గువాహటి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి (ఏప్రిల్6-8) మూడు రోజులపాటు అస్సాంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాల్లో ముర్ము పాల్గొనున్నట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ఈ సందర్బంగా ఆమె ఏప్రిల్ 8వ తేదీని తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో సుఖోయ్ 30 MKI విమానంలో ప్రయాణించనున్నారు. అంతకుముందు 2009లో మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఈ యుద్ధ విమానంలో ప్రయాణించారు.
ఏప్రిల్ 7న రాష్ట్రపతి కాజిరంగా నేషనల్ పార్క్‌లో గజ్ ఉత్సవ్-2023 వేడుకలను ప్రారంభించనున్నారు. అనంతరం గువాహటిలో మౌంట్ కాంచనగంగా సాహసయాత్ర-2023ను జెండా ఊపి ప్రారంభిస్తారు. దీంతోపాటు గౌవాహటి హైకోర్టు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. ఏప్రిల్ 8న తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ముర్ము ప్రయాణించనున్నారు.
చదవండి: జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి టైగర్ జగర్నాథ్ కన్నుమూత..
Comments
Please login to add a commentAdd a comment