సీఎం బందోబస్తులో అపశృతి
కల్లూరు: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడి బందోబస్తులో అపశృతి చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లె గ్రామం వామసముద్రం కొండల్లో బందోబస్తు నిర్వహిస్తున్న ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ అంబన్న తుపాకీ మిస్‌ఫైర్ అయింది. దీంతో బుల్లెట్ ఆయన ఛాతీలోకి దూసుకెళ్లింది. తీవ్రంగా రక్తస్రావం అవటంతో హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన కానిస్టేబుల్ అంబన్న అనంతపురం బెటాలియన్‌కు చెందిన వ్యక్తి. ఈ ఘటనపై పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు.