గురి తప్పింది..! బైక్‌ టైర్‌ను కాల్చబోతే స్నాచర్‌ కాలిలోకి తూటా | Mobile phone snatcher, injured in police firing | Sakshi
Sakshi News home page

గురి తప్పింది..! బైక్‌ టైర్‌ను కాల్చబోతే స్నాచర్‌ కాలిలోకి తూటా

Published Mon, Jun 24 2024 7:13 AM | Last Updated on Mon, Jun 24 2024 7:13 AM

Mobile phone snatcher, injured in police firing

సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని సిటీలైట్‌ హోటల్‌ వద్ద యాంటీ స్నాచింగ్‌ టీమ్‌ పోలీసులు.. పారిపోతున్న స్నాచర్ల బైక్‌ టైర్‌ను కాల్చాలని ప్రయతి్నంచినట్లు టాస్‌్కఫోర్స్‌ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్‌ ప్రకటించారు. ఆ తూటా బైక్‌ వెనుక కూర్చున్న నేరగాడి కాలులోకి దూసుకుపోయినట్లు వివరణ ఇచ్చారు. గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఉదంతంలో తప్పించుకున్న ఇద్దరు స్నాచర్లను పట్టుకున్నట్లు ఆదివారం టాస్‌్కఫోర్స్‌ డీసీపీ  పేర్కొన్నారు.  

రెండు ‘పనులు’ చేస్తున్నా చాలక..  
ఫలక్‌నుమాలోని అన్సారీ రోడ్‌ ప్రాంతానికి చెందిన మసూద్‌ ఉర్‌ రెహా్మన్‌ పదో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. బతుకుతెరువు కోసం వెల్డర్‌గా, క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ రెండు పనుల్లోనూ వచ్చే ఆదాయం విలాసాలకు సరిపోకపోవడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టాడు. దీనికోసం దోపిడీలు, చోరీలు చేయాలని పథకం వేశాడు. నాచారం, మైలార్‌దేవ్‌పల్లిల్లో మూడు నేరాలు చేసి జైలుకు వెళ్లాడు. ఈ కేసుల్లో బెయిల్‌పై బయటకు వచి్చన ఇతడి వ్యవహార శైలి మారలేదు. మసూద్‌ తరచూ ముషీరాబాద్‌లో ఉండే తన బంధువు ఇంటికి వెళ్లేవాడు. అక్కడే ఇతడికి స్క్రాప్‌ వ్యాపారం చేసే ఫజల్‌ ఉర్‌ రెహ్మాన్‌తో పరిచయం ఏర్పడింది.  

వాహనంపై తిరుగుతూ వరుస నేరాలు..  
సెల్‌ఫోన్‌ స్నాచింగ్స్‌ చేయాలని నిర్ణయించుకున్న మసూద్‌ తనకు సహకరించాల్సిందిగా ఫజల్‌ను కోరాడు. దీనికి అతడు అంగీకరించడంతో ఇద్దరూ రెండు కత్తుల్ని దగ్గర పెట్టుకుని బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయటకు వచ్చారు. తొలుత చాదర్‌ఘాట్‌లోని ఓ బార్‌ వద్ద ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశారు. ఈ వాహనాన్ని అదును చూసుకుని విక్రయించాలని భావించారు. అప్పటి వరకు భద్రంగా ఉంచడం కోసం భోలక్‌పూర్‌ వరకు తీసుకువెళ్లి ఓ ప్రాంతంలో దాచారు. అదే రాత్రి అట్నుంచి వీరిద్దరు సికింద్రాబాద్‌ వైపు వెళ్లారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్‌ సమీపంలోని గణేష్‌ టెంపుల్‌ వద్ద ఓ వ్యక్తి వీరికి కనిపించాడు.  

కత్తులతో బెదిరించి సెల్‌ఫోన్‌ దోపిడీ.. 
అతడిని అడ్డుకున్న వీరిద్దరు సెల్‌ఫోన్‌ గుంజుకోవడానికి ప్రయతి్నంచారు. బాధితుడు ఎదురు తిరగడంతో వాహనం దిగిన ఇరువురూ కత్తులతో బెదిరించి ఫోన్‌ లాక్కున్నారు. అక్కడి నుంచి తమ వాహనంపై క్లాక్‌ టవర్‌ వైపు వెళ్తూ తమ చేతిలో ఉన్న కత్తుల్ని చూపిస్తూ పాదచారులకు భయభ్రాంతులకు గురి చేశారు. ఇటీవల నగరంలో చోటు చేసుకున్న నేరాల నేపథ్యంలో యాంటీ స్నాచింగ్‌ టీమ్స్‌ రాత్రి వేళ గస్తీ నిర్వహిస్తున్నాయి. పాదచారుల అరుపులు సమీపంలో పెట్రోలింగ్‌ చేస్తున్న బృందం చెవిన పడ్డాయి. అప్రమత్తమైన పోలీసులు ఆ ఇద్దరి వద్దకు చేరుకుని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. మసూద్, ఫజల్‌ కత్తులు చూపిస్తూ పోలీసులను కూడా బెదిరించారు.  

పట్టుకునే ప్రయత్నాల్లో కాల్పులు.. 
అక్కడి నుంచి పారిపోతున్న ఇద్దరు నిందితులను యాంటీ స్నాచింగ్‌ టీమ్‌ వెంబడిస్తూ పోయింది. బాటా షోరూమ్‌ వద్ద మరో పాదచారి నుంచి ఫోన్‌ స్నాచింగ్‌ చేయడానికి వీళ్లు ప్రయతి్నంచి సిటీ లైట్‌ హోటల్‌ వద్దకు చేరుకున్నారు. వీరి వ్యవహారశైలిని గమనించిన ఇద్దరు పోలీసులూ పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా వారి వాహనం ఆపాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం తమ వద్ద ఉన్న తుపాకీతో దాని టైర్‌పై గురిచూసి కాల్చారు. ఈ తూటా వాహనం వెనుక కూర్చున్న నేరగాడి కాలిలోకి దూసుకుపోయింది. మరో తూటా పేలి్చనా ఫలితం లేకపోవడంతో ఇద్దరూ వాహనంపై పారిపోయారు. టాస్‌్కఫోర్స్, నార్త్‌జోన్‌ పోలీసులు ముమ్మరంగా గాలించి ఇద్దరినీ పట్టుకున్నారు. వీరి నుంచి చోరీ సొత్తు, కత్తులు స్వా«దీనం చేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement