసారి ఆ రెమ్యునరేషన్ తీసుకుని ఇండియాలోనే చరిత్రకెక్కారు.

90 కాలంలో దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న వారి జాబితాలో చిరంజీవి మొదటి స్థానంలో నిలిచారు.

1992లో డైరెక్టర్ కే. విశ్వనాథ్ తెరకెక్కించిన 'ఆపద్బాంధవుడు' సినిమాకు చిరు తొలిసారి రూ. 1.25 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు.

'ఆపద్బాంధవుడు' సినిమా సమయంలోనే మెగాస్టార్ సత్తా ఏంటో బాలీవుడ్‌కు తెలిసింది.

ఆ సమయంలో బాలీవుడ్‌లో టాప్‌లో ఉన్న అమితాబ్ బచ్చన్ రూ. 70 లక్షలు మాత్రమే తీసుకునేవారట

చిరు తర్వాత ఈ జాబితాలో కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ ఉన్నారు.

1994లో ఒక సినిమాకు కమల్ ఆ రెమ్యునరేషన అందుకున్నారట. అయితే, అదే ఏడాదిలో రజనీకాంత్ కూడా ఆ లిస్ట్‌లో చేరిపోయారు.

1998 నుంచి 1999 సమయంలో అమితాబ్‌తో పాటు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా ఒక్కో సినిమాకు కోటి అందుకున్నారట.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమాకు రూ. 60 నుంచి 70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.