న్యూఢిల్లీ : సెలవుపై ఇంటికొచ్చిన ఓ ఆర్మీ జవాన్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని వస్తున్న వార్తలను భారత డిఫెన్స్ మంత్రిత్వశాఖ ఖండించింది. అవన్నీ తప్పుడు వార్తలేనని, ఏ ఒక్క జవాన్ కిడ్నాప్‌కు గురికాలేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేసింది. కిడ్నాప్ గురయ్యారని ప్రచారం చేసిన ఆ జవాన్ సురక్షితంగానే ఉన్నాడని శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఆర్మీలోని లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌లో పనిచేస్తున్న బుద్గాంలోని క్వాజిపొరా చదురా ప్రాంతానికి చెందిన మొహమ్మద్ యాసిన్ భట్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారనే వార్త గత 24 గంటలుగా హల్‌చల్ చేస్తోంది.
ఇటీవల ఉన్నతాధికారులు సెలవు మంజూరుచేయడంతో ఇంటికొచ్చిన యాసిన్ కదలికలపై కన్నేసిన ఉగ్రవాదులు శుక్రవారం ఆయన ఇంట్లోకి చొరబడి, తుపాకీ గురిపెట్టి లాక్కెళ్లారని, ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన పోలీసులను ఆశ్రయించారని కథనాలు మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే. గతేడాది జూన్‌లో 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జవాన్ ఔరంగజేబ్‌ను కిడ్నాప్‌చేసిన ఉగ్రవాదులు తుపాకీతో కిరాతకంగా కాల్చిచంపారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment