
పుణే: ఎన్‌సీపీని ఎన్నికల సంఘమే తమనుంచి లాగేసుకుందని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్ వాపోయారు. ఎన్సీపీ పేరును, గుర్తును అజిత్ పవార్ వర్గానికి ఈసీ కేటాయించడం తెలిసిందే.
ఆదివారం పుణేలో జరిగిన శరద్ పవార్ ఒక కార్యక్రమంలో దీనిపై స్పందించారు. ఎన్సీపీని స్థాపించి, బలోపేతం చేసిన వారి చేతుల్లో నుంచి లాగేసుకోవడమే గాక ఇతరులకు అప్పగిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందన్నారు. దీన్ని ప్రజలు హర్షించరని నమ్మకం తనకుందని చెప్పారు.