ఓటరు దేవుడా..అని దండం పెట్టి మోసం చేశారు: వైఎస్‌ అవినాష్‌రెడ్డి | Kadapa MP YS Avinash Reddy Comments On Alliance Government In AP | Sakshi
Sakshi News home page

ఓటరు దేవుడా..అని దండం పెట్టి మోసం చేస్తున్నారు: వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Published Sat, Feb 8 2025 4:25 PM | Last Updated on Sat, Feb 8 2025 4:55 PM

Kadapa MP YS Avinash Reddy Comments On Alliance Government In AP

సాక్షి,వైఎస్సార్‌జిల్లా: కూటమి ప్రభుత్వం అన్ని విధాల విఫలం అవుతోందని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. శనివారం(ఫిబ్రవరి8) వైఎస్సార్‌ జిల్లా జెడ్పీ మీటింగ్‌ అనంతరం అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రైతులకు రూ.20వేలు ఇస్తామన్నారు. ఇంతవరకు ఇచ్చింది లేదు. మా అధినేత వైఎస్‌ జగన్‌ 9 గంటల విద్యుత్‌ సరఫరా ఇస్తే దాన్ని 7 గంటలకు కుదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే రోడ్లెక్కుతాం.రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం.

రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు. పంటల బీమా లేదు. కనీసం బీమా ప్రీమియం కూడా రైతులే కట్టుకోవాల్సి వస్తోంది. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ దరఖాస్తులు వేలల్లో పెండింగులో ఉన్నాయి. వాటినీ మంజూరు చేయడం లేదు. గతంలో ఉన్న పథకాలూ అమలు చేయడం లేదు. గొప్పలు చెప్పుకున్న సూపర్‌ సిక్స్‌ అమలు అంతకన్నా లేదు.

కానీ ఈ 9 నెలల్లో 1.40లక్షల కోట్లు అప్పు మాత్రం తెచ్చారు..ఎక్కడ ఖర్చు చేశారో తెలియదు. చంద్రబాబు అనుభవం ఉన్న ఆర్థిక వేత్త అని చెప్పుకుంటారు. ఆయన కచ్చితంగా సూపర్‌ సిక్స్‌ అమలు చేసి తీరాల్సిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే ఆనాడు హామీలు ఇచ్చారు కదా. హామీలు అమలు చేయాల్సిన బాధ్యత వారిదే. ఆనాడు అలవిగాని హామీలు ఇచ్చి..ఓటరు దేవుడా అంటూ దండాలు పెట్టి ఇప్పుడు ఘోరంగా మోసం చేస్తున్నారు.

కూటమి కుట్రలు భయంతో బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా

ప్రభుత్వ పథకాలు లేక ప్రజల చేతుల్లో డబ్బు లేక వారి కొనుగోలు శక్తి కూడా తగ్గిపోయింది. ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా పరిషత్‌ సమావేశానికి కూటమి ప్రజాప్రతినిధులు కాదు..చివరికి కలెక్టర్,జేసీలు కూడా హాజరు కాలేదు. మేం అభ్యంతరం తెలిపితే అరగంట తర్వాత జేసీ వచ్చారు. ఇది తీవ్రమైన బాధ్యతారాహిత్యం. ఒక జిల్లా అత్యున్నతస్థాయి సమావేశానికి మంత్రులు సరే..కనీసం కలెక్టర్‌ కూడా రాలేదు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నా’అని అవినాష్‌రెడ్డి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement