Guwahati
-
తరుణ్ సంచలనం
గువాహటి: కీలకదశలో పాయింట్లు సాధించిన తెలంగాణ బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ తరుణ్ మన్నేపల్లి తన కెరీర్లో గొప్ప విజయాన్ని సాధించాడు. గువాహటి మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నీలో టాప్ సీడ్, ప్రపంచ 35వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్ (భారత్)ను బోల్తా కొట్టించి తరుణ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 77వ ర్యాంకర్ తరుణ్ 24–22, 15–21, 21–13తో ప్రియాన్షును మట్టికరిపించాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో తరుణ్ మూడు గేమ్ పాయింట్లను కాచుకొని గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ప్రియాన్షు తేరుకోగా... నిర్ణాయక మూడో గేమ్‌లో తరుణ్ పైచేయి సాధించి అద్భుత విజయాన్ని అందుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ వాంగ్ జెంగ్ జింగ్ (చైనా)తో తరుణ్ తలపడతాడు. భారత్‌కే చెందిన సతీశ్ కుమార్, రవి, ఆయుశ్ శెట్టి కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పోరాడి ఓడిన శ్రియాన్షి మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ శ్రియాన్షి వలిశెట్టి పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. వు లువో యు (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో శ్రియాన్షి 21–19, 12–21, 12–21తో ఓడింది. భారత్‌కే చెందిన మాన్సి సింగ్, తన్వీ శర్మ, అన్మోల్ ఖరబ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల డబుల్స్‌లో తనీషా క్రాస్టో–అశి్వని పొన్నప్ప; ప్రియ–శ్రుతి మిశ్రా (భారత్) జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల; రోహిత్–రిదువర్షిణి; అశిత్–అమృత; కనపురం సాతి్వక్ రెడ్డి–వైష్ణవి జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. -
తల్లి మృతదేహంతో మూడు నెలలుగా ఒక ఇంట్లో ఉంటూ..
గౌహతి: అస్సాంలోని గౌహతిలో ఒళ్లు జలదరించే ఘటన చోటుచేసుకుంది. మూడు నెలలుగా తల్లి మృతదేహంతో పాటు ఒకే ఇంట్లో ఉంటున్న కుమారునికి సంబంధించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన గౌహతిలోని జ్యోతికుచి ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతురాలిని పూర్ణిమా దేవి(75)గా పోలీసులు గుర్తించారు. మూడు నెలల క్రితమే ఆమె మృతి చెందివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పూర్ణిమా దేవి తన కుమారుడు జైదీప్ దేవ్‌తో కలిసి ఈ ఇంటిలో కొన్నేళ్లుగా ఉంటోంది. జైదీప్ దేవ్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని స్థానికులు తెలిపారు.మృతురాలి అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమె కుమారుడు జైదీప్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు బృందం ఇంట్లో ఆధారాలు సేకరించారు. జైదీప్ మామ, అమ్మమ్మలను కూడా పోలీసులు విచారిస్తున్నారు.పూర్ణిమా దేవి ఇంటికి సమీపంలో ఉంటున్న వారు మీడియాతో మాట్లాడుతూ మృతురాలి కుమారుడు జైదీప్ మానసిక ఆరోగ్యం సరిగా లేదని, అతని ప్రవర్తన వింతగా ఉండేదని తెలిపారు. అతని తండ్రి చనిపోయాడని, అప్పటి నుంచి తల్లిని బయటకు రానివ్వలేదని, ఎవరైనా అడిగితే తల్లి ఆరోగ్యంగా ఉందని చెప్పేవాడన్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: వెంటపడిన కుక్క.. హోటల్ పైనుంచి పడి యువకుడు మృతి -
మహిమాన్వితమైన శక్తిపీఠం..కామాఖ్యాలయం..!
శాక్తేయులకు అత్యంత ఆరాధనీయమైనది కామరూప లేదా కామాఖ్యాదేవి ఆలయం. ఇక్కడే దశమహావిద్యలనే పేరు గల కాళి, తార, భువనేశ్వరి, బగళాముఖి, ఛిన్నమస్త, భైరవి, ధూమావతి, కమలాంబిక, షోడశి, మాతంగి అనే పది వేర్వేలు ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయమూ ఒక్కో విద్యకు ప్రసిద్ధమైనది. ప్రధాన ఆలయం కామాఖ్యాలయమే. సతీదేవి ఆత్మత్యాగానంతరం తీవ్రమైన వేదనతో తపస్సమాధిలో లీనమై ఉన్న పరమేశ్వరుని మనస్సును మార్చాలని దేవతలు సంకల్పిస్తారు. ఇందులో భాగంగా మన్మథుడు సమయం చూసుకుని, పూలబాణాలు వేసి, ఆయనకు తపోభంగం కలిగిస్తాడు. దాంతో ముక్కంటి తన మూడవకంటిని తెరచి మన్మథుణ్ణి మసి చేస్తాడు. మన్మథుడికే కాముడు అనే పేరు. కాముణ్ణి దహించిన ప్రదేశం కనుక దీనికి కామాఖ్య అనే పేరొచ్చిందంటారు. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహంతో మన్మథుడు తిరిగి రూపాన్ని పొందాడు. అయితే కేవలం ఆయన భార్య రతీదేవికి మాత్రమే రూపంతో కనిపిస్తాడు. ఇక్కడి బ్రహ్మపుత్రానదిలో భస్మకూటమనే పర్వతం ఉండటం శివుడు మన్మథుని భస్మం చేయడం, తిరిగి ఆయన రూపం పొందాడనడానికి ప్రతీకగా నిలుస్తుంది.ప్రత్యేకతలకు ఆలవాలం... ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినదిగా భావిస్తున్న ఈ ఆలయం 16వ శతాబ్దంలో అన్యమతస్థుల దాడుల్లో ధ్వంసం కాగా, 17వ శతాబ్దంలో కుచ్ బీహార్ రాజు నరనారాయణుడు పునర్నిర్మించాడని శాసనాధారాలున్నాయి. తేనెపట్టు ఆకారంలో ఉన్న ఆలయ శిఖరం గణేశుడు తదితర దేవీ దేవతల శిల్పాలతో కనువిందు చేస్తుంది. మాంత్రికులకు, తాంత్రికులకు, వామాచారులకు, క్షుద్రపూజలు చేసేవారికి ఈ ఆలయమే ఆధారం.కారణం ఇది సతీదేవి యోని భాగం పడిన ప్రదేశం. మూడు మంటపాలుగా నిర్మించి ఉంటుంది. అందులో మొదటి ప్రాకారంలో గుహలా ఉండే గర్భాలయంలో యోనిచిహ్నం ఉన్న నల్లటి బండరాయి ఉంటుంది. దానికే పూజలు జరుగుతాయి.అయితే ఆ రూపం కనిపించకుండా భక్తుల దర్శనానికి ముందే పూలతో నింపేస్తారు. ఆ గుహ లోపల రాతి మీద ఎప్పుడూ జల వూరుతూ ఉంటుంది. అందువల్ల మూలవిరాట్టు ఎప్పుడూ తడిగా ఉంటుంది. గర్భాలయం అంతా చిత్తడిగా, జారుడుగా ఉంటుంది. ఆలయం బయటే శీతలాదేవి సన్నిధి ఉంటుంది. దీర్ఘవ్యాధులు ఉన్నవారు ఈమెను సేవించుకుంటే వాటినుంచి విముక్తి కలుగుతుందని ప్రతీతి. పూజలు– ఉత్సవాలు... అమ్మవారికి రోజూ చేసే పూజలు గాక దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా దుర్గాపూజ జరిపిస్తారు. ఇవిగాక ఫాల్గుణ మాసంలో దుర్గాడియుల్ అని దుర్గాదేవికి ప్రత్యేక పూజ ఉంటుంది. అదేవిధంగా మానసాపూజ, పోహన్ బియా అంటే పుష్యమాసంలో కామేశ్వరుడికీ, కామేశ్వరీదేవికీ కల్యాణం జరిపిస్తారు. పసిపిల్లవానికి పాలు ఇస్తున్నట్లుగా ఉండే విగ్రహం పశ్చిమ ద్వారాన ఉంటుంది. అమ్మవారు భక్తులను ఎల్లప్పుడూ కన్నతల్లిలా కాపాడుతూ ఉంటుందని చెప్పేందుకు ప్రతీక ఇది. ఈ ఆలయంలో అమ్మవారు సంవత్సరానికి ఒకసారి జూన్ రెండవవారంలో బహిష్టు అవుతారు. స్థానికులు దీనిని అంబుబాషి సమయం అంటారు. ఈ నాలుగురోజులపాటు ఆలయాన్ని మూసి ఉంచి, అయిదోరోజున తలుపు తెరుస్తారు. అంబుబాషి రోజులలో అమ్మవారి ఆలయంతోపాటు మిగతా ఆలయాలన్నిటినీ కూడా మూసి ఉంచుతారు. గౌహతి నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో చట్టగామ్లో శీతకుండం దగ్గర గల చంద్రశేఖర పర్వతంపై భగవతి అమ్మవారి ఆలయం ఉంది. కుండం లో నిత్యం అగ్ని ప్రజ్వరిల్లే శక్తి పీఠం ఇది. నరకాసురుడు కామాఖ్యాదేవిని ఆరాధించటం వల్లే అంతటి బలపరాక్రమాలు పొందగలిగాడని పెద్దలు చెబుతారు. అమ్మవారు, పరమేశ్వరుడు ఇక్కడ నిత్యం కామకేళిలో తేలియాడుతుంటారని, అందువల్లే అమ్మవారికి కామాఖ్య అనే పేరు వచ్చిందని చెబుతారు. అలాగే శివపార్వతులు ప్రతిరోజూ రాత్రిపూట ఆలయం అంతర్భాగంలో సర్పాల రూపంలో జూదం ఆడుతుంటారని విశ్వాసం. ఈ క్షేత్రంలోనే మరో ఐదు శైవాలయాలున్నాయి. అవి అఘోరేశ్వర, అమృతేశ్వర, కోటిలింగేశ్వర, సిద్ధేశ్వర, కామేశ్వరాలయాలు.కామాఖ్యలో ఇంకా ఏమేం చూడవచ్చు..?కామాఖ్యాలయం నీలాచలం కొండలపై ఉందని తెలుసుకదా, అక్కడే భువనేశ్వరీ ఆలయం, వనదుర్గాలయం ఉన్నాయి. పైన చెప్పుకున్న ఐదు శివాలయాలూ, దశమహావిద్యలకూ సంబంధించిన ఆలయాలూ ప్రధానాలయానికి చేరువలోనే ఉంటాయి. ఇవిగాక శుక్లేశ్వర కొండలపై జనార్దనాలయం, లక్ష్మీమందిరం, గ్రామదేవతా మందిరం, చక్రేశ్వరాలయం, విశ్వకర్మ మందిరం, కాళీపురంలో శివమందిరం, మహావీర్ అక్రాలయం, శని మందిరం, గోపాల మందిరం, కాళీమందిరం, హనుమాన్ మందిరం ఉన్నాయి. ఇంకా లోకనాథాలయం, శీతలామందిరం, నామ్ ఘర్ ఆలయం, గోశాల నేపాలీ మందిరం, రామ్ ఠాకూర మందిరం ఉన్నాయి. ఇవిగాక దిహింగ్ సరస్సు, బుద్ధ మందిరం, నౌకామందిరం, ఎల్విజిస్ మ్యూజియం, తోరుణామ్ ఫుకాన్ పార్క్, శ్రీ జలరామ్ మందిరాలను కూడా సందర్శించవచ్చు.ఆలయానికి ఎలా వెళ్లాలి..?దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి గువహతికి వెళ్లేందుకు, బస్సులు, రైళ్లు, విమానాలూ ఉన్నాయి. గువహతి రైల్వేస్టేషన్ నుంచి 6 కిలోమీటర్లు, ఏర్΄ోర్టునుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామాఖ్యాదేవి ఆలయానికి వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలున్నాయి. పిలవని పేరంటానికి వెళ్లి, కన్నతండ్రి చేత ఘోరపరాభవం పొందిన సతీదేవి, ఆ అవమాన భారంతో ఆత్మత్యాగం చేస్తుంది. ఇది తెలిసి, అక్కడకు చేరుకున్న శివుడు ఆమె శరీరాన్ని భుజాలమీదకు ఎత్తుకుని రుద్రతాండవం చేస్తుంటాడు. సతీదేవి శరీరం అక్కడ ఉన్నంతసేపూ శివుడిని ఆప శక్యం కాదని తెలిసిన విష్ణువు తన చక్రాయుధాన్ని ఉపయోగించి, ఆమె శరీరాన్ని ఖండఖండాలు చేస్తాడు. అవి 108 ఖండాలుగా భూలోకంలోని వివిధ ప్రదేశాలలో పడతాయి. ఆమె శరీరంలోని కీలకమైన భాగాలు పడిన ప్రదేశాలలో తిరిగి అత్యంత కీలకమైన ప్రదేశాలను గుర్తించి, అలయాలు నిర్మించారు పూర్వులు. అవే అష్టాదశ శక్తిపీఠాలు. వాటిలో అమ్మవారి యోనిభాగం నీలాచలం కొండలపై పడింది. అదే కామాఖ్యా పీఠంగా గుర్తింపు పొంది, కామాఖ్యాదేవి ఆలయంగా ప్రసిద్ధికెక్కింది.ఇతర విశేషాలు..ఎగుడు దిగుడు కొండలు, గుట్టలు, లోయలు ఉండే ఈ ప్రదేశానికి అసమ దేశం అని పేరు. అసమ కాస్తా అస్సాంగా, అసోమ్గా రూపాంతరం చెందింది. శ్రీహరి కొలువై ఉన్న ప్రదేశం కాబట్టి దీనికి హరిక్షేత్రం అని కూడా పేరు. అందుకే అష్టాదశ శక్తిపీఠాల స్తోత్రం లో హరిక్షేత్రే కామరూపా అని ఉంటుంది. ఇక్కడ అమ్మవారి రూపం కానీ, విగ్రహం కానీ ఏమీ ఉండవు. కామాఖ్యాదేవికి నలుపు రంగంటే ప్రీతి. జంతు బలులు ఇక్కడ పరిపాటి. అదీ నల్లటి జంతువులనే బలివ్వాలి. ఆడ జంతువులను వధించరాదని నియమం. ఇది అమ్మవారి యోనిభాగం పడిన ప్రదేశం కావడం వల్ల శివుడు, అమ్మవారు నిత్యం కామకేళిలో మునిగి తేలుతూ ఉంటారని ప్రతీతి. – డి.వి.ఆర్. భాస్కర్(చదవండి: మహిమాన్వితమైన శక్తిపీఠం..కామాఖ్యాలయం..!) -
యూపీలో ఎన్కౌంటర్.. రూ. లక్ష రివార్డు నిందితుని హతం
లక్నో: యూపీలోని లక్నోలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గత ఆగస్టులో ఇద్దరు ఆర్పీఎఫ్ పోలీసులను రైలు నుంచి తోసి, హత్య చేసిన కేసులో నిందితునిగా ఉన్న జాహిద్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఇతనిపై పోలీసులు రూ. రూ.లక్ష రివార్డు ప్రకటించారు. నిందితుడు జాహిద్ మద్యాన్ని రైలులో అక్రమంగా రవాణా చేస్తుండగా, ఇద్దరు ఆర్పీఎఫ్ జవానులు అడ్డుకున్నారు. అయితే నిందితుడు జాహిద్ వారిని రైలు నుంచి తోసివేశాడు. ఈ ఘటనలో వారిద్దరూ మృతి చెందారు.వివరాల్లోకి వెళితే గత నెల ఆగస్టు 19న రాత్రి బార్మర్ గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో జావేద్ ఖాన్, ప్రమోద్ కుమార్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లను నిందితుడు జాహిద్ రైలు నుంచి కిందకు నెట్టివేశాడు. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో పోలీసులు నిందితుడు జాహిద్‌ను ఎన్కౌంటర్ చేశారు. ఘాజీపూర్‌లోని దిల్దార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాయపడిన స్థితిలో నిందితుడు జాహిద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతను చనిపోయినట్లు ప్రకటించారు. నిందితుడు పట్నాలోని మన్సూర్ గాలి పెదిమా బజార్‌కు చెందినవాడు. నిందితునిపై గతంలో కిడ్నాప్, దాడి, మద్యం స్మగ్లింగ్ తదితర కేసులు నమోదయ్యాయి. STF यूनिट नोएडा कोतवाली गहमर व GRP दिलदारनगर पुलिस की संयुक्त टीम द्वारा आरपीएफ जवानों की हत्या में शामिल 100000/- रुपये के इनामिया बदमाश के साथ थाना दिलदारनगर क्षेत्रान्तर्गत हुई मुठभेड़ के संबंध में #spgzr महोदय की बाइट(1)@Uppolice @IgRangeVaranasi @adgzonevaranasi pic.twitter.com/lCHVw8Z1In— Ghazipur Police (@ghazipurpolice) September 23, 2024ఇది కూడా చదవండి: మహాబోధి ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు -
పాఠాలు చెబుతున్న ఏఐ టీచరమ్మ..
అన్ని రంగాల్లోనూ సంచలనం సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విద్యా రంగంలోనూ ప్రవేశించింది. ఏఐని విద్యలో విలీనం చేసే దిశగా గౌహతిలో రాయల్ గ్లోబల్ స్కూల్ తొలి ఏఐ టీచర్ 'ఐరిస్'ను ఆవిష్కరించింది.సంప్రదాయ దుస్తులు ధరించిన ఐరిస్ తన పరిజ్ఞానం, సంభాషణ సామర్థ్యాలతో విద్యార్థులను అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రారంభ సెషన్లో విద్యార్థులు ‘ఐరిస్’ను ప్రశ్నలతో ముంచెత్తారు. విద్యార్థుల ప్రశ్నలన్నింటికీ ఏఐ టీచర్ వివరణాత్మకంగా, ఉదాహరణలతో చక్కగా సమాధానాలు ఇచ్చింది.విద్యార్థుల సందేహాలు తీర్చడమే కాదు.. కరచాలనం వంటి హావభావాలను ప్రదర్శిస్తుండటంతో విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. నీతి ఆయోగ్ ప్రారంభించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్) ప్రాజెక్టు కింద మేకర్ల్యాబ్స్ ఎడ్యు-టెక్ సహకారంతో అభివృద్ధి చేసిన ఈ ‘ఐరిస్’ విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గణనీయమైన పురోగతికి ప్రాతినిధ్యం వహిస్తుంది. -
రాజస్తాన్-కేకేఆర్ మ్యాచ్ రద్దు అవ్వాలి: ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్
ఐపీఎల్-2024లో గౌహతి వేదికగా చివరి లీగ్ మ్యాచ్‌లో తలపడేందుకు రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు సిద్దమయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. బర్సపరా క్రికెట్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. దీంతో 7:00 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యం కానుంది. కాగా ఇరు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్ 19 పాయింట్లతో అగ్రస్ధానంలో ఉండగా.. రాజస్తాన్ 16 పాయింట్లతో మూడో స్ధానంలో ఉంది. ఇక పంజాబ్‌పై తమ చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో స్ధానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాజస్తాన్- కేకేఆర్ మ్యాచ్ రద్దవ్వాలని సన్‌రైజర్స్ అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ మ్యాచ్ మొత్తానికి రద్దు అయితే రాజస్తాన్, కేకేఆర్‌కు తలో పాయింట్ లభిస్తుంది. దీంతో ఎస్ఆర్హెచ్ 17 పాయింట్లతో తమ రెండో స్ధానాన్ని పదిలం చేసుకుంటుంది. కాగా మ్యాచ్ రద్దు అయితే రాజస్తాన్ ఖాతాలో కూడా 17 పాయింట్లు ఉంటాయి. కానీ రాజస్తాన్ జట్టు కంటే ఎస్ఆర్హెచ్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది. కాబట్టి ఎస్ఆర్హెచ్ సెకెండ్ ప్లేస్‌కు ఎటువంటి ఢోకా లేదు. -
పోలీసుల కళ్లెదుటే ‘మణిపూర్ ఘోరం’
మణిపుర్లో మైతీ తెగకు చెందిన మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీ తెగ మహిళను నగ్నంగా ఊరేగించి.. లైంగిక హింసకు పాల్పడిన ఘటన దేశంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఛార్జిషీట్లో షాకింగ్ విషయాలను వెల్లడించింది. బాధిత మహిళలు సాయం చేయమని కోరినా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, వారు ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిగుంపుకే సహకరించేలా వ్యవహరించారని తెలిపింది.కాంగ్పోక్పీ జిల్లాలో మైతీ అల్లరిగుంపు చేతికి చిక్కిన ఇద్దరు కుకీ మహిళలు ఘటనా ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీసు జీపు వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరారు. అయితే పోలీసులే స్వయంగా బాధితులను ఆ అల్లరిగుంపకు అప్పగించినట్లు ఛార్జిషీటులో సీబీఐ పేర్కొంది. దీంతో ఆ అల్లరి మూక ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వరిపొలాల్లో దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వివరించింది.బాధితురాళ్లలో ఒక మహిళ తమను కాపాడి, సురక్షిత ప్రాంతాని తీసుకుళ్లాలని పోలీసులను కోరారు. అయితే జీపు తాళాలు తమ వద్ద లేవని పోలీసులు అబద్దాలు చెప్పినట్లు సీబీఐ ఛార్జిషీట్ పేర్కొంది. మరోవైపు.. అల్లరిగుంపు చేతికి చిక్కిన మూడో మహిళ వారి నుంచి త్రుటిలో తప్పించుకొంది.గతేడాది మే 4న జరిగిన ఈ ఘటన రెండు నెలల తర్వాత జులై నెలలో వైరల్‌గా మారి దేశమంతా కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆరుగురు నిందితులతోపాటు ఓ బాల నేరస్థుడిపై గౌహతి సీబీఐ ప్రత్యేక జడ్జి కోర్టులో అక్టోబరు 16న ఛార్జిషీటు దాఖలు అయింది.ఈ దాడుల్లో అల్లరిగుంపు చేతిలో మృతిచెందిన కుకీ తెగకు చెందిన తండ్రీకొడుకుల మృతదేహాలను గ్రామ సమీపంలోని నీరులేని నదిలోకి విసిరేసినట్లు తెలిపింది. మైతీ గుంపు జీపు వద్దకు చేరుకోగానే బాధితులను అక్కడే వదిలేసి.. పోలీసులు పారిపోయినట్లు సీబీఐ మూడు పేజీల ఛార్జిషీటులో పేర్కొంది. -
‘‘ఐసిస్‌లో చేరతా’’.. ఐఐటీ విద్యార్థి అరెస్టు
గువహతి: ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరతానని సోషల్ మీడియాలో ప్రకటించడంతో పాటు ఈ మెయిల్స్ చేసిన ఐఐటీ గువహతి విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన తర్వాత ఆ విద్యార్థి ఎక్కడికెళ్లాడో ఆజూకీ తెలియలేదు. తర్వాత పోలీసులు గాలించి అస్సాంలోని కమ్రుప్ జిల్లాలో అతడిని పట్టుకున్నారు. ఐసిస్ ఇండియా చీఫ్ హరిస్ ఫరూకీ అలియాస్ హరీష్ అజ్మల్ ఫరూకీ అతని అనుచరుడు అనురాగ్ సింగ్ అలియాస్ రెహాన్ అస్సాంలోని ధుబ్రిలో అరెస్టయిన నాలుగు రోజుల తర్వాత మిస్సైన విద్యార్థి ఆజూకీని పోలీసులు కనుగొనడం గమనార్హం. ‘ విద్యార్థి పంపిన మెయిల్స్ నిజమైనవేనని ధృవీకరించుకుని దర్యాప్తు ప్రారంభించాం. ట్రావెలింగ్‌లో ఉండగా ఆ విద్యార్థిని పట్టుకున్నాం. అరెస్టు చేసి ప్రాథమికంగా విచారించాం. చట్ట ప్రకారం అతడిపై చర్యలు తీసుకుంటాం. ఐసిస్ నల్ల జెండాతో పాటు ఐసిస్ మనుస్క్రిప్ట్ విద్యార్థి హాస్టల్ రూమ్‌లో దొరికింది. విద్యార్థి డిల్లీలోని ఓక్లాకు చెందినవాడు’అని అస్సాం పోలీసులు తెలిపారు. Reference @IITGuwahati student pledging allegiance to ISIS - the said student has been detained while travelling and further lawful follow up would take place. @assampolice @CMOfficeAssam @HMOIndia — GP Singh (@gpsinghips) March 23, 2024 ఇదీ చదవండి.. ఎన్నికల వేళ బరితెగిస్తున్న కేటుగాళ్లు -
ఆధ్యాత్మిక బాటలో రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లి తర్వాత తొలిసారిగా!
టాలీవుడ్ హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. నటుడు, నిర్మాత అయిన తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. గోవాలో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీ తారలు కూడా హాజరయ్యారు. ఫిబ్రవరి 21 వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆనంద్ కరాజ్ అనే పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వరుడి సాంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలోనూ ముచ్చటగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత రకుల్, భగ్నానీ జంట బిజీగా మారిపోయింది. తన భర్తతో కలిసి ఆధ్యాత్మిక బాట పట్టింది. కుటుంబసభ్యులతో పాటు దేవుళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటోంది. తాజాగా అస్సాం గువహటిలోని కామాఖ్య దేవి అమ్మవారిని రకుల్ దర్శించుకున్నారు. కొత్త జీవితం ప్రారంభించిన నూతన దంపతులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
క్యా సీన్ హై.. వధువుకి పాదాభివందనం చేసిన వరుడు
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో మధురమైంది. అది ప్రేమ పెళ్లి అయినా పెద్దల అంగీకారంతో చేసుకునే పెళ్లి అయినా ఎప్పటికీ గుర్తిండిపోవాలనుకునే విధంగా ఆనందంగా జరుపుకోవాలనుకుంటారు. అచ్చం అలాగే అస్సాం రాజధాని గౌహతిలో ఓ పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. అతిథులంతా వచ్చేశారు. పెళ్లి ఘనంగా జరుగుతోంది. ఇరు కుటుంబ సభ్యుల హడావిడీతో మండపం అంతా సందడి వాతావరణం నెలకొంది. హిందూ సంప్రదాయంలో పెళ్లి తర్వాత వరుడి పాదాలను వధువు తన రెండు చేతులతో తాకి నమస్కరించడం ఆనవాయితీ. అందుకు తగ్గట్లే వధువు వరుడి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. అయితే అనంతరం పెళ్లి కొడుకు కల్లోల్ దాస్ కూడా తన భార్య పాదాలను తాకి శిరస్సు వంచి నమస్కరించాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్యర్యానికి లోనవుతూ చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ వీడియోను స్వయంగా కల్లోల్ దాస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా ఆమరింది. రెండు మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి. ఈ వ్యవహారాన్ని కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే తన భార్యను ఎంతగానో గౌరవిస్తున్నానని, అందులో భాగంగానే పెళ్లిలో ఆమెకు పాదాభివందనం చేశానని కల్లోల్ దాస్ ప్రతిస్పదించాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. అతడిని తన భార్య కాళ్లు పట్టుకోకుండా ఎవరూ ఆపలేదు. వాస్తవానికి ఇంకా అతన్ని ప్రోత్సహించారు. అవును ప్రతి పెళ్లి ఇలాగే ఉండాలి. సమాన గౌరవం, సమానమైన విలువ ఉండాలి. మీ ఇద్దరిని దేవుడు ఆశిర్వదించాలి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. సమస్య మళ్లీ మొదటికి! -
గౌహతిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన తమన్నా
-
ఆధ్యాత్మిక సేవలో తమన్నా: ట్రెడిషనల్ లుక్ పిక్స్ వైరల్
#TamannabhatiavisitsKamakhyaTemple సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్లో కూడా తన సత్తాను చాటుకున్న తమన్నా భాటియా ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనలు, సేవపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. అందం, ఆకర్షణతో మిల్కీ బ్యూటీగా పాపులర్ అయిన తమన్నా పర్సనల్ లైఫ్‌కి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. రెండు రోజుల క్రితం రామమందిర ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో పాల్గొన్న తమన్నా కుటుంబ సమేతంగా కామాఖ్య ఆలయానికి వెళ్లింది. తాజాగా తల్లి దండ్రులతో కలిసి తమన్నా గౌహతిలోని ప్రఖ్యాత కామఖ్య ఆలయాన్ని సందర్శించింది. ప్రత్యేకంగా పూజలు నిర్వహించి. మాతా రాణి ఆశీస్సులు తీసుకుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. ఈ సందర్భంగా తమన్నా లుక్, గెటప్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) పసుపు కాషాయ రంగు మేళవింపుతో కూడిన సాంప్రదాయ దుస్తులు, నుదుటిన తిలకం, మెడలో పూమాల, దేవుడి శాలువ ఇలా ప్రత్యేకంగాట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టేస్తోంది. శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య దేవాలయం నీలాచల్ కొండపై ఉంది. -
పాతిక కేసులు పెట్టుకోండి: రాహుల్
బార్పేట(అస్సాం): అస్సాంలో హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ తనపై మోపిన కేసులకు భయపడేది లేదని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. నాగాలాండ్ నుంచి అస్సాంలోని గువాహటిలోకి భారత్ జోడో న్యాయ్ యాత్ర అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డుకున్నపుడు జరిగిన ఘర్షణలకు రాహుల్ కారకుడంటూ హిమంత సర్కార్ కేసులు పెట్టడం తెల్సిందే. అస్సాంలో ఏడురోజుల యాత్ర బర్పెటా జిల్లా కేంద్రంలో బుధవారం ప్రారంభించిన సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన తొలి బహిరంగ సభలో సీఎంపై రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ కేసులు పెట్టి నన్ను బయపెట్టొచ్చన్న ఐడియా హిమంతకు ఎందుకు వచి్చందో నాకైతే తెలీదు. మీరు(హిమంత, పోలీసులు) ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. మరో పాతిక తప్పుడు కేసులు బనాయించండి. నేను అస్సలు భయపడను. బీజేపీ–ఆర్ఎస్ఎస్ నన్ను భయపెట్టలేవు’’ అని అన్నారు. హిమంతను అతిపెద్ద అవినీతి సీఎంగా అభివరి్ణంచారు. ‘‘ మీరు ఆయనతో మాట్లాడుతుంటే ఆలోపు మీ భూమి కొట్టేస్తారు. మీరు వక్కపలుకులు నమిలినంత తేలిగ్గా ఆయన సుపారీ బిజినెస్ కానచ్చేస్తారు. మీ జేబులో డబ్బు నొక్కేస్తారు. ఏకంగా కజిరంగా నేషనల్ పార్క్ స్థలాలనే సీఎం ఆక్రమించారు. సీఎంతో జాగ్రత్త’ అని జనాన్ని అప్రమత్తం చేశారు. ఎన్నికలయ్యాక లోపలేస్తాం: సీఎం మంగళవారం నాటి ఘర్షణలకు సంబంధించిన కేసులో రాహుల్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని సీఎం హిమంత చెప్పారు. -
రాహుల్ భద్రతపై అమిత్‌షాకు ఖర్గే లేఖ
అస్సాం ప్రభుత్వం వర్సెస్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య జరుగుతున్న తాజా వివాదం నేపథ్యంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగారు. గువాహటిలో రాష్ట్ర పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో రాహుల్ ఎదుర్కొన్న భద్రత వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాహుల్ గాంధీతోపాటు భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటున్న ఇతరులకు భద్రతా విషయంపై అమిత్ షా జోక్యం చేసుకోవాలనికోరారు. అస్సాంలో మంగళవారం చోటు చేసుకున్న పలు ఉద్రిక్తతల నేపథ్యంలో రాహుల్ గాంధీపై పోలీసులు కేసు నమోదు చేసిన అనంతరం ఈ పరిణామం జరిగింది. హింసాత్మక ఘటనలు, రెచ్చగొట్టడం, పోలీసులపై దాడి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు రాహుల్ , కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్ సహా ఇతర వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. Shri @RahulGandhi and the #BharatJodoNyayYatra has faced serious security issues in Assam in the last few days. My letter to Home Minister, Shri @AmitShah underlining the same. pic.twitter.com/FHLG5pg5Bz — Mallikarjun Kharge (@kharge) January 24, 2024 అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్‌కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, అనేక భద్రతా లోపాలు వెలుగుచూశాయని కేంద్ర హోంమత్రికి రాసిన లేఖలో ఖర్గే వివరించారు. కాంగ్రెస్ పోస్టర్లను ధ్వంసం చేయడం, కాంగ్రెస్ యాత్రను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం, రాష్ట్ర పార్టీ చీఫ్ భూపెన్ బోరాపై దాడి చేయడం వంటి విషయాలను ఆయన ప్రస్తావించారు. చదవండి: తగ్గేదేలే.. రాహుల్ గాంధీపై కేసు నమోదు వీటన్నింటి విషయాల్లో అస్సాం పోలీసులు బీజేపీ కార్యకర్తలవైపు పక్షాన నిలిచారని ఆరోపించారు. అంతేగాక కాషాయ శ్రేణులకు రాహుల్ కాన్వాయ్ దగ్గరకు రావడానికి అనుమతించారని విమర్శించారు. రాహుల్, ఆయన సిబ్బంది భద్రతకు ప్రమాదం కలిగించారని మండిపడ్డారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పటికీ.. ఈ ఘటనలతో సంబంధం ఉన్న వారెవరినీ పోలీసులు అరెస్టు చేయలేదన్నారు. న్యాయ యాత్ర కొనసాగుతున్న కొద్దీ రాహుల్‌కు ప్రమాదం పెరిగే అవకాశం ఉందని, ఇకనైన అమిత్‌షా జోక్యం చేసుకొని రాహుల్ యాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భద్రత కల్పించేలా అస్సాం ముఖ్యమంత్రి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లను ఆదేశించాలని కోరారు. ఇదిలా ఉండగా భారత్ జోడో న్యాయ్ యాత్ర గువాహటి నగరంలోకి యాత్ర ప్రవేశించకుండా అస్సాం పోలీసులు మంగళవారం భారీగా బారికేడ్లను అడ్డుపెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని ముందుకు దూసుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరు వర్గాల మద్య ఘర్షణ జరిగింది. చదవండి: ముంబైలో రామ భక్తులపై దాడులు.. నిందితులపై బుల్డోజర్ యాక్షన్ -
క్వార్టర్స్‌లో అచ్యుతాదిత్య–హర్షవర్ధన్ జోడీ
గువాహటి: హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో కీలకదశలో పాయింట్లు గెలిచిన దొడ్డవరపు అచ్యుతాదిత్య రావు–వెంకట హర్షవర్ధన్ (భారత్) జోడీ... గువాహటి ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణకు చెందిన అచ్యుతాదిత్య, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హర్షవర్ధన్ ద్వయం 24–22, 23–21తో నాలుగో సీడ్ వె చున్ వె–వు గువాన్ జున్ (చైనీస్ తైపీ) జంటను బోల్తా కొట్టించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ అమ్మాయి సామియా 15–21, 21–18, 13–21తో రెండో సీడ్ వెన్ చి సు (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ 21–13, 19–21, 17–21తో చూంగ్ హోన్ జియాన్–గో పె కీ (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలైంది. -
IND vs AUS: మాక్స్వెల్ విధ్వంసకర సెంచరీ.. భారత్‌పై ఆసీస్ విజయం
గౌహతి వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టీ20లో 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా అద్బుత విజయం సాధించింది. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆఖరి బంతికి 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా విజయంలో గ్లెన్ మాక్స్వెల్ మెరుపు సెంచరీతో కీలక పాత్ర పోషించాడు. ప్రసిద్ద్ కృష్ణ వేసిని ఆఖరి ఓవర్లో ఆసీస్ విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతిని ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వెడ్ ఫోర్ బాదాడు. అనంతరం రెండో బంతికి సింగిల్ తీసి మాక్స్‌వెల్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. 4 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన నేపథ్యంలో వరుసగా ఒక సిక్స్, మూడు ఫోర్లు బాది తన జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 104 పరుగులు చేసి మాక్సీ ఆజేయంగా నిలిచాడు. కాగా ఈ విజయంతో సిరీస్ అధిక్యాన్ని 2-1కు ఆసీస్ తగ్గించింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో అదరగొట్టాడు. 57 బంతులు ఎదుర్కొన్న రుత్‌రాజ్ 13 ఫోర్లు, 7 సిక్స్‌లతో 123 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 19 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 202 /5 19 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి 6 బంతుల్లో 21 పరుగులు కావాలి. 18 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 180/5 18 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి 12 బంతుల్లో 43 పరుగులు కావాలి. 16 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 174/5 గ్లెన్ మాక్స్వెల్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.16 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి 18 బంతుల్లో 49 పరుగులు కావాలి. మాక్స్వెల్ హాఫ్ సెంచరీ.. మాక్స్వెల్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. 29 బంతుల్లో మాక్సీ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఐదో వికెట్ డౌన్.. భారత బౌలర్లు తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. టిమ్ డేవిడ్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 136/5 నాలుగో వికెట్ డౌన్.. 128 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన మార్క్స్ స్టోయినిష్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 9 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 99/3 9 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. క్రీజులో మాక్స్వెల్(26), స్టోయినిష్(5) పరుగులతోఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్.. జోష్ ఇంగ్లీష్(10) రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. ఇంగ్లీష్‌ను బిష్ణోయ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండో వికెట్ డౌన్.. 66 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన ఆరోన్ హార్డీ.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 56/1. క్రీజులో ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీష్(10) పరుగులతో ఉన్నారు. రుత్‌రాజ్ విధ్వంసకర సెంచరీ.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బ్యాటర్లలో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆసీస్ రుతురాజ్ బౌలర్లను ఊచ కోశాడు. ఈ మ్యాచ్‌లో 57 బంతులు ఎదుర్కొన్న రుత్‌రాజ్ 13 ఫోర్లు, 7 సిక్స్‌లతో 123 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాగా రుత్‌రాజ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ. అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్(39), తిలక్ వర్మ(31) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ.. ఆసీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో సెంచరీతో సత్తాచాటాడు. 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో రుతురాజ్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 17 ఓవర్లకు టీమిండియా స్కోర్: 155/3 17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. క్రీజులో రుత్‌రాజ్ గైక్వాడ్(71), తిలక్ వర్మ(21) పరుగులతో ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ.. టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మరో హాఫ్ సెంచరీ సాధించాడు. 33 బంతుల్లో 9 ఫోర్లతో రుతు తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.15 ఓవర్లకు టీమిండియా స్కోర్: 143/3. క్రీజులో గైక్వాడ్(63), తిలక్ వర్మ(17) పరుగులతో ఉన్నారు. టీమిండియా మూడో వికెట్ డౌన్.. సూర్యకుమార్ ఔట్ 81 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. ఆరోన్ హార్డీ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 12 ఓవర్లకు టీమిండియా స్కోర్: 101/3 దూకుడుగా ఆడుతున్న సూర్య.. 8ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన బ్యాట్‌ను ఝుళిపిస్తున్నాడు. 33 పరుగులతో సూర్య బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో పాటు క్రీజులో రుత్‌రాజ్ గైక్వాడ్(12) ఉన్నాడు. 5 ఓవర్లకు టీమిండియా స్కోర్: 39/2 5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(13), రుత్‌రాజ్ గైక్వాడ్(6) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియాకు బిగ్ షాక్.. ఇషాన్ కిషన్ ఔట్ 24 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కేన్ రిచర్డ్సన్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు అదిలోకి బిగ్ షాక్ తగిలింది. యువ ఓపెనర్ జైశ్వాల్(6) తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి ఇషాన్ కిషన్ వచ్చాడు. 2 ఓవర్లకు భారత్ స్కోర్: 18/1 గౌహతి వేదికగా మూడో టీ20లో ఆస్ట్రేలియా-భారత్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు టీమిండియా ముఖేష్ కుమార్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో అవేష్ ఖాన్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. జట్టులోకి ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, కేన్ రిచర్డ్సన్, బెహ్రెన్‌డార్ఫ్ వచ్చారు. తుది జట్లు ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్), నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా, కేన్ రిచర్డ్సన్ భారత్: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ -
India vs Australia 3rd T20I: సిరీస్ విజయమే లక్ష్యంగా...
గువాహటి: టి20ల్లో వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న భారత జట్టు ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను 3–0తో ఇక్కడే కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగే మూడో టి20 మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. అటు బ్యాటర్స్, ఇటు బౌలర్స్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో ఆతిథ్య జట్టుకు సిరీస్ విజయం ఏమంత కష్టమేమీ కాదు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ 200 పైచిలుకు స్కోరు చేసిన భారత్ మళ్లీ గువాహటి ప్రేక్షకులకు అలాంటి మజానే అందించేందుకు సిద్ధమైంది. పైగా ఆల్‌రౌండ్ సామర్థ్యంతో జట్టు సమరోత్సాహంతో ఉంది. ఆస్ట్రేలియా మాత్రం సిరీస్‌లో నిలవాలంటే కచి్చతంగా గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. పరాజయాల ‘హ్యాట్రిక్’ అయితే మాత్రం సిరీస్ చేజార్చుకుంటుంది. బ్యాటర్స్‌ను ఆపతరమా... టాపార్డర్ బ్యాటర్స్ అసాధారణ ఫామ్‌లో ఉన్నారు. యశస్వి దూకుడు ఆసీస్‌ను కంగారు పెట్టిస్తోంది. రెండు వరుస అర్ధ సెంచరీలతో ఇషాన్ కిషన్ ప్రత్యర్థి బౌలర్లపై సత్తా చాటగా, రుతురాజ్ కూడా ఫిఫ్టీతో తొలిమ్యాచ్ డకౌట్‌ను మరచిపోయేలా చేశాడు. రింకూ సింగ్ డెత్ ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇక నిరూపించుకోవాల్సింది, సత్తా చాటుకోవాల్సిన వారు ఎవరైనా ఉన్నారంటే అది హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మే! ఎందుకంటే విశ్రాంతిలో ఉన్న శ్రేయస్ అయ్యర్ తదుపరి రెండు మ్యాచ్‌లకు వైస్ కెపె్టన్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను తుది జట్టులో ఆడటం ఖాయం కావడంతో బెంచ్‌కు పరిమితమయ్యే పరిస్థితి తిలక్కే వస్తుంది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్‌లో మెరుపులు మెరిపిస్తే... ప్రస్తుతానికి పక్కన పెట్టినా టచ్‌లోకి వచి్చన బ్యాటర్‌గా జట్టు ఎంపికలో ఉంటాడు. ఇక బౌలింగ్ విభాగం కూడా గత మ్యాచ్‌లో మెరుగైంది. కీలకమైన వికెట్లను వరుస విరామాల్లో తీసి మ్యాచ్‌లో పట్టు సాధించింది. ప్రసి«ద్‌కృష్ణ, అర్‡్షదీప్‌లతో పాటు స్పిన్నర్లు రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఆసీస్ రేసులోకొచ్చేనా... ఆ్రస్టేలియా తొలి టి20లో 200 పైచిలుకు పరుగులు చేసినా ఓడింది. తర్వాతి మ్యాచ్‌లో 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. వరుస పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న ఆ్రస్టేలియా గెలిచి నిలవడం సాధ్యమవుతుందా అనేది నేటి మ్యాచ్‌తో తేలుతుంది. గత మ్యాచ్‌లో అనుభవజు్ఞలైన డాషింగ్ బ్యాటర్ మ్యాక్స్‌వెల్, ప్రధాన స్పిన్నర్ ఆడమ్ జంపాలను కూడా బరిలోకి దించినా కంగారూ జట్టుకైతే ఒరిగిందేమీ లేదు. నిలకడ లేని బ్యాటింగ్, నియంత్రణ లేని బౌలింగ్ జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. స్మిత్, షార్ట్, ఇన్‌గ్లిస్, టిమ్ డేవిడ్, స్టోయినిస్లాంటి మేటి బ్యాటర్లున్నప్పటికీ ఈ సిరీస్‌లో గెలుపు దారిలో మాత్రం ఆసీస్ పడలేకపోతోంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిస్తే తప్ప పటిష్టమైన ఆతిథ్య జట్టు జోరుకు కళ్లెం వేయలేదు. జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెపె్టన్), రుతురాజ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, తిలక్‌వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్‡్షదీప్, ప్రసిధ్ కృష్ణ, ముకేశ్ కుమార్. ఆ్రస్టేలియా: మాథ్యూ వేడ్ (కెపె్టన్), స్టీవ్ స్మిత్, షార్ట్, జోష్ ఇన్‌గ్లిస్, మ్యాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, స్టోయినిస్, ఆడమ్ జంపా, సీన్ అబాట్, నాథన్ ఎలిస్, తనీ్వర్ సంఘా. -
WC- Ind vs Eng: టీమిండియా అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
ICC Cricket World Cup Warm-up Matches 2023- India vs England: వన్డే ప్రపంచకప్-2023 సన్నాహక మ్యాచ్ కోసం ఆశగా ఎదురుచూసిన టీమిండియా అభిమానులకు వరణుడు షాకిచ్చాడు. గువాహటిలో ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో శనివారం జరగాల్సిన వామప్ మ్యాచ్ రద్దైపోయింది. కాగా అసోంలోని బర్సపరా స్టేడియంలో రోహిత్ సేన.. జోస్ బట్లర్ బృందంతో తమ తొలి వామప్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, టాస్ అనంతరం వర్షం మొదలుకావడంతో ఆలస్యంగానైనా ఆట మొదలవుతుందని అభిమానులు ఆశించారు. కానీ వరణుడు వాళ్ల ఆశలపై నీళ్లు చల్లాడు. వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో అంపైర్లు టీమిండియా- ఇంగ్లండ్ వామప్ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వన్డే వరల్డ్‌కప్-2023 వామప్ మ్యాచ్ టీమిండియా (బ్యాటింగ్ ఎలెవన్, ఫీల్డింగ్ ఎలెవన్): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ. ఇంగ్లండ్ (బ్యాటింగ్ ఎలెవన్, ఫీల్డింగ్ ఎలెవన్): డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, సామ్ కరన్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్. చదవండి: సచిన్, కోహ్లి కాదు! అతడికి బౌలింగ్ చేయడం చాలా కష్టం: డేల్ స్టెయిన్ -
ఇకపై బహుభార్యత్వం నిషేధం.. డిసెంబర్లో బిల్లు
గౌహతి: డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. టిన్సుకియాలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అయన మాట్లాడుతూ వచ్చే 45 రోజుల్లో ఈ బిల్లును సిద్ధం చేసి డిసెంబర్ సమావేశాల్లో ప్రవేశపెడతామని అన్నారు. లీగల్ కమిటీ.. శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ అసోం ప్రభుత్వం బహుభార్యత్వం బిల్లును సీరియస్‌గా తీసుకుందని దీనిపై ఒక లీగల్ కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. బహుభార్యత్వాన్ని నిషేధించడంలో సాధ్యాసాధ్యాలు గురించి అధ్యయనం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని సూచించినట్లు తెలిపారు. ప్రజాభిప్రాయం కూడా.. ఇదే అంశంపై ప్రజాభిప్రాయాలను కూడా సేకరించగా ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని మొత్తం 149 మంది నుంచి అభిప్రాయసేకరణ చేయగా వారిలో 146 మంది సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మరో ముగ్గురు మాత్రం బహుభార్యత్వాన్ని సమర్ధించినట్లు తెలిపారు. బిల్లును రూపొందించడమే మా తదుపరి కార్యాచరణని అన్నారు. వీలైతే రాష్ట్రంలో లవ్ జిహాద్‌ను కూడా అంతం చేసే విధంగా ఇదే బిల్లులో మరికొన్ని అంశాలను కూడా చేర్చనున్నామన్నారు. ఈ సందర్బంగా సాయుధ దళాల ప్రత్యేక అధికారాలు ఉపసంహరించే చట్టం గురించి ప్రస్తావిస్తూ.. అది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయమని ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని.. ఈ నెలాఖరులో కేంద్రంతో చర్చించి కచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటామని అన్నారు. సాయుధ దళాల ప్రత్యేక చట్టం.. 1958 సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ప్రకారం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రాంతాల్లో ప్రజా జీవనానికి ఇబ్బంది లేకుండా చేయడానికి పార్లమెంట్ వారికి ఈ అధికారాలను మంజూరు చేసింది. 1972లో ఈ చట్టాన్ని సవరిస్తూ ఒకసారి ఇబ్బందికరమైన ప్రాంతమని ప్రకటించాక అక్కడ కనీసం మూడు నెలల పాటు విధులు నిర్వర్తించేందుకు సాయుధ దళాలకు ప్రత్యేక అధికారముంటుంది. #WATCH | On banning polygamy in the state, Assam CM Himanta Biswa Sarma says "A legal committee was formed to check if polygamy can be banned by the state govt or not. Later, we asked the public for their opinion if they had any objections. We received a total of 149 suggestions… pic.twitter.com/ZC9U2TNSQQ — ANI (@ANI) September 3, 2023 ఇది కూడా చదవండి: సరదా సన్నివేశం.. రాహుల్‌కు మటన్ కర్రీ వండటం నేర్పిన లాలూ -
‘బాయ్’ ఎక్స్‌లెన్స్ సెంటర్ కోచ్‌గా ముల్యో హండోయో
అస్సాం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) గువాహటిలో కొత్తగా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (ఎన్సీఈ)ను అధునాతన సొబగులు, క్రీడా సదుపాయాలతో తీర్చిదిద్దింది. దీనికి హెడ్ కోచ్‌గా ఇండోనేసియాకు చెందిన ప్రఖ్యాత కోచ్ ముల్యో హండోయోను ‘బాయ్’ నియమించింది. హండోయోకు భారత షట్లర్లతో విజయవంతమైన అనుబంధముంది. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, గురుసాయిదత్ తదితరుల ప్రతిభకు మెరుగులు దిద్ది... చైనా షట్లర్లకు ఎదురునిలిచే నైపుణ్యాన్ని ముల్యోనే నేర్పారు. ఆయన కోచింగ్ హయాంలోనే శ్రీకాంత్ ప్రపంచ నంబర్‌వన్‌గా ఎదిగాడు. అలాగే మరో ఇద్దరు విదేశీ కోచ్‌లను కూడా ఎన్సీఈకి నియమించారు. మాజీ ఆల్‌ఇంగ్లండ్ చాంపియన్ ఇవాన్ సొజొనొవ్ (రష్యా) డబుల్స్ కోచ్‌గా, కొరియాకు చెందిన సింధు మాజీ కోచ్ పార్క్ తే సంగ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. అస్సాం, బాయ్ ఉమ్మడి భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఎన్సీఈలో 24 కోర్టులున్నాయి. 3000 మంది ప్రేక్షకులు వీక్షించవచ్చు. శిక్షణపొందే షట్లర్లు, సిబ్బంది కోసం సౌకర్యవంతమైన వసతి గదులు, కసరత్తుకు జిమ్, ఇతరత్రా అధునాతన సదుపాయాలెన్నో ఉన్నాయి. ఈ సెంటర్‌ను శుక్రవారం లాంఛనంగా ప్రారంభిస్తారు. -
మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని
గువాహటి: గువాహటి(అస్సాం)–న్యూజల్పాయ్గురి(పశ్చిమబెంగాల్) వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ప్రధాని మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటి ఈ వందేభారత్ రైలుతో ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వారంతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వంలో దేశం అభివృద్ధి దిశగా అద్భుతమైన ప్రయాణం సాగించిందన్నారు. 2014కు పూర్వం ఊహించని అనేక విజయాలను ప్రభుత్వం సాధించిందని తెలిపారు. గువాహటిలో ఈ రైలు ప్రారంభ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, సీఎం హిమాంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. గువాహటి– న్యూజల్పాయ్గురి మధ్య రైలు ప్రయాణ సమయం ప్రస్తుతమున్న 6.30 గంటల నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాకతో 5.30 గంటలకు తగ్గనుంది. -
పెను విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి
గువహటి: ఈశాన్య రాష్ట్రమైన అసోంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. గువాహటిలోని జలూక్‌బరీ ప్రాంతంలో ఓ కారు(01 GC 8829) ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడికికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరంతా గువాహటిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నట్లు తెలిసింది. క్షతగాత్రులను సమీపంలోని జీఎంసీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. కారు.. వ్యాన్‌ను ఢీకొనే ముందు డివైడర్‌ను ఢీకొట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు.. - అరిందమ్ భల్లాల్ - నియోర్ దేకా - కౌశిక్ మోహన్ - ఉపాంగ్షు శర్మ - రాజ్‌కిరణ్ భుయాన్ - ఎమోన్ గయాన్ - కౌశిక్ బారుహ్ తీవ్రంగా గాయపడిన వారు.. - అర్పాన్ భుయాన్ - అర్నాబ్ చక్రవర్తి బొంగైగావ్ - మృన్మోయ్ బోరా. ఇది కూడా చదవండి: ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం.. -
సుఖోయ్ 30 యుద్ధ విమానంలో ప్రయాణించనున్న రాష్ట్రపతి ముర్ము
గువాహటి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి (ఏప్రిల్6-8) మూడు రోజులపాటు అస్సాంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాల్లో ముర్ము పాల్గొనున్నట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ఈ సందర్బంగా ఆమె ఏప్రిల్ 8వ తేదీని తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో సుఖోయ్ 30 MKI విమానంలో ప్రయాణించనున్నారు. అంతకుముందు 2009లో మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఈ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఏప్రిల్ 7న రాష్ట్రపతి కాజిరంగా నేషనల్ పార్క్‌లో గజ్ ఉత్సవ్-2023 వేడుకలను ప్రారంభించనున్నారు. అనంతరం గువాహటిలో మౌంట్ కాంచనగంగా సాహసయాత్ర-2023ను జెండా ఊపి ప్రారంభిస్తారు. దీంతోపాటు గౌవాహటి హైకోర్టు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. ఏప్రిల్ 8న తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ముర్ము ప్రయాణించనున్నారు. చదవండి: జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి టైగర్ జగర్నాథ్ కన్నుమూత.. -
RR Vs PBKS: చహల్ ఉండగా భయమేల! కానీ అసోంలో మాత్రం..
Rajasthan Royals vs Punjab Kings Predicted Playing XI: ఐపీఎల్-2023 సీజన్‌ను భారీ విజయంతో ఆరంభించిన రాజస్తాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్‌తో పోటీకి సిద్ధమైంది. గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరుగనుంది. ఇక తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై స్వల్ప తేడాతో గెలుపొందిన పంజాబ్ సైతం రాజస్తాన్‌తో ఢీ అంటే ఢీ అంటోంది. కాగా తమకు హోం గ్రౌండ్‌గా ఉన్న ఈ స్టేడియంలో రాజస్తాన్ రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత సొంతమైదానం జైపూర్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడనుంది. ఇదిలా ఉంటే.. మరి అసోంలో వాతావరణం, బర్సపరా స్టేడియంలో పిచ్ పరిస్థితి, తుది జట్లు ఎలా ఉండబోతున్నాయన్న వివరాలు గమనిద్దాం. పిచ్ పరిస్థితి? గతంలో పలు అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన అసోం స్టేడియంలో వికెట్ కాస్త బౌన్సీగా ఉంటుంది. పేసర్లకు అనుకూలం. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు సహకరిస్తుంది. గతేడాది అక్టోబరులో ఇక్కడ టీమిండియా- సౌతాఫ్రికా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఒక్కో జట్టు 200 పరుగుల కంటే ఎక్కువ స్కోరు నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 16 పరుగుల తేడాతో గెలిచింది. కాబట్టి ఈసారి కూడా హై స్కోరింగ్ మ్యాచ్ చూసే అవకాశం లేకపోలేదు. వాతావరణం అసోంలో వర్ష సూచన లేదు. కాబట్టి రాజస్తాన్- పంజాబ్ మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం ఉండకపోవచ్చు. యుజీ ఉండగా భయమేల? వాళ్ల తర్వాత చహల్ మాత్రమే పంజాబ్ కింగ్స్‌పై రాజస్తాన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. పంజాబ్‌తో మ్యాచ్‌లో యుజీ ఇప్పటి వరకు 28 వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్(34), సునిల్ నరైన్ (33) తర్వాత పంజాబ్‌పై ఈ ఘనత సాధించిన మూడో బౌలర్ చహల్. ఇక సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చి విశ్వరూపం చూపించిన చహల్.. పంజాబ్‌పై కూడా చెలరేగితే రాజస్తాన్‌కు తిరుగు ఉండదు. ఇక పేస్ విభాగంలో బౌల్ట్, హోల్డర్, ఆసిఫ్, సైనీ(తొలి మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్) ఉండనే ఉన్నారు. ఇక రాజస్తాన్ టాపార్డర్‌లో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్.. వన్‌డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. వెరసి ‘హోం గ్రౌండ్’లో రాజస్తాన్‌దే పైచేయి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, టాపార్డర్‌ను దెబ్బకొట్టడం సహా ఫినిషర్ హెట్‌మెయిర్‌ను కట్టడి చేస్తే పంజాబ్ గెలుపు అవకాశాలు మెరుగుపడతాయి. ఇక మ్యాచ్ పరిస్థితిని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్లు ఎలాంటి పాత్ర పోషించనున్నారో వేచిచూడాలి. తుది జట్ల అంచనా: రాజస్తాన్ యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్‌కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కేఎమ్ ఆసిఫ్, యజ్వేంద్ర చాహల్. పంజాబ్ శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్సే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సికందర్ రజా, షారుక్ ఖాన్, సామ్ కరన్, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, అర్ష్‌దీప్ సింగ్. చదవండి: అందుకే అక్షర్‌తో బౌలింగ్ చేయించలేదు.. మా నుంచి అతడు మ్యాచ్ లాగేసుకున్నాడు! -
Vandana Kalita: భర్త, అత్తలను ఫ్రిడ్జ్‌లో..
ఆమె నేరం చేసినట్లయితే ఆమెను కాల్చివేయండయ్యా. అలాంటి కూతురు నాకు వద్దు. వివాహేతర సంబంధంతో భర్త, అత్తలను చంపడం ఏంటయ్యా?. ఒకవేళ నిజంగా ఆమె తన భర్తను, అత్తగారిని చంపి ఉంటే నాకు ఆమెతో ఎలాంటి సంబంధం ఉండదు.. తన కన్నకూతురిని ఉద్దేశించి ఓ తండ్రి చెప్తున్న మాటలివి. గువాహతి: దేశంలో జరుగుతున్న ఒక తరహా నేరాలు-ఘోరాలపై విపరీతమైన చర్చ నడుస్తోంది. ప్రేమ.. సహజీవనం.. పెళ్లిమాటొచ్చేసరికి చంపేయడం లాంటి వరుస ఘటనలు చూస్తున్నాం. ఈ నేరాలను స్ఫూర్తిగా తీసుకుందేమో.. అసోంలో ఒకావిడ భర్త, అత్తలను ఆ కేసుల తరహాలోనే హతమార్చింది. అసోం గువాహతి సమీపంలో నూన్‌మతికి చెందిన ఓ వివాహిత.. భర్త, అత్తలను కడతేర్చి ముక్కలు చేసింది. ఆ ముక్కలను ఫ్రిడ్జ్‌లో భద్రపరిచింది. ఆపై ప్రియుడి సాయంతో వాటిని దూరంగా పడేసి వచ్చింది. దాదాపు ఆరు నెలల తర్వాత.. ఇది వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త, అత్తలు అడ్డువస్తున్నారనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందట. నిందితురాలి పేరు వందనా కలిటా. భర్త పేరు అమర్‌జ్యోతి దే. అత్త పేరు శంకరీ దే. కిందటి ఏడాది ఆగష్టు నెలలో వాళ్లను ప్రియుడు, మరొక వ్యక్తి సాయంతో చంపేసి ముక్కలు చేసింది వందన. ఆపై ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేసి.. ఫ్రిడ్జ్‌లో భద్రపరిచింది. మూడు రోజుల తర్వాత ప్రియుడి సాయంతో ఆ శరీర విడి భాగాలను 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరపుంజి(మేఘాలయా)కు తీసుకెళ్లి.. అక్కడ సోహ్రా ప్రాంతంలో వాటిని పడేసింది. తిరిగొచ్చి ప్రియుడితో కలిసి ఉంటోంది. ఏడు నెలలపాటు వాళ్ల గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. పోలీసులకు సైతం ఫిర్యాదు చేయకుండా జాగ్రత్త పడింది. తన కన్నతండ్రికి సైతం ఏం చెప్పకుండా ఉండిపోయింది. చివరికి.. దగ్గరి బంధువు ఒకరు అమర్, శంకరీల గురించి ఆరా తీయడంతో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్తూ వచ్చింది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించగా.. వాళ్లు తమ శైలిలో విచారణ చేపట్టారు. చివరాఖరికి.. ఫిబ్రవరి 19వ తేదీన ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితురాలు వందనతో పాటు ఆమె ప్రియుడు అరుప్ డేక, అరుప్ స్నేహితుడు ధాంజిత్ డేకాలను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్తాభర్తల అదృశ్యం గురించి ఆమె(వందన) నాటకాలాడిందని, ఒకవేళ ఆమె నేరం చేసిందని రుజువైతే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాలని వందన తండ్రి పోలీసులను కోరుతున్నాడు. వివాహేతర సంబంధం తనకు భర్త, అత్తకు తెలిసిందని, వాళ్లు హెచ్చరించడంతోనే ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె పోలీసుల ముందు ఒప్పుకుంది. ఇదిలా ఉంటే శ్రద్ధా వాకర్ హత్య కేసు, తాజాగా నిక్కీ యాదవ్ కేసులోనూ ఫ్రిడ్జ్‌లో బాడీ విడిభాగాలు, బాడీని భద్రపర్చడం తెలిసిందే.