received
-
కోటి రెమ్యూనరేషన్ అందుకున్న ఇండియన్ తొలి హీరో ఎవరు.. ఏ సినిమాకు? (ఫోటోలు)
-
మరోమారు 30 విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు విమానయాన సంస్థల విమానాలకు తరచూ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి కూడా 30 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం రాత్రి ఇండియన్ ఎయిర్‌లైన్‌కు చెందిన 30 దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.ఇండిగో ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన నాలుగు విమానాలకు సోమవారం భద్రతా హెచ్చరికలు అందాయని తెలిపారు. ఈ జాబితాలో 6ఈ 164 (మంగుళూరు నుండి ముంబై), 6ఈ 75 (అహ్మదాబాద్ నుండి జెడ్డా), 6ఈ 67 (హైదరాబాద్ నుండి జెడ్డా), 6ఈ 118 (లక్నో నుండి పూణే) ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయా విమానాల్లోని ప్రయాణికులు సురక్షితంగా అక్కడి నుండి తరలించారు.ఇదేవిధంగా ఎయిర్ ఇండియా విమానాలకు కూడా బెదిరింపులు వచ్చినట్లు ఆ సంస్థ ప్రతినిధి ధృవీకరించారు. నిర్దేశించిన ప్రోటోకాల్‌ను అనుసరించి, సంబంధిత అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారని, భద్రతా సంస్థల మార్గదర్శకాల ప్రకారం అన్ని భద్రతా విధానాలను అమలు చేశామన్నారు.విస్తారా ప్రతినిధి మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన కొన్ని విమానాలకు సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయని చెప్పారు. వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తమయ్యారని, అన్ని భద్రతా విధానాలను అమలు చేశారన్నారు.గడచిన వారం రోజుల్లో 120కి పైగా భారతీయ విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే బాంబు బెదిరింపులను కేవలం వదంతులుగా తేలికగా తీసుకోలేమని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. కాగా విమానయాన సంస్థలకు వస్తున్న బాంబు బెదిరింపులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చట్టబద్ధమైన చర్యలకు ఉపక్రమిస్తోంది. నేరస్తులను నో-ఫ్లై జాబితాలో ఉంచే యోచనలో ఉందని సమాచారం. ఇది కూడా చదవండి: ఉద్యోగుల తొలగింపు అవాస్తవం: ఫోన్‌పే -
ఆస్పత్రిలో ఊర్వశి రౌతేలా.. లక్ష గులాబీలు పంపిన అభిమానులు (ఫోటోలు)
-
బాలీవుడ్ బాద్షాకు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డ్ సొంతం! (ఫొటోలు)
-
రూ.10 నాణెం చెల్లుతుంది
సాక్షి, అమరావతి: రూ.10 నాణెం చెల్లుబాటుపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి ముందుకు రావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఏపీఎస్‌ఆరీ్టసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలు పది రూపాయల నాణేలను స్వీకరించడం ద్వారా ప్రజలకు భరోసా కలి్పంచేలా తక్షణం పత్రికా ప్రకటన విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. బుధవారం విజయవాడలో 32వ స్టేట్ లెవెల్ సెక్యూర్టీ మీటింగ్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ కమల్ పి పట్నాయక్ మాట్లాడుతూ ప్రజల్లో నెలకొన్న అపోహల వల్ల రాష్ట్రంలో తీవ్రమైన చిల్లర కొరత నెలకొని ఉందన్నారు.ఇటువంటి పరిస్థితుల్లోనే కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రకటన విడుదల చేసిన తర్వాత రూ.10 నాణేల చెలామణి ఏడు రెట్లు పెరిగిందని చెప్పారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశానికి చైర్మన్‌గా వ్యవహరించిన రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ను కోరారు. ఇప్పటికే ఆర్బీఐ పలు ప్రకటనలు చేసినా వినియోగం ఆశించినంత పెరగలేదని, ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. రూ.10 నోట్లతో పోలిస్తే నాణేల జీవిత కాలం రెండు దశాబ్దాలుపైన ఉంటుందని తెలిపారు.రూ.10 నాణేలు చెల్లవనే ప్రచారం ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా ఉందని, హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ పరిధిలో రూ.22 కోట్ల విలువైన రూ.10 నాణేలు మింట్, కరెన్సీ చెస్ట్‌ల్లో మూలుగుతున్నాయన్నారు. ప్రస్తుతం దేశంలో 14 డిజైన్లలో పది రూపాయల నాణేలు చెలామణిలో ఉన్నాయని, ఇవన్నీ కూడా చెల్లుతాయని ఆర్బీఐ అధికారులు స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన విశ్వజిత్ ఆర్బీఐ లిఖిత పూర్వకంగా ఈ ప్రతిపాదనను పంపిస్తే తక్షణంచర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వంతో చర్చిస్తామని హామీనిచ్చారు.రూ.10 నాణేల చెలామణి పెంచే విధంగా బ్యాంకులు కూడా ప్రోత్సహించాలని ఆర్బీఐ కోరింది. అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు, డీమార్ట్, మోడరన్ సూపర్ బజార్, రైస్ మిల్లుల వ్యాపారులకు రూ.10 నాణేలను కమల్ పి పట్నాయక్, కుమార్ విశ్వజిత్ చేతుల మీదుగా అందజేశారు. -
బాండ్లతో బీజేపీకి రూ.6,986 కోట్లు
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లతో అధికార బీజేపీ అత్యధికంగా లబ్ధి పొందినట్లు వెల్లడయ్యింది. కమలం పార్టికి ఈ బాండ్ల ద్వారా ఏకంగా రూ.6,986.5 కోట్లు అందినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. ఎన్నికలబాండ్లపై పార్టిలు గత నవంబర్‌లో ఇచి్చన సమాచారాన్ని ఆదివారం తన వెబ్సైట్లో అందుబాటులోకి తెచి్చంది. పశి్చమ బెంగాల్లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.1,397 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.1,334 కోట్లు, భారత రాష్ట్ర సమితికి రూ.1,322 కోట్లు, బిజూ జనతాదళ్‌కు రూ.944.5 కోట్లు, డీఎంకేకు రూ.656.5 కోట్లు బాండ్ల రూపంలో అందినట్లు ఈసీ డేటాను బట్టి తెలుస్తోంది. బాండ్ల కొనుగోలుదార్లలో ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సరీ్వసెస్ సంస్థ అధినేత, లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ అగ్రస్థానంలో నిలిచాడు. రూ.1,368 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేశాడు. ఇందులో 37 శాతానికిపైగా, అంటే రూ.509 కోట్లను డీఎంకేకు అందజేశాడు. డీఎంకేకు మేఘా ఇంజనీరింగ్ రూ.105 కోట్లు, ఇండియా సిమెంట్స్ రూ.14 కోట్లు, సన్ టీవీ నెట్వర్క్ రూ.100 కోట్లు సమరి్పంచుకున్నాయి. అన్నాడీఎంకేకు ఇండియా సిమెంట్స్ యాజమాన్యంలోని ఐపీఎల్ టీం చెన్నై సూపర్ కింగ్స్; జేడీ(ఎస్)కు ఆదిత్య బిర్లా గ్రూప్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, మేఘా ఇంజనీరింగ్, ఎంబసీ గ్రూప్; ఆప్‌కు బజాజ్, కేఎంజెడ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎన్‌జేకే, బీజీ షిర్కే, టొరెంట్ ఫార్మా; జేడీ(యూ)కు భారతీ ఎయిర్టెల్, శ్రీ సిమెంట్స్; ఎన్సీపీకి నియోటియా ఫౌండేషన్, భారతీ ఎయిర్టెల్, సైరస్పూనావాలా, బజాజ్ ఫిన్సర్వ్, ఒబెరాయ్ రియాల్టీ తదితర సంస్థలు విరాళాలిచ్చాయి. బాండ్ల రూపంలో తమకు ఏయే సంస్థ/వ్యక్తుల నుంచి ఎంతెంత విరాళాలు వచ్చాయో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఈసీకి తెలియజేయలేదు. ఏడీఆర్ గణాంకాల ప్రకారం బీజేపీకి మొత్తం 7,700 కోట్ల విరాళాలు అందాయి. బాండ్ల ద్వారా తమకెలాంటి నిధులూ రాలేదని సీపీఎం, బీఎస్పీ, మజ్లిస్ ప్రకటించాయి. ఈసీ డేటా ప్రకారం బాండ్ల ద్వారా అత్యధిక నిధులు అందుకున్న పారీ్టలు పార్టీ నిధులు బీజేపీ రూ.6,986.5 కోట్లు టీఎంసీ రూ.1,397 కోట్లు కాంగ్రెస్ రూ.1,334 కోట్లు బీఆర్ఎస్ రూ.1,322 కోట్లు -
జనగామ బరిలో నేనే ఉంటా
జనగామ: తెలంగాణ ఆర్టీసీ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినా.. జనగామలో బీఆర్ఎస్ తరపున బరిలో తానే ఉంటానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడానికి కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి హైదరాబాద్ వెళ్లిన ముత్తిరెడ్డి.. కార్యక్రమం అనంతరం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యమని, ఆ మేరకే ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు. అంతకుముందు ఆయన హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్య త లు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి దేవుళ్ల చిత్రపటాల వద్ద పూజలు నిర్వహించిన అనంతరం ఫైల్‌పై తొలి సంతకం చేశారు. సీఎం కేసీఆర్ తనపై నమ్మకం ఉంచి అప్పగించిన ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంస్థ పురోగతికి కృషి చేస్తానన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఎండీగా ఉంటూ సంస్థను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నారని, తాను కూడా సంస్థ ఉద్యోగుల్లో ఒకడిగా వ్యవహరిస్తూ సంస్థ బాగుకు యత్నిస్తానని తెలిపారు. అనంతరం ఎండీ సజ్జనార్ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి అభినందించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
స్వీట్ పాప్‌కార్న్ అడిగితే చేదు కాకర.. స్విగ్గీ ఎందుకలా చేసిందంటే..
ఈ రోజుల్లో హోమ్ డెలివరీ సర్వీస్ అందిస్తున్న పలు ప్రైవేట్ కంపెనీలు క్రియేటివ్ క్యాంపెయిన్ చేస్తున్నాయి. ఇవి ఎంతో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇటువంటి కోవలోకే వచ్చే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు చెందిన ఒక పోస్టు అందరినీ ఆకర్షిస్తోంది. బెంగళూరుకు చెందిన ఒక మహిళకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి డెలివరీ అయిన వస్తువులలో తాను ఆర్డర్ చేయని ఒక వస్తువు రావడంతో ఆమె కంగుతింది. పౌషాలీ సాహు అనే మహిళకు ఆమె ఆర్డర్ చేసిన క్యారమెల్ పాప్‌కార్న్‌తో పాటు సదరు ఫుడ్ డెలివరీ యాప్ నుంచి ఒక కాకరరాయ వచ్చింది. కాకరకాయను ఆర్డర్ చేయకుండానే, దానిని పంపడంతో ఆమె ఆశ్చర్యపోయింది. దీనితో పాటు ఆమెకు ఒక పెద్ద నోట్ కూడా వచ్చింది. ఆమె స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది. ‘స్విగ్గీలో తాను ఆర్డర్ చేసిన కారమెల్ పాప్‌కార్న్ ప్యాకెట్‌తో పాటు ఒక కాకరకాయ వచ్చింది’ అని పేర్కొంది. దీనిని విచిత్రమైన ఫ్రెండ్షిప్ క్యాంపెయిన్‌గా స్విగ్గీ పేర్కొంది. సాహూ తన ట్విట్టర్ ఖాతాలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నోట్‌తోపాటు కాకరకాయ ఫొటోను కూడా షేర్ చేసింది. ఆ లెటర్లో ఒక కవితతో పాటు ఒక లైఫ్ లెసన్ కూడా ఉంది. ‘ఒక్కోసారి మనం వేటినైతే దూరం పెడుతుంటామో అవే మనకు అత్యంత అవసరమైనవి అవుతుంటాయి.. కాకర మాదిరిగా’ అని దానిలో రాసివుంది. అలాగే నిజమైన స్నేహితులు మనం చెడుదారిలో వెళ్లకుండా చూస్తారని, ఎప్పుడూ మన మంచినే కోరుకుంటారని, అయితే మంచి చేసే స్నేహితుల మాటలు ఒక్కోసారి చేదుగా ఉంటాయని’ దానిలో రాసివుంది. ‘ఈ ఫ్రెండ్షిప్ డే నాడు మీరు కాకరతో సంబరాలు జరుపుకోండి. ఎందుకంటే అలాంటివారే మంచి స్నేహితులు’ అని స్విగ్గీ పేర్కొంది. ఈ పోస్టును చూసిన యూజర్లు ఇది అద్భుతమైన క్యాంపెయిన్ అని పేర్కొంటున్నారు. ఒక యూజర్ ‘నిజమైన స్నేహితులెప్పుడూ చేదుగానే ఉంటారని’ వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: ‘నీకు పెళ్లయ్యింది.. నా హృదయం ముక్కలయ్యింది’.. షాకిస్తున్న ఎలక్ట్రీషియన్ లెటర్! The weirdest #FriendshipDay campaign ever! 😀 #Swiggy sent me a bitter gourd with the caramel popcorn packets I ordered yesterday.. pic.twitter.com/dc3I9Q1ItO — Paushali Sahu 🎶 (@PaushaliSahu) August 7, 2023 -
ఎన్సీపీలో కీలక మలుపు.. ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన అజిత్ పవార్
అజిత్ పవార్ తిరుగుబాటుతో ఎన్సీపీలో చీలిక వచ్చిన సంగతి తెలిసిందే. తదనంతరం పార్టీపై పట్టు సాధించడానికి అజిత్ పవర్ వర్గం, శరద్ పవార్ వర్గం తీవ్రంగా కృషి చేస్తున్నారు. పార్టీ నాదంటే.. నాదంటూ ఇరువర్గాలు పంతం కొనసాగిస్తున్నాయి. పార్టీ పేరు, గుర్తును సొంతం చేసుకోవడానికి పోరాడుతున్నారు. ఈ క్రమంలో అజిత్ పవార్ వర్గం ఎన్నికల కమిషన్(ఈసీఐ)ను ఆశ్రయించింది. పార్టీ పేరు, గుర్తు కేటాయింపుకు సంబంధించిన పిటీషన్‌ను ఈసీఐకి దాఖలు చేశారు. పార్టీ పేరు, గుర్తుపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎన్నికల కమిషన్ తన మాట కూడా వినాలని కోరుతూ ఇక శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇప్పటికే కేవియట్ దాఖలు చేసింది. తొమ్మిది మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలనే అంశంలోనూ ఈసీఐని శరద్ పవార్ వర్గం అభ్యర్థించింది. నేడు ఎన్సీపీలో ఇరువర్గాల బల ప్రదర్శన జరిగింది. ఇందులో అజిత్ పవార్ 30 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకోగా.. శరద్ పవార్ వెనక కేవలం 13 మంది మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి మొత్తం 53 ఎమ్మెల్యేల బలం ఉండగా.. తనకు 43 మంది శాసన సభ్యుల మద్దతు ఉందని అజిత్ పవార్ చెబుతున్నారు. అయితే అజిత్ వెనక ఉన్నది 13 మంది ఎమ్మెల్యేనంటున్న శరద్ పవార్ వర్గం ఆరోపిస్తుంది. ఇదీ చదవండి: Sharad Pawar Vs Ajit Pawar.. నేడు ఎమ్మెల్యేల బలపరీక్ష.. ఎవరిది పైచేయి! -
రూ. 2 వేల నోట్లు: ఆర్బీఐ కీలక ప్రకటన
అతిపెద్ద కరెన్సీ నోటు రూ.2,000 నోట్లను (మే 19న) ఉపసంహరించుకున్న తర్వాత రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా సోమవారం కీలక ప్రకటన చేసింది. జూన్ 30 నాటికి 76 శాతం వరకు పింక్ నోట్స్ బ్యాంకులకు అందాయని సోమవారం తెలిపింది. ఇప్పటివరకు తిరిగి వచ్చిన మొత్తం నోట్ల విలువ రూ. 2.72 లక్షల కోట్లని ఆర్బీఐ తెలిపింది. (స్టార్ క్రికెటర్ కోహ్లీ, ఫస్ట్ కారు ఏదో తెలుసా? దుమ్మురేపే లగ్జరీ కార్ల కలెక్షన్) మార్చి 31, 2023న రూ. 3.62 లక్షల కోట్లకు చలామణిలో ఉన్న రూ. 2,000 నోట్ల మొత్తం విలువ మే 19, 2023న వ్యాపారం ముగిసే సమయానికి రూ. 3.56 లక్షల కోట్లకు తగ్గింది. బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం మే 19న ప్రకటన తర్వాత 2023 జూన్ 30 వరకు చెలామణి నుండి తిరిగి పొందిన రూ. 2,000 నోట్ల మొత్తం విలువ రూ. 2.72 లక్షల కోట్లు. తత్ఫలితంగా, జూన్ 30న వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లు రూ.84,000గా ఉన్నాయనీ మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లలో 76శాతం తిరిగి వచ్చాయని ఆర్బిఐ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే చెలామణి నుండి తిరిగి వచ్చిన రూ. 2,000 మొత్తం నోట్లలో 87శాతం డిపాజిట్ల రూపంలో ఉండగా, మిగిలిన 13శాతం ఇతర డినామినేషన్ నోట్లలోకి మార్పిడి జరిగినట్టు ఆర్బీఐ వెల్లడించింది. సెప్టెంబర్ 30, 2023 నాటికి రెండు వేల నోట్ల మార్పిడికి ముగియనున్న సంగతి తెలిసిందే. కనుక ప్రజలు తమవద్ద ఉన్న రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయడానికి /లేదా మార్చుకోవడానికి వచ్చే మూడు నెలల సమయాన్ని ఉపయోగించుకోవాలని ఆర్బిఐ ఒక ప్రకటనలో తెలిపింది.(Tata Motors Price Hike: కొనుగోలుదారులకు టాటా మోటార్స్ షాక్!) కాగా చలామణీలో ఉన్న రూ. 500, 1000 నోట్ల రద్దు తరువాత నవంబర్ 2016లో రూ. 2 వేల నోటును తీసుకొచ్చిన సంగతి తె లిసిందే. అయితే 2018-19లో రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది. -
విజయవాడకు చేరుకున్న రైలు ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు
-
వినతీపత్రాలు స్వీకరిస్తున్న సీఎం వైఎస్ జగన్
-
గూగుల్ సీఈవో మరో రికార్డు
-
గూగుల్ సీఈవో మరో రికార్డు
హ్యూస్టన్: ప్రముఖ సెర్చి ఇంజీన్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (44 ) అందిన పరిహారం ఎంత పెరిగిందో తెలుసా? అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న అమెరికా టాప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్స్ లిస్ట్ లో చేరిన పిచాయ్ 200 మిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ సొంతం చేసుకొని మరోసారి రికార్డు సృష్టించారు. గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ సుందర్‌కు 200 మిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్ యూనిట్లను ఆయనకిచ్చింది. వీటి విలువ రూపాయల్లో సుమారు 12,855కోట్లకు చేరింది. 2015 స్టాక్ అవార్డు సుమారు 99.8 మిలియన్ డాలర్లకు ఇది రెట్టింపు. యూ ట్యూబ్ వ్యాపారంతోపాటు, ప్రధానమైన యాడ్స్ బిజినెస్‌ద్వారా గూగుల్ ఆదాయానికి మంచి బూస్ట్ఇచ్చినందుకుగాను పిచాయ్ కి ఈ భారీ కాంపన్సేషన్ లభించింది. అలాగే మెషీన లెర్నింగ్, హార్డ్ వేర్ , క్లౌడ్ కంప్యూటింగ్ పెట్టుబడుల ద్వారా ఈ గ్రోత్ సాధించారని సీఎన్ఎస్ నివేదించింది. అనేక విజయవంతమైన ప్రాజెక్టులను లాంచ్ చేసినందుకు సంస్థ పరిహార కమిటీ ఈ విలాసవంతమైన పరిహారం చెల్లించిందని తెలిపింది. భారత సంతతికి చెందిన పిచాయ్ 2015 నాటి వేతనంతో పోలిస్తే ఇది రెండింతలు పెరిగింది. అయితే 2015 లో 652,500 డాలర్లను ఆర్జించిన పిచాయ్, గత ఏడాది ఈ వేతనం కొంచెం క్షీణించి 650,000డాలర్లు (రూ.667 కోట్లు) వేతనాన్ని పొందారు అల్ఫాబెట్ స్టాక్ వాల్యూ ఈనెలలో భారీగా పుంజుకుంది. మొదటిసారి దీని మార్కెట్ క్యాప్ 600 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా 2004 సంవత్సరంలో గూగుల్‌లో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా కేరీర్‌ను ఆరంభించిన పిచాయ్ 2015 ఆగస్టులో సంస్థ పునఃనిర్మాణ సమయంలో సీఈవో పదవిని చేపట్టారు. 2016లో 199 మిలియన్ డాలర్ల స్టాక్ అవార్డును అందుకున్నారు. -
అధ్యాపకురాలికి పీహెచ్డీ ప్రదానం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) : జేఎ¯ŒSటీయూ ఇంజినీరింగ్ కళాశాల ఫిజిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ చట్టి సన్యాసలక్షి్మకి ఆంధ్రా యూనివర్సిటీ పీహెచ్డీ ప్రదానం చేసింది. ‘స్రక్చరల్, మేగ్నేటిక్ అండ్ ఎలక్ట్రికల్ ఇన్వెస్టగేష¯Œ్స ఆ¯ŒS ఆంటిమొనో అండ్ నియోబియయ్ డొపడ్నానోక్రిస్టలీ¯ŒS నికెల్ జింగ్ ఫెర్రైట్స్’ అంశంపై దశాబ్దకాలంగా చేసిన పరిశోధనలో ప్రతిపాదించిన అంశాలను వర్సిటీ ఆమోదించినట్టు ఆమె మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ వీసీ జి.నాగేశ్వరరావు చేతుల మీదుగా ఆమె పీహెచ్‌సీని అందుకున్నారు. వర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ పీఎస్ బంగారురాజు నేతృత్వంలో ఆమె ఈ పరిశోధన చేశారు. ఈ నూతన ఆవిష్కరణ వల్ల మెక్రో ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో మైక్రోవేవ్ డివైజర్స్, కంప్యూటరియా మెమరీ ఎలిమెంట్స్, వైద్యరంగంలో డీప్ బై¯ŒS స్టిమ్యులేష¯ŒS వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడుతుందన్నారు. మతిమరుపు లక్షణాల గుర్తింపు, సూచనలు, కేన్సర్ ట్రీట్మెంట్లో ఈ పరిశోధన దోహదపడుతుందని ఆమె వివరించారు. దశాబ్ది కాలంగా చేసిన కృషి ఫలించిందని, ఆమె భర్త, విశాఖ గాయత్రి ఇంజినీరింగ్ కళాశాల మేథమెటిక్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేవీఎస్ శర్మ తెలిపారు. -
శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : స్టాఫ్ సెలక్ష¯ŒS కమిష¯ŒS నిర్వహించనున్న కంబై¯ŒS్డ హైయర్ సెకండరీ లెవెల్–2016 పరీక్ష కోసం ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ ఇవ్వనుంది. దీనికి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థులు అర్హులు. దరఖాస్తులను పోస్టు ద్వారా లేదా నేరుగా రాజమహేంద్రవరం ఆరŠట్స్ కళాశాల సమీపంలోని బీసీ స్టడీ సర్కిల్లో అందచేయవచ్చు. దరఖాస్తునకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ మార్కుల జాబితాలు, టీసీ జతచేసి ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తులను అందచేయాలి. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 21 నుంచి శిక్షణ ఇస్తారు. వివరాలకు 0883 2421129ను సంప్రదించాలి. -
పౌరసరఫరాల శాఖకు ‘స్కోచ్’ అవార్డులు
హైదరాబాద్: అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో తెలంగాణ పౌర సరఫరాల శాఖ అమలు చేస్తున్న ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. సరుకులు దారి మళ్లకుండా చూసేందుకు, రైతులకు మద్దతు ధర అందించేందుకు ఈ శాఖ అమలు చేస్తున్న ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్), ఈ-పీడీఎస్, ఎస్సిఎమ్ (సప్లయ్ చైన్ మేనేజ్మెంట్), ఒపీఎంఎస్ (ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ), ఫిర్యాదుల పరిష్కారం వంటి అయిదు ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డులకు ఎంపికయ్యాయి. దేశ వ్యాప్తంగా ఈ అవార్డుకు ఎంపికైన వంద ప్రాజెక్టుల్లో ఈ అయిదు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. హెచ్ఐసీసీలో గురువారం జరిగిన 45వ జాతీయ స్కోచ్ సమ్మిట్‌లో ఈ అవార్డులను శాఖల తరపున జాయింట్ డెరైక్టర్ ఏసురత్నం స్వీకరించారు. సాంకేతికతతో అక్రమాలకు అడ్డుకట్ట ఈ-పాస్ విధానం గ్రేటర్ హైదరాబాద్‌లోని 1545 రేషన్ షాపుల్లో అమలవుతుండగా, సరుకుల్లో 30శాతం మిగులు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపులకు ప్రతినెలా పంపే సరుకుల వివరాలు నమోదు చేయడానికి ఈ-పీడీఎస్, సరుకులు పక్కదారి పట్టకుండా ఎంఎల్ఎస్ పాయింట్లు, గోదాములు, రేషన్ షాపులను ఎస్సీఎం ద్వారా ఆన్‌లైన్‌కు అనుసంధానించారు. ఒపిఎంఎస్ ద్వారా రైతులకు మద్దతు ధర అందించడమే కాకుండా, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే వారికి చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. పౌరసరఫరాల శాఖలో అక్రమాలకు సాంకేతికతతోనే అడ్డుకట్ట వేస్తామని కమిషనర్ సి.వి.ఆనంద్ తెలిపారు. దీని కోసం ఐటీని మరింతగా విస్తరిస్తామని చెప్పారు. ఈ అవార్డులు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ
పెద్దాపురం : నవోదయ విద్యాలయలో 2016–17 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ వి.మునిరామయ్య తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ అభ్యర్థులు వచ్చే నెల 16వ తేదీలోగా ఆయా మండల విద్యాశాఖాధికారులకు అందజేయాలన్నారు. దరఖాస్తు ఫారాలకు ఎటువంటి రుసుము లేదని, జిరాక్స్లో కూడా స్వీకరిస్తామన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించే పరిస్థితి లేదని, మండల విద్యాశాఖాధికారులు గమనించి గత ఏడాది కంటే ఈ ఏడాది 15 శాతం రిజిస్ట్రేషన్ పెరిగేలా సహరించాలన్నారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, బాలికలు తప్పని సరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముని రామయ్య తెలిపారు. -
పతంజలి ప్రకటనలపై 33 ఫిర్యాదులు
న్యూఢిల్లీ: యోగా గురు రామ్ దేవ్ పతంజలి ఉత్పత్తుల ప్రకటనలపై 30 ఫిర్యాదులు అందాయని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయమంత్రి మంత్రి రాజవర్దన్ రాథోడ్ లోక్ సభకు తెలిపారు. పతంజలి ఆయుర్వేదం లిమిటెడ్ ప్రకటనలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 2015 , జూలై 2016 మధ్య కాలానికి 30కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయని పార్లమెంట్ కు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలియజేసారు. దీంతో మొత్తం ఈ సంవత్సరానికి 33 కంప్లయిట్స్ నమోదయ్యాయన్నారు. కన్జూమర్ ఫిర్యాదుల కౌన్సిల్ (సీసీసీ) పరిశోధనలను ప్రకారం ప్రకటనల స్వీయ నియంత్రణపై ఈ ఫిర్యాదులందాయన్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ అందించిన సమాచారం ప్రకారం మొత్తం 21 ఫిర్యాదుల్లో , 17 అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఉల్లంఘించినట్టుగా పరిగణించినట్టు చెప్పారు. ఆరు ఉత్పత్తి ప్యాకేజింగ్ సమాచార ప్రకటనలు కూడా, అడ్వర్టైజింగ్ కంటెంట్ స్వీయ నియంత్రణ కోల్పోయినట్టుగా గుర్తించామనీ, ఏఎస్సీఐ కోడ్ ఉల్లంఘనగానే భావించినట్టు మంత్రి తెలిపారు. -
నాలాగే ఎందరో!
కనువిప్పు అమ్మాయిలు కనిపిస్తే చాలు కామెంట్ చేయడం అనే అలవాటు నాకు ఉండేది. కాలేజిలో నా ముందు నుంచి ఎవరైనా అమ్మాయి వెడితే చాలు... రకరకాల కామెంట్లు చేసేవాడిని. నేను కామెంట్ చేస్తుంటే ఫ్రెండ్స్ తెగ ఎంజాయ్ చేసేవాళ్లు. ఒకసారి ఒక అమ్మాయిని ఏడిపిస్తే చాలా పెద్ద గొడవ జరిగింది. ప్రిన్సిపాల్‌గారు పిలిచి నన్ను బాగా తిట్టారు. అయినా నాలో ఎలాంటి మార్పూ రాలేదు. ఎప్పుడూ ఎవరో ఒక అమ్మాయిని ఏదో రకంగా ఏడిపిస్తూనే ఉండేవాడిని. ఒకరోజు ప్రిన్సిపాల్‌గారు మా నాన్నను పిలిచి నా ప్రవర్తన గురించి పూసగుచ్చినట్లు చెప్పారు. ఇంకోసారి కంప్లైంట్ వస్తే కాలేజి నుంచి డిస్మిస్ చేస్తానని హెచ్చరించారు. ఆరోజు నాన్న కొట్టడం ఒక్కటే తక్కువ. ‘‘నా వయసులో ఎవరైనా ఇలాగే చేస్తారు. ఏదో సరదాగా చేస్తుంటాను. అంత సీరియస్ కావడం దేనికి?’’ అన్నాను నేను. ‘‘నిన్ను ఆ దేవుడు కూడా మార్చలేడు’’ అని తిడుతూ బయటికి వెళ్లారు నాన్న. దేవుడు మార్చలేదుగానీ...ఒక సంఘటన నన్ను పూర్తిగా మార్చేసింది. మా చెల్లిని ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి తీసుకెళ్లమని అమ్మ చెబితే తీసుకెళ్లాను. వెనక నుంచి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘‘ఏం ఫిగర్ గురూ!’’ ‘‘కాస్త లావుగా ఉందిగానీ..’’ కోపంతో వెనక్కి తిరిగి చూశాను. పెద్ద గుంపు ఉంది. కండలు తిరిగి దృఢంగా ఉన్నారు. వాళ్లతో గొడవ పడితే ఎముకల్లో సున్నం లేకుండా కొడతారని ఊహించడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. ఆ రోజంతా విపరీతంగా బాధ పడ్డాను. ‘‘నీకు బాధ పడే అర్హత ఉందా?’’ అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఎందుకంటే అలాంటి కామెంట్స్ ఎన్నో సార్లు చేసి ఉన్నాను. నాలాగే ఎందరో బాధ పడి ఉంటారు. ఇక అప్పటి నుంచి ఏ అమ్మాయినీ పొరపాటున కూడా కామెంట్ చేయలేదు. - వి.ఆర్, ఒంగోలు