IPL 2023, RR VS PBKS: Yuzvendra Chahal Named As Rajasthan Royals Skipper During Toss, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2023: రాజస్తాన్‌ కెప్టెన్‌ చాహల్‌.. మరి శాంసన్‌ ఎవరు భయ్యా? వీడియో వైరల్‌

Published Sat, May 20 2023 8:51 AM | Last Updated on Sat, May 20 2023 9:18 AM

Yuzvendra Chahal named as Rajasthan Royals skipper during toss, video goes viral - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో ప్లే ఆఫ్స్‌ ఆశలను రాజస్తాన్‌ రాయల్స్‌ సజీవంగా నిలుపుకుంది. ధర్మశాల వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన రాజస్తాన్‌.. ముంబైను వెనుక్కి నెట్టి ఐదో స్థానానికి చేరుకుంది. రాజస్తాన్‌ ప్లే ఆఫ్స్‌ భవితవ్యం ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌పై ఆధారపడి ఉంది.

ఇక ఈ విషయం పక్కన పెడితే.. రాజస్తాన్‌, పంజాబ్‌ మ్యాచ్‌ సందర్భంగా ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ భారీ తప్పిదం చేసింది. టాస్ సమయంలో సంజూ శాంసన్‌ మాట్లాడుతున్నప్పుడు.. రాజస్తాన్‌ కెప్టెన్‌గా శాంసన్‌ పేరుగా బదులుగా యుజ్వేంద్ర చాహల్ పేరును కెప్టెన్‌గా ప్రదర్శించారు. 'యుజ్వేంద్ర చాహల్, రాజస్తాన్‌ కెప్టెన్‌' అని బోర్డులో కనిపించింది.

కాగా టాస్ ముగిసిన కొద్దిసేపటికే ఈ తప్పిదంపై రాజస్తాన్‌ రాయల్స్‌ ఫ్రాంజైజీ ఫన్నీగా స్పందించింది. చాహల్‌ ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. "రాజస్తాన్‌ కొత్త కెప్టెన్‌ యుజ్వేంద్ర చాహల్ అంటూ" క్యాప్షన్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దీంతో స్టార్‌స్పోర్ట్స్‌ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. రాజస్తాన్‌ కెప్టెన్‌ చాహల్‌ అయితే, మరి శాంసన్‌ ఎవరు? అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో సంజూ, చాహల్‌ ఇద్దరూ నిరాశపరిచారు. శాంసన్‌ ‍కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరగా.. చాహల్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో వికెట్‌ ఏమీ తీయకుండా 40 పరుగులు సమర్పించుకున్నాడు.
చదవండి: అదే మా కొంపముంచింది.. చాలా విషయాలు నేర్చుకున్నాం! అందుకే అలా చేశా: ధావన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement