హోంశాఖ అప్రమత్తం; ఆ అకౌంట్లు తీసేయండి | Centre Asks Twitter To Remove Some Accounts Spreading Fake News | Sakshi
Sakshi News home page

హోంశాఖ అప్రమత్తం; ఆ అకౌంట్లు తీసేయండి

Published Mon, Aug 12 2019 7:18 PM | Last Updated on Mon, Aug 12 2019 7:53 PM

Centre Asks Twitter To Remove Some Accounts Spreading Fake News - Sakshi

శ్రీనగర్‌ : ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్రం గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. దాదాపు 40 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. ఇంటర్నెట్‌, మొబైల్‌ సేవల్ని నిలిపివేసింది. ఇప్పుడిప్పుడే అక్కడ సేవలన్నీ పునరుద్ధరిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు సృష్టించడానికి సోషల్‌ మీడియాలో కొన్ని వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. పుకార్లు ప్రచారం చేస్తున్న 8 నకిలీ ఖాతాలను తొలగించాలని ట్విటర్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు లేఖ రాసింది. హోంశాఖ వెల్లడించిన జాబితాలో కశ్మీర్‌ వేర్పాటువాద సంస్థ ‘తెహ్రీకే హురియత్‌’ నాయకుడు సయ్యద్‌ అలీ గిలానీ పేరుతో కూడా అకౌంట్‌ ఉండటం గమనార్హం.

కేంద్రం తొలగించమన్న ఖాతాలు ఇవే..
1. @kashmir787 -- వాయిస్ ఆఫ్ కశ్మీర్
2. @Red4Kashmir -- మదిహాషకిల్ ఖాన్
3. @arsched -- అర్షద్ షరీఫ్
4. @mscully94 -- మేరీ స్కల్లీ
5. @sageelaniii -- సయ్యద్ అలీ గిలానీ
6. @sadaf2k19
7. @RiazKha61370907
8. RiazKha723

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement