రాజస్తాన్ రాయల్స్ (PC: IPL/BCCI)
Rajasthan Royals vs Punjab Kings Predicted Playing XI: ఐపీఎల్-2023 సీజన్‌ను భారీ విజయంతో ఆరంభించిన రాజస్తాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్‌తో పోటీకి సిద్ధమైంది. గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరుగనుంది. ఇక తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై స్వల్ప తేడాతో గెలుపొందిన పంజాబ్ సైతం రాజస్తాన్‌తో ఢీ అంటే ఢీ అంటోంది.
కాగా తమకు హోం గ్రౌండ్‌గా ఉన్న ఈ స్టేడియంలో రాజస్తాన్ రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత సొంతమైదానం జైపూర్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడనుంది. ఇదిలా ఉంటే.. మరి అసోంలో వాతావరణం, బర్సపరా స్టేడియంలో పిచ్ పరిస్థితి, తుది జట్లు ఎలా ఉండబోతున్నాయన్న వివరాలు గమనిద్దాం.
పిచ్ పరిస్థితి?
గతంలో పలు అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన అసోం స్టేడియంలో వికెట్ కాస్త బౌన్సీగా ఉంటుంది. పేసర్లకు అనుకూలం. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు సహకరిస్తుంది. గతేడాది అక్టోబరులో ఇక్కడ టీమిండియా- సౌతాఫ్రికా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఒక్కో జట్టు 200 పరుగుల కంటే ఎక్కువ స్కోరు నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 16 పరుగుల తేడాతో గెలిచింది. కాబట్టి ఈసారి కూడా హై స్కోరింగ్ మ్యాచ్ చూసే అవకాశం లేకపోలేదు.
వాతావరణం
అసోంలో వర్ష సూచన లేదు. కాబట్టి రాజస్తాన్- పంజాబ్ మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం ఉండకపోవచ్చు.
యుజీ ఉండగా భయమేల? వాళ్ల తర్వాత చహల్ మాత్రమే
పంజాబ్ కింగ్స్‌పై రాజస్తాన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. పంజాబ్‌తో మ్యాచ్‌లో యుజీ ఇప్పటి వరకు 28 వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్(34), సునిల్ నరైన్ (33) తర్వాత పంజాబ్‌పై ఈ ఘనత సాధించిన మూడో బౌలర్ చహల్.
ఇక సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చి విశ్వరూపం చూపించిన చహల్.. పంజాబ్‌పై కూడా చెలరేగితే రాజస్తాన్‌కు తిరుగు ఉండదు. ఇక పేస్ విభాగంలో బౌల్ట్, హోల్డర్, ఆసిఫ్, సైనీ(తొలి మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్) ఉండనే ఉన్నారు.
ఇక రాజస్తాన్ టాపార్డర్‌లో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్.. వన్‌డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. వెరసి ‘హోం గ్రౌండ్’లో రాజస్తాన్‌దే పైచేయి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, టాపార్డర్‌ను దెబ్బకొట్టడం సహా ఫినిషర్ హెట్‌మెయిర్‌ను కట్టడి చేస్తే పంజాబ్ గెలుపు అవకాశాలు మెరుగుపడతాయి. ఇక మ్యాచ్ పరిస్థితిని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్లు ఎలాంటి పాత్ర పోషించనున్నారో వేచిచూడాలి.
తుది జట్ల అంచనా:
రాజస్తాన్
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్‌కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్‌మెయిర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కేఎమ్ ఆసిఫ్, యజ్వేంద్ర చాహల్.
పంజాబ్
శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్సే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సికందర్ రజా, షారుక్ ఖాన్, సామ్ కరన్, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, అర్ష్‌దీప్ సింగ్.
చదవండి: అందుకే అక్షర్‌తో బౌలింగ్ చేయించలేదు.. మా నుంచి అతడు మ్యాచ్ లాగేసుకున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment