
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ధోనిని నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్‌సీసీ)ని సరికొత్తగా తీర్చిదిద్దే కమిటీలో సభ్యుడిగా నియమించారు. రక్షణ మంత్రిత్వ శాఖ నియమించిన 15 మంది సభ్యుల ఈ కమిటీలో ధోని సహా పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర, ఇతర రంగాల నిపుణులున్నారు. భారత ఆర్మీలో ధోని గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ అతని పేరును కమిటీలో చేర్చింది. క్రమశిక్షణ, కార్యదీక్షతకు మారుపేరైన ఎన్‌సీసీ ని మరింత మెరుగు పరిచేందుకు తీసుకోవా ల్సిన చర్యలపై ఎన్‌సీసీ కమిటీ చర్చిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment