Sardar Vallabhbhai Patel National Police Academy
-
అన్ని అంశాల్లో మెరికల్లా శిక్షణ
సాక్షి, హైదరాబాద్: అకాడమీ శిక్షణలో భాగంగా శాంతిభద్రతల నిర్వహణ, సైబర్ నేరాల కట్టడి, డ్రగ్స్ మహమ్మారిని తుద ముట్టించడం సహా అనేక అంశాల్లో యువ ఐపీఎస్‌లను సుశిక్షితులైన అధికారులుగా మార్చినట్టు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ చెప్పారు. 76వ బ్యాచ్ ఆర్ఆర్ (రెగ్యులర్ రిక్రూటీస్)కు చెందిన 188 మంది ఐపీఎస్ అధికారులు, నేపాల్, రాయల్ భూటాన్, మారిషస్, మాల్దీవులకు చెందిన 19 మంది విదేశీ అధికారులు అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నట్టు తెలిపారు. వీరిలో 58 మంది మహిళా అధికారులు ఉన్నారన్నారు. వీరంతా శుక్రవారం అకాడమీలో జరిగే దీక్షాంత్ పరేడ్‌లో పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ హాజరుకానున్నట్టు చెప్పా రు. బుధవారం అకాడమీ జాయింట్ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళా అధికారులు పెరిగారుసైబర్ నేరాలు, డ్రోన్ టెక్నాలజీ, కొత్త చట్టాలపై అవగాహన, శారీరక, మానసిక ధృఢత్వాన్ని పెంచడం, అన్ని రకాల ఆయుధాలను వాడే విధానం, వివిధ పోలీస్ విభాగాల్లో, సరిహద్దుల్లో మిలిటరీ విభాగాల్లో పనిచేయడం సహా అనేక అంశాల్లో యువ ఐపీఎస్ అధికారులు శిక్షణ పొందినట్లు అమిత్ గార్గ్ తెలిపారు. ఐపీఎస్ అధికారులు కేటాయించబడే రాష్ట్రంలోని స్థానిక భాష, అక్కడి భౌగోళిక పరిస్థితులు, స్థానిక సమస్యలు, సాంప్రదాయాలపై పట్టు సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. ఈ బ్యాచ్ అధికారుల్లో విద్యార్హత పరంగా చూస్తే ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు 109 మంది, ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు 15 మంది ఉన్నట్టు తెలిపారు. మహిళా అధికారుల సంఖ్యలో ఈసారి పెరుగుదల ఉందని, 75వ బ్యాచ్‌లో 21 శాతం మహిళలుండగా, ఈసారి 29% మంది ఉన్నట్టు చెప్పారు. పరేడ్ కమాండర్‌గా అచ్యుత్ అశోక్ వ్యవహరిస్తారని, ఈ బ్యాచ్‌లో టాపర్స్‌గా నిలిచిన 8 మంది పరేడ్ అనంతరం ట్రోఫీలు అందుకోనున్నట్టు తెలిపారు. తెలంగాణ, ఏపీకి నలుగురు చొప్పున ఐపీఎస్‌లు 76వ ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణకు నలుగురు, ఏపీకి నలుగురు చొప్పున అధికారులను కేటాయించారు. తెలంగాణ కేడర్‌కు తెలంగాణకు చెందిన రుత్విక్ సాయి కొట్టె, పత్తిపాక సాయికిరణ్, జమ్మూకశీ్మర్‌కు చెందిన మనన్ భట్, యూపీకి చెందిన యాదవ్ వసుంధర ఫరెబీలను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మనీశరెడ్డి వంగాల, హేమంత్ బొడ్డు, హరియాణాకు చెందిన దీక్ష, తమిళనాడుకు చెందిన ఆర్ సుస్మితలను కేటాయించారు. తప్పుల్లోంచి పాఠాలు నేర్చుకున్నా.. మాది వరంగల్ జిల్లా భీందేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం. నాన్న పేరు కొమరెల్లి, అమ్మపేరు లక్షి్మ. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. మా కుటుంబం నుంచి మొదటి ఐపీఎస్ అధికారిని. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో 2019లో జాబ్‌కు రిజైన్ చేసి, నేనే సొంతంగా ఇంటి వద్ద ప్రిపరేషన్ కొనసాగించా. రోజుకు 8 గంటలు చదివేవాడిని. మా తల్లిదండ్రులు, సిస్టర్స్, ఇతర కుటుంబసభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభించింది. అయితే నా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్లా. మొత్తం మీద మూడో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించా. తెలంగాణ కేడర్‌కు రావడం, మన రాష్ట్ర ప్రజలకే సేవ చేసే అవకాశం దక్కడంతో సంతోషంగా ఉంది. – పత్తిపాక సాయికిరణ్డ్రగ్స్ విషయంలో గట్టిగా పని చేయాలనుకుంటున్నా నా స్వస్థలం వరంగల్. అక్కడే స్కూల్, ఇంటర్ చదివా. నాన్న రాధాకృష్ణరావు సోషల్ వెల్ఫేర్ విభాగంలో లైబ్రేరియన్. మా అమ్మ టీచర్‌గా కొంత కాలం పనిచేశారు. నాన్న చిన్నప్పటి నుంచి చెప్పే మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి. బీటెక్ పూర్తయిన తర్వాత 2017 నుంచి సివిల్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టా. 2022లో నాకు ఐపీఎస్ వచ్చి0ది. పక్కా ప్రణాళికతో ముందుకు వెళితే తప్పకుండా విజయం సాధించవచ్చు. ఐపీఎస్ శిక్షణ మనలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచుతుంది. తెలంగాణ కేడర్‌కు రావడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఏదైనా సమస్య ఉంటే ప్రజలు స్వేచ్ఛగా, ధైర్యంగా రాగలిగేలా పోలీసులపై విశ్వాసం పెంచడమే నా లక్ష్యం. డ్రగ్స్ విషయంలో నేను గట్టిగా పనిచేయాలనుకుంటున్నా. – రిత్విక్ సాయి కొట్టే -
SVPNPA: ఎవరికి వారే.. మహిళా‘మణులే’!
హైదరాబాద్ శివార్లలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడెమీలో (ఎస్వీపీ ఎన్ పీఏ) శిక్షణ పూర్తి చేసుకున్న 155 మంది ఐపీఎస్ ట్రైనీల్లో 32 మంది మహిళలు ఉన్నారు. అన్ని విభాగాల్లోనూ తన సత్తా చాటి ఓవరాల్ టాపర్‌గా నిలిచిన అనుష్త కాలీయా శుక్రవారం జరిగే పాసింగ్ ఔట్ పరేడ్‌కు (పీఓపీ) నేతృత్వం వహించనున్నారు. ఇలా ఓ మహిళ ట్రైనీ పీఓపీకి నేతృత్వం వహించడం 75 ఏళ్ళ అకాడెమీ చరిత్రలో ఇది మూడోసారి. ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారులుగా బయటకు రానున్న మహిళామణుల్లో ఉన్న ప్రత్యేకతల గురించి... గంటకు 16 కిమీ పరిగెత్తే సత్తా సాధించి... ఢిల్లీకి చెందిన అనుష్త కాలియా ఢిల్లీ యూనివర్శిటీలోని క్లస్టర్ ఇన్నోవేషన్ సెంటర్ నుంచి డేటా సైన్్సలో బీటెక్ పూర్తి చేశారు. అక్కడే బ్లింకిట్ అనే స్టార్టప్ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలపై ఉన్న ఆసక్తితో ఆరునెలలకే ఈ ఉద్యోగం వదిలారు. కోవిడ్ ప్రభావంతో కోచింగ్ సెంటర్లకు బదులు ఆన్ లైన్ క్లాసులకు పరిమితం అయ్యారు. లాక్డౌన్ కారణంగా ఇతరుల్ని కలవడం తగ్గిపోవడంతో దాన్ని పాజిటివ్‌గా వాడుకుని చదువుకే పరిమితం అయ్యారు. మొదటి ప్రయత్నంలోనే 143వ ర్యాంకు సాధించారు. స్కూలు, కాలేజీ రోజుల్లో బ్యాడ్మింటన్, కరాటే పోటీల్లో పాల్గొన్నారు. అయినప్పటికీ ఎన్ పీఏలో అడుగు పెట్టే సమయానికి గంటకు కిలోమీటరు దూరం కూడా పరిగెత్తలేని స్థితిలో ఉన్నారు. ఇక్కడి శిక్షణ కారణంగా ప్రస్తుతం గంటకు 16 కిమీ పరిగెత్తే సామర్థ్యాన్ని సాధించారు. ఈ బ్యాచ్‌లో ఓవరాల్ టాపర్‌గా, ఔట్‌డోర్ టాపర్‌గానే కాకుండా పరేడ్ కమాండర్‌గా నిలిచే అవకాశంతోపాటు స్వార్డ్ ఆఫ్ ఆనర్ సొంతం చేసుకున్నారు. ప్రజాసేవలో సాంకేతికతని వినియోగించాలన్నదే తన లక్ష్యమని చెప్తున్నారు. ఎన్ పీఏ శిక్షణలో ఎన్నో అంశాలు నేర్చుకున్నానని, గ్రేహౌండ్స్ ఆ«ధ్వర్యంలో జరిగిన నెల రోజుల జంగిల్ ట్రైనింగ్ మాత్రం కఠినంగా అనిపించిందని చెప్పారు. లాయర్‌గానే సఫాయీ కార్మికుల కోసం... ముంబైకి చెందిన ఇషా సింగ్ తండ్రి యోగేష్ ప్రతాప్ (వైపీ) సింగ్ ఐపీఎస్ అధికారి అయినప్పటికీ వీఆర్ఎస్ తీసుకుని న్యాయవాదిగా మారారు. తల్లి అభాసింగ్ సైతం న్యాయవాది. వైపీ సింగ్ మహారాష్ట్రలో కలకలం సృష్టించిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కామ్‌లో బాధితుల తరఫున న్యాయపోరాటం చేస్తున్నారు. 2018లో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీ నుంచి ఇషా పట్టా పొందారు. 26వ ఏటనే పీపుల్స్ లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు. అక్కడి గొవాండీలో ఉన్న మౌర్య హౌసింగ్ సొసైటీలో 2019 డిసెంబర్ 3న జరిగి ఉదంతం ఇషా దృష్టికి వచ్చింది. అక్కడ సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయడానికి ప్రయత్నించిన ముగ్గురు సఫాయీ కార్మికులు చనిపోయారు. చనిపోయిన వారి భార్యలకు న్యాయం చేయడం కోసం అసిస్టెన్ ్స ఫర్ సఫాయీ కరమ్‌చారీ (ఆస్క్) స్థాపించారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమీకరించి అందించారు. ఇలా మరణించిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని 1993 నుంచి మహారాష్ట్ర లో నిబంధనలు ఉన్నా అమలు కాలేదు. దీనిపై ముంబై హైకోర్టులో 2021లో రిట్ దాఖలు చేసి వారి తరఫున పోరాడి వారికి పరిహారం ఇప్పించారు. ఈ కేసుపై అప్పటి జడ్జ్ ఉజ్వల్ భూయాన్ 1993 నుంచి ఇలా చనిపోయిన వారి జాబితా తయారీకి ఆదేశాలు జారీ చేశారు. తండ్రి చూపిన మార్గంలో ఐపీఎస్ కావాలని భావించిన ఇషా రూ.20 లక్షల ప్యాకేజీతో వచ్చిన ఉద్యోగం వదులుకుని రెండో ప్రయత్నంలో 191వ ర్యాంక్ సా«ధించింది. యూట్యూబ్ చూసి యూపీఎస్సీ పరీక్షలు క్రాక్ చేసి... మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలో ఉన్న మావు పట్టణానికి చెందిన సిమ్రన్ భరద్వాజ్ ఢిల్లీ యూనివర్శిటీ నుంచి జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేశారు. తండ్రి ఆర్మీలో లెఫ్ట్‌నెంట్ కల్నల్‌గా పని చేస్తుండటంతో సాధారణంగానే యూనీఫామ్∙సర్వీసెస్‌పై మక్కువ ఏర్పడింది. తాను నివసించేది చిన్న పట్టణం కావడంతో పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి అవసరమైన కోచింగ్ సెంటర్ల వంటి సదుపాయాలు లేవు. దీనికితోడు 2021 జూన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే సివిల్స్ పరీక్ష రాయాల్సి ఉంది. కరోనా ప్రభావంతో కోచింగ్ సెంటర్లు అన్నీ మూతపడ్డాయి. దీంతో యూట్యూబ్ ఛానల్స్‌లో క్లాసులు వింటూ రోజుకు 8 నుంచి 10 గంటల పాటు సివిల్స్‌కు ప్రిపేర్ అయింది. మిగిలిన సమయం కంబైన్ ్డ డిఫెన్ ్స సర్వీసెస్ (సీడీఎస్) పరీక్షకు వెచ్చించింది. కోవిడ్ కారణంగా వాయిదా పడిన ఈ రెండు పరీక్షలు 2021 అక్టోబర్‌లో జరిగాయి. మొదటి ప్రయత్నాల్లోనే సీడీఎస్‌లో ఆరో ర్యాంక్, సివిల్స్‌లో 172వ ర్యాంక్ సాధించింది. 23 ఏళ్ళ వయస్సులోనే ఐపీఎస్‌కు ఎంపికైంది. ఎలాంటి ఇతర యాక్టివిటీస్ లేని కోవిడ్ టైమ్ తనకు కలిసి వచ్చిందని సిమ్రన్ చెప్తున్నారు. ఐఏఎస్ అనుకున్నా ఐపీఎస్‌గా... వరంగల్‌కు చెందిన బి. చైతన్య రెడ్డి అక్కడి ఎన్ఐటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు. తండ్రి గ్రూప్–1 ఆఫీసర్‌గా ఉండటంతో సివిల్ సర్వీసెస్‌పై మక్కువ ఏర్పడింది. సివిల్ సర్వెంట్స్‌గా ఉంటేనే ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం దక్కుతుందని అని తండ్రి చెప్పిన మాటలు ఆమెలో స్ఫూర్తి నింపాయి. ఇరిగేషన్ శాఖలో ఏఈగా పని చేస్తూనే ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో సివిల్స్ వైపు మొగ్గారు. మెయిన్ ్సలో మూడుసార్లు అపజయం ఎదురైనా కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళారు. సివిల్స్‌తోపాటు కేంద్ర సాయుధ బలగాల్లో ఎంపికకు సంబంధించిన పరీక్షల్నీ రాశారు. దీంతో ఐఏఎస్ నుంచి దృష్టి ఐపీఎస్ వైపు మళ్ళింది. 2022 లో 161వ ర్యాంక్ సాధించి తెలంగాణ క్యాడర్‌కు ఎంపికయ్యారు. – శ్రీరంగం కామేష్, సాక్షి సిటీబ్యూరో, హైదరాబాద్ ; ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
అట్టహాసంగా ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్.. పాల్గొన్న అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: హైదబాద్‌లోని వల్లబాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 74 వ బ్యాచ్ ఐపీఎస్‌ల అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కోసం శుక్రవారం రాత్రికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అమిత్ షా ఆ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అక్కడ ట్రైనీ ఐపీఎస్‌ల నుంచి అమిత్ షా గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. "ట్రైనీ ఐపీఎస్‌లకు అభినందనలు. ఈ బ్యాచ్‌లో అధికం శాతం టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు. రానున్న కాలంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేగాదు టెక్నీలజీతో కూడిన పోలీస్ మేనేజ్మెంట్ మరింతగా అందుబాటులోకి వస్తుంది కూడా. అలాగే 2005లో ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న దేశాన్ని 5వ స్థానంలోకి నిలబెట్టాం. త్వరితగతి దాన్ని కూడా అధిగమించి మూడవ స్థానాన్ని చేరుకుంటుందని ఆశిస్తున్నా. ఐతే శాసన వ్యవస్థ ద్వారా ఒక నాయకుడుకి కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పాలించే అధికారం ఉంటుంది. కానీ ఐపీఎస్‌లకు 30 సంవత్సరాల వరకు ఆ అధికారం ఉంటుంది. రాజ్యాంగం మీ భుజస్కంధాలపై చాలా బాధ్యత పెట్టింది. ప్రతీ ఐపీఎస్ తన బాధ్యతను గుర్తించుకోవాలి. ఎనిమిదేళ్ల క్రితం దేశ అంతర్గత భద్రత విషయంలో చాలా ఆందోళనగా ఉండేది. జమ్ము కాశ్మీర్ తీవ్రవాదము, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంతో సహా ఎన్నో సమాస్యలు ఉండేవి. అలాంటి సమస్యలన్నింటిని పూర్తిగా కట్టడి చేశాం. అలాగే శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు." అని అమిత్ షా నొక్కి చెప్పారు. కాగా, ఈ 74వ బ్యాచ్‌లో దాదాపు 195 మంది ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. 105 వారాలపాటు ఇండోర్ ఔట్‌డోర్ కలిపి మొత్తం సుమారు 17 విభాగాల్లో ట్రైనింగ్ పొందారు. వీరిలో 166 మంది భారతీయులు, 29 మంది విదేశీయలు ఉన్నారు. అందులో 37 మంది మహిళా ఐపీఎస్‌లు కూడా ఉన్నారు. అంతేగాదు ప్రతి ఏడాది మహిళా ఐపీఎస్‌లు పెరుగుతుండటమే గాక ఈ బ్యాచ్‌లో ఇంజనీరింగ్, మెడికల్, సీఏ స్టూడెంట్స్ అధికంగా ఉండటం విశేషం. ఈ శిక్షణలో ప్రతిభ కనబర్చిన ప్రోబేషనరీ ఐపీఎస్‌లకు ట్రోఫీలు అందజేస్తారు. పరేడ్ అనంతరం 11 నుంచి 12 గంటల సమయంలో అధికారులతో అమిత్ షా భేటీ కానున్నారు. (చదవండి: ఈ నెల 11న హైదరాబాద్‌కు అమిత్ షా.. పోలీస్ అకాడమీలోని పరేడ్‌కు హజరు!) -
ఈ నెల 11న హైదరాబాద్‌కు అమిత్ షా.. పోలీస్ అకాడమీలోని పరేడ్‌కు హజరు!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 11న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేయనున్న పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొననున్నారు. కాగా ఈనెల 11న నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 74ఆర్ఆర్ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది. ఈ బ్యాచ్‌లో 195 మంది ప్రొబేషనర్లు శిక్షణ పొందారు. ఈ పరేడ్‌కు కేరళ కేడర్‌కు చెందిన శెహన్‌షా నేతృత్వం వహించనున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎనిమిది సంవత్సరాల శిక్షణ పందిన శెహన్‌షా.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు మెడల్స్ గెలుచుకున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆయన సీఐఎస్ఎఫ్, ఐఆర్పీఎఫ్లలో సైతం బాధ్యతలు నిర్వర్తించారు. కరోనా తర్వాత ఇదే కాగా కోవిడ్ తర్వాత పూర్తిస్థాయిలో జరగనున్న పాసింగ్ అవుట్ పరేడ్ ఇదేనని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఏఎస్ రాజన్ తెలిపారు. ఈ ఏడాదితో ఎన్పీఏ 75 వసంతాలు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. 74వ బ్యాచ్‌లో 195 మంది ట్రైనీ ఐపీఎస్‌లు శిక్షణ పొందారన్నారు. వీరిలో 166 మంది భారతీయులు, 29 మంది విదేశీ శిక్షణార్థులున్నారు. 37 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నట్లు తెలిపారు. వీరంతా 46 వారాలపాటు కఠోర శిక్షణ పొందినట్లు పేర్కొన్నారు. ఈసారి ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారే ఎక్కువగా ఉన్నారు. ఇండోర్, ఔట్ డోర్ సబ్జెక్ట్‌లు కలిపి 17 అంశాలపై ట్రైనింగ్ పొందారు. ఈనెల 11న జరిగే పాసింగ్ ఔట్ పరేడ్‌తో 46 వారాల శిక్షణ పూర్తవుతుంది. ఆ తర్వాత ఢిల్లీకి పంపిస్తారు. అక్కడ మరికొన్ని వారాల శిక్షణ పొందిన తర్వాత వాళ్లకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్తారు. అక్కడినుండి వాళ్ళను నియమించిన జిల్లాలలోకి వెళ్తారు. విధి నిర్వహణలో ఐపీఎస్‌లకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండేందుకు మెంటర్స్ ఉంటారు.’ అని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు నూతన ఐపీఎస్‌లు తెలుగు రాష్ట్రాలకు ఏడుగురు నూతన ఐపీఎస్‌లను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణకు కేటాయించిన అయిదుగురిలో అవినాష్ కుమార్, శేషాద్రిని రెడ్డి, మహేష్ బాబా సాహేబ్, అంకిత్ శంకేశ్వర్, శివం ఉపాధ్యాయ ఉన్నారు. ఏపీకి కేటాయించిన ఇద్దరిలో పంకజ్ కుమార్ మీనా, అంకిత్ మహవీర్లు ఉన్నారు. -
శాస్త్రీయతకు పెద్దపీట.. యువ ఐపీఎస్‌లకు మోదీ దిశానిర్దేశం
►ప్రస్తుతం వెలుగు చూస్తున్న కొత్త తరహా మోసాలు, సరిహద్దులు దాటి విస్తరించి, పోలీసుశాఖకు సవాళ్లు విసురుతున్న సైబర్ నేరాలు, ఆర్థిక నేరాల దర్యాప్తులో శాస్త్రీయ విధానాలను అవలంబించాలి. ►ఐకమత్యం, సున్నితత్వంతో విధులు నిర్వహించి పోలీసు బాధ్యతలను మరింత ప్రభావవంతంగా నిర్వహించాలి. ►జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా విధులు నిర్వహించాలి. ఈ క్రమంలో అధికారులు సాంకేతికతకు పెద్దపీట వేయాలి సాక్షి, హైదరాబాద్: యువ ఐపీఎస్ అధికారులు సురాజ్యం కోసం కదలాలని, పోలీసు శాఖకు సవాళ్లు విసురుతున్న కొత్త తరహా నేరాలను శాస్త్రీయ కోణంలో దర్యాప్తు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంపై సానుభూతితో వ్యవహరిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడేలా, పోలీసు డిపార్ట్‌మెంట్‌పై సమాజంలో సానుకూల భావన కలిగేలా విధులు నిర్వహించా లని ఆకాంక్షించారు. యువ ఐపీఎస్ అధికారులం తా ఒకే శ్రేష్ట భారత్ అనే ప్రతిష్టాత్మక పతకాన్ని చేతబూని దేశాన్ని ముందుండి నడిపించాలని హితవు పలికారు. శనివారం హైదరాబాద్ శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్న 71, 72వ బ్యాచ్ ప్రొబేషనరీ ఐపీఎస్‌లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘రాబోయే 25 ఏళ్లలో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతాయి. ఆ సమయానికి మన దేశ పోలీసు బలగాలు ఆధునిక, దృఢమైన, సవాళ్లను ఎదుర్కొనే స్థాయికి ఎదగాలి. అమృతోత్సవ్‌లో మీరు బాధ్యతలు తీసుకుంటూ వందేళ్ల స్వాతంత్య్ర భారతంలో కీలకభూమిక పోషించాలి’అని ఆశాభావం వ్యక్తంచేశారు. సమరయోధుల స్ఫూర్తిని గుర్తుంచుకోండి ‘గడిచిన 75 ఏళ్లలో మెరుగైన పోలీసు సేవలందించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకోండి. 1930 నుంచి 1947 మధ్యకాలంలోని యువత గొప్ప లక్ష్యాలను చేరుకుంది. వారు స్వరాజ్యం కోసం ఉద్యమించారు. నేటి యువత అయిన మీరు సురాజ్యం కోసం ముందుకు సాగాలి. జిల్లా పోలీసు అధికారిగా పరిపూర్ణ జ్ఞానం, హుందాతనంతో విధులు నిర్వహించాలి. పోలీసు డిపార్ట్మెంటులో మహిళా భాగస్వామ్యం పెరగాల్సిన అవసరముంది. జాతి బిడ్డలైన మీరు పోలీసు సేవల్లో అత్యున్నత ప్రమాణాలు, జవాబుదారీతీనం, గౌరవం, సున్నితత్వాన్ని పెంపొదించాలి’అని మోదీ చెప్పారు. కరోనా కాలంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ప్రధాని శ్రద్ధాంజలి ఘటించారు. వారి త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. మనమంతా ఆప్తులం.. మిత్రులం ‘ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకుని వెళ్తున్న పొరుగు, విదేశీ అధికారులు మన దేశాల మధ్య ఉన్న సంబంధాలను, సఖ్యతను దృష్టిలో ఉంచుకోవాలి. నేపాల్, భూటాన్, మాల్దీవులు, మారిషస్ ఏ దేశమైనా మనం కేవలం భౌగోళిక సాన్నిహిత్యమే కాకుండా.. ఆలోచన దృక్పథం, సామాజిక విధానాల్లో అనేక సారూప్యతలు కలిగి ఉన్నాం. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి విపత్తు, ఆపద వచ్చినా మనమంతా మిత్రులుగా, ఆప్తులుగా ఒకరికొకరం సహకరించుకుంటాం. ఇదే స్ఫూర్తిని కరోనా సమయంలోనూ కొనసాగించాం’అని ప్రధాని చెప్పారు. మొత్తం 178 మంది సర్దార్ వల్లభాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఈసారి పాసింగ్ఔట్ పరేడ్‌లో పాల్గొంటున్న 71, 72వ బ్యాచ్‌ల్లో మొత్తం 178 మంది ప్రొబేషనరీ ఐపీఎస్‌లు ఉన్నారు. వీరిలో 33 మంది మహిళలు కాగా, 34 మంది విదేశీ (నేపాల్, భూటాన్, మారిషస్, మాల్దీవులకు చెందిన) అధికారులు ఉన్నారు. వీరికి ఈనెల 6న పాసింగ్ ఔట్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పాల్గొన్నారు. -
ట్రైనీ ఐపీఎస్‌లను ఉద్దేశించి మోదీ ప్రసంగం
-
ట్రైనీ ఐపీఎస్‌లను ఉద్దేశించి మోదీ ప్రసంగం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలోని ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) ట్రైనీలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. మోదీ వర్చువల్‌గా ట్రైనీ ఐపీఎస్‌లతో సంభాషిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా హజరయ్యారు. గతేడాది సెప్టెంర్‌లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ట్రైనీ ఐపీఎస్‌లతో సంభాషించారు. ఐపీఎస్ అధికారులు తమ ఉద్యోగం, యూనిఫామ్‌ని గౌరవించాల్సిందిగా సూచించారు. కరోనా కాలంలో పోలీసులు చేసిన సేవలు సామాన్యుల మదిలో నిలిచిపోయాయని మోదీ తెలిపారు. ‘‘అనుకోని.. అకస్మాత్తు ప్రమాదాలను గుర్తించి.. వాటిని సమర్థంగా ఎదుర్కొవడమే మీ వృత్తి. విధి నిర్వహణలో మీరు ఎంతో ఒత్తిడికి గురవుతారు. అలాంటి సమయంలో మీ శ్రేయోభిలాశులను కలిసి.. వారితో మాట్లాడండి.. వారి సూచనలు తీసుకొండి’’ అని మోదీ వారికి సూచించారు. -
ఐపీఎస్‌లకు మోదీ సూచన: ఒత్తిడి ఇలా తగ్గించుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం జరిగిన 'దీక్షాంత్ పరేడ్ ఈవెంట్' లో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రొబిషినరీ పిరియడ్‌లో ఉన్న ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరు వారి ఉద్యోగాన్ని, వారి యూనిఫామ్‌ను గౌరవించాలని మోదీ కోరారు. ‘మీ ఖాకీ యూనిఫాం పట్ల గౌరవాన్ని కోల్పోకండి. కరోనా కారణంగా పోలీసులు చేస్తున్న మంచి పనులు వారు ఎప్పుడూ ప్రజల మనస్సులలో చిరస్మరణీయంగా మిగిలేలా చేశాయి’ అని కొనియాడారు. అకాడమీ నుంచి బయటకు వచ్చిన యువ ఐపీఎస్ అధికారులతో తాను తరచూ సంభాషిస్తానని, అయితే ఈ సంవత్సరం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వారిని కలవలేకపోయానని ప్రధాని చెప్పారు. కానీ తన పదవీకాలంలో, ఖచ్చితంగా అందరినీ ఏదో ఒక సమయంలో కలుస్తానని తనకి ఖచ్చితంగా తెలుసు అని ఆయన తెలిపారు. ఐపీఎస్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ ‘మీ వృత్తిలో ఊహించని అనేక ఘటనలు జరుగుతాయి. చాలా హింసను ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటప్పుడు మీకు ఇష్టమైనవారితో, మంచి సలహాలు ఇచ్చే వారితో మాట్లాడండి. ఒత్తిడిలో పనిచేసేవారందరికి యోగా, ప్రాణాయామం మంచిది. ఇలా చేస్తే ఎంత పని ఉన్నా మీరు ఒత్తిడికి గురికారు’ అని తెలిపారు. నేషనల్ పోలీస్ అకాడమీలో 131మంది ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. వీరిలో 28 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. 42 వారాల పాటు శిక్షణ పూర్తిచేసుకున్న వీరిని పలు కేడర్లకు నియమించారు. తెలంగాణకు 11మంది, ఆంధ్రప్రదేశ్‌కు ఐదుగురు ఐపీఎస్‌లను కేటాయించారు. చదవండి: పెట్టుబడులకు భారత్ అత్యుత్తమం: మోదీ -
ఇద్దరు ట్రైనీ ఐపీఎస్‌లకు పాజిటివ్!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభణ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ(ఎన్పీఏ)కి పాకింది. హైదరాబాద్‌లోని అకాడమీలో శిక్షణ పొందుతున్న 72 ఆర్ఆర్ బ్యాచ్‌లో ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ అధికారులకు కరోనా సోకినట్లు తెలిసింది. ఇటీవల శిక్షణలో భాగంగా ఐపీఎస్‌లు వివిధ ప్రాంతాలకు వెళ్లారు. వీరిలో 137 మందికి ముందుజాగ్రత్తగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. ఇరువురిని క్వారంటైన్‌కు తరలించారు. -
శాంతిభద్రతలతోనే ఆర్థిక వృద్ధి
సాక్షి, హైదరాబాద్: శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే దేశ ఆర్థికాభివృద్ధి బలోపేతం అవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో 2017 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ప్రొబెషనర్లు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్‌కు షా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ‘‘దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పేరిట ఉన్న జాతీయ పోలీసు అకాడమీలోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న 103 మంది ఐపీఎస్‌లకు శుభాకాంక్షలు. ప్రొబేషనర్లలో ఆరుగురు భూటాన్, ఐదుగురు నేపాల్ జాతీయులతోపాటు 15 మంది మహిళా అధికారులు ఉండటం సంతోషకరం. ఈ సందర్భంగా మనం సర్దార్ పటేల్‌ని స్మరించుకోవాలి. ప్రస్తుతం మనమున్న హైదరాబాద్‌ను దేశంలో విలీనం చేయడంలో పటేల్ పాత్ర మరువలేనిది. ఆయన పట్టుదల కారణంగానే నిజాం రాజు హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేశారు. దేశంలో 530 చిన్న సంస్థానాల విలీనంలో ఉక్కుమనిషి పటేల్ చూపిన చొరవ కారణంగానే ఈరోజు దేశానికి సమగ్రత చేకూరింది. కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని ఇటీవల ఎత్తేయడం ద్వారా కశ్మీర్‌ను దేశంలో విలీనం చేసి ప్రధాని మోదీ.. సర్దార్ పటేల్ స్వప్నాన్ని నెరవేర్చారు. ఈ దేశానికి అత్యంత కీలకమైనవి రెండు. శాసనాల ద్వారా ఎన్నుకున్న ప్రజాపరిపాలనా వ్యవస్థ, సివిల్స్ ద్వారా ఎంపికైన అధికారుల వ్యవస్థ. దేశాన్ని ముందుకు నడిపించడంలో ఈ రెండు వ్యవస్థల కృషి ఎనలేనిది. సివిల్స్ విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టిన పటేల్ స్ఫూర్తిని మనం మరచిపోకూడదు. ప్రపంచ పటంలో దేశం సమున్నత స్థానంలో ఉండాలంటే అందుకు మీ భాగస్వామ్యం ఎంతో అవసరం. మీరంతా దేశ సేవలో పునరంకితం అయినప్పుడే ఈ కల నెరవేరుతుంది. ఈ రోజు మీరు చేసిన ప్రతిజ్ఞను జీవితాంతం స్మరించండి. శనివారం సర్దార్ వల్లభాయ్‌పటేల్ పోలీస్ అకాడమీలో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఐపీఎస్ ప్రొబెషనర్లు ‘స్మార్ట్’గా ముందుకెళ్లండి... ఏ దేశానికైనా శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే మెరుగైన ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మన దేశానికి పట్టిన ఉగ్రవాదం, తీవ్రవాదాల చీడ తొలగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వేలాది మంది పోలీసు అధికారులు, జవాన్లను స్మరించుకోవాలని, వారి త్యాగాల వల్లే మనం ఈ రోజు ఇక్కడ ఉన్నామని, వారి లక్ష్యం నెరవేర్చినప్పుడే వారి ఆత్మబలిదానాలకు సార్థకత చేకూరుతుందన్నారు. ‘‘ఐపీఎస్ శిక్షణతో మీ కల పూర్తవలేదు. వాస్తవానికి ఇప్పటి నుంచి మీ అసలు లక్ష్యం మొదలవనుంది. సురక్షిత, అభివృద్ధి చెందిన దేశ లక్ష్యం. సర్వీసులో ఉత్తమ ఫలితాలు రావాలంటే ప్రజలతో మమేకం కండి. కోట్లాది మంది పేదలకు చేయూత అందించాల్సిన బాధ్యత మీ భుజాలపై ఉంది. స్మార్ట్ పోలీసింగ్ ప్రధాని మోదీ ఆశయం. ఆయన ప్రకారం స్మార్ట్ పోలీసింగ్ అంటే ఎస్ అంటే సెన్సిటివ్, ఎమ్ అంటే మోరల్ వ్యూ, ఏ అంటే అలర్ట్, ఆర్ అంటే రెస్పాన్సిబుల్, టీ అంటే టెక్ శావీ (టెక్నాలజీ వాడకంలో నిష్టాతుడు). ఈ నినాదంతో మీరు కెరీర్లో ముందుకెళ్లండి. ప్రజాసేవలో మాకు కేవలం ఐదేళ్లే అధికారం ఇచ్చారు. మరో ఐదేళ్లు కావాలంటే ప్రజలు ఆలోచిస్తారు. కానీ మీకు అలాకాదు. మీ చేతిలో 30 ఏళ్లు అవకాశం ఉంది. కాబట్టి విధినిర్వహణలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఒత్తిళ్లు ఎదుర్కొన్నా ఎక్కడా రాజీపడకూడదు’’అని అమిత్ షా పిలుపునిచ్చారు. ప్రతిభావంతులకు పురస్కారాలు ఎన్పీఏ డైరెక్టర్ అభయ్ కేడేట్లకు అకాడమీలో ఇచ్చిన శిక్షణ విశేషాలను అంతకుముందు వివరించారు. అనంతరం శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కేడెట్లకు అమిత్ షా పురస్కారాలు అందజేశారు. ట్రైనింగ్ మొత్తంలో అత్యధిక అవార్డులతో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచిన ఢిల్లీకి చెందిన గోష్ ఆలమ్ తెలంగాణ కేడర్‌కు సెలెక్ట్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ బ్యాచ్‌లో మొత్తం ఆరుగురు అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. అనంతరం ఎన్పీఏ ప్రాంగణంలోని న్యూ ఆఫీసర్స్ మెస్‌ను అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎన్పీఏ మాజీ డైరెక్టర్లు అరుణా బహుగుణ, బర్మన్ తదితరులు పాల్గొన్నారు. -
దీక్షాంత్ పరేడ్‌కు హాజరవనున్న అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఈ నెల 24న(శనివారం) 70వ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్ల దీక్షాంత పరేడ్ జరగనుందని డైరెక్టర్ అభయ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొని గౌరవ వందనం స్వీకరిస్తారని పేర్కొన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈ బ్యాచ్‌లో 92 మంది ఆఫీసర్లు శిక్షణ పొందారని, వీరిలో 12 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. వీరిలో తెలంగాణ కేడర్‌కు ముగ్గురు ప్రొబేషనర్లు ఎంపికైనట్లు తెలిపారు. శిక్షణ పొందిన 11 మంది విదేశీ ఆఫీసర్లలో ఆరుగురు భూటన్, ఐదుగురు నేపాల్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారన్నారు. ఈ బ్యాచ్‌లో ఉత్తమ ప్రొబెషనర్‌గా పురుషుల విభాగంలో తెలంగాణ కేడర్‌కు చెందిన గౌష్ ఆలమ్, మహిళల విభాగంలో రాజస్తాన్ కేడర్‌కు చెందిన రిచా తోమర్లు ఎంపికైనట్లు అభయ్ వెల్లడించారు. ఉత్తమ ఆల్‌రౌండ్ ప్రొబెషనర్‌గా ఎంపికైన గౌష్ ఆలమ్ ప్రధాన మంత్రి బేటన్, హోంమంత్రి రివాల్వర్ అందుకుంటారని తెలిపారు. ప్రొబేషనర్లు ఎక్కువ శాతం సామాన్య కుటుంబాలకు చెందిన వారని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వారు ఐపీఎస్ ఆఫీసర్లుగా కఠోర శిక్షణ పూర్తి చేసుకున్నారని అభయ్ తెలిపారు. -
ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు
సాక్షి, హైదరాబాద్: భారత నవనిర్మాణలో ఐపీఎస్‌లు భాగస్వామ్య కావాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో 69వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువ ఐపీఎస్‌ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లను ఉద్దేశించి ప్రసంగించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటారన్నారు. పనిలో కూడా ప్రతిభ చూపాలన్నారు. ఉగ్రవాదులు ఓ వైపు, సైబర్ దాడులు వంటి సవాళ్లను ఎదురుకోవాల్సి ఉందన్నారు. ప్రజలకు సాయం చేయడంలో ముందుండి కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా వారికి అండగా నిలవాలన్నారు. మంచి అధికారి ఉంటే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీ అభివృద్దికి 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ఆయన ఈ సందర్బంగా ప్రకటించారు. 69 ఐపీఎస్ శిక్షణలో అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరిచిన యువ ఐపీఎస్‌లకు బహుమతులు అందజేశారు. ఈ బ్యాచ్‌లో మొత్తం 136 మంది ఏపీఎస్ అధికారులు శిక్షణ పొందారు. వీరిలో మన దేశం నుంచి 122 మంది.. భూటాన్, నేపాల్, మాల్దీవుల నుంచి 14 మంది ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వారున్నారు. అంతా ఉన్నత విద్యావంతులే. శిక్షణ పొందిన వారిలో ముగ్గురు మెడిసిన్, 75 మంది ఇంజనీరింగ్, ఏడుగురు ఆర్ట్స్, ఆరుగురు సైన్స్, ఇద్దరు కామర్స్, ముగ్గురు ఎంబీఏ, నలుగురు లా, ముగ్గురు ఎంఫిల్ బ్యాక్‌గ్రౌండ్ కలిగిన వారున్నారు. అత్యధికంగా ఇంజనీరింగ్ నుంచి 75 మంది ఎంపిక కావడం ఎస్వీపీఎన్పీఏ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ బ్యాచ్‌లో మొత్తం 21 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. ఈ బ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌గా మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ షమీర్ అస్లామ్ షేక్ ఎంపికయ్యారు. పాసింగ్ ఔట్ పరేడ్ కు అల్ రౌండర్ షమీర్ అస్లామ్ షేక్ పరేడ్ కమాండర్ గా వ్యహరించారు. ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ అందరిని అకర్షించింది. అకింత భావంతో పనిచేస్తామంటూ ఈ సందర్బంగా యువ ఐపీఎస్ లు ప్రతిజ్ఞ పూనారు. సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఈ అకాడమీకి దేశంలోనే అత్యున్నత స్థానం ఉంది. ఇండియన్ పోలీస్ సర్వీసెస్ కి ఎంపికైన ఐపీఎస్‌లకు విలువలతో కూడిన శిక్షణ ఇస్తోంది మన నేషనల్ పోలీస్ అకాడెమీ. ఈ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన ఎందరో ఐపీఎస్ అధికారులు.. కేంద్ర హోం డిపార్ట్ మెంట్ తో పాటు రాష్ట్ర హోంశాఖలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీ ఏర్పడ్డ రోజు నుండి ఇప్పటి వరకు 68 బ్యాచ్‌ల్లో ఐపీఎస్‌లు ఎన్పీఏలో శిక్షణ పొందారు. ఇందులో ప్రతీ బ్యాచ్ కు 45 వారాల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. అందులో ఇండోర్ ఔట్ డోర్ తో పాటు సైబర్ క్రైం నేరాలు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఉగ్రదాడులను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ట్రైనింగ్ ఇచ్చామని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ డోలే బర్మన్ అన్నారు. ఐపీఎస్‌లు అన్ని విభాగాల్లో 45 వారాల పాటు శిక్షణ పొందారన్నారు. ఏడాది పాటు వివిధ పోలీస్ స్టేషన్స్ లో అక్కడ పరిస్థితుల అవగాహన కల్పిస్తామని 2018, సెప్టెంబర్ లో నుంచి వీరంతా విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఇదిలా ఉండగా ఈసారి శిక్షణ పొందిన ఐపీఎస్ ల్లో ఏడుగుర్ని ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించారు. ఏపీకి కేటాయించిన ఐపీఎస్ అధికారుల్లో సతీష్ కుమార్, సుమిత్ సునీల్, వకుల్ జిందాల్, రిషిత్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ క్యాడర్‌కు పోతరాజు సాయి చైతన్య, రాజేష్ చంద్ర, శరత్ చంద్ర పవార్లను కేటాయించారు. -
ఆలిండియా డీజీపీల సదస్సు ప్రారంభం
హైదరాబాద్: 51వ ఆలిండియా డీజీపీలు, ఐజీల సదస్సును కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శుక్రవారం ఈ సదస్సును ఆరంభించారు. అత్యుత్తమ సేవలు అందించిన హోం శాఖ, ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులకు భారత పోలీస్ పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. దేశ అంతర్గత భద్రతను కాపాడేందుకు పోలీసులు చేస్తున్న సేవలను కొనియాడారు. ఉగ్రవాద ప్రాబల్యం ఉన్న జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్రాల పోలీసు బలగాలు శాంతిభద్రతలు కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నాయని అన్నారు. అంతకుముందు రాజ్‌నాథ్ ఉక్కుమనిషి, మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రులు కిరన్ రిజిజు, హన్సరాజ్ గంగారామ్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి, అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణ, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశం ఎదుర్కొంటున్న భద్రత సమస్యలను చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ విచ్చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. ఆయన అక్కడ నుంచి నేరుగా పోలీస్ అకాడమీకి చేరుకున్నారు. ఈ రోజు రాత్రికి అక్కడే బస చేసి రేపు సదస్సులో పాల్గొంటారు. -
సవాళ్లకు సిద్ధంగా ఉండండి
► శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులతో అరుణ్ జైట్లీ ► మానవాళికి ఉగ్రవాదం పెనుశాపంగా మారింది ► ఆధునిక పరిజ్ఞానంతో నేరాలకు చెక్ పెట్టాలని సూచన ► 109 మంది ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో మానవతా దృ క్పథం, నిష్పక్షపాతం, ప్రతిభ ప్రదర్శించిన వారే ఉత్తమ పోలీసు అధికారులుగా నిలిచిపోతారని యువ ఐపీఎస్ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హితబోధ చేశారు. మానవాళికి పెనుశాపంగా మారిన ఉగ్రవాదంపై పోరాటం వంటి సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ మాఫియా వంటి నేరాలను ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో సహాయంతో నియంత్రించేందుకు కృషి చేయాలన్నారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శుక్రవారం 68వ బ్యాచ్ ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో అరుణ్ జైట్లీ ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. ‘‘శిక్షణ నుంచి బయటకు అడుగు పెట్టిన మరుక్షణం నుంచీ విశ్వసనీయతే మీ అత్యున్నత ప్రాధాన్యం కావాలి. వృత్తిలో పనితీరును నిర్ణయించుకోవడానికి విశ్వసనీయతే గీటురాయి. నూతనోత్సాహంతో సమాజ సేవకు సిద్ధమవుతున్న మీకు విజయం వెన్నంటే ఉంటుందని ఆకాంక్షిస్తున్నా.. విధి నిర్వహణలో కొన్నిసార్లు ఏ మార్గాన్ని ఎంచుకోవాలో అర్థం కాని గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు నేరుగా మీ ముందు ఉన్న ఉత్తమమైన దారిని ఎంచుకోవడమే తెలివైన పని. దగ్గరి మార్గాలు తాత్కాలిక ఊరట కలిగించినా.. వాటితో శాశ్వత విజయాలు లభించవు..’’ అని యువ ఐపీఎస్‌లకు జైట్లీ సూచించారు. ఆకట్టుకున్న కవాతు... కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకుని బయటకు వెళ్తున్న ట్రైనీ ఐపీఎస్‌లకు అకాడమీ డెరైక్టర్ అరుణా బహుగుణ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బ్యాచ్‌లో బెస్ట్ ఆల్‌రౌండ్‌గా నిలిచిన రిషికేష్ భగవాన్ సోనావాలే నేతృత్వంలో ట్రైనీ ఐపీఎస్‌లు నిర్వహించిన కవాతు ఆహూతులను కట్టిపడేసింది. 109 ఐపీఎస్ శిక్షణార్థులతో పాటు నేపాల్ పోలీస్ సర్వీసెస్ నుంచి ఐదుగురు, రాయల్ భూటాన్ పోలీస్ సర్వీసెస్ నుంచి ఆరుగురు, మాల్దీవియన్ పోలీస్ సర్వీసెస్ శిక్షణార్థులు నలుగురు కలిపి... 2015కి చెందిన ఈ బ్యాచ్‌లో మొత్తం 124 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన ట్రైనీ అధికారులకు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ట్రోఫీలు, ఇతర పురస్కారాలను అందజేశారు. -
ఐపిఎస్ శిక్షణలో అగ్రగామి ఎన్పిఏ
-
ఆ కుటుంబంలో అందరూ ఐపిఎస్‌లే
-
పోలీస్ షాపింగ్
-
సూపర్ ఉమెన్ ఫోర్స
సందడిగా ‘శాంతి భద్రతల పరిరక్షణలో మహిళల పాత్ర’ సదస్సు {పత్యేక ఆకర్షణగా విదేశీ, భారత మహిళా పోలీసులు రానున్న రోజుల్లో అన్ని దేశాల పోలీస్ వ్యవస్థలో మహిళల సంఖ్య మరింత పెరగాలని పలువురు మహిళా పోలీస్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలోమంగళవారం ‘శాంతిభద్రతల పరిరక్షణలో మహిళల పాత్ర’పై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఇందులో విదేశీయులతో పాటు భారతీయ మహిళా పోలీసు అధికారులు పాల్గొన్నారు. పోలీసింగ్, మహిళా పోలీసుల పాత్రపై చర్చించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ పలువురు విదేశీ మహిళ అధికారులను పలుకరించగా వారు ఇలా స్పందించారు. - సాక్షి, సిటీబ్యూరో ఓర్పు ఉండేది మహిళల్లోనే.. బంగ్లాదేశ్ పోలీసు ఫోర్స్‌లో మహిళల ప్రాతినిథ్యం 20 శాతం కన్నా తక్కువే ఉంది. రానున్న రోజుల్లో వీరి సంఖ్య పెరుగుతుందని అనుకుంటున్నా. ఓర్పు, నేర్పుతో ఉండే మహిళల సంఖ్య పెరిగితే బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా ఇవ్వగలం. మహిళలు, పిల్లల బాధితులకు న్యాయం చేసేందుకు ‘విగ్ టీమ్ సపోర్ట్ సెంటర్’ ప్రత్యేకంగా పనిచేస్తోంది. పోలీసు రిఫామ్ ప్రాజెక్టు కింద కూడా మహిళలకు న్యాయం చేసేందుకు మా పోలీసులు పోరాడుతున్నారు. - షాహీనా అమీన్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, బంగ్లాదేశ్ చిల్డ్రన్-ఉమెన్ బ్యూరోతో సేవలు పిల్లలు, మహిళల కోసం మా దేశంలో ప్రత్యేకంగా ‘చిల్డ్రన్ అండ్ ఉమెన్ బ్యూరో’ పనిచేస్తోంది. మొత్తం 36 బృందాల సహాయంతో ఎప్పటికప్పుడు వారి భద్రతను పర్యవేక్షిస్తున్నాం. శ్రీలంక పోలీసు ఫోర్స్లోనూ మహిళల ప్రాతినిథ్యం అంతంత మాత్రమే. అయితే ఫిర్యాదుదారులు తమ బాధలను ఎక్కువగా మహిళ పోలీసులకే చెప్పేందుకు ఇష్టపడుతున్నారు. - సుమాకుమారి సిన్హా, ఏఎస్పీ, శ్రీలంక సైన్యంలోనూ మహిళలు.. మిలట్రీ ఫోర్స్‌లో ఇప్పుడిప్పుడే మహిళల సంఖ్య పెరుగుతోంది. 2011లో అఫ్ఘనిస్థాన్‌లో జరిగిన యుద్ధంలో మా సైనికులు పాల్గొన్నారు. ఇందులో మహిళల పాత్ర మరువలేనిది. ఇప్పటికే మిలట్రీ ఫోర్స్‌లో మహిళల ఇబ్బందులు, వారు పనిచేస్తున్న తీరుపై అధ్యయనం చేశా. మా దేశంలోనూ మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. - నటాలిక్ శాన్బి, మిలట్రీ భద్రతా అధికారిణి, ఆస్ట్రేలియా బాధితులకు అండగా.. మా ప్రాంతంలో పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్ ఎక్కువగా జరుగుతుంటాయి. బాధితులు ఎక్కువగా విదేశీయులే ఉంటారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలతో పాటు విదేశీయులను టార్గెట్ చేస్తున్న దొంగలను పట్టుకునేందుకు మా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు విభాగం పనితీరుపై పూర్తి అధ్యయనం చేశా. కొంత మంది మహిళా పోలీసులు తాము ఎదుర్కొంటున్న బాధలు కూడా వివరించారు. - లియాన్ బ్లి, రీసెర్చ్ స్టూడెంట్, వియత్నాం -
మారువేషంలో ట్రైనీ ఐపీఎస్‌లు!
సైబరాబాద్ పోలీసుల పనితీరుపై ఆరా సిటీబ్యూరో: శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమి (ఎన్పీఏ)లో శిక్షణ పొందుతున్న యువ ఐపీఎస్‌లు మారు వేషంలో సైబరాబాద్ పోలీసుల పనితీరుపై ఆరా తీశారు. సాధారణ పౌరుల వేషంలో వారు ఆయా పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ‘‘బస్సు దిగుతుండగా పర్సు పోయింది’’, ‘‘బస్టాప్‌లో నిలబడితే జేబులోంచి సెల్‌ఫోన్ దుండగులు లాక్కెళ్లారు’’. ‘‘బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకుని వస్తుండగా దుండగులు లాక్కొనిపోయారు’’ ఇలా రకరకాల ఫిర్యాదులో వారు స్టేషన్‌కు వచ్చి అధికారులను కలిశారు. ఆ సందర్భంగా పోలీసులు స్పందించిన తీరును జాగ్రత్తగా పరిశీలించారు. కొంత మంది ఎస్ఐలు ఫిర్యాదును పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, మరికొంత మంది ఎస్ఐలు వచ్చిన వెంటనే మర్యాదపూర్వకంగా స్వాగతం పలకడం, ఇచ్చిన ఫిర్యాదును ఒపిగ్గా చదివి మరిన్ని వివరాలు తెలుసునే ప్రయత్నం చేయడం, కేసు నమోదు చేస్తామనడం లాంటివి మారువేషంలో వచ్చిన ట్రైనీ ఐపీఎస్‌లు గమనించారు. సైబరాబాద్ పోలీసు అధికారుల పనితీరు 74 శాతం బాగుందని, ఎఫ్ఐఆర్లు నమోదు చేయని వారి శాతం 14 ఉందని, అసలు ఫిర్యాదు చదివే ఒపిక లేక ఏదో ఒకటి చెప్పి వెనక్కి పంపించిన వారి శాతం 12 ఉందని వారు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌కు తెలిపారు. శిక్షణలో భాగంగానే ట్రైనీ ఐపీఎస్‌లు ఇలా వచ్చి పోలీసుల తీరుతెన్నులను పరిశీలించారు. ఈ విషయాన్ని సీవీ ఆనంద్ శుక్రవారం జరిగిన సెట్ కాన్ఫరెన్స్‌లో వివరించారు. స్టేషన్ ఎస్హెచ్ఓలు, ఇతర అధికారులకు ఆయన ఈ కింద సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. *సర్టిఫికెట్లు, సెల్‌ఫోన్ పోగుట్టుకుని ఎవరైనా పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే వారికి వెంటనే మిస్సింగ్ సర్టిఫికెట్ ఇవ్వాలి. *ప్రతి ఠాణా పనితీరుపై నిఘా పెట్టాం. అధికారులు, సిబ్బంది పనితీరుపై స్పెషల్ బ్రాంచ్, ఇతర అధికారులతో నివేదికలు తెప్పించుకుంటున్నాం. *స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఠాణాకు వస్తే వారికి అక్కడి సిబ్బంది, అధికారులు సహకరించడంలేదని తెలిసింది. ఇకపై స్పెషల్ బ్రాంచ్ అధికారులకు సహకరించి, సమాధానాలు చెప్పండి. *ఠాణాలలో నిందితులను విచారించే సమయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించరాదు. శంషాబాద్ జోన్‌లోని ఓ స్టేషన్లో ఇటీవల థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఇకపై ఇలా జరకుండా చూడండి. ఎస్ఐ నుంచి ఆ పై స్థాయి అధికారులందరూ స్మార్ట్ఫోన్లను వినియోగించాలి. ప్రజలను నుంచి వచ్చే ఫిర్యాదులను వాట్స్‌యాప్ ద్వారా పంపించే విధానం ప్రారంభమైంది. -
'ఐపీఎస్ లు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి'
హైదరాబాద్: పరస్పరం సహకరించుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న మీరు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలని ఐపీఎస్ అధికారులకు హితవు పలికారు. శుక్రవారం హైదరాబాద్ నగర శివారుల్లోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో జరిగిన 66వ బ్యాచ్ ఐపీఎస్ అధికారులు పాసింగ్ ఔట్ పెరేడ్లో రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ... దేశానికి సర్దార్ పటేల్ చేసిన సేవలు మరువలేనివని అన్నారు. పటేల్ జన్మదినాన్ని ఏక్తా దివాస్‌గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారని ఈ సందర్బంగా చెప్పారు. 66వ పాసింగ్ ఔట్ పెరేడ్లో128 మంది ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో 19 మంది మహిళలు ఉన్నారు. మరో 15 మంది విదేశాలకు చెందిన అధికారులు ఉన్నారు. -
పోలీస్ అకాడమీలో మిస్ ఫైర్, ఒకరికి తీవ్రగాయాలు
హైదరాబాద్: నగర శివారు రాజేంద్రనగర్ సమీపంలోని జాతీయ పోలీసు అకాడమీలో తుపాకీ మిస్‌ఫైర్ అయి... గార్డెనర్‌గా పని చేస్తున్న హబీబ్ నడుమ భాగంలోకి దూసుకు వెళ్లింది. దీంతో అతడు కుప్పకూలిపోయాడు. అకాడమీ సిబ్బంది వెంటనే స్పందించి హబీబ్‌ను నగరంలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. అతడికి శస్త్ర చికిత్స చేసి నడుమ భాగంలోని చొచ్చుకుని పోయిన బుల్లెట్‌ను వెలికి తీశారు. అతడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. క్షతగాత్రుడు హబీబ్ మైలార్దేవ్ పల్లి గ్రామానికి చెందిన వాడని... దాదాపు 18 ఏళ్లుగా పోలీసు అకాడమీలో గార్డెనర్‌గా విధులు నిర్వహిస్తున్నాడని అకాడమీ అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు అకాడమీ అధికారులు తెలిపారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. అయితే గత అర్థరాత్రి వెలుగులోకి వచ్చింది. గురువారం అకాడమీలోని ఐపీఎస్ పాసింగ్ అవుట్ పేరెడ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయుధాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రేపు జరగనున్న ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పేరెడ్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. -
ఎన్పీఏలో రైఫిల్ మిస్‌ఫైర్
ఒకరికి తీవ్రగాయాలు: పరిస్థితి విషమం సాక్షి, సిటీబ్యూరో: సర్దార్ వల్లభభాయి పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో మంగళవారం ప్రమాదవశాత్తు తుపాకి పేలి ఓ వర్కర్ తీవ్రగాయాల పాలయ్యాడు. నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగే పాసింగ్ అవుట్ పెరేడ్ కోసం ఏర్పాట్లలో భాగంగా ఆయుధాలను ఒకచోట నుంచి మరొక చోటుకి తరలిస్తుండగా, ఓ తుపాకి ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటనలో హబీబ్ అనే వర్కర్ తీవ్రంగా గాయపడ్డాడు. అధికారులు వెంటనే అతన్ని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. -
ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్లో పాల్గొన్న ప్రణబ్
-
ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్లో పాల్గొన్న ప్రణబ్
2012 బ్యాచ్ ఐపీఎస్‌ల ముగింపు శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సర్ధార్ వల్లభాయ్ పటేల్ పోలీసు అకాడమీ చేరుకున్నారు. అక్కడ ఆయన ఐపీఎస్ నుంచి గౌరవ వందన స్వీకరించారు. అనంతరం శిక్షణ పొందిన ఐపీఎస్‌ల ఉద్దేశించి ప్రణబ్ ప్రసంగించనున్నారు. పోలీసు అకాడమీలో 148 మంది ఐపీఎస్‌లు తమ శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణ పొందిన వారిలో ఎనిమిది మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రణబ్ న్యూఢిల్లీ బయలుదేరి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమం పాల్గొనేందుకు నిన్న సాయంత్రం ప్రణబ్ హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. -
4న హైదరాబాద్‌కు రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చే నెల నాలుగో తేదీ రాత్రి హైదరాబాద్‌కు రానున్నారు. 5వ తేదీ ఉదయం సర్దార్ వల్లభాయి పటేల్ జాతీ య పోలీసు అకాడమీలో జరగనున్న 2012 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ప్రొబేషనర్స్ పరేడ్‌లో రాష్ట్రపతి పాల్గొం టారు. అనంతరం రాష్ట్రపతి తిరిగి ఢిల్లీ వెళతారు. మరోవైపు రాష్ట్రపతి కొత్త సంవత్సరం వేడుకలను రాష్ట్రంలోనే జరుపుకోనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా ప్రణబ్ డిసెంబర్ 16న హైదరాబాద్‌కు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఇప్పటివరకు ఖరారైన షెడ్యూల్ మేరకు జనవరి 1వ తేదీ వరకు రాష్ట్రపతి ఇక్కడ ఉంటారు.