ఒకరికి తీవ్రగాయాలు: పరిస్థితి విషమం
సాక్షి, సిటీబ్యూరో: సర్దార్ వల్లభభాయి పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో మంగళవారం ప్రమాదవశాత్తు తుపాకి పేలి ఓ వర్కర్ తీవ్రగాయాల పాలయ్యాడు. నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగే పాసింగ్ అవుట్ పెరేడ్ కోసం ఏర్పాట్లలో భాగంగా ఆయుధాలను ఒకచోట నుంచి మరొక చోటుకి తరలిస్తుండగా, ఓ తుపాకి ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటనలో హబీబ్ అనే వర్కర్ తీవ్రంగా గాయపడ్డాడు. అధికారులు వెంటనే అతన్ని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
ఎన్‌పీఏలో రైఫిల్ మిస్‌ఫైర్
Published Wed, Oct 29 2014 2:55 AM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM
Advertisement
Advertisement