మే1న ముఖ్యమంత్రి పర్యటన
మే1న ముఖ్యమంత్రి పర్యటన
Published Fri, Apr 28 2017 11:35 PM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM
–తంగడంచలో జైన్ ఇరిగేషన్ పుడ్‌పార్కుకు శంకుస్థాపన
కర్నూలు(అగ్రికల్చర్): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన మరింత విస్తరించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం మే నెల1న నంద్యాల, కర్నూలు, వెల్దురి ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన ఉంది. తాజాగా 1వ తేదీ జూపాడుబంగ్లా మండలం తంగడంచ పారంలోను జరిగే కార్యక్రమంలో పర్యటించనున్నారు. తంగడంచలో జైన్ ఇరిగేషన్ నెలకొల్పే పుడ్ పార్క్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే నంద్యాల, కర్నూలు, పత్తికొండ, నందికొట్కూరు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. అన్ని ప్రాంతాల్లోను సంబంధిత శాఖలు ఫొటో ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేయనున్నాయి. వెల్దుర్తి మండలం సూదేపల్లిలో జరిగే నీరు–ప్రగతి కార్యక్రమానికి, తంగడంచ పుడ్ పార్క్ శంకు స్థాపన కార్యక్రమానికి రైతులను భారీ ఎత్తున సమీకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. తంగడంచ, సూదేపల్లిలో సీఎం పర్యటన ఏర్పాట్లను ఎస్పీ ఆకె రవికృష్ణ పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ హరికిరణ్ శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.
Advertisement
Advertisement