
22 స్థిర, 8 చరాస్తులను సీజ్ చేసిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ డ్రగ్స్ దందా కేసులో రూ.7.98 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల మేరకు చేపట్టిన ఈ తాత్కాలిక జప్తులో 22 స్థిర, 8 చరాస్తులున్నాయి. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో నిందితుడు ఆశిష్ జైన్, అతని కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న రూ.6.52 కోట్ల విలువైన భూములు, రూ.1.46 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు సీజ్ చేసినట్లు ఈడీ బుధవారం పేర్కొంది.
హైదరాబాద్ దోమలగూడలోని జేఆర్ ఇన్ఫినిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆశిష్ జైన్ డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు 2022లో ఎన్సీబీ అధికారులు గుర్తించారు. ఆశిష్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించి, రూ.3.72 కోట్ల నగదుతో పాటు ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, ఇతర ఎల్రక్టానిక్ గాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు. 2022, మే 4న ఎన్సీబీ కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. జేఆర్ ఇన్ఫినిటీ, ఆశిష్ జైన్, అతని కుటుంబ సభ్యులపై దర్యాప్తు ప్రారంభించింది.
హైదరాబాద్‌లోని ఇంటర్నెట్ ఫార్మసీ ద్వారా అమెరికా తదితర దేశాలకు ఫార్మా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా రహస్యంగా కంపెనీ ఆన్‌లైన్‌లో ఫార్మా మందులతో పాటు జేఆర్ ఇన్ఫినిటీ పేరుతో అక్రమ దందా నడుపుతున్నట్లు తెలుసుకుంది. మెయిల్స్, వీఓఐపీ ద్వారా కస్టమర్ల నుంచి ఆర్డర్స్ తీసుకుని డ్రగ్స్ సరఫరా చేసేవారని, క్రెడిట్ కార్డు, బిట్ కాయిన్స్ ద్వారా చెల్లింపులు కొనసాగుతున్నాయని గ్రహించింది.
అ్రల్ఫాజోలం, జోల్పిడెమ్, లోరాజెపామ్, క్లోనాజెపామ్, హైడ్రోకోడోన్, ఆక్సికోడోన్ తదితర సైకోట్రోపిక్ పదార్థాలను ట్యాబ్లెట్ల రూపంలో చట్టవిరుద్ధంగా ఎగుమతి చేస్తున్నారని విచారణలో తేలింది. జేఆర్ ఇన్ఫినిటీ ఏర్పాటుకు ముందే ఆశిష్‌జైన్, అతని కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో రూ.4.50 కోట్లు విదేశాల నుంచి వచి్చనట్లు తేల్చారు. ఇలా రూ.12.76 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు, స్థిరాస్తుల కొనుగోలుకు వె చ్చించినట్లు ఈడీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment