అజిత్ పవార్ తిరుగుబాటుతో ఎన్సీపీలో చీలిక వచ్చిన సంగతి తెలిసిందే. తదనంతరం పార్టీపై పట్టు సాధించడానికి అజిత్ పవర్ వర్గం, శరద్ పవార్ వర్గం తీవ్రంగా కృషి చేస్తున్నారు. పార్టీ నాదంటే.. నాదంటూ ఇరువర్గాలు పంతం కొనసాగిస్తున్నాయి. పార్టీ పేరు, గుర్తును సొంతం చేసుకోవడానికి పోరాడుతున్నారు. ఈ క్రమంలో అజిత్ పవార్ వర్గం ఎన్నికల కమిషన్(ఈసీఐ)ను ఆశ్రయించింది. పార్టీ పేరు, గుర్తు కేటాయింపుకు సంబంధించిన పిటీషన్‌ను ఈసీఐకి దాఖలు చేశారు.
పార్టీ పేరు, గుర్తుపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎన్నికల కమిషన్ తన మాట కూడా వినాలని కోరుతూ ఇక శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇప్పటికే కేవియట్ దాఖలు చేసింది. తొమ్మిది మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలనే అంశంలోనూ ఈసీఐని శరద్ పవార్ వర్గం అభ్యర్థించింది.
నేడు ఎన్సీపీలో ఇరువర్గాల బల ప‍్రదర్శన జరిగింది. ఇందులో అజిత్ పవార్ 30 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకోగా.. శరద్ పవార్ వెనక కేవలం 13 మంది మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి మొత్తం 53 ఎమ్మెల్యేల బలం ఉండగా.. తనకు 43 మంది శాసన సభ్యుల మద్దతు ఉందని అజిత్ పవార్ చెబుతున్నారు. అయితే అజిత్ వెనక ఉన్నది 13 మంది ఎమ్మెల్యేనంటున్న శరద్ పవార్ వర్గం ఆరోపిస్తుంది.
ఇదీ చదవండి: Sharad Pawar Vs Ajit Pawar.. నేడు ఎమ్మెల్యేల బలపరీక్ష.. ఎవరిది పైచేయి!
Comments
Please login to add a commentAdd a comment