
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మలక్‌పేటలో విషాదకర చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న జమున టవర్స్‌లో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతురాలి భర్త వినయ్ కుమార్ గుండెపోటుతో చనిపోయిందని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. దీంతో, ఆమె పేరెంట్స్ వచ్చే సరికే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ప్రయత్నం చేయడంతో అనుమానం వ్యక్తమవుతోంది.
వివరాల ప్రకారం.. కర్నూలుకు చెందిన సింగం శిరీషతో హైదరాబాద్‌కు వినయ్‌కు మధ్య 2017లో వీరికి వివాహం జరిగింది. వీరు మలక్‌పేట జమున టవర్స్‌లో నివాసం ఉంటున్నారు. అయితే, శిరీష అనుమానాస్పద స్థితిలో సోమవారం ఉదయం మృతి చెందారు. అనంతరం, భర్త వినయ్ కుమార్.. ఆమె గుండెపోటుతో చనిపోయిందని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. ఈ క్రమంలో అత్తమామలు, మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరకముందే మృతదేహాన్ని సొంత గ్రామం శ్రీశైలం తరలించే ప్రయత్నం చేశారు.
దీంతో, శిరీష కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దోమలపెంటకు అంబులెన్సులో తరలిస్తుండగా సీసీ ఫుటేజ్ ద్వారా వాహనాన్ని గుర్తించి పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్య చేసి చంపి.. గుండెపోటుగా చెపుతున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

చదవండి: 4 నిమిషాల్లో రూ.29.69 లక్షలు దోచేశారు!
Comments
Please login to add a commentAdd a comment