ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో మధురమైంది. అది ప్రేమ పెళ్లి అయినా పెద్దల అంగీకారంతో చేసుకునే పెళ్లి అయినా ఎప్పటికీ గుర్తిండిపోవాలనుకునే విధంగా ఆనందంగా జరుపుకోవాలనుకుంటారు. అచ్చం అలాగే అస్సాం రాజధాని గౌహతిలో ఓ పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. అతిథులంతా వచ్చేశారు. పెళ్లి ఘనంగా జరుగుతోంది. ఇరు కుటుంబ సభ్యుల హడావిడీతో మండపం అంతా సందడి వాతావరణం నెలకొంది.
హిందూ సంప్రదాయంలో పెళ్లి తర్వాత వరుడి పాదాలను వధువు తన రెండు చేతులతో తాకి నమస్కరించడం ఆనవాయితీ. అందుకు తగ్గట్లే వధువు వరుడి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. అయితే అనంతరం పెళ్లి కొడుకు కల్లోల్ దాస్ కూడా తన భార్య పాదాలను తాకి శిరస్సు వంచి నమస్కరించాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్యర్యానికి లోనవుతూ చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
ఈ వీడియోను స్వయంగా కల్లోల్ దాస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా ఆమరింది. రెండు మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి. ఈ వ్యవహారాన్ని కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే తన భార్యను ఎంతగానో గౌరవిస్తున్నానని, అందులో భాగంగానే పెళ్లిలో ఆమెకు పాదాభివందనం చేశానని కల్లోల్ దాస్ ప్రతిస్పదించాడు.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. అతడిని తన భార్య కాళ్లు పట్టుకోకుండా ఎవరూ ఆపలేదు. వాస్తవానికి ఇంకా అతన్ని ప్రోత్సహించారు. అవును ప్రతి పెళ్లి ఇలాగే ఉండాలి. సమాన గౌరవం, సమానమైన విలువ ఉండాలి. మీ ఇద్దరిని దేవుడు ఆశిర్వదించాలి’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
చదవండి: కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. సమస్య మళ్లీ మొదటికి!
Comments
Please login to add a commentAdd a comment