Defence Ministry
-
ఎయిర్‌ఫోర్స్ తదుపరి చీఫ్ అమర్‌ప్రీత్‌సింగ్
న్యూఢిల్లీ:ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తదుపరి చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ నియమితులయ్యారు.అమర్‌ప్రీత్‌సింగ్ ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్ వైస్ చీఫ్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా విధులు నిర్వర్తిస్తున్న వివేక్ రామ్ చౌదరి పదవీ కాలం త్వరలో ముగియనుంది.దీంతో అమర్‌ప్రీత్ సింగ్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం(సెప్టెంబర్21) ఒక ప్రకటన విడుదల చేసింది. 1964 అక్టోబరు 27న జన్మించిన ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ,డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ నేషనల్ డిఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.1984 డిసెంబర్లో ఎయిర్‌ఫోర్స్‌లో ప్రవేశించారు.దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్లో అత్యంత అనుభవజ్ఞుడైన ఫ్లైయర్‌గా, ప్రయోగాత్మక టెస్ట్ పైలట్‌గా అమర్‌ప్రీత్‌సింగ్ గుర్తింపు పొందారు.ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.ఇదీ చదవండి.. భారత వృద్ధికి కీలక చర్చలు : పియూష్ గోయెల్ -
ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్ పారాడ్రాప్
ఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన పోర్టబుల్ హాస్పిటల్‌ను విజయవంతంగా పారాడ్రాప్ చేసినట్లు రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆరోగ్య మైత్రీ హెల్త్ క్యూబ్‌గా పేర్కొనే ఈ ఆస్పత్రిని 15 వేల అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా నేలకు దించినట్లు పేర్కొంది. భీష్మా (భారత హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హితా అండ్ మైత్రి) అనే ప్రాజెక్టులో భాగంగా ఆరోగ్య మైత్రీ హెల్త్ క్యూబ్‌ని ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం సంబంధించిన వీడియోను రక్షణ శాఖ విడుదల చేసింది. ఇక.. ఇది ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్ కావటం విశేషం.#IAF & #IndianArmy have jointly carried out a first-of-its-kind precise para-drop operation of Aarogya Maitri Health Cube at a high-altitude area close to 15,000 ft.These critical trauma care cubes have been indigenously developed under Project #BHISHM👉🏻https://t.co/QmA6ZYBPST pic.twitter.com/iEufwVcEG3— Defence Production India (@DefProdnIndia) August 17, 2024విపత్తుల సమయంలో దెబ్బతిన్న ప్రాంతాల్లోని ప్రజలకు అత్యవసర సేవలు అందించాలనే ప్రధాని మోదీ ఆదేశాలతో ఈ ప్రాజెక్టు ప్రారంభించినట్లు తెలిపింది. మారుమూల, పర్వత ప్రాంతాల్లో విపత్తులు సంభవించినప్పుడు తక్షణ సహాయ చర్యలు అందించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని అన్నారు. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈ పోర్టబుల్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఇక.. పోర్టబుల్ హాస్పిటల్లో మొత్తం 72 క్యూబ్స్ ఉంటాయి. దీన్ని ఉపయోగించి 200 మందికి ఆరోగ్య సేవలందించవచ్చు. భారత వైమానికి దళానికి సంబంధించిన విమానం సీ-130జీని సాయంతో దీనిని నిర్దేశించిన ప్రాంతానికి చేరవేస్తుంది. -
సైనిక్ స్కూళ్ల ప్రైవేటికరణ: ఖర్గే ఆరోపణలను ఖండించిన కేంద్రం
ఢిల్లీ: దేశంలోని సైనిక్ స్కూల్స్‌పై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను కేంద్ర రక్షణ శాఖ ఖండించింది. సైనిక స్కూళ్లను ‘ప్రైవేటుపరం’ చేయాలనే కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ఖర్గే చేసిన ఆరోపణలను ఖండించింది. ‘సైనిక స్కూళ్లలోని ఎంపిక విధానంలో రాజకీయ, సిద్ధాంతపరంగా దరఖాస్తు దారులపై ఎటువంటి ప్రభావం చూపించదు. ఈ పథకం లక్ష్యాలు, అమలును రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సైనిక్ స్కూల్స్‌పై చేస్తున్నవి వక్రీకరించే, తప్పుదారి పట్టించే ఆరోపణలు’ అని రక్షణ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. సైనిక స్కూళ్ల ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇందుకు సంబంధించి చేసుకున్న ఎంఓయులను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతి రాసిన లేఖలో కోరారు. సైనిక్ స్కూల్స్‌ను కూడా రాజకీయం చేయడానికి ప్రభుత్వం కఠోర ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇక.. ఆర్టీఐ రిపోర్టు ఆధారంగా.. సుమారు 62 శాతం సైనిక్ స్కూల్స్ బీజేపీ, బీజేపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ నేతలకు చెందినవిగా తెలిపారు. పక్షపాత రాజకీయాలకు దూరంగా సాయుధ బలగాలను వేరుగా ఉంచడం భారత ప్రజాస్వామ్యంలో అనుసరిస్తున్న సంప్రదాయమని, దానిని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని అన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యూహంలో భాగంగా సాయుధ బలగాల సహజ స్వభావాన్ని, నైతికతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని అన్నారు. జాతీయ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని సైనిక్ స్కూల్స్ ప్రైవేటీకరణ విధానాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని కోరారు. వాటిపై చేసుకున్న ఎంఓయూలు కూడా చెల్లనివిగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోందని ఖర్గేలో రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. -
Defense Deals: రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు ఒప్పందాలు
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లు, అత్యాధునిక రాడార్లు, ఆయుధ వ్యవస్థలు, మిగ్–29 జెట్ విమానాలకు ఏరో ఇంజిన్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం రూ.39,125 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)తో ఒకటి, బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్(బీఏపీఎల్)తో రెండు, లార్సెన్ అండ్ టూబ్రోతో రెండు ఒప్పందాలు ఉన్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్ అరమానె సమక్షంలో శుక్రవారం ఆయా సంస్థల ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ‘సైనిక బలగాల పోరాట సామర్థ్యాన్ని మరింత ఇనుమడింప జేసే ఈ ఒప్పందాలు దేశీయ సంస్థల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తాయి. భవిష్యత్తులో విదేశీ పరికరాల తయారీపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి’అని రక్షణశాఖ తెలిపింది. ఒప్పందంలో భాగంగా భారత్– రష్యాల జాయింట్ వెంచర్ బీఏపీఎల్ నుంచి 200 బ్రహ్మోస్ క్షిపణులను రక్షణశాఖ కొనుగోలు చేయనుంది. -
మరిన్ని యుద్ధ విమానాలు భారత్‌కు.. రక్షణ శాఖ అనుమతి
భారత రక్షణ దళంలోని వాయుసేన విభాగం పటిష్టం చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రక్షణ దళ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు తేలికపాటి యుద్ద విమానాలను కొనుగోలు చేయనుంది. ఇందులో భాగంగా మరో 97 తేజస్ యుద్ధ విమానాలను, 156 ప్రచండ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వశాఖ అనుమతినిచ్చింది. ఈ రెండు రకాల విమానాలు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయనున్నారు. దేశీయ కంపెనీల నుంచి రూ.1.5 లక్షల కోట్ల విలువైన రక్షణ పరికరాల కొనుగోలు ప్రతిపాదనకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) గురువారం ఆమోదం తెలిపింది. వీటి ఒప్పందాల విలువ సుమారు రూ. 1.1 లక్షల కోట్లు ఉండనుంది. అదనంగా భారత వైమానిక దళం కోసం తేజస్ మార్క్ 1-ఏ యుద్ధ విమానాలు.. వైమానిక దళం, సైన్యం కోసం హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. వీటి మొత్తం విలువ సుమారు రూ. 2 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. వీటిని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించనుంది. రాబోయే కొన్నేళ్లలో భారత వైమానిక దళంలో అమ్ముల పొదలో కొత్త యుద్ధ విమానాలు చేరనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే.. భారత్ చరిత్రలోనే స్వదేశీ సంస్థ తయారుచేయనున్న అతిపెద్ద ఆర్డర్ కానుంది. ఇప్పుడే అనుమతి లభించిన నేపథ్యంలో విమానాలు రూపుదిద్దుకునే వరకు సమయం పట్టనుంది. అయితే విదేశీ తయారీదారులు భాగస్వామ్యం అయితే తక్కువ కాలంలో పూర్తిచేసే అవకాశం ఉంది. -
ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
రక్షణ మంత్రిత్వ శాఖలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. డిఫెన్స్ సివిలియన్ ఉద్యోగుల ప్రమోషన్‌కు అవసరమైన కనీస అర్హత సర్వీస్ నిబంధనలను మంత్రిత్వ శాఖ సవరించింది. 7వ పే కమీషన్ పే మ్యాట్రిక్స్ అండ్ పే లెవెల్స్‌ను అనుసరించే వేతనాలు చెల్లించే రక్షణ పౌర ఉద్యోగులకు ఈ సవరించిన నిబంధనలు వర్తిస్తాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 3 శాతం డీఏ పెంపుపై భారీ ఆశలు డియర్నెస్ అలవెన్స్ పెంపునకు సమయం దగ్గర పడుతుండడంతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రం ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం విశేషం. మరోవైపు ఈ సారి 3 శాతం డీఏ పెంపుపై ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం తన కోటి మందికి పైగా ఉద్యోగులు ,పెన్షనర్లకు కరువు భత్యాన్ని (DA) 3 శాతం నుండి 45 శాతానికి పెంచవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. జూలైలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠ స్థాయిని దాటిన నేపథ్యంలో ఈ పెంపు ఉంటుందని అంచనా. తాజా పెంపు డియర్నెస్ అలవెన్స్ జూలై 1, 2023 కి వర్తిస్తుంది. డీఏను చివరిసారిగా మార్చి 2023లో 4 శాతం పెంచి 42 శాతానికి చేర్చారు. (వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం) డీఏ పెంపు ఎలా ? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల కోసం డియర్నెస్ అలవెన్స్ ప్రతి నెలా లేబర్ బ్యూరో ద్వారా విడుదల చేయబడిన పారిశ్రామిక కార్మికుల కోసం (CPI-IW) తాజా వినియోగదారుల ధరల సూచికలోని అంశాల ఆధారంగా లెక్కిస్తారు. ఉద్యోగులు, పెన్షనర్ల ప్రస్తుత జీతాలపై పెరుగుతున్న ధరల భారం ఆధారంగా కేంద్రం డియర్నెస్ అలవెన్స్‌ను మంజూరు చేస్తుంది. ( వర్క్ ఫ్రం హోం: ఐటీ ఉద్యోగులకు భారీ ఝలక్) -
Union Budget 2023-24: రక్షణశాఖకు ఎన్ని కోట్లంటే..?
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఈ ఏడాది రక్షణ రంగానికి ప్రాధాన్యం లభించింది. మొత్తం రూ.5.94 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది కంటే రూ. 69 వేల కోట్లు ఎక్కువ. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ రక్షణ రంగ కేటాయింపుల్లో రూ. 1.62 లక్షల కోట్లు మూల ధన వ్యయమని తెలిపారు. ఈ మొత్తాన్ని కొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధనౌకలు, ఇతర మిలటరీ పరికరాల కొనుగోళ్లకు మాత్రమే ఉపయోగిస్తారన్నమాట. 2022–23 మూలధన కేటాయింపులు రూ.1.52 లక్ష కోట్లు మాత్రమే. అంచనాల సవరణ తరువాత ఇది రూ.1.50 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది రక్షణ రంగ కేటాయింపుల్లో రూ.2.70 లక్షల కోట్లు ఆదాయ వ్యయం అంటే సిబ్బంది జీతభత్యాలు, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం ఖర్చు పెట్టనున్నారు. గత ఏడాది ఈ ఖర్చుల కోసం ముందుగా 2.39 లక్షల కోట్లు కేటాయించారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (సివిల్) మూలధన వ్యయం రూ.8774 కోట్లు. ఫించన్ల కోసం విడిగా రూ.1.38 లక్షల కోట్లు కేటాయిపులు జరిగాయి. దీంతో రక్షణ శాఖ ఆదాయ వ్యయం మొత్తమ్మీద రూ.4.22 లక్షల కోట్లకు చేరింది. భద్రతకు పెద్దపీట దేశంలో అంతర్గత భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా స్పష్టం చేసింది. బడ్జెట్లో కేంద్ర హోంశాఖకు ఏకంగా రూ.1,96,034.94 కోట్లు కేటాƇుుంచడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది బడ్జెట్లో ఈ కేటాయింపులు రూ.1,85,776.55 కోట్లు. ఈసారి కేటాయింపులను రూ.10,258.39 కోట్లు పెంచినట్లు స్పష్టమవుతోంది. మొత్తం కేటాయింపుల్లో సింహభాగం కేంద్ర సాయుధ పోలీసు దళాలు, నిఘాసమాచారం సేకరణ కోసం ఖర్చు చేయనున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోలీసు దళాల ఆధునీకరణ కోసం పెద్ద ఎత్తున వెచ్చించబోతున్నారు. మహిళా భద్రత పథకాలకు రూ.1,100 కోట్లు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు దళాలకు గత ఏడాది రూ.1,19,070 కోట్లు కేటాయించగా ఈసారి రూ.1,27,756 కోట్లు కేటాయించారు. ఇందులో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సీఆర్పీఎఫ్)కు 2022–23లో రూ.31,495 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్లో రూ.31,772 కోట్లు కేటాయించారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్), కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్), సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ), ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ), అస్సాం రైఫిల్స్ తదితర దళాలకు కేటాయింపులను పెంచారు. నేషనల్ సెక్యూరిటీ గార్డు(ఎన్ఎస్జీ), ఇంటెలిజెన్స్ బ్యూరో, ప్రత్యేక భద్రతా విభాగం(ఎస్పీజీ)కి గణనీయమైన కేటాయింపులు లభించాయి. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.3,545.03 కోట్లు, పోలీసు మౌలిక సదుపాయాల కోసం రూ.3,636.66 కోట్లు, పోలీసు దళాల ఆధునీకరణ కోసం రూ.3,750 కోట్లు కేటాయించారు. భద్రతకు సంబంధించిన ఖర్చుల కోసం రూ.2,780.88 కోట్లు, జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన పనులకు రూ.1,564.65 కోట్లు, మహిళా భద్రత పథకాలకు రూ.1,100 కోట్లు, ఫోరెన్సిక్ సదుపాయాల ఆధునీకరణకు రూ.700 కోట్లు, సరిహద్దుల్లో చెక్‌పోస్టుల నిర్వహణకు రూ.350.61 కోట్లు,సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు దళాల ఆధునికీకరణ ప్రణాళిక–4 కోసం రూ.202.27 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అంతరిక్షానికి 12,544కోట్లు అంతరిక్ష రంగానికి బడ్జెట్లో రూ.12,544 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులు గత ఏడాది ఇచ్చిన రూ.13,700 కంటే 8 శాతం తక్కువ కావడం గమనార్హం. వచ్చే ఏడాది చంద్రుడు, చుట్టూ ఉన్న గ్రహాల అధ్యయనం కోసం మానవసహిత గగన్‌యాన్‌ను నిర్వహించేందుకు అంతరిక్ష విభాగం ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఇచ్చిన కేటాయింపుల్లో అధికభాగం రూ.11,669.41 కోట్లను గగన్‌యాన్, శాటిలైట్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఇస్తారు. థియరిటికల్ ఫిజిక్స్‌తోపాటు వివిధ అంశాలపై పరిశోధనలు నిర్వహించే అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి రూ.408.69 కోట్లు కేటాయించారు. ఈ విభాగానికి గత ఏడాది రూ.411.11 కోట్లు ఇచ్చారు. ప్రైవేట్ రంగాన్ని పర్యవేక్షించేందుకు కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన సింగిల్‌విండో విభాగమైన ఇన్–స్పేస్‌కు గత ఏడాది రూ.21 కోట్లు ఇవ్వగా, తాజా బడ్జెట్లో రూ.95 కోట్లను కేటాయించా రు. వచ్చే ఏడాది చంద్రయాన్ మిషన్ చేపడుతున్న ఇస్రో.. సూర్యుడు, శుక్రు డు, అంగారక గ్రహాలపైనా పరిశోధనలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. న్యూక్లియర్ ఎనర్జీకి బూస్ట్ అణు ఇంధన ఉత్పత్తి కెపాసిటీని పెంచేందుకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్)కు గత బడ్జెట్లో కన్నా రూ. 2,859 కోట్లు ఈ బడ్జెట్లో అధికంగా ఇచ్చారు. న్యూక్లియర్ ఎనర్జీకి బూస్ట్ నిచ్చేందుకు ఎన్పీసీఐఎల్ రూ. 9,410 కోట్లు ఈ బడ్జెట్ ద్వారా అందుకోనుంది. అంతర్గత, బహిర్గత వనరుల ద్వారా ఎన్పీసీఐఎల్ రూ. 12,863 కోట్లు సమకూర్చుకోనుంది. అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్కు రూ. 25,078.49 కోట్లు కేటాయించారు. దేశంలో 6,780 మెగావాట్ల సామర్థ్యంతో న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయి. 2031 నాటికి ఈ సామర్థ్యాన్ని 15,700 మెగావాట్లకు పెంచే లక్ష్యంతో మరో 21 పవర్ జనరేషన్ యూనిట్లను స్థాపించనున్నారు. . చదవండి: Union Budget 2023-24: పెరిగేవి, తగ్గేవి ఇవే! -
దురాక్రమణే లక్ష్యంగా...కిరాయి సైనికులను దింపిన రష్యా
Mercenaries unlikely to make up for the loss of regular infantry units: ఉక్రెయిన్ పై దాడులకు దిగిన రష్యా ప్రస్తుతం కిరాయి సైనికులను సైతం కథన రంగంలోకి దింపినట్లు బ్రిటన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో రష్యా సైన్యం తక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు ప్రైవేట్ మిలటరీ కంపెనీ వాగ్నెర్ గ్రూప్ నుంచి పేయిడ్ ఫైటర్స్‌ని దింపింది. ఇప్పడు మరింత ముందుకడుగు వేసి యుద్ధ కాంక్షతో ఆఖరికి కిరాయి సైన్యాన్ని దింపేందుకు కూడా రెడీ అయిపోయింది. ఒక రకంగా రష్యా సైన్యం కూడా కాస్త ఒత్తిడికి గురవుతోందని అవగతమవుతోంది. ఏదీ ఏమైన రష్యా ఈ కిరాయి సైనికులతో పదాతిదళ సామార్థ్యాన్ని పూరించడం అసాథ్యం అని బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఉక్రెయిన్ అధికారులు దక్షిణా ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు భారీగా పునరాగమించినట్లు తెలిపారు. అదీగాక డినిప్రో నదికి పశ్చిమలో రష్య సైన్యం తీవ్ర నష్టం కలిగించనుందని బ్రిటిష్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రష్యా అనుకూల వేర్పాలు వాదుల ప్రాంతాల్లో ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటించడమే కాకుండా రష్యా సైన్యం చోరబడకుండా అడ్డుకుంది. రష్యా సైన్యం ప్రవేశించకుండా అక్కడ ఉన్న డినిప్రో నదిపై ఉన్న ముడు వంతెనలను ధ్వంసం చేసింది. అంతేకాదు ఉక్రెయిన్ తన యుద్ధ విమానాలతో ఖేర్సన్ చుట్టూ ఉన్న ఐదు రష్యన్ బలమైన ప్రాంతాల తోపాటు సమీపంలోని మరొక నగరంపై దాడి కూడా చేసిందని బ్రిటన్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రష్యా కిరాయి సైనికులను యుద్ధంలోకి దింపడమే కాకుండా ఉక్రెయిన్ రాజధాని కీవ్ శివార్లలోని సైనిక స్థావరాలపై కూడా బాంబు దాడి చేసినట్లు పేర్కొంది. ఈ దాడి కారణంగా సుమారు 15 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సీ కులేబా వెల్లడించారు. (చదవండి: చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డ భర్త... నిర్థాక్షిణ్యంగా కాల్చి చంపిన మహిళ) -
ఇండియన్ ఆర్మీలోకి ప్రైవేట్ సంస్థలు! ఇప్పటికే..
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మానిర్బర్ భారత్ పథకం కింద మిలటరీ హార్డ్‌వేర్ విభాగంలోకి ప్రైవేట్ సంస్థల్ని ఆహ్వానించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ డిఫెన్స్ అక్విజేషన్ ప్రొసిజర్స్ (డీఏపీ) మ్యాన్యువల్‌గా సవరించాలని నిర్ణయించింది. ఇండియన్ డిఫెన్స్‌కు (పీఎస్‌యూ) చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు మిలటరీకి సంబంధించిన ఆయుధాలు తయారు చేసేవి. ఇప్పుడీ డీఏపీ సవరణలతో ప్రైవేట్ సంస్థలు ఎక్కువ భాగం డిఫెన్స్‌కు చెందిన ఆయుధాల్ని తయారు చేసేందుకు ఊతం ఇచ్చినట్లైందని నివేదికలు చెబుతున్నాయి. ప్రైవేట్ సంస్థల సహకారంతో ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ (ఐఎంఆర్‌హెచ్ )నను అభివృద్ధి, తయారీని కేంద్ర రక్షణ శాఖ ప్రయత్నిస్తుంది. దీంతో ఇండియన్ ఆర్మీ ఇన్వెంటరీలో ఉన్న రష్యా తయారు చేసిన ఎంఐ-17,ఎంఐ-8 హెలికాప్టర్లు భర్తీ కానున్నాయి. కాగా,13టన్నుల బరువైన ఈ మల్టీరోల్ హెలికాఫ్టర్ వైమానిక దాడిలో భారత సాయుధ బలగాల్ని రంగంలోకి దించడంతో పాటు, ఎయిర్ ఎటాక్, యాంటీ సబ్ మెరైన్, యాంటీ షిప్, మిలటరీ ట్రాన్స్ పోర్ట్, వీవీఐపీ వంటి విభాగాల్లో కీలకంగా పనిచేస్తుంది. ఫ్రెంచ్ కంపెనీతో ఎంఓయూ ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఎరో నాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), ప్రైవేట్ సంస్థలు కలిసి వచ్చే ఏడేళ్లలో ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ తయారీని పూర్తి స్థాయిలో ప్రారంభించేలా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. దీంతో పాటు నేవల్ వేరియంట్‌తో సహా ఐఎంఆర్ హెచ్ ఇంజిన్‌ను తయారీ, ఉత్పత్తితో పాటు మద్దతు అందించేలా కొత్త జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు కానుంది. జులై 8న ఈ జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేసేందుకు హెచ్ఏఎల్ తో విమానాల విడిభాగాల తయారీలో పేరు గాంచిన ఫ్రెంచ్ సంస్థ సఫ్రాన్ అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు సమాచారం. -
అగ్నిపథ్ ఆందోళనలు.. కేంద్రం దిద్దుబాటు చర్య
సాక్షి, న్యూఢిల్లీ: అగ్నిపథ్ ఆందోళనలు చల్లార్చేందుకు కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని ఉద్యోగాల్లో 10 శాతం అగ్నివీర్ రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు రిజర్వేషన్‌కు శనివారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్, సివిల్ డిఫెన్స్ పోస్టులతో పాటు 16 విభాగాల్లో రిజర్వేషన్‌ను వర్తింపజేయనుంది. త్వరలోనే నియామక నిబంధనల్లో మార్పులు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది కేంద్ర రక్షణ శాఖ. ఇదిలా ఉంటే.. అగ్నివీర్లకు రిజర్వేషన్లు కల్పించనున్నట్టు ఇదివరకే కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సీఏపీఎఫ్(Central Armed Police Forces), అసోం రైఫిల్స్‌లో అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు హోంశాఖ స్పష్టం చేసింది. అగ్నిపథ్ నిరసనలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ.. మాజీ సైనికులతో సహా విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాతే అగ్నిపథ్ ప్రకటించబడింది. రాజకీయ కారణాల వల్ల అభ్యర్థుల్లో అపార్థం వ్యాపిస్తోంది. అగ్నిపథ్.. సాయుధ బలగాల్లో రిక్రూట్మెంట్ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. దీనిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది కొత్త పథకం కాబట్టి ప్రజల్లో కొంత గందరగోళం ఉండవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. -
చైనాని శత్రువుగా చిత్రీకరించవద్దు! అమెరికా చారిత్రక తప్పిదం
Taking Us As Threat historic and strategic mistake: సింగపూర్‌లో యూఎస్ రక్షణాధికారి లాయిడ్ ఆస్టిన్‌తో చైనా రక్షణమంత్రి వీ ఫెంఘే ముఖాముఖి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సమావేశంలో యూఎస్ రక్షణాధికారి ఆస్టిన్ తైవాన్‌ని ఇబ్బంది పట్టేలా సైనిక చర్యలకు పాల్పడవద్దంటూ హెచ్చరించారు కూడా. దీంతో చైనా రకణ మంత్రి వీ ఫెంఘే తైవాన్‌ని అడ్డుపెట్టుకుని చైనాని బెదిరించాలనుకోవడం అమెరికా చారిత్రక వ్యూహాత్మిక తప్పిదం అవుతుందన్నారు. చైనాని ముప్పుగానూ లేదా శత్రువుగానూ పరిణించడం తగదని యూఎస్‌కి హితవు పలికారు. ఇది ఇరుదేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తుందని చెప్పారు. ప్రపంచ శాంతికి ఇరు దేశాల అభివృద్ధి కీలకమని గట్టిగా నొక్కి చెప్పారు. ఇకనైనా చైనా ప్రయోజనాలను దెబ్బతీయాలని చూడటం మానుకోవాలని అమెరికాకు సూచించారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారు. వాస్తవానికి 1949 అంతర్యుద్ధంలో తైవాన్, చైనా విడిపోయాయి. కానీ చైనా స్వయంపాలిత దేశమైన తైవాన్‌ని తిరుగబాటు ప్రావిన్స్‌గా పేర్కొంది. చైనాని బెదిరించడానికి తైవాన్ను వాడుకుంటే మాత్రం సహించబోమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. అలాగే దక్షిణ చైనా సముద్ర తీరం వెంబడి ఉన్న ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేషియా వియత్నాంతో సహా అన్ని వివాదాస్పదమైన భూభాగాలు తనవే అని చైనా వాదిస్తోంది కూడా. పైగా తూర్పు చైనా సముద్ర ప్రాంతంలో జపాన్‌తో కూడా చైనాకు ప్రాదేశిక వివాదాలు ఉన్నాయి. (చదవండి: తైవాన్ విషయంలో తగ్గేదే లే అంటున్న చైనా!... అమెరికాకు గట్టి వార్నింగ్) -
గెలుపునకు చేరువలో ఉక్రెయిన్! రష్యా సరిహద్దుకు చేరుకున్న బలగాలు
Mr President, We Made It: ఉక్రెయిన్ పై రష్యా గత రెండు నెలలకు పైగా దాడులు కొనసాగిస్తునే ఉంది. ఈ నేపథ్యంలో యూకే రక్షణ మంత్రిత్వ శాఖ నిరవధిక పోరును ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ పరిస్థితి గురించి ఒక నివేదిక విడుదల చేసింది. భూ, గగన, జల మార్గాలలో దాడులు సాగించిన రష్యా బలగాలు ఈ యుద్ధంలో భారీ నష్టాన్నే చవిచూశాయని పేర్కొంది. ప్రస్తుతం యుద్ధంలో రష్యా కాస్త వెనకబడిందని తెలిపింది. రష్యా బలగాల పోరాట సామర్థ్యం తగ్గిందని, చాలామంది సైనికులు పట్టుబడుతున్నారని వెల్లడించింది. యూకే రక్షణ మంత్రిత్వ శాఖ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం రానున్న రోజల్లో రష్యా దళాలు వేగవంతంగా దాడులు చేసే అవకాశం లేదని అంచనా వేసింది. అంతేగాదు ఖార్కివ్ ప్రాంతంలో కీవ్ దళాలు ఉక్రెయిన్-రష్యా సరిహద్దుకు చేరుకున్నట్లు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహదారు వాడిమ్ డెనిసెంకో తెలిపారు. ఆస్ట్రియా ఉక్రెయిన్ మాజీ రాయబారి ఒలెగ్జాండర్ షెర్బా "మిస్టర్ పుతిన్ మేము సాధించాం". "శత్రు రాజ్య సరిహద్దుకు చేరుకున్నాం" అనే క్యాప్షన్ జోడించి మరీ ఉక్రెయిన్, రష్యా సరిహద్దుకు చేరుకున్న ఉక్రెయిన్ సైనికులను చూపించే వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంతేగాదు బెర్లిన్‌లో జరిగిన నాటో విదేశాంగ మంత్రుల సమావేశంలో జర్మనీకి చెందిన అన్నలెనా బేర్బాక్ ఉక్రెయిన్‌కి తమ మాతృభూమి రక్షణ కోసం తమవంతు మద్దతుగా సైనిక సహాయం అందిస్తామని చెప్పారు. మరోవైపు నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఉక్రెనియన్లు తమ ధైర్య సాహసాలతో తమ మాతృభూమిని రక్షించుకోవడమే కాకుండా ఈ యుద్ధంలో తప్పక విజయం సాధిస్తారని ధీమాగా చెప్పారు. Latest Defence Intelligence update on the situation in Ukraine - 15 May 2022 Find out more about the UK government's response: https://t.co/VBPIqyrgA5 🇺🇦 #StandWithUkraine 🇺🇦 pic.twitter.com/n6dBVZHAos — Ministry of Defence 🇬🇧 (@DefenceHQ) May 15, 2022 “Mr. President, we reached Ukraine’s state border with the enemy state. Mr. President, we made it!” Glory to #Ukraine! Glory to Heroes!#StandWithUkraine️ #UkraineWillWin #RussiaUkraineWar pic.twitter.com/kdD6kD1w3x — olexander scherba🇺🇦 (@olex_scherba) May 15, 2022 (చదవండి: రష్యాకు మరో షాక్! నాటోలో చేరనున్న మరోదేశం) -
లంకలో షూట్ ఎట్ సైట్ ఆదేశాలు
Sri Lanka's Secretary to the Defence Ministry clarified: శ్రీలంకలోని తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఘోరమైన హింసాకాండకు దారితీసింది. నెలలు తరబడి సాగుతున్న అల్లర్లు కాస్తా హింసాత్మకంగా మారిపోతున్నాయి. తొలుత శాంతియుతంగా నిరసనలు చేస్తున్నవారిపై రాజపక్స కుటుంబ సభ్యులు దాడి చేయడంతోనే పరిస్థితి మరింత తీవ్రతరంగా మారింది. దీంతో శ్రీలంక అధికారులు మంగళవారం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు షూట్ఎట్సైట్ ఆర్డర్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శ్రీలంక రక్షణ మంత్రిత్వశాఖ సెక్రటరీ జనరల్ జీడీహెచ్ కమల్ గుణరత్నే అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందో వివరించారు. ఆయన మాట్లాడుతూ..."తొలుత పరిస్థితిని అదుపులో ఉంచేందుకు కట్టుదిట్టమైన కర్ఫ్యూను విధించినప్పటికీ వాటన్నింటిని ఉల్లంఘించి మరీ హింసకు పాల్పడటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఘోరమైన హింసకు పాల్పడినవారందరూ లంకేయులే. మా సొంత వ్యక్తుల పై కాల్పులు జరపడం ఇష్టం లేదు. అయితే తాము మొదటగా నిరసనకారులను చెదరగొట్టేందుకు గాలిలో కాల్పులు జరుపుతాం. అయినప్పటికీ వినకపోతే పోలీసులు వారి మోకాళ్ల పై కాల్పులు జరుపుతారు. ఇక అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే సైన్యం రంగంలోకి దిగుతుంది. అయినా శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్స మంచి నాయకుడు. ఇప్పుడు ఆయనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయని రక్షణ కల్పించకూడదని అర్థం కాదు. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ఏ మాజీ ప్రెసిడెంట్కైనా అతని మరణం వరకు భద్రతా బలగాలు రక్షణ కల్పిస్తాయి. మా రక్షణ బృందం అమాయకులపై ఎప్పటికీ కాల్పులు జరపదు. అని అన్నారు. (చదవండి: లంక కల్లోలం: కొంప ముంచిన మహీంద రాజపక్స మీటింగ్! ఆ గంటలో జరిగింది ఇదే..) -
ఉపేక్షించొద్దు.. కాల్చేయండి: శ్రీలంకలో తీవ్ర హెచ్చరికలు
కొలంబో: ప్రభుత్వ వ్యతిరేక ప్రజా నిరసన జ్వాలలతో హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశం శ్రీలంక తగలబడిపోతోంది. సోమవారం ఉధృత స్థాయికి చేరిన హింసాత్మక అల్లర్లు.. మంగళవారం తారాస్థాయికి చేరుకున్నారు. ఇప్పటివరకు ఐదుగురు మరణించగా.. 220 మందికి పైగా గాయపడినట్లు అధికారిక సమాచారం. ఈ తరుణంలో మిలిటరీ, పోలీసులకు అత్యవసర అధికారాన్ని అప్పజెప్పిన సంక్షోభ-అస్థిర ప్రభుత్వం.. ఇప్పుడు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆస్తులను ధ్వంసం చేసినా.. ఇతరులను గాయపరిచే లేదంటే చంపే యత్నం చేసినా.. ఉపేక్షించొద్దంటూ శ్రీ లంక రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. అలాంటి వాళ్లను వెంటనే కాల్చేయాలంటూ మంగళవారం శ్రీ లంక రక్షణ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది . ఈ మేరకు సైన్యం, పోలీస్ శాఖ మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేయిస్తోంది. అదే తరుణంలో.. వారెంట్లు లేకుండా ఎవరినైనా అదుపులోకి తీసుకునే అధికారాల్ని సైతం కట్టబెట్టింది కూడా. దీంతో వందల మంది నిరసనకారుల్ని పోలీసులు జైళ్లకు తరలిస్తున్నారు. మరోవైపు పరిస్థితి చేజారిపోవడంతో.. ప్రజలంతా సమయమనం పాటించాలంటూ లంక అధ్యక్షుడు గోటబయా రాజపక్స మంగళవారం పిలుపు ఇచ్చాడు. లంకా దహనంపై స్పందించిన ఐరాస.. వీలైనంత త్వరగా సంక్షోభం ముగియాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. మద్ధతుదారులను వదలడం లేదు ఇంతకాలం ప్రభుత్వ వ్యతిరేకతతో నిరసనలు కొనసాగుతుండగా.. గత రెండు రోజులుగా పరిణామాలు హింసాత్మకంగా మారిపోయాయి. ప్రభుత్వ మద్ధతుదారులు ఎక్కడ కనిపించినా చితకబాదుతున్నారు ప్రజలు. ప్రధాని పదవికి మహీంద రాజపక్స రాజీనామా ప్రకటించాక.. ఆయన మద్ధతుదారులు భారీ ఎత్తున్న ప్రధాని నివాసం టెంపుల్ ట్రీస్‌కు చేరుకుని మద్ధతు ప్రకటించారు. ఈ క్రమంలో.. నిరసనకారులు వాళ్లపై విరుచుకుపడ్డారు. సమీపంలో ఉన్న ఓ మురుగు కాలువలోకి రాజపక్స మద్ధతుదారుల్ని నెట్టిపడేశారు. ఈ ఉద్రిక్తతల నడుమ పోలీసులు, సైన్యం కల్పించుకుని వాళ్లను రక్షించింది. ఇక అప్పటి నుంచి ప్రజాప్రతినిధులు, అధికార వర్గాల ఇళ్లను మాత్రమే కాదు.. రాజపక్స మద్ధతుదారుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని నిరసనకారులు దాడులు, తగలబెట్టేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మాజీ ప్రధాని మహీంద రాజపక్స దేశం దాటి పారిపోతాడనే ప్రచారం ఊపందుకోవడంతో ఆయన కోసం గాలింపు చేపట్టారు నిరసనకారులు. అయితే ఆయన ఎక్కడికి వెళ్లబోడని ఆయన తనయుడు ఒక ప్రకటన విడుదల చేశాడు. ఇక ఎక్కడిక్కడ చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి మరీ రాజపక్సను, అతని విధేయులను పారిపోకుండా కాపలా కాస్తున్నారు ప్రజలు. చదవండి: నేవీ స్థావరంలో తలదాచుకున్న రాజపక్స కుటుంబం -
భారత్ మిస్సైల్ మిస్‌ఫైర్.. ‘యాక్షన్ వేరేలా ఉండేది.. కానీ, కామ్‌గా ఉన్నాం’
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ మిస్సైల్ మిస్‌ఫైర్ వివాదంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి స్పందించారు. ఆ ఘటన జరిగిన వెంటనే తమ దేశం ఘాటుగా ప్రతిస్పందించగలిగేదని అన్నారు. అయితే.. అలా చేయకుండా తమ వైఖరికి భిన్నంగా ఓపిక పట్టామని చెప్పారు. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను, దేశాన్ని శక్తిమంతం చేసుకుంటామని పేర్కొన్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని హఫీజాబాద్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ర్యాలీలో ఇమ్రాన్ పైవిధంగా స్పందించారు. కాగా, మార్చి 9న భారత్‌కి చెందిన సూపర్-సోనిక్ ఫ్లయింగ్ క్షిపణి సూరత్‌గఢ్ నుంచి పాకిస్తాన్ భూభాగంవైపు దూసుకుపోయిన సంగతి తెలిసిందే. పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్ చున్ను నగర సమీపంలో అది కూలింది. అయితే, ఈప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ సమీపంలోని గోడ మాత్రం ధ్వంసమైంది. దీనిపై భారత రక్షణ శాఖ ఇప్పటికే వివరణ ఇచ్చింది. సాధారణ నిర్వహణ ప్రక్రియ జరగుతుండగా ప్రమాదవశాత్తు పాకిస్థాన్‌వైపు క్షిపణి దూసుకుపోయిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. (చదవండి: బ్రహ్మోస్ మరింత శక్తివంతం) ఈ క్షిపణి పాకిస్తాన్లో ల్యాండ్ అవ్వడానికి ముందు గగనతలంలో సుమారు 100 కి.మీ పైగా వేగంతో దాదాపు 40 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించిందని పేర్కొంది. సాంకేతిక లోపం కారణంగా ఈ సంఘటన జరిగిందని తీవ్ర విచారం వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక భారత్ స్పందనపై పాకిస్తాన్ విదేశాంగశాఖ కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత్ వివరణ సరిగా లేదని, ఘటనపై ఉమ్మడి దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. అనుకోని ప్రమాదమే అయితే, క్షిపణి లాంచ్ కాగానే వెంటనే చెప్పాలి కదా! అని ప్రశ్నించింది. (చదవండి: మాటలు జాగ్రత్త! తేడా వస్తే అంతే.. ఇలా వచ్చి అలా తలపై కోడిగుడ్డుతో...) -
పాకిస్తాన్ పై భారత్ క్షిపణి ప్రయోగం... ప్రమాదవశాత్తు జరిగిందని వివరణ
Defence Ministry said Technical Malfunction: భారత్ ప్రమాదవశాత్తు పాకిస్థాన్‌పైకి క్షిపణిని ప్రయోగించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్షిపణి పాకిస్తాన్లో ల్యాండ్ అవ్వడానికి ముందు గగనతలంలో సుమారు 100 కి.మీ పైగా వేగంతో దాదాపు 40 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించిందని పేర్కొంది. సాంకేతిక లోపం కారణంగా ఈ సంఘటన జరింగిందని తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈ క్షిపణి మార్చి 9, 2022న, సాధారణ నిర్వహణ సమయంలో, సాంకేతిక లోపం కారణంగా ప్రమాదవశాత్తూ ఈ క్షిపణి పేలిందని రక్షణ శాఖ వివరణ ఇచ్చింది. అంతేకాదు భారత ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఇస్లామాబాద్‌లోని భారత్ ఛార్జ్ డి'అఫైర్స్‌ను పిలిపించి భారత్‌కి చెందిన సూపర్-సోనిక్ ఫ్లయింగ్ క్షిపణి సూరత్‌గఢ్ నుంచి పాకిస్తాన్లోకి ప్రవేశించిందని తెలిపింది. ఈ చర్యను గగనతలంలో అకారణ ఉల్లంఘనగా పేర్కొంటూ నిరసన వ్యక్తం చేసింది. అంతేకాదు ఇలాంటి చర్యల వల్ల పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అందువల్ల ఈ ఘటనపై భారత్ సత్వరమే విచారణ జరపాలని పాకిస్థాన్ కోరింది. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ భారత్‌ను హెచ్చరించింది. అంతేకాదు ఈ క్షిపణి పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్ చున్ను నగరం సమీపంలో సాయంత్రం 6:50 గంటల సమయంలో కూలిందని తెలిపింది. దీని వలన పౌర ఆస్తులకు నష్టం వాటిల్లిందని కూడా పేర్కొంది. (చదవండి: ఉగ్రవాదుల ఏరివేత.. జమ్ముకశ్మీర్‌లో హైఅలర్ట్) -
ఎన్సీసీ ప్యానెల్లో ధోని
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ధోనిని నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్సీసీ)ని సరికొత్తగా తీర్చిదిద్దే కమిటీలో సభ్యుడిగా నియమించారు. రక్షణ మంత్రిత్వ శాఖ నియమించిన 15 మంది సభ్యుల ఈ కమిటీలో ధోని సహా పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర, ఇతర రంగాల నిపుణులున్నారు. భారత ఆర్మీలో ధోని గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ అతని పేరును కమిటీలో చేర్చింది. క్రమశిక్షణ, కార్యదీక్షతకు మారుపేరైన ఎన్సీసీ ని మరింత మెరుగు పరిచేందుకు తీసుకోవా ల్సిన చర్యలపై ఎన్సీసీ కమిటీ చర్చిస్తుంది. -
డీఆర్డీవో చేపట్టిన ఆకాష్ మిసైల్ ప్రయోగం విజయవంతం
భూ ఉపరితలం నుంచి గాల్లోని లక్ష్యాలను ఛేదించగల కొత్త తరం ఆకాష్ మిసైల్‌ను బుధవారం రోజున డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగాన్ని ఒడిషా తీరాన ఉన్నఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ప్రయోగించారు. మిసైల్‌కు సంబంధించిన ఫ్లైట్ డేటా ప్రకారం టెస్ట్ విజయవంతమైందని డీఆర్డీవో నిర్థారించింది.ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్, రాడార్, టెలిమెట్రీ వంటి అనేక పర్యవేక్షణ విధానాలను టెస్ట్‌రేంజ్‌లో ఏర్పాటు చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 12 . 45 నిమిషాలకు ఆకాష్ మిసైల్‌ను పరిక్షించినట్లు పేర్కొంది. కొత్తగా అప్డేట్ చేసిన ఈ మిసైట్ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నలక్ష్యాలను మాక్ 2.5 వేగంతో ఛేదించగలదని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కొత్త క్షిపణి వ్యవస్థను హైదరాబాద్‌కు చెందిన డీఆర్డీవో ల్యాబ్ అభివృద్ధి చేసింది. ఆకాష్-ఎన్జీ క్షిపణి ఆయుధ వ్యవస్థతో భారత వైమానిక దళానికి మరింత బలం చేకూరతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించినందుకుగాను డీఆర్డీవో, భారత వైమానిక దళం, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థలకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలను తెలిపారు. -
కొలంబో తీరంలో కాలిపోతున్న నౌక.. ఐసీజీ చేయూత
కొలంబో: గుజరాత్ నుంచి శ్రీలంకలోని కొలంబో పోర్టుకు వెళ్తున్న సరుకు రవాణా నౌక ఎంవీ ఎక్స్‌ప్రెస్ పెర్ల్‌లో ఆరు రోజుల కిందట అగ్ని ప్రమాదం సంభవించింది. కొలంబో పోర్టుకు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో మంగళవారం ఒక కంటైనర్ అంటుకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కాగా ప్రమాద సమయంలో నౌకలో ఉన్న వివిధ దేశాలకు 25 మంది సిబ్బందిని ఇప్పటికే సురక్షితంగా కాపాడారు. కాలిపోతున్న నౌకలోని సరుకును సురక్షితంగా తెచ్చేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రెండు ఐసీజీ ఓడలు 'వైభవ్', 'వజ్రా'లను సహాయం కోసం పంపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్రీలంక అధికారులతో జరిపిన చర్చల అనంతరం ఎలాంటి ప్రమాదాలనైనా తట్టుకునే వైభవ్, వజ్రల పంపించినట్లు కోస్ట్‌గార్డ్ అధికారులు పేర్కొన్నారు. వీటికి అదనంగా, కొచ్చి, చెన్నై, టుటికోరిన్ వద్ద ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకలను తక్షణ సహాయం కోసం రెడీగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ కోసం శ్రీలంక అధికారులతో ఐసీజీ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. చదవండి: ఘోర రైలు ప్రమాదం.. 213 మందికి గాయాలు -
సరికొత్త టెక్నాలజీ అభివృద్ధి చేసిన డీఆర్డీఓ
సాక్షి, న్యూఢిల్లీ: శత్రు క్షిపణి దాడుల నుంచి నౌకాదళ నౌకలను రక్షించేందుకు ‘అడ్వాన్స్డ్ చాఫ్ టెక్నాలజీ’ని ’రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ’(డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. డీఆర్డీవోకు చెందిన ‘డిఫెన్స్ లాబొరేటరీ జోధ్‌పూర్’(డీఎల్‌జే) ఈ కీలక పరిజ్ఞానాన్ని దేశీయంగా అభివద్ధి చేసి షార్ట్ రేంజ్ చాఫ్ రాకెట్ (ఎస్‌ఆర్‌సీఆర్), మీడియం రేంజ్ చాఫ్ రాకెట్ (ఎంఆర్‌సీఆర్), లాంగ్ రేంజ్ చాఫ్ రాకెట్ (ఎల్‌ఆర్‌సీఆర్) అనే మూడు రకాల రాకెట్లను రూపొందించింది. నౌకాదళ గుణాత్మక అవసరాలను తీర్చేలా వీటిని డీఎల్‌జే తీర్చిదిద్దింది. ఈ మూడు విభాగాల రాకెట్లను భారత నౌకాదళం ఇటీవల అరేబియా సముద్రంలో పరీక్షించింది. శత్రు రాడార్, రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారిత క్షిపణుల నుంచి రక్షణ నౌకలను రక్షించేందుకు చాఫ్ పరిజ్ఞానాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా శత్రువుల భవిష్యత్ దాడులను ఎదుర్కొనే నైపుణ్యాన్ని డీఆర్డీవో సాధించింది. ఈ విజయాన్ని సాధించిన డీఆర్డీఓ, నౌకాదళాన్ని, డిఫెన్స్ ఇండస్ట్రీని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ అభినందించారు. నౌకాదళ నౌకల రక్షణ పరిజ్ఞాన్ని దేశీయంగా అభివృద్ధి చేయడంలో పాల్గొన్న శాస్త్రవేత్తలను డీఆర్డీవో ఛైర్మన్ డా.జి. సతీష్ రెడ్డి ప్రశంసించారు. తక్కువ వ్యవధిలో దీన్ని అభివృద్ధి చేయడానికి డీఆర్డీవో చేసిన ప్రయత్నాలను నౌకాదళ ఉప అధిపతి అడ్మిరల్ జి.అశోక్ కుమార్ కూడా అభినందించారు. DRDO has developed an Advanced Chaff Technology to safeguard the naval ships against enemy missile attack. The three variants namely Short Range Chaff Rocket, Medium Range Chaff Rocket, and Long Range Chaff Rocket met Indian Navy’s qualitative requirements. #AtmaNirbharBharat pic.twitter.com/T1RVu3elaK — DRDO (@DRDO_India) April 5, 2021 చదవండి: డిజిటల్ చెల్లింపులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఆయుధాల నవీకరణకు నిధులేవి?
దేశీయంగా ఆయుధ సేకరణ కోసం రక్షణరంగానికి చేసిన భారీ కేటాయింపు.. భారత రక్షణ పారిశ్రామిక పునాదిని విస్తృతపరుస్తుందని, మధ్యతరహా, చిన్న, సూక్ష్మ స్థాయి పరిశ్రమలను ప్రోత్సహించడంపై బహువిధ ప్రభావం వేస్తుందని రక్షణమంత్రి ఘనంగా ప్రకటించారు. ఎంచుకున్న లక్ష్యాలను చూస్తే ఆయన ప్రకటనను తప్పుపట్టలేం. కానీ చేదు నిజం ఏమిటంటే, దేశీయంగా రక్షణ కొనుగోళ్లకు కేటాయించిన రూ. 70,221 కోట్లలో అధికభాగం గతంలో రక్షణశాఖ హామీపడిన చెల్లింపులకు ఖర్చు కావడమే. అంటే పాత చెల్లింపులు పోతే కొత్త కొనుగోళ్లకు మిగిలేది అత్యంత తక్కువ మొత్తమేనని అర్థమవుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన భారీ మొత్తాన్ని పూర్తిగా స్థానిక రక్షణ విక్రేతలకు, నూతన ఒప్పందాల కింద ఆయుధాలు, పరికరాల సరఫరాదారులకు చెల్లిస్తారని భ్రమలు పెట్టుకోవలసిన పనిలేదు. రక్షణ సామగ్రి అవసరాల్లో ఆత్మనిర్భర్ లేక స్వావలంబన సాధించటానికి అధికశాతం ఆయుధ సామగ్రిని దేశీయంగానే సేకరించబోతున్నట్లు కేంద్రప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటనలో స్థానికతకు ఏమాత్రం చోటు లేదనిపిస్తోంది. ఈ ప్రతిపాదనలో కొత్త విషయమూ లేదు. అలాగని అసాధారణమైన అంశమూ లేదు. దీర్ఘకాలంగా వాయిదాలో ఉంటున్న ఈ లక్ష్య సాధనకు తోడ్పడటానికి రక్షణ మంత్రిత్వ శాఖకు కేటాయిస్తున్న ఆర్థిక కేటాయింపుల్లో అతి స్వల్పమాత్రంగానే పెంచడం అనే గత కాలపు ధోరణికి కేంద్రప్రభుత్వ తాజా ప్రకటన ఒక కొనసాగింపే తప్ప దీంట్లే మరే కొత్త విషయమూ లేదు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి దేశ రక్షణకోసం రూ.70,221 కోట్లు లేదా మొత్తం మూలధన కొనుగోలు బడ్జెట్లో 63 శాతం వరకు త్రివిధ దళాలకు దేశీయంగా సేకరించిన రక్షణ సామగ్రిపైనే వెచ్చించనున్నట్లు గత నెలలో రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దిగుమతులను బాగా తగ్గిం చుకుని మేక్ ఇన్ ఇండియా అనే ప్రభుత్వ భావనను బలోపేతం చేసే లక్ష్యం నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,35,061 కోట్ల మూలధన వ్యయంలో రక్షణ రంగంలో కొనుగోలు బడ్జెట్ కింద కేటాయించిన రూ.1,11,714 కోట్ల మొత్తం చిన్న భాగం మాత్రమే. ప్రస్తుత సంవత్సరం సవరించిన రక్షణ కొనుగోళ్ల వ్యయంలో వాస్తవానికి రూ. 2,551 కోట్లను తగ్గించడం గమనార్హం. ప్రధానంగా యుద్ధవిమానాలు, ఏరో ఇంజిన్లు, భారీ, మధ్యతరహా సైనిక వాహనాలతోపాటు త్రివిధ దళాలకు ఇతర పరికరాలను కొనడానికి ఈ మొత్తాన్ని కేటాయించారు. అనేక అధునాతన రక్షణ ప్లాట్‌ఫాంలు, వాటితో ముడిపడిన ప్రోగ్రామ్‌లు, భారతీయ వాయుసేనకు చెందిన ఇతర ప్రత్యేక ప్రాజెక్టుల కొనుగోలుకోసం ఈ కేపిటల్ అక్విజిషన్ బడ్జెట్ (సీఏబీ) నుంచి నిధులు కేటాయిస్తారు. ఈ రక్షణ కొనుగోలు బడ్జెట్ నుంచి చిన్న మొత్తాన్ని దేశీయంగా ఆయుధాల సేకరణపై వెచ్చించడం అనేది అసాధారణం కాదు. ఉదాహరణకు 2014–15 నుంచి 2018–19 (డిసెంబర్ 2019 వరకు) మధ్య కాలంలో రక్షణ రంగంపై చేసిన వ్యయం సీఏబీలో 60 శాతంగా ఉండిందని గ్రహించాలి. న్యూఢిల్లీలో ఈ సంవత్సరం ఒక వెబినార్ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన మొత్తం కంటే ఇది 3 శాతం మాత్రమే తక్కువ. ఈ కేటాయింపు భారత రక్షణ పారిశ్రామిక పునాదిని విస్తృతపర్చడంపై, మధ్యతరహా, చిన్న, సూక్ష్మ స్థాయి పరిశ్రమలను ప్రోత్సహించడంపై బహువిధ ప్రభావం వేస్తుందని రక్షణమంత్రి ఘనంగా ప్రకటించారు. అలాగే రక్షణ రంగ అవసరాలను తీర్చే స్టార్టప్‌లు, దేశీయ ఉపాధి అవకాశాలను కూడా ఇది గణనీయంగా పెంచుతుందని మంత్రి పేర్కొన్నారు. ఎంచుకున్న లక్ష్యాలను చూస్తే రక్షణమంత్రి ప్రకటనను తప్పుపట్టలేం. కానీ ప్రకటిత ఉద్దేశాలకు, అసలు వాస్తవానికి మధ్య కాస్త అంతరం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయితే చేదు నిజం ఏమిటంటే, దేశీయంగా రక్షణ కొనుగోళ్లకు కేటాయించిన రూ. 70,221 కోట్లలో అధికభాగం గతంలో రక్షణశాఖ హామీపడిన చెల్లింపులకు ఖర్చు కావడమే. లేదా గతంలో కొన్న రక్షణ ప్లాట్‌ఫాం, ఆయుధాల కొనుగోళ్లకు చెల్లించాల్సిన అసలు చెల్లింపులకు ఈ కేటాయింపులో అధిక భాగం సరిపోవచ్చు. విశ్వసనీయ అంచనా ప్రకారం ఇలా గతంలోని కొనుగోళ్లకు చెల్లించాల్సిన మొత్తం ప్రభుత్వం తాజాగా ప్రకటించిన రక్షణ కొనుగోళ్ల మొత్తంలో 80 నుంచి 90 శాతం వరకు ఉండటమే. అంటే పాత చెల్లింపులు పోతే కొత్త కొనుగోళ్లకు మిగిలేది అత్యంత తక్కువ మొత్తమేనని మనకు అర్థమవుతుంది. అంటే కేంద్రప్రభుత్వం తాజాగా ప్రకటించిన రూ. 70,221 కోట్ల మొత్తాన్ని పూర్తిగా స్థానిక రక్షణ విక్రేతలకు, నూతన ఒప్పందాల కింద ఆయుధాలు, పరికరాల సరఫరాదారులకు చెల్లిస్తారని భ్రమలు పెట్టుకోవలసిన పనిలేదు. ఈ వాస్తవ పరిస్థితి గురించి మన త్రివిధ బలగాలకు స్పష్టంగా తెలుసు. 2018 సంవత్సరంలోనే అప్పటి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్ నాటి రక్షణరంగంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి స్పష్టంగా ఒక విషయం తెలిపారు. సీఏబీలో భారత సాయుధ బలగాలకు కేటాయించిన అతి స్వల్ప మొత్తం కారణంగా 2018–19 ఆర్థిక సంవత్సరానికి గానూ, చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఆధునీకరణ ప్రక్రియపై భారత సైన్యం పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా హరీమన్నాయని ఆయన తేల్చిచెప్పారు. భారత సైనిక అవసరాలకు కేటాయించిన ఆర్థిక పొడిగింపు అనేది ద్రవ్యోల్బణాన్ని, పన్నుల పెంపుదలను తటస్థీకరించడానికి మాత్రమే సరిపోతుందని, మేకిన్ ఇండియా ప్రాజెక్టులకు, మౌలిక వనరుల అభివృద్ధికి, సైన్యం చెల్లించాల్సిన చెల్లింపులకు చాలా కొద్దిమొత్తమే మిగులుతుందని నాటి లెఫ్టినెంట్ జనరల్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి మొరపెట్టుకున్నారు. అంతకుమించి పొరుగు దేశంతో నిత్య ఘర్షణల నేపథ్యంలో జరూరుగా అవసరమైన మందుగుండు సామగ్రి, ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సమర్థ నిర్వహణకు ఇది తూట్లు పొడుస్తుందని శరత్ చంద్ వాపోయారు. అలాగే, సైన్యం వద్ద ఉన్న ఆయుధాల్లో 68 శాతం వరకు పురాతన కేటగిరీలో ఉంటున్నాయని, సమకాలీన అవసరాలకు సరిపోయే ఆయుధాలు 28 శాతం మాత్రమే ఉన్నాయని, అందులోనూ అత్యధునాతన ఆయుధ సామగ్రి 8 శాతం మాత్రమే భారత సైన్యం వద్ద ఉందని, ఈ పరిస్థితుల్లో రక్షణ రంగానికి కేటాయింపులు క్షీణిస్తూ పోతే భారత సాయుధ బలగాల ఆధునీకరణ ప్రక్రియనే అది సవాలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన మొత్తం ఎంత అనేది రక్షణ మంత్రి వెబినార్ సమావేశంలో పేర్కొనలేదు. రక్షణ శాఖ వద్ద ఈ సమాచారం ఉన్నప్పటికీ, పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీకి ఈ విషయం ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నప్పటికీ చెల్లించాల్సిన మొత్తం ఎంత అనేది రక్షణ శాఖ బహిరంగపర్చలేదు. రక్షణ బడ్జెట్లలో చెల్లింపులకు తక్కువ కేటాయింపులను చేస్తూ పోవడం వల్ల ఒక దశలో రక్షణ శాఖ ఇకేమాత్రం చెల్లింపులు చేయలేని స్థితికి దిగజారిపోవచ్చని రక్షణపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవలి నివేదికలో హెచ్చరించింది కూడా. దీంతో ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయ రక్షణ పరిశ్రమను ప్రోత్సహించడానికి అతి తక్కువ మాత్రమే కేటాయించాల్సి వచ్చింది. భారతీయ, విదేశీ రక్షణరంగ పరిశ్రమాధిపతులకు కూడా భారత రక్షణ శాఖ బడ్జెట్ వాస్తవాల గురించిన అవగాహన ఉంది. వెబినార్‌లో తాజాగా రక్షణశాఖ ప్రకటన వీరిలో కాస్త ఉత్సాహాన్ని కలిగించిందంటే దానికి కారణం.. సైనిక సామగ్రి కోసం ప్రపంచ మార్కెట్లో పనిచేస్తున్న ఆయుధాల విక్రేతలు భారతీయ రక్షణరంగ చీకటి జోన్లో ఏదో ఒకరకంగా మనుగడ సాగించాల్సి ఉండటమే. వీరి పరిస్థితి ఎలా ఉంటుం దంటే ద్రవరూప ఆక్సిజన్‌లో వీరు కూరుకుపోయినట్లు ఉంటుంది. దీన్ని మరింత స్పష్టంగా చెప్పాలంటే ద్రవరూప ఆక్సిజన్ వీరిని బతకనీయదు. ఆదే సమయంలో ఆక్సిజన్ వీరిని చావనివ్వదు. ఎందుకంటే జారీ చేసిన టెండర్లు, బహుకరించిన కాంట్రాక్టుల కోసం వీరు నిరంతరం వేచి ఉండాల్సి ఉంటుంది. దశాబ్దాలుగా రక్షణ రంగ వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఎలాంటి సత్ప్రయత్నాలు జరగటం లేదు. పైగా ఈ వ్యవస్థలో ఉంటున్న ప్రతి ఒక్కరూ యథాతథ స్థితిని కొనసాగిస్తూ ఉండిపోయారు. ఓ ఒక్కరి ఆచరణలోనూ సాహసోపేతమైన అడుగులు వేయలేదు. వీరిలో చాలామంది రంగం నుంచి తప్పుకున్నారు. పరస్పర ఆరోణలతో మంత్రిత్వ శాఖలోని పౌర సైనిక విభాగాలను మరింత నిరంకుశత్వం వైపు నెట్టేశారు. ప్రతిసారీ లక్ష్య సాధనవైపు అడుగేయడం, లోపభూయిష్టమైన పథకంతో కుప్పగూలడం.. దీంతో సర్వత్రా అనిశ్చితి రాజ్యమేలడం.. జరుగుతూ వస్తున్న క్రమం ఇదే మరి. అమిత్ కౌషిశ్, ఆర్థిక సలహాదారు రాహుల్ బేడీ, సీనియర్ జర్నలిస్ట్ -
సరిహద్దు వివాదం : కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) కీలక నిర్ణయం తీసుకుంది. 21 మిగ్-29 యుద్ధ విమానాలతో పాటు 59 ఎంఐజీ-29 విమానాల ఆధునీకరణకు డీఏసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు 12 ఎస్‌యూ-30 ఎంకేఐల కొనుగోలుకూ పచ్చజెండా ఊపింది. రష్యా నుంచి ఎంఐజీ-29 యుద్ధవిమానాల కొనుగోలు, ఆధునీకరణకు 7400 కోట్ల రూపాయలు వెచ్చించనుండగా,10,700 కోట్ల రూపాయలతో 12 సుఖోయ్ యుద్ధవిమానాలను కొనుగోలు చేయనుంది. యుద్ధ విమానాల కొనుగోలు, ఆధునీకరణ చేపట్టాలని చాలాకాలంగా భారత వాయుసేన (ఐఏఎఫ్) కోరుతోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశంలో 38,900 కోట్ల విలువైన ఆయుధసామాగ్రి, రక్షణ పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. వీటిలో 31,130 కోట్ల విలువైన సామాగ్రిని భారత పరిశ్రమల నుంచి సమీకరిస్తారు. చదవండి : చైనా మైండ్ గేమ్ -
దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టారు
న్యూఢిల్లీ: వివాదాస్పద రఫేల్ ఒప్పంద పత్రాలు చోరీకి గురయ్యాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలుచేసింది. లీకైన రహస్య సమాచారం ఆధారంగానే పిటిషన్‌దారులు కోర్టును ఆశ్రయించారని తెలిపింది. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం అంతా సక్రమంగానే ఉందని గతంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పునివ్వగా, దానిని సమీక్షించాలని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రక్షణశాఖ అఫిడవిట్ దాఖలుచేసింది. రఫేల్ పత్రాలు బహిర్గతం కావడం దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టిందని రక్షణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పేపర్లను నకళ్లు తీసినవారు దొంగతనానికి పాల్పడ్డారని ఆరోపించింది. బలగాల పోరాట సామర్థ్యానికి సంబంధించిన ఈ సమాచారం విస్తృతంగా వ్యాపించి శత్రువుకు కూడా అందుబాటులోకి వచ్చిందని రక్షణ శాఖ ఆక్షేపించింది. ఈ వ్యవహారంలో అంతర్గత విచారణ ప్రారంభమైందని, లీకేజీ ఎక్కడ జరిగిందో కనుక్కోవడంపై ప్రధానంగా దృష్టిపెట్టామని కోర్టుకు తెలిపింది. ఈ అఫిడవిట్ గురువారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. వారంతా ఐపీసీ కింద దోషులే రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీకి గురైన పత్రాల ఆధారంగానే రివ్యూ పిటిషన్లు వేశారని మార్చి 6నే అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మళ్లీ రెండు రోజుల తరువాత మాటమారుస్తూ..పత్రాలు తస్కరణకు గురి కాలేదని, వాటి నకళ్లనే పిటిషన్‌దారులు ఉపయోగించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం రఫేల్ గోప్యతను కాపాడుతున్నా..సిన్హా, శౌరి, భూషణ్‌లు సున్నిత సమాచారాన్ని బహిర్గతం చేసి ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని అందులో పేర్కొంది. ఈ కుట్రలో పాలుపంచుకుని అనధికారికంగా ఆ పత్రాలను నకళ్లు తీసిన వారు ఐపీసీ చట్టం ప్రకారం దోషులేనని తెలిపింది. ఈ వ్యవహారంలో లీకేజీ ఎక్కడ జరిగిందో తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వ కీలక నిర్ణయాల గోప్యతను కాపాడతామని చెప్పింది. అనధికారికంగా, అక్రమంగా సేకరించి సమర్పించిన పత్రాలను కోర్టు రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేసింది. రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేనిదే ఆ సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద బహిర్గతం చేయరాదని గుర్తు చేసింది. -
అది తప్పుడు వార్త : డిఫెన్స్ మంత్రిత్వశాఖ
న్యూఢిల్లీ : సెలవుపై ఇంటికొచ్చిన ఓ ఆర్మీ జవాన్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని వస్తున్న వార్తలను భారత డిఫెన్స్ మంత్రిత్వశాఖ ఖండించింది. అవన్నీ తప్పుడు వార్తలేనని, ఏ ఒక్క జవాన్ కిడ్నాప్‌కు గురికాలేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేసింది. కిడ్నాప్ గురయ్యారని ప్రచారం చేసిన ఆ జవాన్ సురక్షితంగానే ఉన్నాడని శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఆర్మీలోని లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్‌లో పనిచేస్తున్న బుద్గాంలోని క్వాజిపొరా చదురా ప్రాంతానికి చెందిన మొహమ్మద్ యాసిన్ భట్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారనే వార్త గత 24 గంటలుగా హల్చల్ చేస్తోంది. ఇటీవల ఉన్నతాధికారులు సెలవు మంజూరుచేయడంతో ఇంటికొచ్చిన యాసిన్ కదలికలపై కన్నేసిన ఉగ్రవాదులు శుక్రవారం ఆయన ఇంట్లోకి చొరబడి, తుపాకీ గురిపెట్టి లాక్కెళ్లారని, ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన పోలీసులను ఆశ్రయించారని కథనాలు మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే. గతేడాది జూన్‌లో 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జవాన్ ఔరంగజేబ్‌ను కిడ్నాప్‌చేసిన ఉగ్రవాదులు తుపాకీతో కిరాతకంగా కాల్చిచంపారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. -
రఫేల్ రగడ : ఎయిర్ మార్షల్ సిన్హా వివరణ
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని నిరూపించే క్రమంలోనే రక్షణ మంత్రిత్వ శాఖ నోట్లో ఎంపిక చేసుకున్న భాగాన్ని ప్రచారంలోకి తెచ్చారని ఈ ఒప్పందంలో భారత్ తరపున సంప్రదింపులు జరిపిన ఎయిర్ మార్షల్ ఎస్పీబీ సిన్హా పేర్కొన్నారు. నోట్లో చెబుతున్న అంశాలేవీ భారత సంప్రదింపుల బృందానికి సంబంధం లేనివని ఆయన స్పష్టం చేశారు. భారత్ తరపున రఫేల్ ఒప్పందంపై ఫ్రాన్స్‌తో చర్చలు జరిపిన బృందం సభ్యులంతా ఎలాంటి విభేదాలకు తావులేకుండా ఏడుగురు సభ్యుల సంతకాలతో కూడిన తుది నివేదికను సమర్పించారని పేర్కొన్నారు. ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో అవినీతి నిరోధక క్లాజుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఇప్పటివరకూ అమెరికా, రష్యాలతో ప్రభుత్వం-ప్రభుత్వం మధ్య ఒప్పందాలున్నాయని, ఫ్రాన్స్‌తో ఇది ఈ తరహా మూడవ ఒప్పందమని చెప్పారు. వీటిలో ఇలాంటి క్లాజ్ ఇంతవరకూ లేదని తేల్చిచెప్పారు. రఫేల్ ఒప్పందంపై పీఎంఓ ఫ్రాన్స్‌తో సమాంతర చర్చలు జరిపిందంటూ రక్షణ మంత్రిత్వ శాఖ నోట్‌ను ఓ జాతీయ పత్రిక వెల్లడించడంపై కాంగ్రెస్ సహా విపక్షాలు మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. పీఎంఓ సమీక్ష జోక్యంగా పరిగణించలేమని రఫేల్ ఒప్పందంపై అన్ని అంశాలను ప్రభుత్వం పార్లమెంట్, న్యాయస్ధానాల ముందుంచిందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ విపక్షాలకు దీటుగా బదులిచ్చారు.