పాకిస్తాన్‌ పై భారత్‌ క్షిపణి ప్రయోగం... ప్రమాదవశాత్తు జరిగిందని వివరణ | India Accidental Firing A Missile Into Pakistan Landed In Pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ పై భారత్‌ క్షిపణి ప్రయోగం... ప్రమాదవశాత్తు జరిగిందని వివరణ

Published Sat, Mar 12 2022 10:02 AM | Last Updated on Sat, Mar 12 2022 10:06 AM

India Accidental Firing A Missile Into Pakistan Landed In Pakistan - Sakshi

Defence Ministry said Technical Malfunction: భారత్ ప్రమాదవశాత్తు పాకిస్థాన్‌పైకి క్షిపణిని ప్రయోగించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్షిపణి పాకిస్తాన్‌లో ల్యాండ్‌ అవ్వడానికి ముందు గగనతలంలో సుమారు 100 కి.మీ పైగా వేగంతో దాదాపు 40 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించిందని పేర్కొంది. సాంకేతిక లోపం కారణంగా ఈ సంఘటన జరింగిందని తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

ఈ మేరకు ఈ క్షిపణి మార్చి 9, 2022న, సాధారణ నిర్వహణ సమయంలో, సాంకేతిక లోపం కారణంగా ప్రమాదవశాత్తూ ఈ క్షిపణి పేలిందని రక్షణ శాఖ వివరణ ఇచ్చింది. అంతేకాదు భారత ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ విదేశాంగ కార్యాలయం ఇస్లామాబాద్‌లోని భారత్‌ ఛార్జ్ డి'అఫైర్స్‌ను పిలిపించి భారత్‌కి చెందిన సూపర్-సోనిక్ ఫ్లయింగ్ క్షిపణి సూరత్‌గఢ్ నుంచి పాకిస్తాన్‌లోకి ప్రవేశించిందని తెలిపింది.

ఈ చర్యను గగనతలంలో అకారణ ఉల్లంఘనగా పేర్కొంటూ నిరసన వ్యక్తం చేసింది. అంతేకాదు ఇలాంటి చర్యల వల్ల పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అందువల్ల ఈ ఘటనపై భారత్‌ సత్వరమే విచారణ జరపాలని పాకిస్థాన్  కోరింది. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ భారత్‌ను హెచ్చరించింది. అంతేకాదు ఈ క్షిపణి పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్ చున్ను నగరం సమీపంలో సాయంత్రం 6:50 గంటల సమయంలో కూలిందని తెలిపింది. దీని వలన పౌర ఆస్తులకు నష్టం వాటిల్లిందని కూడా పేర్కొంది. 

(చదవండి: ఉగ్రవాదుల ఏరివేత.. జమ్ముకశ్మీర్‌లో హైఅలర్ట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement