kurnool tour
-
ఎడిటర్ కామెంట్: కర్నూలు పర్యటనలో చంద్రబాబు విపరీత ప్రవర్తన
-
సీఎం వైఎస్ జగన్ కర్నూలు పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (బుధవారం) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన ఇంటి నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ స్థానిక నాయకులతో మాట్లాడతారు. ఆ తర్వాత పంచలింగాలలో పాణ్యం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కుమారుడు శివ నరసింహారెడ్డి పెళ్లికి హాజరవుతారు. అనంతరం తిరిగి బుధవారం మధ్యాహ్నం 12.20 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి కర్నూలు విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.50 గంటలకు తాడేపల్లిలోని ఇంటికి చేరుకుంటారు. -
న్యాయ రాజధానికి విమాన శోభ
తొలి స్వాతంత్య్ర సమరయోధుడికి నివాళిగా ఈ విమానాశ్రయానికి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం’అని నామకరణం చేస్తున్నాం. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఆమోదంగా ఇటీవల జరిగిన మునిసిపల్, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అండగా నిలిచారు. మీ కోసం మరింతగా పని చేస్తాం.రాష్ట్రంలో ఇప్పటివరకు తిరుపతి, కడప, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్‌లో విమానాశ్రయాలు ఉన్నాయి. ఇక నుంచి కర్నూలులోని ఓర్వకల్లులో కూడా విమానాశ్రయం ప్రారంభమవుతోంది. మనందరం నిర్మించుకోబోతున్న ‘న్యాయ రాజధాని’ నుంచి ఇతర రాష్ట్రాలు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను కలిపే ఎయిర్‌పోర్టుగా ఇది నిలబడుతుందని గర్వంగా చెబుతున్నా. కర్నూలు: ఏపీ ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ‘స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం’అని ప్రజల హర్షధ్వానాల మధ్య నామకరణం చేశారు. సీఎం వైఎస్ జగన్ విజయవాడ నుంచి ఉదయం 11.45 గంటలకు ఓర్వకల్లు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఎయిర్‌పోర్టు టెర్మినల్ బిల్డింగ్ వద్దకు చేరుకుని, జాతీయ జెండాను ఎగుర వేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, పుష్పాంజలి ఘటించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి టెర్మిల్ బిల్డింగ్ ప్రారంభించారు. అనంతరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేసిన సభావేదికపై శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రజలు, కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కర్నూలు చరిత్రలో ఈ రోజు (గురువారం) ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. కారణమేంటంటే కర్నూలు నుంచి ప్రయాణం అంటే ఇంతవరకు రోడ్డు, రైలు మార్గాలే అందుబాటులో ఉండేవని, ఇక నుంచి విమానయానం ప్రారంభమవుతోందన్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు మొదలవుతాయని చెప్పారు. బెంగళూరు, వైజాగ్, చెన్నైలకు సర్వీసులు నడుస్తాయని, ఇక్కడ ఒకేసారి నాలుగు విమానాలు పార్కింగ్ చేసే సౌకర్యం ఉందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. రూ. 110 కోట్లతో విమానాశ్రయం పనులు ఎన్నికలకు కేవలం నెలరోజుల గడువు ఉన్నప్పుడు 2019 ఫిబ్రవరిలో ఎయిర్‌పోర్టు పూర్తికాక మునుపే, అనుమతులు రాకుండానే, విమానాలు ఎగరకుండానే, చివరకు కనీసం రన్‌వే కూడా పూర్తి స్థాయిలో పూర్తవ్వకుండానే అప్పటి ముఖ్యమంత్రి రిబ్బన్ కట్ చేశారు. ఆయన పేరు చంద్రబాబునాయుడు. ఇది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పటి నుంచి ఈ రెండేళ్లలో విమానాశ్రయం కచ్చితంగా రావాలనే పట్టుదలతో రూ.110 కోట్లు విలువైన పనులను కేవలం ఏడాదిన్నరలోపే పూర్తి చేశాం. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ఐదు ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, పోలీసు బ్యారెక్, ప్యాసింజర్ లాంజ్, వీఐపీ లాంజ్, బ్యారెక్, సబ్స్టేషన్లు, రన్వేలలో బ్యాలెన్సింగ్ పనులు, ఓవర్‌హెడ్ ట్యాంక్‌లతో పాటు ఇతరత్రా పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశాం. ఆస్ట్రియా నుంచి రెండు అధునాతన అగ్నిమాపక శకటాలు తెప్పించాం. కార్ రెంటల్, బేబీ కేర్, మెడికల్ కేర్ కూడా అందుబాటులోకి తెచ్చాం. ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్), డీజీసీఏ అనుమతులు తెప్పించడం, విమానాశ్రయానికి సంబంధించిన అన్ని నిర్మాణాలు పూర్తి చేయడంలో సంబంధిత మంత్రితో పాటు అందరూ శ్రమపడ్డారు. ‘ఉయ్యాలవాడ’ పేరుపై చిరంజీవి కృతజ్ఞతలు విమానాశ్రయానికి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’పేరు పెట్టడంపై ప్రముఖ సినీ హీరో చిరంజీవి ముఖ్యమంత్రికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ట్విట్టర్లో ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘దేశంలో తొలి స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం చాలా సంతోషం’అని చిరంజీవి పేర్కొన్నారు. ఉయ్యాలవాడకు అసలైన నివాళి.. మనదేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్ 1885లో పుట్టింది. 1915లో గాంధీ మన దేశానికి తిరిగి వచ్చారు. 1917లో మొట్టమొదటగా బిహార్‌లోని చంపారన్‌లో సత్యాగ్రహం జరిగింది. వీటి కంటే ముందు, స్వాతంత్య్రానికి వందేళ్లు ముందే.. తొలి స్వాతంత్య్ర పోరాటం అని చరిత్రకారులు చెప్పిన 1857లో సిపాయిల తిరుగుబాటుకంటే ముందే 1847లోనే రైతుల పక్షాన, పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన మహా స్వాతంత్య్ర యోధుడు ఈ గడ్డ నుంచి వచ్చారు. ఆయనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ కార్యక్రమానికి ముందు తపాలా శాఖ ఆధ్వర్యంలో విమానాశ్రయ పోస్టల్ స్టాంప్‌ను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. ఎయిర్‌పోర్టు సిబ్బందితో గ్రూపు ఫొటో దిగారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరాం, ఎంపీలు పోచా బ్రహ్మానందరెడ్డి, సంజీవ్‌కుమార్, గోరంట్ల మాధవ్, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురాం, స్థానిక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డితో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ప్రారంభించిన సీఎం జగన్
-
‘ఉయ్యాలవాడ’ పేరుతో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు: సీఎం జగన్
సాక్షి, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి పి హర్దీప్సింగ్కు కూడా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్, కేంద్రమంత్రితో కలిసి ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ముందుగా సీఎం జగన్ జాతీయ జెండాను, ఆ తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. కర్నూలుకు రోడ్డు, రైలు మార్గంలోనే ప్రయాణం ఉండేదని, ఇక నుంచి విమాన ప్రయాణం కూడా జరగబోతోందని సీఎం జగన్ తెలిపారు. ఈనెల 28 నుంచి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖకు విమానాలు అందుబాటులో ఉంటాయిని తెలిపారు. ఓర్వకల్లుతో రాష్ట్రంలో ఆరో ఎయిర్‌పోర్టు ప్రారంభమవుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు రిబ్బన్ కటింగ్‌తో హడావుడి చేసిందని, రూ.110 కోట్లు ఖర్చు చేసి కేవలం ఏడాదిన్నరలోనే పనులు పూర్తి చేశామని సీఎం జగన్ తెలిపారు. అధునాతన అగ్నిమాపక కూడా అందుబాటులో ఉంటుందని, ఈ గడ్డ నుంచే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వచ్చారని తెలిపారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్ ప్రకటించారు. ఇండిగో సంస్థ ఈనెల 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి సర్వీసులు నడపనుంది. 1,008 ఎకరాల్లో రూ.153 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేశారు. విమాన సర్వీసులు ప్రాంభించడానికి డీజీసీఏ ఈ ఏడాది జనవరి 15న లైసెన్స్ జారీ చేయగా.. బీసీఏఎస్ సెక్యూర్టీ క్లియరెన్స్ జనవరి 27న మంజూరైంది. 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పులో ఇక్కడి రన్‌వేను అభివృద్ధి చేశారు. నాలుగు విమానాలకు పార్కింగ్తో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించారు. -
పొత్తులు తేలాకే అభ్యర్థుల ప్రకటన: ఉత్తమ్
సాక్షి, కర్నూలు: టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో మంగళవారం కర్నూలు జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఏపీ ప్రభుత్వం వైపల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తారా లేక పొత్తుపై వ్యాఖ్యలు చేస్తారా అని అటు కాంగ్రెస్ నేతలకు, ప్రతిపక్ష పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కర్నూలు పర్యటన పార్టీకి ఉపయోగపడే విధంగా తయారు చేశారు. గత నెలలో ఏఐసీసీ అధ్యక్షుడి హైదరాబాద్ పర్యటన విజయవంతం కావడంతో అదే రీతిలో ఇక్కడా విజవంతం చేయాలని స్థానిక నేతలు భావిస్తున్నారు. విద్యార్థులతో, రైతులతో, కాంగ్రెస్ దివంగత నేతల కుటుంబ సభ్యులతో రాహుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక సాయంత్రం ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించనున్న బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను, కార్యకర్తలను తరలించాలని ఏపీసీసీ భావిస్తోంది. కర్నూలుకు ఉత్తమ్ కర్నూలు జిల్లాలో రాహుల్ పర్యటనలో పాల్గొంటున్నానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన పాల్గొన్నారు. పార్టీ ఎన్నికల కమిటీ నియామకం రాహుల్ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. త్వరగా కమిటీలు వేయాలని ఏఐసీసీని కోరుతున్నానని వివరించారు, పొత్తుల అంశం, సీట్ల కేటాయింపు విషయంపై ఇంకా క్లారిటీ రాలేదని తెలిపారు. పొత్తుల అంశం తేలకుండా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడే కూటమి విషయంలో ప్రాథమిక చర్చలే జరిగాయని, ఉమ్మడి ఎజెండా ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నామని వివరించారు. కూటమికి ఎవరు నాయకత్వం వహించాలనేది అందరితో చర్చించి నిర్ణయిస్తామన్నారు. అభ్యర్థుల ప్రకటన స్ర్కీనింగ్ కమిటీ పరిధిలో ఉందన్నారు. పొత్తులో గెలిచే సీట్లను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాహుల్ పర్యటన వివరాలు: మంగళవారం మధ్యాహ్నం 12.15 గం.లకు స్థానికంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రాహల్ గాంధీ చేరుకుంటారు. అనంతరం నేరుగా మాజీ సీఎం దామోదర సంజీవయ్య ఇంటికి చేరుకొని అయన కుటుంబ సభ్యులతో సమావేశమవుతారు. అనంతరం బైరెడ్డి కన్వెన్షన్ సెంటర్లో విద్యార్థులతో పలు విషయాలపై చర్చించనున్నారు. విద్యార్థులతో చర్చా గోష్టి అనంతరం దివంగత సీఎం విజయ్ భాస్కర్ రెడ్డి సమాధి(కిసాన్ ఘాట్) వద్దకు చేరుకొని పుష్పాంజాలి ఘటిస్తారు. అనంతరం దివంగత సీఎం కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించనున్నారు. అక్కడే రైతులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అనంతరం స్థానిక ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. బహిరంగ సభ అనంతరం హైదరాబాద్‌కు పయనమవుతారు. -
మీడియా ప్రతినిధులపై నోరు పారేసుకున్న బాబు
-
చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో భాగంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. గురువారం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఓర్వకల్ వద్ద జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన పారిశ్రామివేత్తలు, మీడియా సమావేశంలో తీవ్ర అసహనానికి గురైన చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. శంకుస్థాపనలకే పరిమితయ్యారంటూ ప్రతిపక్షాలు అరోపిస్తున్నాయని ఓ మీడియా ప్రతినిధి చంద్రబాబును అడగగా.. అందుకు ఆయన తీవ్రంగా స్పందించారు. ‘ప్రతిపక్షం వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు. చేస్తున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడటం లేదా.. కేసుల మాఫీ కోసం భారతీయ జనతా పార్టీతో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా మెక్కుబడిగా మీడియా సమావేశాన్ని నిర్వహించిన చంద్రబాబు రెండు నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరో వైపు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) ఇంతవరకు అధికారంలోకి రాలేదన్న విషయాన్ని చంద్రబాబు మర్చిపోవడం కొసమెరుపు. -
మే1న ముఖ్యమంత్రి పర్యటన
–తంగడంచలో జైన్ ఇరిగేషన్ పుడ్‌పార్కుకు శంకుస్థాపన కర్నూలు(అగ్రికల్చర్): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన మరింత విస్తరించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం మే నెల1న నంద్యాల, కర్నూలు, వెల్దురి ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన ఉంది. తాజాగా 1వ తేదీ జూపాడుబంగ్లా మండలం తంగడంచ పారంలోను జరిగే కార్యక్రమంలో పర్యటించనున్నారు. తంగడంచలో జైన్ ఇరిగేషన్ నెలకొల్పే పుడ్ పార్క్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే నంద్యాల, కర్నూలు, పత్తికొండ, నందికొట్కూరు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. అన్ని ప్రాంతాల్లోను సంబంధిత శాఖలు ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయనున్నాయి. వెల్దుర్తి మండలం సూదేపల్లిలో జరిగే నీరు–ప్రగతి కార్యక్రమానికి, తంగడంచ పుడ్ పార్క్ శంకు స్థాపన కార్యక్రమానికి రైతులను భారీ ఎత్తున సమీకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. తంగడంచ, సూదేపల్లిలో సీఎం పర్యటన ఏర్పాట్లను ఎస్పీ ఆకె రవికృష్ణ పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ హరికిరణ్ శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. -
సీఎం బందోబస్తులో అపశృతి
-
సీఎం బందోబస్తులో అపశృతి
కల్లూరు: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడి బందోబస్తులో అపశృతి చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లె గ్రామం వామసముద్రం కొండల్లో బందోబస్తు నిర్వహిస్తున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ అంబన్న తుపాకీ మిస్‌ఫైర్ అయింది. దీంతో బుల్లెట్ ఆయన ఛాతీలోకి దూసుకెళ్లింది. తీవ్రంగా రక్తస్రావం అవటంతో హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన కానిస్టేబుల్ అంబన్న అనంతపురం బెటాలియన్‌కు చెందిన వ్యక్తి. ఈ ఘటనపై పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు. -
సీడ్‌హబ్.. అధికారుల గుండెల్లో లబ్‌డబ్
నంద్యాల: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలు పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రకటించిన సీడ్ హబ్ అధికారులకు సవాల్‌గా మారింది. ఇది కొత్త ప్రాజెక్టు కావడంతో అవగాహన కోసం అధికారులు అవస్థలు పడుతున్నారు. నంద్యాల ప్రాంతంలో అన్ని రకాల విత్తనాలు పండుతాయి. దేశంలో ఎక్కడ ఇలాంటి అవకాశం ఉండదు. అయినా సీడ్ హబ్‌ను ఎలా రూపొందించాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నెల 15న జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబునాయుడు నంద్యాల పట్టణంలో సీడ్ హబ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు కోసం అధికారులు లోతుగా విచారణ ఆరంభించారు. ఈ హామీ అమలు జరిగితే దేశంలోనే మొదటి సారి ఇలాంటి కార్యక్రమాన్ని నంద్యాలలో అమలు చేసినట్లు అవుతుందని వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇది అధికారులకు సవాల్‌గా మారింది. నంద్యాల పట్టణంలో సీడ్ వ్యాపారులదే పై చేయిగా ఇంత కాలం కొనసాగుతూ వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే హబ్ ప్రైవేటు సంస్థల గుప్పిట్లోకి వెళ్తుందా.. లేక ప్రభుత్వమే నేషనల్ సీడ్ సంస్థలాగా కొనసాగిస్తుందా అనే చర్చ జరుగుతోంది. ప్రాథమికంగా ఈ నెల 22న సాయంత్రం 3గంటలకు నూనెపల్లెలోని వైఎస్సార్ భవనంలో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆలోపల కలెక్టర్‌కు అవగాహన కలిగించడానికి జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు ఠాగూర్‌నాయక్ మంగళవారం స్థానిక వ్యవసాయ ఏడీఏ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. స్థానిక అధికారులకు ఈ అంశంపై అవగాహన లేకపోవడంతో జేడీఏ అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలారు. సీడ్ హబ్ ఏర్పాటు చేయడానికి నంద్యాల అనువైన స్థలమే అయినా సీడ్‌ను భారీ ఎత్తున పండించడానికి అవసరమైన సాగునీటి గ్యారెంటీ ఎంత వరకని వ్యవసాయ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నంద్యాల ప్రాంతంలో పత్తి, వేరుశెనగ, బీపీటీ 5204 వరి రకంతో పాటు కంది, కొర్ర, జొన్న, తదితర పంటలను భారీగా పండిస్తున్నారు. ఈ రకాలకు చెందిన విత్తనాలన్నింటిని సీడ్ హబ్ ద్వారా అందజేయవచ్చని, అయితే శ్రీశైలం జలాశయంలో 854అడుగుల కనీస నీటి మట్టం కొనసాగిస్తే తప్ప విత్తనాల పెంపకానికి అనుకూలత ఏర్పడదని రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. విత్తనాల తయారీలో నేషనల్ సీడే ఫస్ట్: నంద్యాల పట్టణంలోని జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో విత్తనాలను తయారు చేస్తోంది. ఈ సంస్థ ఏడాదికి రూ.22కోట్ల వరకు వ్యాపారం నిర్వహిస్తోంది. వేరుశనగ విత్తనాన్ని స్థానిక రైతులకే కాకుండా జైపూర్‌ప్రాంతానికి 1800క్వింటాళ్లు, కలకత్తాకు 2500క్వింటాళ్లు, బెంగుళూరుకు 2వేల క్వింటాళ్లు, తమిళనాడుకు 500క్వింటాళ్లు, పూనాకు 550క్వింటాళ్లు, భూపాల్‌కు 500క్వింటాళ్లు, పాట్నాకు 2300క్వింటాళ్లు స్థానికంగా తయారు చేసి ఏటా ఎగుమతి చేస్తున్నారు. అలాగే బీహార్‌కు కంది 220 క్వింటాళ్లు, మధ్యప్రదేశ్‌కు 1500 క్వింటాళ్లు, కలకత్తాకు 1800 క్వింటాళ్లు ఎగుమతి చేస్తుండగా పశ్చిమ బెంగాల్‌కు 1500 క్వింటాళ్ల జనుము, భూపాల్‌కు 1750 క్వింటాళ్ల మినుమును ఎగుమతి చేస్తున్నారు. మొత్తం ఐదు రకాల విత్తనాలను 25రకాలుగా రూపొందించి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఇటీవలనే రూ.1.50కోట్లతో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా వరి, మినుము, కంది, వేరుశెనగ, జనుము ఉన్నాయి. ఇదే తరహాలో నూతనంగా ఏర్పాటు చేసే హబ్‌లో విత్తనాలను తయారు చేయాల్సి ఉంటుందని అంటున్నారు.