Snatching
-
పోలీసుల ఎదురుకాల్పుల్లో ‘బద్లాపూర్’ రేప్ నిందితుడి మృతి
ముంబై: మహారాష్ట్రలో ఆగస్ట్‌లో సంచలనం సృష్టించిన ‘బద్లాçపూర్’ బాలికలపై అత్యాచారం కేసులో నిందితుడు అక్షయ్ షిండే పోలీసుల ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. నవీ ముంబైలోని తలోజా జైలు నుంచి థానె జిల్లాలోని బద్లాçపూర్ పట్టణానికి తీసుకొస్తుండగా పోలీసుల నుంచి పిస్టల్ లాక్కుని కాల్పులకు తెగబడిన అతడిని పోలీసులు క్షణాల్లో మట్టుబెట్టారు. సోమవారం సాయంత్రం 6.15గంటలకు ముంబ్రా బైపాస్ రోడ్డు వద్ద ఈ ఎదురుకాల్పుల ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. బద్లాçపూర్లోని ఓ స్కూల్లో స్వీపర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల అక్షయ్ అక్కడి నాలుగేళ్ల ఇద్దరు బాలికలపై లైంగికంగా దాడిచేశాడని ఆరోపణలు వెల్లువెత్తడం తెల్సిందే. విషయం తెల్సిన మరుక్షణం స్కూలు పిల్లల తల్లిదండ్రులు, స్థానికులు, నిరసనకారులు వేలాదిగా ఆందోళన చేపట్టడం తెల్సిందే. ఎదురుకాల్పుల ఉదంతంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విలేకరులతో మాట్లాడారు. ‘‘ అక్షయ్‌పై అతని మాజీ భార్య లైంగిక హింస కేసు పెట్టింది. ఈ కేసులో విచారణ నిమిత్తం తలోజా జైలు నుంచి ఇతడిని బద్లాçపూర్‌కు ఒక పోలీస్ ఎస్కార్ట్ బృందం తీసుకొస్తోంది. మార్గమధ్యంలో పోలీసు వాహనం ముంబ్రా బైపాస్ చేరుకోగానే పోలీస్ నుంచి పిస్టల్‌ను లాక్కొని నిందితుడు ఒక అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ నీలేశ్ మోరెపైకి 2–3 రౌండ్ల కాల్పులు జరిపాడు. హఠాత్ పరిణామం నుంచి తేరుకున్న మరో పోలీసు అధికారి వెంటనే తన తుపాకీతో అక్షయ్‌ను కాల్చాడు. రక్తమోడుతున్న ఇతడిని దగ్గర్లోని కల్వా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆత్మరక్షణ కోసం మాత్రమే పోలీసు ఇతనిపై కాల్పులు జరిపాడు’’ అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. -
‘ప్లేట్’ ఫిరాయిస్తే కేసే!
ట్రాఫిక్ ఉల్లంఘనులు నగరంలో రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. జరిమానాలు తప్పించుకోవడానికి నిఘా నేత్రాలు, ట్రాఫిక్ కెమెరాలకుతమ వాహన నంబర్ చిక్కకుండా ఉండేందుకు వాటిని ‘కవర్’ చేస్తున్నారు. దీనికోసం నంబర్ ప్లేట్స్‌కు మాస్కులు తొడగటం, వంచేయడం, విరిచేయడం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఉల్లంఘనులపై పోలీసులు మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తూ వచ్చారు. అయితే ఈ తరహా ఉల్లంఘనుల్లో మార్పు రాకపోవడం, స్నాచింగ్స్, చోరీలకు పాల్పడేవారు సైతం ఇదే బాటపట్టడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్స్ మూసేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. గత నెలలోనే 35 కేసులు నమోదు చేయించారు. - సాక్షి, హైదరాబాద్ఈ–చలాన్లు తప్పించు కోవాలనే ఉద్దేశంతో..ఈ– చలాన్లు తప్పించుకోవడానికే నంబర్ ప్లేట్లు మూసేసే వారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాలు అమలవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది తమ చేతిలో ఉన్న డిజిటల్ కెమెరాలతో, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు జంక్షన్లతోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలు నంబరు ప్లేట్స్‌తో సహా చిత్రీకరిస్తున్నారు.వీటి ఆధారంగా ఆయా ఉల్లంఘనులకు ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. ఈ విధానంలో ఉల్లంఘనులు వినియోగించిన వాహన రిజిస్ట్రేషన్ నంబర్, దాని ఆధారంగా సేకరించే రిజిస్టర్డ్ చిరునామానే కీలకం. కొందరు తమ వాహనాలకు సంబంధించిన నంబర్ ప్లేట్లను వివిధ రకాలుగా కవర్ చేస్తూ ట్రాఫిక్ కెమెరాలకు చిక్కుకుండా చేస్తున్నారు. కొందరు నేరగాళ్లు సైతం నంబరు ప్లేట్లు కనిపించకుండా చేసి నేరాలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇలా జరిగిన కొన్ని నేరాలను కొలిక్కి తేవడానికి పోలీసులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.ముందు వాటి కంటే వెనుకవే ఎక్కువవాహనాల నంబర్ ప్లేట్స్ ఎదుటి వారికి, సీసీ కెమెరాలకు చిక్కకుండా కవర్ చేయడం అనేది కార్లు వంటి తేలికపాటి వాహనాల కంటే ద్విచక్ర వాహనాలకే ఎక్కువగా కనిపిస్తోంది. రోడ్లపై ఈ తరహా నంబర్ ప్లేట్‌ను పోలీసులు గుర్తించి ఆపడానికి ప్రయత్నిస్తే బైక్స్ మాదిరిగా ఫోర్ వీలర్స్ వాహనాలు తప్పించుకొని వెళ్లిపోలేవు. దీంతో వారు అలాంటి చర్యల జోలికివెళ్లరు. ద్విచక్ర వాహనాల్లోనూ 90 శాతం వెనుక వైపు నంబర్ ప్లేట్‌కే రూపురేఖలు లేకుండా చేస్తున్నారు.క్షేత్రస్థాయిలో స్పెషల్ డ్రైవ్స్ చేసేప్పుడు రహదారులపై కొన్ని వాహనాలను తనిఖీ చేస్తారు. ముందు ఉండే నంబర్ ప్లేట్ వారికి స్పష్టంగా కనిపిస్తుండటంతో ఆ వాహనాలను ఆపి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదే వెనుక నంబర్ ప్లేట్ అయితే వాహనం ముందుకు వెళ్లిపోయాకే ట్రాఫిక్ పోలీసులకు కనిపిస్తుంది. ఇలా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయడం మొదలెట్టారు. గత నెల వరకు ఐపీసీలోని సెక్షన్ 420 ప్రకారం నమోదు చేయగా, ఈ నెల నుంచి బీఎన్ఎస్లోని సెక్షన్ 318 వినియోగించనున్నారు. ఈ కేసుల్లో నేరం నిరూపణ అయితే ఏడేళ్ల వరకు జైలు లేదా జరిమానా విధించే అవకాశం ఉంది.ఉద్దేశపూర్వకంగా చేసిన వారిపైనే కేసులుఅనివార్య కారణాల వల్ల, పొరపాటుగా వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు డ్యామేజ్ అవుతుంటాయి. మరికొందరికి తమ నంబర్ ప్లేట్ డ్యామేజ్ అయిన విషయం తెలిసినా పని ఒత్తిడి, నిర్లక్ష్యం వంటి కారణాలతో దాన్ని సరి చేసుకోరు. స్పెషల్ డ్రైవ్‌లో ఇలాంటి వాహనాలు చిక్కితే వారికి చలాన్ ద్వారా జరిమానా మాత్రమే విధిస్తున్నారు. కొందరు మాత్రం నేరాలు చేయాలని, ఈ–చలాన్‌కు చిక్కకూడదనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్లను డ్యామేజ్ చేయడం, వాటిపై ఉన్న నంబర్లు మార్చడం, వంచేయడం, స్టిక్కర్లు వేసి మూసేయడం చేస్తున్నారు. ఇలాంటి వారిపై మాత్రమే శాంతిభద్రతల విభాగం పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేయిస్తున్నాం. – పి.విశ్వప్రసాద్, అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) -
గురి తప్పింది..! బైక్ టైర్‌ను కాల్చబోతే స్నాచర్ కాలిలోకి తూటా
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని సిటీలైట్ హోటల్ వద్ద యాంటీ స్నాచింగ్ టీమ్ పోలీసులు.. పారిపోతున్న స్నాచర్ల బైక్ టైర్‌ను కాల్చాలని ప్రయతి్నంచినట్లు టాస్‌్కఫోర్స్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ ప్రకటించారు. ఆ తూటా బైక్ వెనుక కూర్చున్న నేరగాడి కాలులోకి దూసుకుపోయినట్లు వివరణ ఇచ్చారు. గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఉదంతంలో తప్పించుకున్న ఇద్దరు స్నాచర్లను పట్టుకున్నట్లు ఆదివారం టాస్‌్కఫోర్స్ డీసీపీ పేర్కొన్నారు. రెండు ‘పనులు’ చేస్తున్నా చాలక.. ఫలక్‌నుమాలోని అన్సారీ రోడ్ ప్రాంతానికి చెందిన మసూద్ ఉర్ రెహా్మన్ పదో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. బతుకుతెరువు కోసం వెల్డర్‌గా, క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ రెండు పనుల్లోనూ వచ్చే ఆదాయం విలాసాలకు సరిపోకపోవడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టాడు. దీనికోసం దోపిడీలు, చోరీలు చేయాలని పథకం వేశాడు. నాచారం, మైలార్‌దేవ్‌పల్లిల్లో మూడు నేరాలు చేసి జైలుకు వెళ్లాడు. ఈ కేసుల్లో బెయిల్‌పై బయటకు వచి్చన ఇతడి వ్యవహార శైలి మారలేదు. మసూద్ తరచూ ముషీరాబాద్‌లో ఉండే తన బంధువు ఇంటికి వెళ్లేవాడు. అక్కడే ఇతడికి స్క్రాప్ వ్యాపారం చేసే ఫజల్ ఉర్ రెహ్మాన్‌తో పరిచయం ఏర్పడింది. వాహనంపై తిరుగుతూ వరుస నేరాలు.. సెల్‌ఫోన్ స్నాచింగ్స్ చేయాలని నిర్ణయించుకున్న మసూద్ తనకు సహకరించాల్సిందిగా ఫజల్‌ను కోరాడు. దీనికి అతడు అంగీకరించడంతో ఇద్దరూ రెండు కత్తుల్ని దగ్గర పెట్టుకుని బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయటకు వచ్చారు. తొలుత చాదర్‌ఘాట్‌లోని ఓ బార్ వద్ద ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశారు. ఈ వాహనాన్ని అదును చూసుకుని విక్రయించాలని భావించారు. అప్పటి వరకు భద్రంగా ఉంచడం కోసం భోలక్‌పూర్ వరకు తీసుకువెళ్లి ఓ ప్రాంతంలో దాచారు. అదే రాత్రి అట్నుంచి వీరిద్దరు సికింద్రాబాద్ వైపు వెళ్లారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్ సమీపంలోని గణేష్ టెంపుల్ వద్ద ఓ వ్యక్తి వీరికి కనిపించాడు. కత్తులతో బెదిరించి సెల్‌ఫోన్ దోపిడీ.. అతడిని అడ్డుకున్న వీరిద్దరు సెల్‌ఫోన్ గుంజుకోవడానికి ప్రయతి్నంచారు. బాధితుడు ఎదురు తిరగడంతో వాహనం దిగిన ఇరువురూ కత్తులతో బెదిరించి ఫోన్ లాక్కున్నారు. అక్కడి నుంచి తమ వాహనంపై క్లాక్ టవర్ వైపు వెళ్తూ తమ చేతిలో ఉన్న కత్తుల్ని చూపిస్తూ పాదచారులకు భయభ్రాంతులకు గురి చేశారు. ఇటీవల నగరంలో చోటు చేసుకున్న నేరాల నేపథ్యంలో యాంటీ స్నాచింగ్ టీమ్స్ రాత్రి వేళ గస్తీ నిర్వహిస్తున్నాయి. పాదచారుల అరుపులు సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న బృందం చెవిన పడ్డాయి. అప్రమత్తమైన పోలీసులు ఆ ఇద్దరి వద్దకు చేరుకుని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. మసూద్, ఫజల్ కత్తులు చూపిస్తూ పోలీసులను కూడా బెదిరించారు. పట్టుకునే ప్రయత్నాల్లో కాల్పులు.. అక్కడి నుంచి పారిపోతున్న ఇద్దరు నిందితులను యాంటీ స్నాచింగ్ టీమ్ వెంబడిస్తూ పోయింది. బాటా షోరూమ్ వద్ద మరో పాదచారి నుంచి ఫోన్ స్నాచింగ్ చేయడానికి వీళ్లు ప్రయతి్నంచి సిటీ లైట్ హోటల్ వద్దకు చేరుకున్నారు. వీరి వ్యవహారశైలిని గమనించిన ఇద్దరు పోలీసులూ పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా వారి వాహనం ఆపాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం తమ వద్ద ఉన్న తుపాకీతో దాని టైర్‌పై గురిచూసి కాల్చారు. ఈ తూటా వాహనం వెనుక కూర్చున్న నేరగాడి కాలిలోకి దూసుకుపోయింది. మరో తూటా పేలి్చనా ఫలితం లేకపోవడంతో ఇద్దరూ వాహనంపై పారిపోయారు. టాస్‌్కఫోర్స్, నార్త్‌జోన్ పోలీసులు ముమ్మరంగా గాలించి ఇద్దరినీ పట్టుకున్నారు. వీరి నుంచి చోరీ సొత్తు, కత్తులు స్వా«దీనం చేసుకున్నారు. -
HYD: చిలుకలగూడలో కాల్పలు కలకలం
సికింద్రాబాద్: చిలకలగూడలో అర్ధరాత్రి సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా హల్చల్ చేసింది. వీరని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారిపైకి కాల్పులు జరిపినట్టు సమాచారం. అయితే పోలీసులు వెర్షన్ వేరేగా ఉంది.చిలకలగూడలో సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న ముఠా తిరుగుతోంది. ఎప్పటి నుంచో ఫిర్యాదులు అందుకుంటున్న పోలీసులు నిన్న రాత్రి సడెన్ డెకాయ్ ఆపరేషన్ చేశారు. అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న ఆ ముఠా పారిపోయేందుకు యత్నించింది.పారిపోతున్నా దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠాపై ఒక రౌండ్ కాల్పులు చేశారని అంటున్నారు. ముగ్గురు సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వారి పారిపోయే క్రమంలోజరిగిన పెనుగులాటలో మిస్‌ఫైర్ అయిందని పోలీసులు చెబుతున్నారు. -
ఎన్సీపీని లాగేసుకున్న ఈసీ: పవార్
పుణే: ఎన్సీపీని ఎన్నికల సంఘమే తమనుంచి లాగేసుకుందని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్ వాపోయారు. ఎన్సీపీ పేరును, గుర్తును అజిత్ పవార్ వర్గానికి ఈసీ కేటాయించడం తెలిసిందే. ఆదివారం పుణేలో జరిగిన శరద్ పవార్ ఒక కార్యక్రమంలో దీనిపై స్పందించారు. ఎన్సీపీని స్థాపించి, బలోపేతం చేసిన వారి చేతుల్లో నుంచి లాగేసుకోవడమే గాక ఇతరులకు అప్పగిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందన్నారు. దీన్ని ప్రజలు హర్షించరని నమ్మకం తనకుందని చెప్పారు. -
పాక్ ప్రధాని అనుచిత ప్రవర్తన.. మహిళ ఆఫీసర్ దగ్గర గొడుగు లాక్కుని.. వీడియో వైరల్..
ప్యారిస్ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అనుచితంగా ప్రవర్తించారు. సమావేశానికి హాజరవ్వడానికి వెళ్లిన క్రమంలో ఆహ్వనానికి వచ్చిన మహిళ అధికారి వద్ద గొడుగు లాక్కున్నారు. పాపం.. వర్షం కారణంగా గొడుగు పట్టడానికి వచ్చిన ఆ మహిళ ఉద్యోగిని తడుస్తూనే ప్రధాని వెంట నడిచింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. Prime Minister Muhammad Shehbaz Sharif arrived at Palais Brogniart to attend the Summit for a New Global Financial Pact in Paris, France. #PMatIntFinanceMoot pic.twitter.com/DyV8kvXXqr — Prime Minister's Office (@PakPMO) June 22, 2023 సమావేశ భవనాన్ని చేరడానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ కారు దిగారు. వర్షం కారణంగా ఆయనకు గొడుగు పట్టడానికి కారు డోర్ దగ్గరే ఓ మహిళ అధికారి రెడీగా ఉంది. ప్రధాని కారు దిగగానే తడవకుండా గొడుగు పట్టింది. అయితే.. ఆయన ఆ గొడుగును ఆమె నుంచి తీసుకునే ప్రయత్నం చేయగా.. అసౌకర్యం కలగకుండా తానే పడతానన్నట్లుగా గొడుగును ఎత్తే ప్రయత్నం చేసింది. కానీ షెహబాజ్ షరీఫ్ ఆమె నుంచి గొడుగును లాక్కున్నారు. తానే గొడుగు పట్టుకుని సమావేశ భవనానికి వెళ్లారు. ఏం చేయాలో తెలియక ఆ మహిళ ఉద్యోగిని అధ్యక్షుడి వెంటే వర్షంలో తడుస్తూ నడిచింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Why did he leave the woman in the rain? Shehbaz sharif is such an embarrassment. Yaaar kis cartoon ko PM bana diya hai inho ne. 😂 pic.twitter.com/kPzOmXSvQG — Saith Abdullah (@SaithAbdullah99) June 22, 2023 ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ప్రధాని అనుచిత ప్రవర్తనపై పాక్ సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మహిళను వర్షంలోనే ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ప్రధాని ఎలా అయ్యారని నెట్టింట విమర్శల వర్షం కురిపించారు. What a disgraceful embarrassment this man is! #Titanic #ShehbazSharif pic.twitter.com/91hpulmBkL — bushra (@Bushra2k7) June 22, 2023 ఇదీ చదవండి: యుద్ధానికి సై అంటారు, మమ్మల్ని పట్టించుకోరు.. ఆదుకోండి ప్లీజ్!: పాక్ ప్రధాని -
Viral Video: తిక్క కుదిరింది.. మొబైల్ కొట్టేద్దామనుకున్నాడు.. పాపం చివరికి!
కర్మ సిద్దాంతాన్ని చాలా మంది నమ్ముతుంటారు. చేసిన ప్రతి పనులకు తప్పక ఫలితం అనుభవించాల్సి ఉంటుందని దీని అర్థం. ఎదుటి వారికి మంచి చేస్తే మంచి.. చెడు చేస్తే అదే చెడు మనకి రివర్స్‌లో తగులుతుందని భావిస్తుంటారు. అందరి విషయంలో ఏమో కానీ ఓ యువకుడి విషయంలో జరిగింది తెలుసుకుంటే మాత్రం ‘కర్మ ఫలం’ నిజమేననిపిస్తుంది. అసలేం జరిగిందంటే.. రోడ్డు పక్కన ఓ యువతి ఒంటరిగా నిల్చొని మొబైల్ చూస్తూ ఉంటుంంది. అదే దారిలో ఓ యువకుడు సైకిల్‌పై వచ్చాడు. యువతి దగ్గరకు చేరుకోగానే ఆమె చేతిలో నుంచి మొబైల్ తీసుకొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. సరిగ్గా అదే సమయానికి రోడ్డు మీద వస్తున్న కారు అతనికి ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. కారు తగిలి కిందపడ్డ దొంగ మళ్లీ లేచి పరుగులు తీశాడు. పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు రోడ్డు మీద ఉన్న చాలా మంది అతన్ని వెంబడించారు. అయినా ఎవరికి దొరకకుండా పరుగులు తీశాడు. ఈ క్రమంలో దొంగ కొన్నిచోట్ల కిందపడిపోతూ దెబ్బలు తగిలించుకున్నాడు. గాయాలైన కూడా మళ్లీ లేచి పరుగెత్తాడు. కానీ చివరికి దొంగ దొరికిపోయాడు. కొంతమంది యువకులు అతన్ని పట్టుకొని కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. తక్షణ (ఇన్స్టంట్) కర్మ అంటే ఇదేనంటూ.. దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన యువకుడిని ఉద్ధేశించి కామెంట్ చేస్తున్నారు. అంతేగాక యువతికి సాయం చేసేందుకు ప్రయత్నించిన వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: హోటల్లో షాకిచ్చిన వెయిటర్.. కస్టమర్ కూల్‌గా ఏం చేశాడంటే! Karma is Real pic.twitter.com/klE9IpsCYS — Karma Videos (@thedarwinawerds) March 21, 2023 -
‘దొంగ’ తెలివి! ఏకంగా హోంగార్డు బైక్‌నే దొంగిలించి...వెళ్తు..వెళ్తూ..
సాక్షి, బంజారాహిల్స్: చోరాగ్రేసరుల తెలివే వేరు. విభిన్నంగా ఆలోచించడమే వీరికున్న అదనపు అర్హత. ఏకంగా హోంగార్డు బైక్‌నే దొంగిలించి.. దానిపైనే వెళుతూ ఓ ద్విచక్ర వాహన చోదకుడి మొబైల్‌నే కొట్టేశారు. ఆ తర్వాత ఎట్టకేలకు దొరికిపోయిన ముగ్గురు యువకుల ‘దొంగ’ తెలివి బయటపడిన ఉదంతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ధర్మ అనే హోంగార్డు పని చేస్తున్నారు. కారి్మకనగర్‌లో ఆయన నివసిస్తున్నారు. రోజువారీలాగే బుధవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వచి్చన ధర్మ.. తన బైక్‌ను బయట పార్కింగ్ చేశారు. రాత్రి 12 గంటల సమయంలో ముగ్గురు యువకులు సదరు బైక్‌ను అపహరించారు. ఆ వాహనంపైనే రహమత్‌నగర్ మీదుగా యూసుఫ్‌గూడ వైపు దొంగతనానికి బయల్దేరారు. కొట్టేసిన వాహనంపైనే వెళుతూ.. అదే సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీకి చెందిన మల్లారెడ్డి అనే స్విగ్గి డెలివరీ బాయ్ ఓ ఆర్డర్ కోసం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం వద్ద వేచి చూస్తున్నాడు. బైక్‌పై వచి్చన దొంగలు సదరు మల్లారెడ్డిని లైటర్ ఉందా అని అడుగుతూనే మల్లారెడ్డి చేతుల్లోని మొబైల్ ఫోన్‌ను క్షణాల్లో లాక్కుని ఉడాయించారు. బాధితుడు అప్రమత్తమై తన బైక్‌పై వారిని వెంబడిస్తూ దొంగా.. దొంగా అంటూ అరిచాడు. చుట్టుపక్కల వారు సైతం ఆయనతో పాటు దూసుకెళ్లారు. సందుల్లోకి వెళ్లిన ముగ్గురు దొంగలు ఆ ప్రాంతం కొత్తది కావడంతో అటు తిరిగి... ఇటు తిరిగి మళ్లీ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంవైపే వచ్చారు. అప్పటికే వీరి కోసం వెంట పడుతున్నవారికి కనిపించారు. వీరందరిని చూడగానే దొంగలు ముగ్గురు మొబైల్ ఫోన్‌తో పాటు బైక్‌ను అక్కడే పడేసి ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: స్పాల ముసుగులో వ్యభిచారం.. ఆరు నెలల నుంచి విచ్చలవిడిగా..) -
కదులుతున్న రైలులో మొబైల్ చోరీకి యత్నం.. పాపం వాడి పనైపోయింది!
దొంగతనం.. చట్టరీత్యా నేరం అయినా నిత్యం ఈ పదం వింటూనే ఉన్నాం. ఇంటికి తాళం కనిపిస్తే చాలు ఇల్లు గుల్ల అవ్వాల్సిందే. ఒక ఇంట్లోని వస్తువులేనా.. ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలు, విలువైన వస్తువులు సైతం కొట్టేస్తుంటారు. ఇక రైలు, బస్సుల్లో వంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లోనూ దొంగలు తమ చేతి వాటాన్ని చూపిస్తూనే ఉంటారు. ఎంత తెలివిగా తప్పించుకున్నా కొన్నిసార్లు దొంగ దొరికిపోతుంటాడు. తాజాగా ఓ దొంగ రైల్వే స్టేషన్ నుంచి కదులుతున్న రైలులో మొబైల్ ఫోన్ చోరీకి ప్రయత్నించి చివరికి ఊహించని విధంగా విఫలమయ్యాడు. ఈ ఘటన సెప్టెంబర్ 14న బిహార్‌లో చోటుచేసుకుంది. బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలులో కిటికీలోంచి ప్రయాణికుడి మొబైల్‌ను కొట్టేసేందుకు ఓ దొంగ ప్రయత్నించాడు. రైలు సాహెబ్‌పూర్ కమల్ స్టేషన్ దగ్గరకు రాగానే దొంగ మొబైల్ దొంగిలించేందుకు వ్యక్తి చేతిని పట్టుకున్నాడు. కానీ అక్కడే అతని ప్లాన్ బెడిసి కొట్టింది. మొబైల్ తీసుకుంటుండగా అప్రమత్తమైన ప్యాసింజర్ దొంగ చేతులను కిటికీలోంచే గట్టిగా పట్టుకున్నాడు. రైలు కదలడం ప్రారంభమవ్వడంతో దొంగ క్షమాపణలు కోరుతూ, చేతులు వదిలేయమని వేడుకున్నాడు. అప్పటికే రైలు వేగం పెరగడంతో ఏం చేయాలో తోచని దొంగ తన రెండో చేతిని కూడా కిటికీ ద్వారా లోపలికి అందించాడు. ప్రయాణికుడు దొంగ రెండు చేతులను గట్టిగా పట్టుకున్నాడు. దాదాపు 10 కిలోమీటర్లు దొంగ అలాగే కిటికీకి వేలాడుతూ ప్రయాణం చేశాడు. చివరికి రైలు ఖగారియా దగ్గరకు రాగానే ప్రయాణికుడు స్నాచర్ చేయి వదలడంతో అతడు పారిపోయాడు. దీనిని తోటి ప్రయాణికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: చిన్న కారులో 29 మంది.. ‘ఇంకెంత మందిని ఎక్కించేస్తార్రా బాబు’ Though #unverified yet chilling. A mobile snatcher caught in a moving train when his failed attempt probably led to his worst day of life. The thief was hung by a window in a moving train from Begusarai to Khagaria. The passengers handed him over to GRP. IS this act justified? pic.twitter.com/o3ja5qWggi — Kumar Saurabh Singh Rathore (@JournoKSSR) September 15, 2022 -
అందరూ చూస్తుండగానే... మహిళ బ్యాగ్ కొట్టేసిన బైకర్!
న్యూఢిల్లీ: శ్రీనగర్‌కి చెందిన షాహిదా బజాజ్ ఢ్లిలీకి వచ్చి ఒక చేదు అనుభవాన్ని ఎదర్కొంది. ఆమె తన భర్తతో కలిసి ఢిల్లీలోని ఒక మార్కెట్‌కి వెళ్లింది. షాపింగ్ పూర్తి అయిన తదనంతరం వారు తిరిగి తాము ఉంటున్న హోటల్‌కి వెళ్తుండగా..ఆమె పక్క నుంచే బైక్ పై ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. అందులో ఒక వ్యక్తి ఆమె బ్యాగ్‌ని కొట్టేశాడు. సదరు బైకర్లు ఆమెని గమనిస్తూ పక్క నుంచే వెళ్తూ..ఆమె బ్యాగ్‌ని గుంజుకుని పట్టుకుపోయాడు. ఐతే ఆ దొంగ బ్యాగ్‌ని ఆమె నుంచి లాక్కొనే సమయంలో ఆమె ప్రతిఘటించడంతో ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆమె భర్త సాయంతో లేచింది. ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. ఆ దొంగ రద్దీగా ఉండే మార్కెట్లో అదీ కూడా అందురూ చూస్తుండగానే చోరి చేసి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ దొంగ ఆచూకి కోసం గాలిస్తున్నారు. ఐతే ఈ ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. (చదవండి: ఒకే ఇంట్లో ఆరు డెడ్‌బాడీల కలకలం.. ఏం జరిగింది?) -
అమ్మ బాబోయ్.. రైల్వే బ్రిడ్జిపై షాక్ తిన్న ప్యాసింజర్
రైల్వే బ్రిడ్జిపై రైలు ముందుకెళ్తోంది. వాటర్ వ్యూను ఆస్వాదించే ఉద్దేశంతో ప్రయాణికులు డోర్లు, కిటికీల దగ్గరకు వచ్చి చేరారు. ఇద్దరు యువకుల్లో ఒకడు.. తన జేబు నుంచి మొబైల్ తీసి దృశ్యాన్ని షూట్ చేస్తున్నాడు. ఉన్నట్లుండి ఆ ప్రయాణికుడికి ఊహించని సర్ప్రైజ్ ఎదురైంది. రెయిలింగ్‌కు వేలాడుతున్న ఓ వ్యక్తి.. ప్యాసింజర్ చేతిలో ఫోన్‌ను రెప్పపాటులో లాగేసుకున్నాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదుగానీ.. బీహార్ బెగుసారాయ్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రెయిలింగ్‌కు కట్టేసుకుని.. ముఖానికి ముసుగు దొంగకు ముద్దుగా స్పైడర్‌మ్యాన్ అని పేరు పెట్టారు నెటిజన్స్. -
స్థలం చూసోద్దామని చెప్పి...కిడ్నాప్ చేసి రూ.10 లక్షల వసూలు
కెలమంగలం: ఫైనాన్సియర్‌ను కిడ్నాప్ చేసి రూ. 10 లక్షలు లాక్కొన్న ముగ్గురిని అంచెట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. తాలూకా కేంద్రం అంచెట్టి మరాఠీ వీధికి చెందిన వెంగోపరావ్ (44) ఫైనాన్సియర్. 9వ తేదీ కొందరు వెంగోపరావ్ ఇంటికెళ్లి విక్రయానికి ఉంచిన స్థలాన్ని చూద్దామని కారులో తీసుకెళ్లారు. దుండగులు బెంగళూరు సమీపంలోని అడవీ ప్రాంతానికి తీసుకెళ్లి రూ. 10 లక్షలు ఇస్తే వదిలేస్తామని, ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించడంతో భయపడిన అతను మిత్రునికి ఫోన్ చేసి రూ. 10 లక్షలు తెప్పించి వారికి అందజేశాడు. దీంతో అతన్ని వదిలేశారు. వెంగోపరావ్ గత రెండు రోజుల క్రితం అంచెట్టి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి మిలిదిక్కి గ్రామానికి చెందిన గణేష్ (35), ఏరికొడి గ్రామానికి చెందిన శక్తివేల్ (30), పాండురంగన్కొటాయ్కు చెందిన శక్తి (28)లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. (చదవండి: ప్రేక్షకులకు ఏమైంది?) -
లైవ్ టెలికాస్టింగ్‌లో ఫోన్ చోరీ! కట్ చేస్తే..
కైరో: ఇటీవల కాలంలో సోషల్ మీడియా క్రేజ్ పెరిగిపోవడంతో లైవ్ ఈవెంట్లు కూడా వీటిద్వారానే ప్రసారం కావడంతో వార్తాప్రపంచం అనేది ప్రజలకు మరింత చేరువైంది.. ఇది కాలక్రమంలో టెక్నాలజీ పరంగా వచ్చిన మార్పుగానే చెప్పవచ్చు. ఎక్కువ న్యూస్ టెలికాస్ట్ చేయాలన్న ఉద్దేశంతో చాలా సరికొత్త ఈవెంట్స్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తున్న సంగతి తెలిసిందే. అందలో భాగంగా ఈజిప్ట్‌లోని ఒక న్యూస్ చానల్ ఒక సరికొత్త కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తుంటే ఒక విచిత్రం చోటు చేసుకుంది. (చదవండి: అందుకే ఇంగ్లండ్ నుంచి వస్తున్నారు) అసలేం జరింగిందంటే....ఈ జిప్ట్‌లోని యూమ్ 7 న్యూస్ చానల్ రియల్ టైమ్ ఈవెంట్ అనే సరికొత్త కార్యక్రమంతో ప్రేక్షకులకు మరింత చేరవ కావడానికీ ప్రయత్నిస్తోంది. ఆ తరుణంలో కొన్ని భయంకరమైనవి, ఆసక్తి కలిగించే రియల్‌టైం ఈవెంట్లను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అయితే ఇటీవల ఈజిప్ట్‌లో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రియల్‌టైం ఈవెంట్లో భాగంగా భూకంపం తర్వాత ప్రజల పరిస్థితి ఎలా ఉంది అనే న్యూస్‌ని ఫోన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు అనూహ్యంగా ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ రోజు న్యూస్ చానల్ ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యక్షప్రసారంలో న్యూస్‌ని జర్నలిస్ట్ మహమూద్ రాఘేబ్ నివేదిస్తుండగా బైక్‌పై వచ్చిన దొంగ అతని ఫోన్ కొట్టేశాడు. ఫోన్‌ను కొట్టేసిందే తడువు బైక్‌పై వేగంగా జారుకుంటాడు. ఆ ఫోన్‌ను చేతిలోనే ఉంచుకుని సిగరెట్ కాలుస్తూ బైక్‌ను దర్జాగా డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతాడు. కాగా, ఆ ఫోన్ కెమెరా రోలింగ్లోనే ఉందని విషయం దొంగ గ్రహించకపోవడంతో అది ప్రత్యక్ష ప్రసారంలోనే రికార్డు అయ్యింది. తనను ఎవరైనా ఫాలో చేస్తున్నారా అనే అనుమానంతో మధ్యమధ్యలో వెనక్కి చూసుకుంటూ ఉండటం లైవ్ చూసేవారికి నవ్వులు తెప్పించింది. ‘నీ వెనకాల ఎవరూ రావడం లేదు.. కానీ ప్రపంచం మొత్తం నీ దొంగతనం చూస్తుంది’ అని నెటిజన్లు చమత్కరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవ్వడంతో ప్రజలు ఆ దొంగను పట్టుకోవటానికి కూడా ప్రయత్నించారు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిన ప్రతిసారి ఆ విషయం నన్ను బాధిస్తోంది) -
దొంగతనం.. ఆపై కొంత దూరం వెళ్లి దుస్తులు మార్చి..
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు స్నాచర్లు తాము చేసిన నేరానికి సంబంధించి పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకుండా కొత్త ఎత్తు వేశారు. బంధువుల వాహనంపై స్నాచింగ్ చేయడానికి వెళ్తూ నంబర్ ప్లేట్, ‘పని’ పూర్తయిన తర్వాత తమ వ్రస్తాలు మార్చుకున్నారు. ఈ ద్వయాన్ని అరెస్టు చేసిన బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు 16.3 తులాల బంగారం స్వాదీనం చేసుకున్నట్లు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. బొల్లారం, శామీర్‌పేట్ ప్రాంతాలకు చెందిన పి.సంతోష్, టి.కరుణాకర్ స్నేహితులు. విలాసాలకు అలవాటుపడిన వీరు స్నాచింగ్స్‌కు పథకం వేశారు. సంతోష్ తన బంధువుల బైక్ తీసుకురాగా.. దాని నంబర్ ప్లేట్ మార్చి, తలో జత బట్టలు పట్టుకుని ఇద్దరూ స్నాచింగ్ చేయడానికి బయలుదేరే వారు. మహిళల మెడలోని గొలుసు తెంచుకెళ్లేవారు. ఆపై కొంత దూరం వెళ్లి తమ వ్రస్తాలను మార్చుకునేవారు. వీరు అల్వాల్, దుండిగల్, జగద్గిరిగుట్టలతో పాటు గౌరారంల్లో నాలుగు నేరాలు చేశారు. బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: బిట్ కాయిన్స్ పేరుతో రూ.60 లక్షలు స్వాహా -
ఆమె పట్టుతో దొంగ చిక్కక తప్పలేదు
చండీగఢ్: మొబైల్ ఫోన్ స్నాచింగ్‌ను సమర్థంగా అడ్డుకుని, ఓ దొంగను కటకటాల్లోకి నెట్టిన పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన కుసుమ్ కుమారి (15) పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. కుసుమ్ కుమారి ధైర్యం ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శమని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను సాహస బాలికగా పేర్కొన్న జలంధర్ పోలీస్ కమిషనర్ గుర్ప్రీత్ సింగ్ భుల్లర్ ఆమె పేరును జాతీయ, రాష్ట్రస్థాయి సాహస అవార్డులకు పంపిస్తామని చెప్పారు. ఇక కుసుమ్ కుమారి సాహసానికి మెచ్చిన సిటీ డిప్యూటీ కమిషనర్ ఘన్‌శ్యామ్ తోరీ ఆమెకు రూ.51 వేల నజరానా ప్రకటించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కింద ఈ సాయం చేస్తున్నానని తెలిపారు. ‘బేటీ బచావో- బేటీ పడావో’ కార్యక్రమానికి సంబంధించి కుసుమ్ కుమారి ఫొటోను వాడుకుంటామని చెప్పారు. దొంగకు మూడు రోజుల రిమాండ్ కాగా, కుసుమ్ కుమారి చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని రోడ్డుపై వెళ్తుండగా దొంగలు అవినాష్ కుమార్ (22) అలియాస్ అషు, వినోద్ కుమార్ బైక్‌పై ఆమెను వెంబడించారు. చేతిలోని మొబైల్ ఫోన్‌ను లాక్కుని పారిపోయేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన కుసుమ్ కుమారి వారిపై సివంగిలా దూకి.. దొంగలకు చుక్కలు చూపించింది. ఫోన్ లాక్కుని బైక్‌పై కూర్చున్న అవినాష్ కుమార్‌ను అమాంతం పట్టేసుకుంది. ఈక్రమంలో ఆ దొంగ కుసుమ్ కుమారి చేతిపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. అయినా, ఆమె వెనకడుగు వేయలేదు. అంతలోనే దారినపోయేవారు అక్కడకు చేరుకుని దొంగను పట్టుకున్నారు. మరో దొంగ బైక్‌పై ఉడాయించాడు. సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇక నిందితుడు అవినాష్ కుమార్‌కు న్యాయస్థానం మూడు రోజుల రిమాండ్ విధించిందని జలంధర్ డివిజన్ నెంబర్-2 ఎస్ఐ జితేంతర్ పాల్ సింగ్ చెప్పారు. రెండోవాడి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. నిందితులపై హత్యాయత్నం, దొంగతనం కేసులు పెట్టామని తెలిపారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరగ్గా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇదిలాఉండగా.. గాయాలపాలైన సాహస బాలికకు జోషి ఆస్పత్రి ఉచితంగా చికిత్స అందిస్తుండటం అభినందనీయం. #Punjab: 15-year-old girl fights snatchers to save her mobile phone in #Jalandhar pic.twitter.com/MTqYvwiXPr — The Tribune (@thetribunechd) September 1, 2020 -
వీడియో: చూస్తుండగానే మొబైల్‌తో పరారీ!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కిషన్‌బాగ్‌లో శుక్రవారం మిట్టమధ్యాహ్నం ఇద్దరు దుండగులు మొబైల్ ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన ఎన్ఎం గూడ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద జరిగింది. ఒక వ్యక్తి మొబైల్ చూస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతలోనే బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతని చేతిలో నుంచి మొబైల్ లాక్కుని క్షణాల్లో అక్కడి నుంచి పరార్యాయారు. వారిని బాధితుడు వెంబడించినప్పటికీ లాభం లేపోయింది. ఈ స్నాచింగ్ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులు గుర్తించే పనిలోపడ్డారు. (సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై హైకోర్టులో పిటిషన్) -
వీడియో: చూస్తుండగానే మొబైల్‌తో పరారీ!
-
మూడు రకాలైన దొంగతనాలు.. ఆరు కేసులు
సాక్షి, సిటీబ్యూరో: నిఘా కళ్లకు చిక్కకుండా సందులూ గొందుల్లో సంచరిస్తూ, పక్కాగా రెక్కీ చేసి ఆపై చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు కుంచం కోటిని మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడు సెల్‌ఫోన్ స్నాచింగ్స్, వాహన చోరీలు, ఇళ్లల్లో దొంగతనాలు చేస్తున్నట్లు ఆదివారం డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. నిందితుడు కోటి నుంచి రూ.1.2 లక్షల విలువైన సెల్ఫోన్లు, వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. డీసీపీ వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన కోటికి బంటి, ఈశ్వర్ అనే మారు పేర్లూ ఉన్నాయి. బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన ఇతగాడు జియాగూడలో స్థిరపడ్డాడు. కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తూ దురవాట్లకు బానిసయ్యాడు. తనకు వచ్చే సంపాదనతో జల్సాలు చేయడం సాధ్యం కాకపోవడంతో దొంగతనాల బాటపట్టాడు. 2016 నుంచి చోరీలు చేయడం ప్రారంభించాడు. గతంలో టప్పాచబుత్రా, కాచిగూడ, మాదాపూర్, నార్సింగ్ ఠాణాల్లో ఇతడిపై ఆరు కేసులు ఉన్నాయి. ప్రధాన రహదారాల్లో సీసీ కెమెరాలు ఉంటాయనే ఉద్దేశంతో ఇతగాడు ఎక్కువగా చిన్న రూట్లు, సందుల్లో సంచరిస్తూ ఉంటాడు. ఓ ప్రాంతంలో నేరం చేయడానికి నిర్ణయించుకున్న తర్వాత పక్కాగా రెక్కీ నిర్వహిస్తాడు. స్నాచింగ్ లేదా చోరీ చేసిన తర్వాత ఎలాంటి గందరగోళానికి గురికాకుండా తప్పించుకునే మార్గాలను అన్వేషిస్తాడు. ఆపై ఆ ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై ఎదురు చూస్తాడు. రాత్రి వేళల్లో, తెల్లవారుజామునే రంగంలోకి దిగే ఇతగాడు ఫోన్లో మాట్లాడే వారిని గుర్తిస్తాడు. వేగంగా వాహనంపై అతడి వద్దకు వెళ్లి ఫోన్ లాక్కుని ఉడాయిస్తాడు. అవకాశం చిక్కితే ఇళ్లల్లో చోరీలు, వాహనాల దొంగతనాలు కూడా చేస్తుంటాడు. ఇటీవల సైఫాబాద్, ఆసిఫ్‌నగర్ ఠాణాల పరిధుల్లో రెండు సెల్‌ఫోన్ స్నాచింగ్స్, ఓ వాహన చోరీ, మరో ఇంట్లో దొంగతనం చేశాడు. కోటిని పట్టుకోవడానికి మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ జావేద్ నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీనివాసులు, మహ్మద్ షానవాజ్ షరీఫ్, టి.శ్రీధర్‌లతో కూడిన బృందం రంగంలోకి దిగింది. ఆదివారం నిందితుడిని పట్టుకుని సొత్తు రికవరీ చేసింది. తదుపరి చర్యల నిమిత్తం సైఫాబాద్ పోలీసులకు అప్పగించింది. -
స్నాచర్లను పట్టుకుంటే గ్యాంగ్ దొరికింది
సాక్షి, సిటీబ్యూరో: సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఓ సెల్‌ఫోన్ స్నాచింగ్ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారి నుంచి ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఆరా తీయగా అది పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైనట్లు తేలింది. దీంతో లోతుగా విచారించిన అధికారులు 11 మంది సభ్యులతో కూడిన వాహనచోరీలు, చైన్ స్నాచింగ్‌ల ముఠాను పట్టుకున్నారు. ఈ గ్యాంగ్‌లీడర్ ఆదేశాల మేరకు సభ్యులు వేర్వేరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి సోమవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. బజార్‌ఘాట్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ వాహెద్ అలియాస్ అఫ్రోజ్ అలియాస్ అఫ్రోజ్ ఖాన్ ఎనిమిదితో తరగతితో చదువుకు స్వస్థి చెప్పాడు. ఆపై కొన్నాళ్ల పాటు ఆటోడ్రైవర్‌గా పని చేసిన ఇతను చివరకు బైక్ మెకానిక్‌గా మారాడు. దురలవాట్లకు బానిసైన అతను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు వాహనచోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆసిఫ్‌నగర్‌కు చెందిన మహ్మద్ అల్తాఫ్, జిర్రాకు చెందిన సయ్యద్ జమీల్, రాజేంద్రనగర్‌కు చెందిన అమీర్, మోతీదర్వాజ ప్రాంతానికి చెందిన మరో మైనర్‌తో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. వృత్తిరీత్యా మెకానిక్ అయిన వాహెద్‌కు వాహనాల తాళాలు పగులకొట్టడం, అసలు తాళం చెవి లేకుండా స్టార్ట్ చేయడంపై పట్టుంది. దీనిపై తన గ్యాంగ్ సభ్యులకు అవగాహన కల్పించిన అతను వాహన చోరీలకు పురిగొల్పాడు. మహ్మద్ అల్తాఫ్ ద్వారా వహీద్‌కు కుమ్మర్‌వాడికి చెందిన ఎలక్ట్రీషియన్ హర్షవర్ధన్‌తో పరిచయం ఏర్పడింది. అతడినీ ఈ ‘రంగం’లోకి దింపిన వాహెద్ చోరీలకు ప్రోత్సహించాడు. దీంతో ఇతగాడు తన స్నేహితులైన అభిషేక్, ఉదయ్‌కిరణ్, అభిలాష్, మల్లేష్లతో ముఠా కట్టాడు. వీరు వాహనచోరీలతో పాటు స్నాచింగ్స్లకు పాల్పడేవారు. ఈ చోరీ సొత్తును తీసుకునే వాహెద్ దానిని జిర్రాలో వెల్డింగ్ దుకాణం నిర్వహించే సయ్యద్ జమీల్‌తో పాటు ఆసిఫ్‌నగర్‌కు చెందిన సేల్స్‌మెన్ షేక్ జమీర్‌లకు విక్రయించేవాడు. అలా వచ్చిన సొమ్మును అందరూ పంచుకునే వారు. రిసీవర్‌గా ఉన్న సయ్యద్ జమీల్ ఈ గ్యాంగ్స్‌తో కలిసి కొన్ని నేరాలు కూడా చేశాడు. దాదాపు నాలుగు నెలలపాటు ఈ ముఠాలు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలతో పాటు సంగారెడ్డి జిల్లాలోనూ పంజా విసిరాయి. వీరు ప్రధానంగా పార్కింగ్ ప్లేసులు, మాల్స్, ఇళ్ల వద్ద నిలిపి ఉంచిన వాహనాలనే ఎత్తుకెళ్లేవారు. సాయికిరణ్, మల్లేష్లు కొన్నాళ్ల క్రితం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పార్కింగ్ ఏరియా నుంచి బైక్ చోరీ చేశాడు. గత నెల 17న దానిపై వెళ్లిన హర్షవర్థన్, ఉదయ్ కిరణ్, అభిషేక్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సెల్‌ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ జావేద్ నేతృత్వంలో ఎస్సైలు టి.శ్రీధర్, కె.శ్రీనివాసులు, మహ్మద్ షానవాజ్ షఫీలతో కూడిన బృందం ఘటనాస్థలిలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని స్నాచింగ్‌కు ఉపయోగించిన వాహనాన్ని స్వా«ధీనం చేసుకున్నారు. ఇది తమ బంధువుకు చెందినదని నిందితులు చెప్పడంతో వాహనం పత్రాల కోసం ఆరా తీశారు. వారి వద్ద అవి లేకపోవడంతో వాహనంతో పాటు ఇంజిన్, చాసిస్ నంబర్ ఆధారంగా సదరు బైక్ కొన్నాళ్ల క్రితం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో నిందితులను విచారించగా మొత్తం ముఠాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మైనర్‌తో పాటు చోరులు, రిసీవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఆటో, బుల్లెట్, కేటీఎంలతో సహా 28 వాహనాలు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలు సిటీలో మూడు, సైబరాబాద్‌లో 22, రాచకొండలో 5, సంగారెడ్డిలో 3 నేరాలు చేసినట్లు గుర్తించారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను వారు నేరం చేసిన ప్రాంతాల వారీగా స్థానిక పోలీసులకు అప్పగించారు. హర్షవర్ధన్, ఉదయ్‌కిరణ్, అభిషేక్, జమీర్‌లను సైఫాబాద్, అమీర్‌ఖాన్, అల్తాఫ్, సమీల్లను ఎస్సార్‌నగర్, అబ్దుల్ వాహెద్‌తో పాటు మైనర్‌ను మీర్‌చౌక్, సాయికిరణ్, మల్లేష్‌లను పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లకు అప్పగించినట్లు తెలిపారు. -
రెండు ముఠాలు... ఏడుగురు దొంగలు!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పశ్చిమ మండలంలో దారి దోపిడీ, బ్యాగ్ స్నాచింగ్‌లకు పాల్పడిన రెండు ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం వెల్లడించారు. వెస్ట్‌జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, ఆసిఫ్‌నగర్ ఏసీపీ ఆర్జీ శివమారుతిలతో కలిసి తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. బార్కస్‌లోని యర్రకుంట ప్రాంతానికి చెందిన సయ్యద్ జఫార్ వృత్తిరీత్యా గ్లాస్ ఫిట్టింగ్ పని చేసేవాడు. గత ఏడాది నుంచి నేరాలు ప్రారంభించిన ఇతడిపై నల్లగొండ జిల్లా, గుడిపల్లితో పాటు నగరంలో చంద్రాయణగుట్ట, బాలాపూర్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. భవానీనగర్‌కు చెందిన మహ్మద్ మజీదుద్దీన్, బార్కస్ ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలురు అతడికి స్నేహితులు. వీరిలో ఇద్దరు మైనర్లపై హత్య సహా వివిధ కేసులు నమోదై ఉన్నాయి. ఈ నలుగురూ కలిసి రోజు మద్యం తాగడంతో పాటు గంజాయి సేవిస్తుంటారు. ఆ నిషాలో రోడ్లపైకి వచ్చి నేరాలు చేస్తుంటారు. ఇటీవల ఓ ఆటోను అద్దెకు తీసుకున్న ఈ ముఠా ఈ నెల 3న అర్ధరాత్రి అందులో చక్కర్లు కొట్టింది. లంగర్‌హౌస్‌లోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన శుభకార్యానికి హాజరైన ఇస్లాం బిన్ అబ్దుల్లా అనే వ్యక్తి రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై నిలుచున్నాడు. అదే సమయంలో ఆటోలో వచ్చిన ఈ నలుగురూ ఒకరు డ్రైవర్‌గా, మిగిలిన ముగ్గురూ ప్యాసింజర్లుగా నటించారు. అబ్దుల్లాను ఆటోలో ఎక్కించుకుని కొద్దిదూరం వెళ్లిన తర్వాత కత్తి చూపించి బెదిరించారు. అతడి వద్ద ఉన్న రూ.1100 నగదు, సెల్‌ఫోన్ లాక్కున్నారు. అయితే ఆటో నుంచి దూకేసిన బాధితుడు తనతో పాటు ఓ నిందితుడినీ పట్టుకుని కిందకు లాగేశాడు. అదే సమయంలో అటుగాగస్తీ వాహనంలో వస్తున్న గోల్కొండ ఠాణా ఏఎస్సై ఒమర్ దీనిని గుర్తించి అప్రమత్తమయ్యాడు. పారిపోతున్న నిందితుడిని వెంబడించి పట్టుకుని బాధితుడితో సహా పోలీసుస్టేషన్‌కు తరిలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురినీ అరెస్టు చేసి సొత్తు, ఆటో, కత్తి స్వాధీనం చేసుకున్నారు. చీకట్లో తిరుగుతూ స్నాచింగ్‌లు... గోల్కొండ, బంజారాహిల్స్, టోలిచౌకీ ప్రాంతాలకు చెందిన ఆఫ్రోజ్‌ఖాన్, మహ్మద్ సోహైల్ ఖురేషీ, మహ్మద్ అబ్దుల్ గఫార్ స్నేహితులు. వృత్తిరీత్యా ఆటోడ్రైవర్, ప్రైవేట్ ఉద్యోగి, డెలివరీ బాయ్‌లుగా పని చేసే వీరు జల్సాలకు అలవాటు పడి నేరాలు చేయడం ప్రారంభించారు. అఫ్రోజ్‌పై గతంలో 11, సోహైల్‌పై 13 కేసులు ఉన్నాయి. వీరితో జట్టుకట్టిన గఫార్ కూడా నేరం చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున ఖైరున్నిస్సాబేగం అనే మహిళ కుటుంబసభ్యులతో సహా ఆటోలో జగ్జిఖానా నుంచి బీహెచ్ఈఎల్లోని తమ ఇంటికి వెళుతుండగా, అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఈ ముగ్గురు ఆటోను వెంబడిస్తూ కొంత దూరం వెళ్లారు. అదును చూసుకుని ఖైరున్నిస్సా బేగం బ్యాగ్ లాక్కుని ఉడాయించారు. లంగర్‌హౌస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. శుక్రవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి చోరీ సొత్తుతో పాటు కత్తి స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు, విచారణ నేపథ్యంలో ఈ ముఠా సైబరాబాద్ పరిధిలోని నార్సింగి ఠాణా పరిధిలో రెండు, లంగర్‌హౌస్ పరిధిలోనే మరో రెండు నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ కేసులు ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన సిబ్బందిని సీపీ అంజనీకుమార్ అభినందించారు. -
టిక్–టాక్‌పై మోజుతో...
దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు క్రిమినల్ గ్యాంగ్‌ల ఆట కట్టించారు. గురువారం వరుసగా దాడులు నిర్వహించి మొత్తం మూడు గ్యాంగ్‌లలోని 8 మందిని అదుపులోకితీసుకున్నారు. కత్తులు, డాగర్లతో అర్ధరాత్రి ఆటోల్లో తిరుగుతూ ఒంటరిగా కనిపించే వారిని బెదిరించి దోచుకుంటున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. టిక్‌టాక్ వీడియోలు చేయాలనే ఆసక్తితో రెండు స్మార్ట్ఫోన్లను దొంగిలించిన ఇద్దరిని, కత్తులు వినియోగించిభారీ దోపిడీ చేయాలని పథకం పన్నిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరి నుంచి రూ.9 లక్షల విలువైన సొత్తు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం వరుస దాడులు చేసి మూడు గ్యాంగ్‌లకు చెందిన ఎనిమిది మంది నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి మారణాయుధాలతో పాటు రూ.9 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్‌తో కలిసి గురువారం తన కార్యాయంలో వివరాలు వెల్లడించారు. ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలోని బృందం నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒంటరి వ్యక్తులే టార్గెట్‌గా... నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహ్మద్ అక్బరుద్దీన్ ఫారూఖీ, మహ్మద్ మోహిసిన్, మహ్మద్ ఖదీర్, మీర్ షానవాజ్ అలీ ముఠాగా ఏర్పడ్డారు. కత్తులు, డాగర్ల తో అర్థరాత్రి ఆటోలో తిరుడుతూ రోడ్డుపై ఒంటరిగా కనిపించిన వారిని బెదిరించి వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు, నగదు దోచుకునేవారు. వీరిపై బహదూర్‌పుర, ఫలక్‌నుమా, మొఘల్‌పుర, మైలార్‌దేవ్‌పల్లి ఠాణాల్లో ఐదు కేసులు నమోదయ్యాయి. వీరిలో మొహిసిన్‌పై 10, ఫారూఖీపై 11, మహ్మద్ ఖదీర్‌పై 4, అలీపై 2 పాత కేసులు ఉన్నాయి. గురువారం వీరిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టిక్–టాక్‌పై మోజుతో... పాతబస్తీ, ఛత్రినాక పరిధిలోని ఉప్పుగూడకు చెందిన బి.రమేష్ సినీ రంగంలో వర్కర్‌గా పని చేస్తున్నాడు. ఇతడి స్నేహితుడైన అదే ప్రాంత వాసి రంగాపురం కుమార్ ఆటోడ్రైవర్. తరచూ ఇద్దరూ కలి మద్యం తాగేవారు. వీరికి టిక్–టాక్ యాప్‌లో వీడియోలు చేయాలనే సరదా. అయితే దానికోసం స్మార్ట్‌ఫోన్ కొనుక్కునే స్థోమత లేకపోవడంతో వాటిని తస్కరించాలని పథకం వేశారు. చంద్రాయణగుట్ట, ఛత్రినాక ప్రాంతాల నుంచి రెండింటిని చోరీ చేశారు. దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దోపిడీలకు పథకం... పాత నేరగాళ్లైన కాలాపత్తర్ రౌడీషీటర్ షేక్ ఒబేద్, అబ్దుల్ లతీఫ్ ఖాన్ ముఠాగా ఏర్పడ్డారు. ఒబేద్‌పై ఇప్పటికే 36 కేసులు ఉన్నాయి. ఘరానా దొంగ మంత్రి శంకర్‌కు ప్రధాన అనుచరుడైన అతడిపై గతంలో రెండుసార్లు పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు. రెండు నెలల క్రితం జైలు నంంచి వచ్చిన ఇతను లతీఫ్‌తో కలిసి రంగంలోకి దిగాడు. కత్తులు వినియోగించి భారీ దోపిడీలకు పథకం వేశాడు. దీనిపై సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నేపథ్యంలో వీరిపై కంచన్‌బాగ్, హుస్సేని ఆలం, నార్సింగి, మీర్‌పేట ఠాణాల్లో ఐదు కేసులు, ఒబేద్‌పై 11, లతీఫ్‌పై మూడు నాన్–బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. -
మోదీ అన్న కూతురి పర్స్ దొంగల అరెస్ట్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అన్న కూతురు దమయంతి బెన్ మోదీ పర్స్ దొంగిలించిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ వద్ద ఆటోలో నుంచి దిగిన దమయంతి పర్స్‌ను బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు లాక్కెళ్లిన సంగతి తెలిసిందే. పర్స్‌లో 56 వేల రూపాయల నగదు, రెండు ఫోన్లు, ఇతర పత్రాలు ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దమయంతి పేర్కొన్నారు. దొంగతనం జరిగిన ప్రాంతంలోని సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు బైక్ నంబర్ ఆధారంగా నిందితులైన గౌరవ్ అలియాస్ నోను (21)ను హరియాణాలోని సోనిపట్‌లో, బాదల్‌ను సుల్తాన్‌పురిలో అరెస్ట్ చేశారు. (చదవండి: మోదీ సోదరుని కుమార్తెకు చేదు అనుభవం) -
మోదీ సోదరుని కుమార్తెకు చేదు అనుభవం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో స్నాచింగ్ కేసులు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. తాజాగా సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ సోదరుని కుమార్తె కూడా స్నాచర్ల బారిన పడ్డారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు దమయంతి బెన్ మోదీ పర్సును లాక్కుపోయారు. సివిల్ లైన్స్‌లోని గుజరాతీ సమాజ్ భవన్ హోటల్ గేటు వెలుపల శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగిన ప్రాంతం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి సమీపంలోనే ఉండటం గమనార్హం. ఇండియా టుడే అందించిన కథనం ప్రకారం.. ప్రధానిమోదీ సోదరుని కుమార్తె దమయంతి బెన్ మోదీ శనివారం ఉదయం అమృత్సర్ నుండి ఢిల్లికి వచ్చారు. సివిల్ లైన్స్ ప్రాంతంలోని గుజరాతీ సమాజ్ భవన్లో ఒక గదిని బుక్ చేసుకున్నారు. ఆమె హోటల్ గేటు వద్దకు చేరుకోగానే, బైక్‌ఫై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె పర్సును లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. వాలెట్లో సుమారు రూ. 56,000 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, ఇతర ముఖ్యమైన పత్రాలు ఉన్నాయని ఆమె తెలిపారు. తిరుగు ప్రయాణానికి సంబంధించిన విమాన టికెట్లు కూడా పర్సులోనే ఉన్నాయని దమయంతి బెన్ వాపోయారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
తెగబడ్డ దొంగలు, పరిగెత్తిన మహిళ
-
తెగబడ్డ దొంగలు, పరిగెత్తిన మహిళ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దొంగలు తెగ బడుతున్నారు. పట్టపగలు నడిరోడ్డుపై చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఉత్తర ఢిల్లీలోని పాండవ నగర్ ప్రాంతంలో చోటు చేసుకున్న స్నాచింగ్ తాజాగా కలకలం రేపింది. మంగళవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళ దగ్గర నుంచి స్మార్ట్‌ఫోన్‌ను దుండగులు లాక్కుపోయారు. హెల్మెట్లు పెట్టుకుని బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ దురాగతానికి పాల్పడ్డారు. స్నాచింగ్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైయ్యాయి. దుండగులను ప్రతిఘటించిన బాధితురాలు వారిని పట్టుకునేందుకు కొంచెం దూరం బైక్ వెంట పరిగెత్తిన దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ఈ వీడియోను ట్విటర్ యూజర్ ఒకరు షేర్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా దీనిపై స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు దొంగలను పట్టుకోవడంలో పోలీసులకు సహాయపడగలవని ఆయన అన్నారు. దుండగులు తప్పించుకోలేరని అంటూ ఘటన ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. పాండవ నగర్, పాత్‌పర్‌గంజ్ ప్రాంతాల్లో ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల 50పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అయితే బాధితురాలు అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఉత్తర ఢిల్లీలో స్నాచింగ్ ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత నెలలో లక్ష్మీనగర్‌లో ఇంటి బయట వేచివున్న వృద్ధురాలిని స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు దోపిడీ చేశారు. ఈ దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డైయ్యాయి.