Sukhoi aircraft
-
సుఖోయ్ 30 యుద్ధ విమానంలో ప్రయాణించనున్న రాష్ట్రపతి ముర్ము
గువాహటి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి (ఏప్రిల్6-8) మూడు రోజులపాటు అస్సాంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాల్లో ముర్ము పాల్గొనున్నట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ఈ సందర్బంగా ఆమె ఏప్రిల్ 8వ తేదీని తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో సుఖోయ్ 30 MKI విమానంలో ప్రయాణించనున్నారు. అంతకుముందు 2009లో మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఈ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఏప్రిల్ 7న రాష్ట్రపతి కాజిరంగా నేషనల్ పార్క్‌లో గజ్ ఉత్సవ్-2023 వేడుకలను ప్రారంభించనున్నారు. అనంతరం గువాహటిలో మౌంట్ కాంచనగంగా సాహసయాత్ర-2023ను జెండా ఊపి ప్రారంభిస్తారు. దీంతోపాటు గౌవాహటి హైకోర్టు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. ఏప్రిల్ 8న తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ముర్ము ప్రయాణించనున్నారు. చదవండి: జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి టైగర్ జగర్నాథ్ కన్నుమూత.. -
సరిహద్దు వివాదం : కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) కీలక నిర్ణయం తీసుకుంది. 21 మిగ్-29 యుద్ధ విమానాలతో పాటు 59 ఎంఐజీ-29 విమానాల ఆధునీకరణకు డీఏసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు 12 ఎస్‌యూ-30 ఎంకేఐల కొనుగోలుకూ పచ్చజెండా ఊపింది. రష్యా నుంచి ఎంఐజీ-29 యుద్ధవిమానాల కొనుగోలు, ఆధునీకరణకు 7400 కోట్ల రూపాయలు వెచ్చించనుండగా,10,700 కోట్ల రూపాయలతో 12 సుఖోయ్ యుద్ధవిమానాలను కొనుగోలు చేయనుంది. యుద్ధ విమానాల కొనుగోలు, ఆధునీకరణ చేపట్టాలని చాలాకాలంగా భారత వాయుసేన (ఐఏఎఫ్) కోరుతోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశంలో 38,900 కోట్ల విలువైన ఆయుధసామాగ్రి, రక్షణ పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. వీటిలో 31,130 కోట్ల విలువైన సామాగ్రిని భారత పరిశ్రమల నుంచి సమీకరిస్తారు. చదవండి : చైనా మైండ్ గేమ్ -
కూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. పైలట్లు క్షేమం
గువహటి: భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం అసోంలో కూలిపోయింది. మంగళవారం మధ్యాహ్నం నాగవోన్ జిల్లాలో సుఖోయ్-30ఎంకేఐ జెట్ కూలింది. ఇందులో ఉన్న ఇద్దరు పైలట్లు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు.