![CM Chandrababu Naidu Intolerance in kurnool tour - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/10/chandrababu-naidu.jpg.webp?itok=bgn0x1eG)
సాక్షి, కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో భాగంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. గురువారం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఓర్వకల్ వద్ద జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన పారిశ్రామివేత్తలు, మీడియా సమావేశంలో తీవ్ర అసహనానికి గురైన చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు.
శంకుస్థాపనలకే పరిమితయ్యారంటూ ప్రతిపక్షాలు అరోపిస్తున్నాయని ఓ మీడియా ప్రతినిధి చంద్రబాబును అడగగా.. అందుకు ఆయన తీవ్రంగా స్పందించారు. ‘ప్రతిపక్షం వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు. చేస్తున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడటం లేదా.. కేసుల మాఫీ కోసం భారతీయ జనతా పార్టీతో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
అంతే కాకుండా మెక్కుబడిగా మీడియా సమావేశాన్ని నిర్వహించిన చంద్రబాబు రెండు నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరో వైపు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) ఇంతవరకు అధికారంలోకి రాలేదన్న విషయాన్ని చంద్రబాబు మర్చిపోవడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment