
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభణ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ(ఎన్‌పీఏ)కి పాకింది. హైదరాబాద్‌లోని అకాడమీలో శిక్షణ పొందుతున్న 72 ఆర్‌ఆర్ బ్యాచ్‌లో ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ అధికారులకు కరోనా సోకినట్లు తెలిసింది. ఇటీవల శిక్షణలో భాగంగా ఐపీఎస్‌లు వివిధ ప్రాంతాలకు వెళ్లారు. వీరిలో 137 మందికి ముందుజాగ్రత్తగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. ఇరువురిని క్వారంటైన్‌కు తరలించారు.