ఐపీఎస్ల పాసింగ్ ఔట్లో పాల్గొన్న ప్రణబ్ | President Pranab Mukherjee reach Hyderabad to Attend IPS Police | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 5 2013 10:44 AM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

2012 బ్యాచ్ ఐపీఎస్ల ముగింపు శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సర్ధార్ వల్లభాయ్ పటేల్ పోలీసు అకాడమీ చేరుకున్నారు. అక్కడ ఆయన ఐపీఎస్ నుంచి గౌరవ వందన స్వీకరించారు. అనంతరం శిక్షణ పొందిన ఐపీఎస్ల ఉద్దేశించి ప్రణబ్ ప్రసంగించనున్నారు. పోలీసు అకాడమీలో 148 మంది ఐపీఎస్లు తమ శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణ పొందిన వారిలో ఎనిమిది మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రణబ్ న్యూఢిల్లీ బయలుదేరి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమం పాల్గొనేందుకు నిన్న సాయంత్రం ప్రణబ్ హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement