లోక్‌సభ ఎన్నికల తరుణంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా నగదు పంపిణీ చేశారంటూ మహరాష్ట్ర అజిత్ పవార్ (ఎన్‌సీపీ) వర్గంలోని ఐదుగురి మద్దతు దారులపై పోలీసులు నాన్ కాగ్నిసబుల్ కేసు నమోదు చేశారు.
మహారాష్ట్రలో సార్వత్రిక ఎన్నికల పోరులో వదిన-మరదళ్ల సమరం ఆసక్తిని రేపుతోంది. అజిత్ పవార్ తిరుగుబాటుతో రెండు ముక్కలైన ఎన్‌సీపీకి కంచుకోటగా ఉన్న బారామతి లోక్‌సభ స్థానం నుంచి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్) వర్గం నేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్, మరోవైపు శరద్ పవార్ కూతురు సుప్రియాసూలే ఎన్సీపీ( ఎస్పీ) గ్రూపు నుంచి పోటీ చేస్తున్నారు.
మంగళవారం మహరాష్ట్రలోని మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో మూడవ దశలో 11 స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అయితే ఈ పోలింగ్‌కు ముందు రోజు అంటే సోమవారం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన కొందరు వ్యక్తులు బారామతి లోక్‌సభ పోలింగ్‌కు ముందు జిల్లాలోని భోర్ పట్టణంలోని ఓటర్లకు నగదు పంపిణీ చేశారని ఎన్‌న్సీపీ (శరద్ పవార్) ఆరోపించింది. దీంతో పూణే పోలీసులు నిందితులపై నాన్ కాగ్నిసబుల్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంపై మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. తన పార్టీపై, పార్టీ మద్దతుదారులపై వస్తున్న ఆరోణల్ని కొట్టిపారేశారు.
Comments
Please login to add a commentAdd a comment