సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) కీలక నిర్ణయం తీసుకుంది. 21 మిగ్-29 యుద్ధ విమానాలతో పాటు 59 ఎంఐజీ-29 విమానాల ఆధునీకరణకు డీఏసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు 12 ఎస్‌యూ-30 ఎంకేఐల కొనుగోలుకూ పచ్చజెండా ఊపింది. రష్యా నుంచి ఎంఐజీ-29 యుద్ధవిమానాల కొనుగోలు, ఆధునీకరణకు 7400 కోట్ల రూపాయలు వెచ్చించనుండగా,10,700 కోట్ల రూపాయలతో 12 సుఖోయ్ యుద్ధవిమానాలను కొనుగోలు చేయనుంది.
యుద్ధ విమానాల కొనుగోలు, ఆధునీకరణ చేపట్టాలని చాలాకాలంగా భారత వాయుసేన (ఐఏఎఫ్) కోరుతోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశంలో 38,900 కోట్ల విలువైన ఆయుధసామాగ్రి, రక్షణ పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. వీటిలో 31,130 కోట్ల విలువైన సామాగ్రిని భారత పరిశ్రమల నుంచి సమీకరిస్తారు. చదవండి : చైనా మైండ్ గేమ్
Comments
Please login to add a commentAdd a comment