
సికింద్రాబాద్: చిలకలగూడలో అర్ధరాత్రి సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా హల్‌చల్ చేసింది. వీరని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారిపైకి కాల్పులు జరిపినట్టు సమాచారం. అయితే పోలీసులు వెర్షన్ వేరేగా ఉంది.
చిలకలగూడలో సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న ముఠా తిరుగుతోంది. ఎప్పటి నుంచో ఫిర్యాదులు అందుకుంటున్న పోలీసులు నిన్న రాత్రి సడెన్ డెకాయ్ ఆపరేషన్ చేశారు. అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న ఆ ముఠా పారిపోయేందుకు యత్నించింది.
పారిపోతున్నా దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠాపై ఒక రౌండ్ కాల్పులు చేశారని అంటున్నారు. ముగ్గురు సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వారి పారిపోయే క్రమంలోజరిగిన పెనుగులాటలో మిస్‌ఫైర్ అయిందని పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment