misfire
-
‘రస్ట్’ కేసు కొట్టివేత
శాంటా ఫే: ‘రస్ట్’ సినిమా షూటింగ్ రిహార్సల్స్ సమయంలో 2021లో అలెక్ బాల్డ్విన్(61) చేతిలోని తుపాకీ పేలి సినిమాటోగ్రాఫర్ హలియానా హట్చిన్ ప్రాణాలు కోల్పోయిన ఘటన కేసు మూడేళ్లకు అనూహ్యంగా సుఖాంతమయింది. నటుడు అలెక్ బాల్డ్‌విన్‌పై ఉన్న ‘అసంకల్పిత హత్య’ ఆరోపణలపై విచారణ కొనసాగుతుండగానే న్యూ మెక్సికో కోర్టు జడ్జి అకస్మాత్తుగా కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. కేసులో సాక్షులను అడ్డుకుంటూ పోలీసులు, లాయర్లు వ్యవహరించిన తీరు ఆధారంగానే తీర్పు ఇచ్చినట్లు జడ్జి మేరీ మార్లో సోమర్ తెలిపారు. కోర్టు హాల్లోనే ఉన్న బాల్డ్విన్ తీర్పు విని పట్టరాని ఆనందంతో ఏడ్చేశారు. మూడు దశాబ్దాలకు పైగా మంచి నటుడిగా పేరున్న బాల్డ్విన్ కెరీర్ 2021 నాటి ఘటనతో ప్రశ్నార్థకంలో పడింది. -
సూపర్ పోలీస్
సాక్షి, హైదరాబాద్: ‘మెడలో లావుపాటి బంగారం గొలుసు వేసుకొని, ఫోన్ మాట్లాడుతూ ఎంచక్కా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నాడు ఓ బాటసారి. వెనకాలే బైక్ మీద వచ్చిన ఇద్దరు స్నాచర్లు అతని మెడ మీద నుంచి చెయిన్‌ను స్నాచింగ్ చేసే ప్రయత్నం చేయగా.. వెంటనే బైక్ వెనకాల నుంచి బుల్లెట్ పేలింది. అంతే బైక్ వెనక కూర్చున్న స్నాచర్ కాలిలో బుల్లెట్ దిగింది. ఏం జరుగుతుందో అర్థం కాని స్నాచర్ల బైక్ రేస్ పెంచి అక్కణ్నుంచి ఉడాయించారు’... ఇదీ స్నాచర్లను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వేసిన ప్లాన్. ఇటీవల కాలంలో నగరంలో ధార్, బవారియా గ్యాంగ్‌ల వరుస చెయిన్ స్నాచింగ్‌ల నేపథ్యంలో సిటీ పోలీసులు స్నాచర్ల కోసం వల వేశారు. స్థానిక ఠాణా, సీఆర్ హెడ్ క్వార్టర్స్ పోలీసులతో యాంటీ స్నాచింగ్ డెకాయ్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.ముందు చెయిన్, వెనక తుపాకీ..సిటీలోని ప్రతి పోలీసు స్టేషన్, సీఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇద్దరేసి చొప్పున మొత్తం నలుగురితో ఈ టీమ్ ఉంటుంది. ఠాణాకు చెందిన పోలీసు మఫ్టీ డ్రెస్‌లో మెడలో చెయిన్ వేసుకొని, బయటికి కనిపించేలా రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతూ వెళ్తుంటాడు. ఇతనికి కాస్త దూరంలో తుపాకీతో సీఆర్ హెడ్ క్వార్టర్ పోలీసు నిఘా పెడుతూ నడుస్తుంటాడు. వీరిని సామాన్యులుగా భావించిన స్నాచర్లు స్నాచింగ్ చేసేందుకు వీరిని వెంబడిస్తారు. స్నాచింగ్ చేసే క్రమంలో పోలీసులు అప్రమత్తమై నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. ఒకవేళ వారు పారిపోయేందుకు ప్రయత్నిస్తే.. వెనకాల తుపాకీతో గస్తీ కాస్తున్న పోలీసు వెంటనే నిందితులపై కాల్పులు జరుపుతారు.రెండు చోట్ల కాల్పులు, ఏడుగురు అరెస్టు..ఈ క్రమంలో శుక్రవారం రాత్రి చిలకలగూడ పీఎస్ పరిధిలోని ఆలుగడ్డ బావి ప్రాంతంలో మెడలో చెయిన్ వేసుకొని పోలీసులు వెళుతుండగా.. వెనక నుంచి ఇద్దరు స్నాచర్లు బైక్ వచ్చి స్నాచింగ్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో వెనక నుంచి మరో పోలీసు కాల్పులు జరపడంతో ఓ స్నాచర్కు కాలులో బుల్లెట్ దిగింది. గాయంతోనే బైక్ మీద పారిపోయిన ఇద్దరు నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఇదే తరహాలో శనివారం మార్కెట్ స్టేషన్ పరిధిలోని బాట వద్ద స్నాచింగ్ చేసేందుకు వచ్చిన రెండు బృందాలపై పోలీసులు కాల్పులు జరిపి, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఐదుగురు ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరు స్నాచర్లను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి, విచారిస్తున్నారు. శనివారం నుంచి టాస్క్‌ఫోర్స్ పోలీసులలో ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్ ఛబుత్రా’ టీమ్స్ పని చేయనున్నాయి. అర్థరాత్రి వీధుల్లో తిరిగే ఆకతాయిలను ఈ బృందాలు పట్టుకొని, కౌన్సెలింగ్ ఇస్తాయి. -
HYD: చిలుకలగూడలో కాల్పలు కలకలం
సికింద్రాబాద్: చిలకలగూడలో అర్ధరాత్రి సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా హల్చల్ చేసింది. వీరని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారిపైకి కాల్పులు జరిపినట్టు సమాచారం. అయితే పోలీసులు వెర్షన్ వేరేగా ఉంది.చిలకలగూడలో సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న ముఠా తిరుగుతోంది. ఎప్పటి నుంచో ఫిర్యాదులు అందుకుంటున్న పోలీసులు నిన్న రాత్రి సడెన్ డెకాయ్ ఆపరేషన్ చేశారు. అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న ఆ ముఠా పారిపోయేందుకు యత్నించింది.పారిపోతున్నా దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠాపై ఒక రౌండ్ కాల్పులు చేశారని అంటున్నారు. ముగ్గురు సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వారి పారిపోయే క్రమంలోజరిగిన పెనుగులాటలో మిస్‌ఫైర్ అయిందని పోలీసులు చెబుతున్నారు. -
గన్ మిస్‌ఫైర్.. డీఎస్పీ మృతి
సాక్షి,భద్రాద్రికొత్తగూడెంజిల్లా: సీఆర్పీఎఫ్ క్యాంపులో గన్ మిస్‌ఫైర్ అయి డీఎస్పీస్థాయి అధికారి శేషగిరి మృతి చెందినట్లు తెలుస్తోంది. చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామంలోని క్యాంపులో బుధవారం(ఏప్రిల్24) ఈ ఘటన జరిగింది. పూసుగుప్ప సీఆర్పీఎఫ్ 81 బెటాలియన్ క్యాంపులో శేషగిరి విధులు నిర్వహిస్తున్నారు. ఛాతిలోకి బుల్లెట్ దూసుకెవెళ్లడంతో శేషగిరిని చికిత్స నిమిత్తం హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఇది మిస్‌ఫైరా లేక ఆత్మహత్యనా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు వివరాలు గోప్యంగా ఉంచడంతో ఈ ఘటనపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. -
పాకిస్తాన్ పై భారత్ క్షిపణి ప్రయోగం... ప్రమాదవశాత్తు జరిగిందని వివరణ
Defence Ministry said Technical Malfunction: భారత్ ప్రమాదవశాత్తు పాకిస్థాన్‌పైకి క్షిపణిని ప్రయోగించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్షిపణి పాకిస్తాన్లో ల్యాండ్ అవ్వడానికి ముందు గగనతలంలో సుమారు 100 కి.మీ పైగా వేగంతో దాదాపు 40 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించిందని పేర్కొంది. సాంకేతిక లోపం కారణంగా ఈ సంఘటన జరింగిందని తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈ క్షిపణి మార్చి 9, 2022న, సాధారణ నిర్వహణ సమయంలో, సాంకేతిక లోపం కారణంగా ప్రమాదవశాత్తూ ఈ క్షిపణి పేలిందని రక్షణ శాఖ వివరణ ఇచ్చింది. అంతేకాదు భారత ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఇస్లామాబాద్‌లోని భారత్ ఛార్జ్ డి'అఫైర్స్‌ను పిలిపించి భారత్‌కి చెందిన సూపర్-సోనిక్ ఫ్లయింగ్ క్షిపణి సూరత్‌గఢ్ నుంచి పాకిస్తాన్లోకి ప్రవేశించిందని తెలిపింది. ఈ చర్యను గగనతలంలో అకారణ ఉల్లంఘనగా పేర్కొంటూ నిరసన వ్యక్తం చేసింది. అంతేకాదు ఇలాంటి చర్యల వల్ల పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అందువల్ల ఈ ఘటనపై భారత్ సత్వరమే విచారణ జరపాలని పాకిస్థాన్ కోరింది. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ భారత్‌ను హెచ్చరించింది. అంతేకాదు ఈ క్షిపణి పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్ చున్ను నగరం సమీపంలో సాయంత్రం 6:50 గంటల సమయంలో కూలిందని తెలిపింది. దీని వలన పౌర ఆస్తులకు నష్టం వాటిల్లిందని కూడా పేర్కొంది. (చదవండి: ఉగ్రవాదుల ఏరివేత.. జమ్ముకశ్మీర్‌లో హైఅలర్ట్) -
ఘోరం: కుందేలు అనుకోని మిత్రునిపై తూటా.. దీంతో..
సాక్షి, మైసూరు(కర్ణాటక): వలస కూలీ బతుకు విషాదాంతమైంది. కుందేలు అనుకుని స్నేహితుడు కాల్చడంతో చనిపోయాడు. వివరాలు.. కేరళకు చెందిన ఎంఎస్ ప్రసన్న, నంజనగూడు తాలూకాలోని కురిహుండి గ్రామంలో అల్లం తోటలో కూలీ. నంజనగూడు తాలూకా కుత్తువాడి గ్రామానికి చెందిన స్నేహితుడు నిషాద్ ఇంటికి ప్రసన్న భోజనానికి బయల్దేరాడు. అదే సమయంలో నిషాద్ కుందేళ్లను వేటాడాలని తుపాకీతో పక్కనే ఉన్న పొలానికి వెళ్లాడు. దూరంగా పొదల్లో ప్రసన్న నడిచి వస్తుండగా కుందేలు అనుకుని నిషాద్ తుపాకీ పేల్చాడు. దగ్గరికి పోయి చూడగా ప్రసన్న తూటా తగిలి గాయపడి ఉన్నాడు. వెంటనే కేఆర్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. నిషాద్ పరారీలో ఉన్నాడు. హుల్లహళ్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. చదవండి: మనోవేదన: చితి పేర్చుకుని దూకేశాడు -
నిర్మల్ జిల్లా: కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తుపాకీ మిస్‌ఫైర్
-
తుపాకీ మిస్‌ఫైర్
-
పెద్దపల్లిలో తుపాకి మిస్ పైర్ కలకలం
-
ఏమరుపాటుతో పేలుతున్న గన్లు
సాక్షి, అమరావతి: బతుకుదెరువు కోసం ఎంచుకున్న పోలీస్ ఉద్యోగంలో ఏమరుపాటు వారి ప్రాణాలనే తీస్తోంది. రక్షించాల్సిన తుపాకీ వారి ప్రాణాలనే బలితీసుకుంటోంది. మంత్రులు, అధికారుల అంగరక్షకులు (గన్మెన్లు) ఇటీవల మిస్‌ఫైర్ అయ్యి మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి గన్‌మెన్ చంద్రశేఖర్‌రెడ్డి కడపలో గురువారం రివాల్వర్ శుభ్రం చేసుకుంటూ మిస్‌ఫైర్ అయ్యి దుర్మరణం చెందడం చర్చనీయాంశమైంది. ఢిల్లీ ఏపీ భవన్ నుంచి ఏపీ, తెలంగాణల్లోను ఈ తరహా ఘటనలు పెరగడం పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ ఏడాది జనవరి 2న కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు బందోబస్తుకు వచ్చిన ఏఆర్ కానిస్టేబుల్ హంపన్న చేతిలో ఏకే47 గన్ మిస్‌ఫైర్ అయ్యింది. తీవ్రగాయాలైన హంపన్నను ఆసుపత్రికి తీసుకెళ్లి అత్యవసర వైద్యసేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు. గతేడాది జూలైలో ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ అకాడమిలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్న కార్యక్రమంలో ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ వాసుదేవరెడ్డి చేతిలో గన్ మిస్‌ఫైర్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్లో 2015 అక్టోబర్‌లో 404 గదిలో జరిగిన కాల్పుల్లో పోలీస్ అధికారి ఒకరు గాయపడగా అది మిస్‌ఫైర్‌గా విచారణలో నిర్ధారించారు. గతేడాది జూన్‌లో పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్ అనుమానాస్పదంగా మృతిచెందడం అప్పట్లో కలకలం రేపింది. ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ అయ్యి చనిపోయాడని తొలుత భావించినప్పటికీ ఆయన కణతికి దగ్గర్లో కాల్చుకున్నట్టు ఉండటంతో ఆత్మహత్య అయి ఉండొచ్చని అప్పట్లో పోలీసు ఉన్నతాధికారులు భావించారు. అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో నెల్లూరు ఏఎస్పీ శరత్‌బాబు కారుడ్రైవర్‌గా ఉన్న కానిస్టేబుల్ రమేష్‌బాబు రివాల్వర్ కాల్పులతో అనుమానాస్పదంగా దుర్మరణం పాలయ్యాడు. ఇలా ఎందుకు జరుగుతోంది.. పోలీసులకు శిక్షణ సమయంలో ఆయుధాలు వినియోగించడంతో పాటు వాటిని భద్రంగా చూసుకోవడంలో కూడా తర్ఫీదు ఇస్తారు. ఏడాదికి ఒకసారి జిల్లా కేంద్రం నుంచి ఒక హెడ్‌కానిస్టేబుల్ (ఆర్మర్) ప్రతీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆయుధాల పనితీరు పరిశీలించి, మరమ్మతులు చేస్తారు. గన్లు, తుపాకులు వెంట తీసుకెళ్లినప్పుడు లోడ్ చేసినప్పటికీ బ్యాక్ లాక్ వేస్తారు. ఫైర్ ఓపెన్ చేయాల్సి వస్తే లాక్ తీసి ఆయుధాలను వినియోగిస్తారు. ఇలాంటి సమయంలో మిస్‌ఫైర్ కావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయని ఒక పోలీస్ అధికారి చెప్పారు. ఇటువంటి ఘటనల్లో ఎక్కువగా ఉద్దేశపూర్వకంగా కాల్పుకోవడం, ఎవరైనా కాల్చడం జరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కారణం ఏదైనా మిస్‌ఫైర్‌కు పోలీసుల బతుకు బలైపోతుంటే వారి కుటుంబాలు మాత్రం దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న మిస్‌ఫైర్ వ్యవహారంపై పోలీస్ బాస్ దృష్టిపెడితే తమ ఆయుధాలకే బలైపోతున్న పోలీసుల ప్రాణాలు కాపాడినట్టు అవుతుందని పలువురు పేర్కొంటున్నారు. -
మిస్‌ఫైర్ కాదు.. హత్యే!
-
మిస్‌ఫైర్ కాదు.. హత్యే!
ఏఎస్పీ కారు డ్రైవర్ రమేష్ తండ్రి ఆరోపణ నెల్లూరు సిటీ: తన కుమారుడిని హత్యచేసి మిస్‌ఫైర్‌గా చిత్రీకరిస్తున్నారని ఏఎస్పీ కారు డ్రైవర్ రమేష్ తండ్రి వెంకటేశ్వర్లు ఆరోపించారు. శనివారం రాత్రి నెల్లూరులో అడిషనల్ ఎస్పీ బి.శరత్‌బాబు గన్‌మన్ కె.నాగేంద్ర వద్దనున్న ఏకే 47 మిస్‌ఫైర్ అయి ఏఎస్పీ కారు డ్రైవర్ రమేష్ (32) మృతిచెందిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం నెల్లూరు కిమ్స్ ఆస్పత్రి నుంచి రమేష్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తుండగా బంధువులు అడ్డుకున్నారు. విచారణ నిర్వహించి న్యాయం చేస్తామని ఎస్పీ రామకృష్ణ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురానికి చెందిన రమేష్ 2009 బ్యాచ్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. ఐదేళ్లుగా ఏఎస్పీ కారు డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏఎస్పీ శరత్‌బాబు వద్ద ఏడాదిన్నర నుంచి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఎస్పీ రామకృష్ణ ఓ కేసు విషయంపై మాట్లాడేందుకు రావాలని ఏఎస్పీ శరత్‌బాబును పిలిపించారు. దీంతో ఆయన ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ గన్‌మన్ కె.నాగేంద్ర కారు దిగి ఏకే 47ను చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గన్ మిస్‌ఫైర్ అయి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న రమేష్ ఛాతిలోకి ఓ బుల్లెట్, రెండో బుల్లెట్ రమేష్ చేతికి తగిలి పక్కకు వెళ్లింది. దీంతో రమేష్‌ను నెల్లూరు కిమ్స్ (బొల్లినేని హాస్పిటల్)కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 10.45 గంటలకు మృతిచెందారు. ఇదిలా ఉండగా రమేష్ మృతదేహాన్ని ఆదివారం ఉదయం హాస్పిటల్ నుంచి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలిస్తుండగా కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనిపై విచారణ జరిపిస్తామని ఎస్పీ హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం రమేష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆయన సొంత ఊరు సీతారామపురానికి పోలీసులు తీసుకెళ్లారు. సోమవారం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ఏకే 47 మిస్‌ఫైర్
నెల్లూరు: ఏఎస్పీ శరత్‌బాబు గన్‌మెన్ ఏకే-47 మిస్‌ఫైర్ అవడంతో డ్రైవర్ రమేష్ మృతిచెందారు. ఈ సంఘటన జిల్లా పోలీసు కార్యాలయంలో చోటుచేసుకుంది. వివరాలు ఏకే 47 మిస్‌ఫైరై రమేష్ ఛాతిలోకి ఒక్కసారిగా బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రమేష్ చనిపోయారు. కాగా రమేష్‌ను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలన్నారు. -
సీఎం బందోబస్తులో అపశృతి
-
సీఎం బందోబస్తులో అపశృతి
కల్లూరు: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడి బందోబస్తులో అపశృతి చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లె గ్రామం వామసముద్రం కొండల్లో బందోబస్తు నిర్వహిస్తున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ అంబన్న తుపాకీ మిస్‌ఫైర్ అయింది. దీంతో బుల్లెట్ ఆయన ఛాతీలోకి దూసుకెళ్లింది. తీవ్రంగా రక్తస్రావం అవటంతో హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన కానిస్టేబుల్ అంబన్న అనంతపురం బెటాలియన్‌కు చెందిన వ్యక్తి. ఈ ఘటనపై పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు. -
మద్యం మత్తులో తుపాకీ పేలుడు
ప్రభుత్వాస్పత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ కలకలం నెల్లూరు(క్రైమ్): నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం తుపాకి పేలింది. ప్రిజనర్స్ వార్డ్ గార్డ్ డ్యూటీ నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ మద్యం మత్తే ఇందుకు కారణమని తెలుస్తోంది. తూటా గోడకు తగలడంతో ప్రమాదం తప్పింది. పోలీసుల సమాచారం మేరకు.. జి.అనిల్ నెల్లూరు ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్. ఆయన కొద్దిరోజులుగా డీఎస్ఆర్ ప్రభుత్వాస్పత్రిలో ప్రిజనర్స్(ఖైదీలు)వార్డ్ గార్డ్ డ్యూటీ చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం డ్యూటీకి వచ్చారు. అయితే అప్పటికే పూటుగా మద్యం సేవించి ఉండటంతో వార్డ్ వద్ద హల్చల్ చేశారు. సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో తన వద్ద నున్న 303 రైఫిల్‌ని చేతులతో తిప్పసాగాడు. ఈవిషయాన్ని గమనించిన తోటి సిబ్బంది అతడిని వారించారు. అయినా అతను పెడచెవిన పెట్టి తిప్పుతూ ఉన్న సమయంలో పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. ఏం జరిగిందోనని సమీప వార్డులోని రోగులు, సహచర సిబ్బంది భయాందోళనకు గురైయ్యారు. రోగులు బయటకు పరుగులు తీశారు. సహచర సిబ్బంది ఏం జరిగిందోనని పరిశీలించగా అనిల్ చేతిలో ఉన్న తుపాకి పేలి అందులోని తూటా ఎదురుగా ఉన్న గోడను తగిలి కిందపడి ఉండటాన్ని గుర్తించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అనిల్ చేతిలో ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం జరిగిన విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆర్ఐ కె.శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనిల్ మద్యం మత్తులో ఉండటంతో ట్రాఫిక్ సిబ్బంది ద్వారా బ్రీత్‌ఎన్‌లైజర్‌తో పరీక్షలు నిర్వహించారు. కానిస్టేబుల్ అనిల్ అధిక మొత్తంలో మద్యం సేవించి ఉండటాన్ని గుర్తించి వైద్యపరీక్షల నిమిత్తం అతడిని ఎమెర్జెన్సీ వార్డుకు పంపారు. తూటాను, తుపాకీని స్వాధీనం చేసుకొన్నారు. తుపాకీ పేలుడు ఘటనపై విచారణ జరుగుతోందని, నివేదికను ఎస్పీకి అందజేయనున్నట్లు ఆర్ఐ కె.శ్రీనివాసరావు తెలిపారు. తుపాకీ గోడకు తగలడంతో ప్రమాదం తప్పిందని ఆయన తెలిపారు. -
యుద్ధనౌకలో మిస్‌ఫైర్!
• నేవీ సబ్ లెఫ్టినెంట్ తేజ్వీర్ సింగ్ మృతి • ఐఎన్ఎస్ కతార్‌లో పిస్టల్ శుభ్రం చేస్తుండగా ఘటన • ఆత్మహత్య అనే అనుమానాలు సాక్షి, విశాఖపట్నం/మల్కాపురం: పిస్టల్‌ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలిన (మిస్‌ఫైర్) సంఘటనలో తూర్పు నావికాదళానికి చెందిన సబ్ లెఫ్టినెంట్ తేజ్వీర్ సింగ్ మరణించారు. హర్యానాకు చెందిన సింగ్ విశాఖ కేంద్రంగా ఐఎన్ఎస్ కుతార్ యుద్ధ నౌకలో విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నౌకలో విధి నిర్వహణలో ఉన్నారు. తన 9 ఎంఎం పిస్టల్‌ను శుభ్రపరుస్తుండగా ప్రమాదవశాత్తూ అది పేలింది. తీవ్రంగా గాయపడిన సింగ్‌ను వెంటనే నేవల్ ఆస్పత్రి ఐఎన్ఎస్ కళ్యాణికి తరలించారు. ఆయన ప్రాణాలు కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, తేజ్వీర్ సింగ్ చనిపోయారని నేవీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. హర్యానాలోని సింగ్ కుటుంబసభ్యులకు ఈ మేరకు సమాచారం తెలియజేశారు. అయితే సింగ్ ఆత్మహత్య చేసుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు నేవీ అధికారులు ఒక సూసైడ్ నోటును గుర్తించినట్లు తెలుస్తోంది. నౌకాదళ అధికారులు మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు. వారి ఫిర్యాదు మేరకు మల్కాపురం సీఐ కేశవరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సబ్‌మెరైన్‌లో విద్యుత్ షాక్‌తో సైలర్ మృతి ఐఎన్ఎస్ సింధుధ్వజ్ సబ్‌మెరైన్‌లో విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రికల్ పవర్ సైలర్ పవన్‌కుమార్ పాండే మృత్యువాత పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేవీ అధికారుల కథనం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మెయింటెనెన్స్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పాండే షాక్‌కు గురికాగానే నేవల్ ఆస్పత్రి ఐఎన్ఎస్ కళ్యాణికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు ఆయన మృతి చెందారు. ఈ రెండు ఘటనలపై నౌకాదళం విచారణకు ఆదేశించింది. -
సర్పంచ్ రివాల్వర్ మిస్‌ఫైర్
గన్‌మన్‌కు తీవ్ర గాయం బండి ఆత్మకూరు: బోధనం గ్రామ సర్పంచ్ మల్లేశ్వర రెడ్డి రివాల్వర్ మిస్‌ఫైర్ కావడంతో ఆయన వెంట ఉన్న గన్‌మెన్ సుబ్రమణ్యం కాలుకు తీవ్రగాయమైంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ సాయినాథ్ సంఘటన స్థలానికి చేరుకొని సర్పంచ్‌కు చెందిన రివాల్వర్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. 2012 అక్టోబర్ 14వ తేదీ రాత్రి ప్రత్యర్థులు జరిపిన దాడిలో సర్పంచ్ మల్లేశ్వర రెడ్డి తృటిలో తప్పించుకోగా అదే గ్రామానికి చెందిన రామేశ్వర్‌రెడ్డి, శివరామిరెడ్డి హతమయ్యారు. ఈ కేసులో ఇదే గ్రామానికి చెందిన ఏడుగురిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో ప్రధాన సాక్షిగా ఉన్న మల్లేశ్వర రెడ్డికి ప్రత్యర్థుల నుంచి ముప్పు పొంచి ఉండడంతో తనకు రివాల్వర్ కావాలని పోలీసు ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయనకు ప్రభుత్వం రివాల్వర్‌కు అనుమతి ఇచ్చింది. అంతేగాక 1ప్లస్1 చొప్పున గన్మెన్లను రక్షణగా కేటాయించింది. గురువారం బోధనం సమీపంలో జరుగుతున్న వంతెన పనులను మల్లేశ్వరరెడ్డి పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ కాసేపు రివాల్వర్‌ను తనవద్దే ఉంచుకొని కూర్చున్నారు. అకస్మాత్తుగా పైకి లేవడంతో రివాల్వర్ కింద పడి మిస్ ఫైర్ అయింది. పక్కనే ఉన్న గన్‌మన్ సుబ్రమణ్యం కాలులోకి బుల్లెట్ చొచ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆయనను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. -
కలకలం సృష్టించిన 'మిస్ ఫైర్'
సీఎం భద్రతా సిబ్బందిలో కమాండోకు బుల్లెట్ గాయం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పట్టణ పోలీసులు మంగళగిరి : సీఎం భద్రత కోసం రాత్రి వేళలో నిఘా పర్యవేక్షించే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) సిబ్బందిలో ఓ కమాండోకు బుల్లెట్ గాయమైన ఘటన కలకలం సృష్టించింది. పట్టణంలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్‌లో గురువారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు నివాసం ఉండటంతో పాటు పలువురు అగ్రనేతలు పర్యటిస్తుంటారు. వారి భద్రతా చర్యల నిమిత్తం ఎన్ఎస్జీ సిబ్బంది 140 మందితో కూడిన బృందం పట్టణంలోని ఆరవ ఏపీఎస్పీ బెటాలియన్‌లో బస చేస్తోంది. వీరు రాత్రి వేళ గస్తీ తిరుగుతూ విధులు నిర్వహిస్తుంటారు. అగ్రనేతల భద్రత నిమిత్తం రాత్రివేళ కొండ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ ఇంటిలిజెన్స్‌కు నివేదిక ఇచ్చే నిమిత్తం నాలుగు రోజులుగా 140 మంది కమాండో బృందం మంగళగిరితో పాటు రాజధాని ప్రాంతాల్లో గస్తీ తిరుగుతున్నారు. ఈ క్రమంలో విధులలో భాగంగా గురువారం విజయవాడలోని ఓ వాణిజ్య సముదాయంలో శిక్షణ పొందేందుకు వెళ్తుండగా ఎన్ఎల్కే శ్రీనివాస్ అనే కర్ణాటకకు చెందిన కమాండో జాకెట్లో వున్న 9 ఎంఎం పిస్టల్ ప్రమాదవశాత్తూ పేలింది. దీంతో అతని కుడి కాలులోకి బుల్లెట్ దూసుకుపోయింది. వెంటనే తోటి సిబ్బంది, అధికారులు ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స చేయించి హుటాహుటిన వారి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారు. కాగా, కర్ణాటక రాష్ట్రంలోని మిద్యానగర్కు చెందిన శ్రీనివాస్ 2002లో ఆర్మీలో చేరి ఏడాది క్రితం హర్యానా రాష్ట్రం తరఫున ఎన్ఎస్జీలో శిక్షణ పొందుతున్నాడు. సీఎం తదితర ప్రముఖుల భద్రతకు నియమించిన కమాండోలే నిర్లిప్తంగా ఉండటాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఈ ఘటనపై పట్టణ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఏపీ భవన్లో తుపాకీ మిస్‌ఫైర్!
న్యూఢిల్లీ : ఢిల్లీ ఏపీభవన్‌లో ప్రమాదవశాత్తూ తుపాకీ మిస్‌ఫైర్ అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోదావరి బ్లాక్‌లోని 404 గదిలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తెలంగాణ ఇన్స్పెక్టర్ రవికిరణ్ గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రివాల్వర్ బెల్టును నడుముకు పెట్టుకున్న రవికిరణ్...సెల్‌ఫోన్ కిందపడటంతో దాన్ని తీసుకునే ప్రయత్నంలో కిందకు వంగారు. దీంతో ఒత్తిడికి గురై రివాల్వర్ పేలడంతో కాలికి గాయమైంది. గతంలో ఆయన తిరుమలగిరి సీఐగా పనిచేశారు. ప్రస్తుతం రవికిరణ్ సీసీఎస్ లో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఎన్ మిషన్ లో పాల్గొనేందుకు రవికిరణ్ ఢిల్లీ వెళ్లారు.ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రివాల్వర్ మిస్ ఫైర్
అనంతపురం: అనంతపురం జిల్లా కేంద్రంలో సోమవారం రివాల్వర్ మిస్ ఫైర్ అయింది. విధుల్లో ఉన ఏఎస్ఐ రివాల్వర్‌ను సరిచేస్తుండగా బుల్లెట్లు దూసుకు వచ్చాయి. దీంతో సంఘటనా ప్రదేశంలో ఉన్న ముగ్గురు కానిస్టేబుల్లు గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
బతుకు తెల్లారిపోయింది..
- మిస్‌ఫైర్ అయిన రైల్వే పిస్తోలు - ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మృతి - మరో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు డాబాగార్డెన్స్: వేకువజామునే లేచాడు. ఉదయం 4.30 గంటలకే డ్యూటీకి బయలుదేరుతుంటే.. ‘తెల్లవారేక వెళ్లొచ్చు కదా’ అంటూ భార్య వారించింది. ‘ఢిల్లీ నుంచి రైల్వే బోర్డు సభ్యుడొచ్చారు. ఆయనతో అరకు స్పెషల్ డ్యూటీకెళ్లాలంటూ..’ చకచకా వెళ్లిపోయాడు. కాసేపటికే పిడుగులాంటి వార్త. భర్త చనిపోయాడని తెలుసుకొని ఆ ఇల్లాలు సొమ్మసిల్లిపోయింది. ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ముసలయ్య ఇంట్లో నెలకొన్న విషాదమిది. కన్నీరుమున్నీరవుతున్న ఆయన భార్య కృష్ణవేణిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. నగరంలో జరుగుతున్న డీజిల్ లోకో షెడ్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన రైల్వే బోర్డు సభ్యుడు హేమంత్‌కుమార్‌కు ఎస్కార్ట్‌గా ఎనిమిది మంది సభ్యులతో ఏర్పాటు చేసిన రక్షక దళంలో ముసలయ్య ఉన్నారు. ఎస్కార్ట్‌గా వెళ్లే వారి వద్ద పిస్తోలు ఉండాలనే ఆదేశంతో డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం వెనుక భాగాన ఉన్న ఆయుధలు భద్రపరిచే గదికి ఎనిమిది మంది రక్షక దళం వెళ్లారు. కానిస్టేబుల్ కె.సి.ప్రధాని 9 ఎమ్ఎమ్ పిస్తోలును చెక్ చేస్తుండగా మిస్‌ఫైర్ అయింది. పక్కనే ఉన్న హెడ్ కానిస్టేబుల్ ధర్మాన ముసలయ్య (48) ఛాతి కింద భాగాన కుడి వైపున బుల్లెట్ దిగబడి ఎడమ వైపుకు దూసుకుపోయి పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ ఎస్.మల్లికార్జునరావుకు కూడా ఛాతి వెనుక భాగాన దిగబడింది. ఈ దుర్ఘటన మిగతా ఆర్పీఎఫ్ సిబ్బందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హుటాహుటిన పక్కనే ఉన్న రైల్వే ఆస్పత్రికి తరలిస్తుండగా హెచ్‌సీ ముసలయ్య మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మల్లికార్జునరావు సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం శస్త్రచికిత్స చేసి బుల్లెట్‌ను తొలగించారు. ఇంటి నుంచి బయలుదేరిన భర్త ఇలా విగత జీవిగా తిరిగివస్తారనుకోలేదని ముసలయ్య భార్య కృష్ణవేణి రోదనను చూసిన వారందరూ కంటతడిపెట్టారు. సమాచారం తెలుసుకున్న రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఎదురుగా ఉన్న గోర్ఖాలేన్లో నివాసం ఉంటున్న ముసలయ్య బంధువులు, సన్నిహితులు రైల్వే ఆస్పత్రికి చేరుకున్నారు. రైల్వే పోలీసులు, టూటౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముసలయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు రాకేష్ బీటెక్ పూర్తి చేసి ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు రాజేష్ రూర్కెలాలో ఎన్ఐటీ చదువుతున్నాడు. -
పిస్తోలు మిస్‌ఫైర్: హెడ్ కానిస్టేబుల్ మృతి
పిస్తోలు మిస్‌ఫైర్: హెడ్ కానిస్టేబుల్ మృతి విశాఖపట్నం: పిస్తోలు చెక్ చేసే ప్రయత్నంలో మిస్‌ఫైర్ కావడంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) హెడ్ కానిస్టేబుల్ ఒకరు మృతి చెందగా మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. విశాఖ రైల్వే డివిజనల్ కార్యాలయం వెనుక భాగాన ఆయుధాలను భద్రపరిచే గదిలో ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. రైల్వే డీజిల్ లోకోషెడ్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి విశాఖ వచ్చిన రైల్వే బోర్డు సభ్యుడు (మెకానికల్) హేమంత్‌కుమార్ ఆదివారం ఉదయం అరకు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. ఆయనకు ఎస్కార్ట్‌గా వెళ్లాల్సిన బృందంలోని వారికి కేటాయించిన 9 ఎమ్ఎమ్ పిస్తోలును అక్కడి సిబ్బంది అందజేశారు. ఇలా కానిస్టేబుల్ కె.సి.ప్రధాని తన పిస్తోలును చెక్ చేస్తుండగా మిస్‌ఫైర్ అయింది. పక్కనే ఉన్న హెచ్.సి. ధర్మాన ముసలయ్య (48) ఛాతీలోకి బుల్లెట్ దిగబడి, ముందుకు దూసుకుపోయి పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ ఎస్.మల్లికార్జునరావు ఛాతీ వెనుక భాగాన దిగబడింది. వీరిని పక్కనే ఉన్న రైల్వే ఆస్పత్రికి తరలిస్తుండగా ముసలయ్య మృతి చెందాడు. మల్లికార్జునరావుకు శస్త్రచికిత్స చేసి బుల్లెట్‌ను తొలగించారు. రైల్వే పోలీసులు, టూటౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తుపాకీ మిస్‌ఫైర్‌పై విచారణ
విజయవాడ సిటీ : నగర సాయుధ విభాగంలోని బెల్లా ఫామ్స్(ఆయుధాగారం)లో తుపాకీ తూటా పేలుడుపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి విధులు ముగించిన తర్వాత ఏఆర్ ఎస్ఐ డిపాజిట్ చేసిన 9ఎం.ఎం. పిస్టల్ నుంచి తూటా బయటకు వచ్చిన విషయం తెలి సిందే. కానిస్టేబుల్ కుమారస్వామి సినీ ఫక్కీలో తుపాకీని తిప్పడంతో ఈ ఘటన జరిగింది. విషయం బయటకు పొక్కకుండా చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కొద్దిరోజుల కిందట రాష్ట్రమంత్రి దేవినేని ఉమా ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న గార్డు చేతిలోని 303 రైఫిల్ పేలిన విషయం తెలిసిందే. వరుస ఘటనలతో ఆగ్రహించిన పోలీసు అధికారులు ఏఆర్ అధికారుల పనితీరుపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంగళవారం ఆర్మ్డ్ రిజర్వ్డ్(ఏఆర్) అధికారులను కమిషనరేట్‌కు పిలిచి విచారణ చేశారు. కమిషనరేట్ పరిపాలనా విభాగం డీసీపీ జి.వి.జి.అశోక్‌కుమార్ సంబంధిత అధికారుల నుంచి వివరాలు నమోదు చేసినట్టు తెలిసింది. జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను తయారు చేసే పనిలో అధికారులు ఉన్నారు. కమిషనరేట్ ఉన్నతాధికారులు ఏఆర్ విభాగం కార్యకలాపాలపై దృష్టి సారించి సంబంధిత అధికారుల విషయాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. -
ఎన్పీఏలో రైఫిల్ మిస్‌ఫైర్
ఒకరికి తీవ్రగాయాలు: పరిస్థితి విషమం సాక్షి, సిటీబ్యూరో: సర్దార్ వల్లభభాయి పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో మంగళవారం ప్రమాదవశాత్తు తుపాకి పేలి ఓ వర్కర్ తీవ్రగాయాల పాలయ్యాడు. నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగే పాసింగ్ అవుట్ పెరేడ్ కోసం ఏర్పాట్లలో భాగంగా ఆయుధాలను ఒకచోట నుంచి మరొక చోటుకి తరలిస్తుండగా, ఓ తుపాకి ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటనలో హబీబ్ అనే వర్కర్ తీవ్రంగా గాయపడ్డాడు. అధికారులు వెంటనే అతన్ని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.