star sports
-
T20 World Cup 2024: సెమీస్‌కు చేరే జట్లు ఇవే..!
ఐపీఎల్ 2024 సీజన్ ముగిసి రెండు రోజులైనా పూర్తి కాకముందే క్రికెట్ సర్కిల్స్‌ను పొట్టి ప్రపంచకప్ ఫీవర్ పట్టుకుంది. ప్రపంచకప్ ప్రారంభానికి మరో మూడు రోజులు ఉండగానే అభిమానులతో పాటు విశ్లేషకులు వరల్డ్‌కప్ మోడ్‌లోకి వచ్చారు. ఈసారి తమ టీమ్ గెలుస్తుందంటే తమ టీమ్ గెలుస్తుందని అభిమానులు నెట్టింట డిబేట్లకు దిగుతున్నారు. విశ్లేషకులు, మాజీలు గెలుపు గుర్రాలపై అంచనాలు వెల్లడిస్తున్నారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పలువురు మాజీ క్రికెటర్లు వరల్డ్‌కప్ సెమీస్‌కు చేరే జట్లపై తమ అంచనాలను వెల్లడించారు. వీరిలో అందరూ భారత్ తప్పక సెమీస్‌కు చేరుతుందని చెప్పడం విశేషం.టీ20 వరల్డ్‌కప్ 2024 సెమీఫైనలిస్ట్‌ల విషయంలో మాజీల అంచనాలు ఇలా..అంబటి రాయుడు- భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాబ్రియాన్ లారా- భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్పాల్ కాలింగ్‌వుడ్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్సునీల్ గవాస్కర్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్క్రిస్ మోరిస్- భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియామాథ్యూ హేడెన్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాఆరోన్ ఫించ్- భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్మొహమ్మద్ కైఫ్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్టామ్ మూడీ- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాశ్రీశాంత్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్కాగా, టీ20 వరల్డ్‌కప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాక్, ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడా దేశాలు.. గ్రూప్-బిలో నమీబియా, స్కాట్లాండ్, ఒమన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా.. గ్రూప్-సిలో ఉగాండ, పపువా న్యూ గినియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-డిలో నెదర్లాండ్స్, నేపాల్, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడుతున్నాయి. -
IPL 2024: ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఇలా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో ముందడుగు పడింది. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో తొలిసారి చెవిటి, దృష్టి లోపం ఉన్న అభిమానుల కోసం సంకేత భాష మరియు వివరణాత్మక వ్యాఖ్యానాన్ని అందించనున్నారు. చెవిటి, దృష్టి లోపం ఉన్న అభిమానుల సౌకర్యార్దం స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఈ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ నుంచి ఈ తరహా వ్యాఖ్యానం అమల్లోకి రానుంది. ఈ నూతన ఒరవడిని అమల్లో పెట్టేందుకు ఐపీఎల్ అధికారిక ప్రసారకర్త అయిన స్టార్ స్పోర్ట్స్ ఇండియా సైనింగ్ హ్యాండ్స్ (ISH) న్యూస్‌తో చేతులు కలిపింది. ఐఎస్హెడ్ నిపుణుల ఆధ్వర్యంలో ఫీడ్‌ను భారతీయ సంకేత భాషను ఉపయోగించి బాల్ టు బాల్ అప్డేట్స్ ఇస్తామని స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. సంకేత బాష ఫీడ్‌తో పాటు సాధారణ వెర్బల్ స్కోర్ అప్డేట్స్ కూడా ఉంటాయని పేర్కొంది. ఈ వెసులుబాటుతో చెవిటి, దృష్టి లోపం ఉన్న క్రికెట్ అభిమానులు గేమ్‌లోని ప్రతి క్షణాన్ని ఆస్వాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే, ఇవాల్టి నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే.. ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. -
విరాట్ కోహ్లికి ఘోర అవమానం! మండిపడుతున్న ఫ్యాన్స్
టెస్ట్ క్రికెట్లో ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్ ఎలెవన్‌ను స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. దక్షిణాఫ్రికా-భారత్ మధ్య బాక్సింగ్ డే టెస్ట్ లంచ్ బ్రేక్ సందర్భంగా ఈ లిస్ట్‌ను స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఓపెనర్లగా ఆసీస్ స్టార్ ఆటగాడు ఉస్మాన్ ఖావాజా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చోటు దక్కింది. అదే విధంగా మూడు నాలుగు స్ధానాల్లో వరుసగా ఇంగ్లండ్ వెటరన్ జో రూట్, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను స్టార్‌స్పోర్ట్స్ ఎంపిక చేసింది. ఐదో స్ధానంలో ఆసీస్ విధ్వంసకర ఆటగాడు ట్రావిస్‌కు హెడ్‌కు అవకాశం దక్కింది. వికెట్ కీపర్‌గా ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో ఎంపికయ్యాడు. ఆల్‌రౌండర్ల కోటాలో టీమిండియా వెటరన్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవి అశ్విన్‌కు చోటిచ్చింది. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో ఆసీస్ స్పీడ్ స్టార్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఉన్నారు. విరాట్ కోహ్లికి ఛాన్స్..? అయితే ఈ జట్టులో టీమిండియా స్టార్ ఆటగాడు, రన్‌మిషన్ విరాట్ కోహ్లికి చోటు దక్కకపోవడం గమనార్హం. దీంతో స్టార్స్పోర్ట్స్పై కింగ్ కోహ్లి అభిమానులు మండిపడుతున్నారు. ఈ ఏడాది టెస్టుల్లో మిడిలార్డర్లో అద్భుతంగా రాణిస్తున్న కోహ్లికి చోటు ఇవ్వడంపై అభిమానలుతో పాటు మాజీ క్రికెటర్ల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ స్పోర్ట్‌ను అభిమానులు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం స్పందిచాడు. 'ఈ ఏడాది టెస్టుల్లో 55 బ్యాటింగ్ యావరేజ్ ఉన్న కోహ్లీకి ఇయర్ ఆఫ్ ది టీమ్‌లో చోటు దక్కకపోవడం షాకింగ్‌గా ఉందని' ఓ జాతీయ ఛానల్‌తో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది 8 టెస్టులు ఆడిన విరాట్.. 54.09 సగటుతో 595 పరుగులు చేశాడు. అతడు ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. స్టార్ స్పోర్ట్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్: ఉస్మాన్ ఖవాజా, రోహిత్ శర్మ, జో రూట్, కేన్ విలియమ్సన్, ట్రావిస్ హెడ్, జానీ బెయిర్‌స్టో, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, స్టువర్ట్ బ్రాడ్. Star Sports Test team of the year. pic.twitter.com/I0JqE9rCOc — Mufaddal Vohra (@mufaddal_vohra) December 26, 2023 Irfan Pathan said "Kohli has 55 Test average in 2023 & it's shocking that he is missing in the test team of the year" [Star Sports] pic.twitter.com/zYd467NA7x — Johns. (@CricCrazyJohns) December 26, 2023 -
India vs South Africa: సఫారీ ‘టెస్టు’ సవాల్
దక్షిణాఫ్రికా గడ్డపై ఎనిమిదిసార్లు పర్యటన... 23 టెస్టుల్లో బరిలోకి...4 టెస్టుల్లో విజయాలు ... 12 పరాజయాలు... సమంగా ముగిసిన మరో 7 మ్యాచ్‌లు... అయితే 31 ఏళ్లలో ఒక్క సిరీస్ కూడా భారత్ సొంతం కాలేదు... గతంలో ఎన్నడూ గెలవని ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ వేదికలపై కూడా ఈ మూడు దశాబ్దాల వ్యవధిలో తొలిసారి సిరీస్ విజయాలు సాధించి టీమిండియా లెక్క సరి చేసింది... కానీ ఇప్పటికి కొరకరాని కొయ్యలా మిగిలింది సఫారీ టూర్ మాత్రమే... ఇక్కడ మాత్రం మనకు ఇప్పటి వరకు సిరీస్ దక్కలేదు. ఈ రికార్డును చెరిపేసేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా మరోసారి దక్షిణాఫ్రికా గడ్డపై అడుగు పెట్టింది. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లతో సత్తా చాటి భారత్ ఈసారి ఆ లోటును తీరుస్తుందా లేక స్వదేశంలో బలమైన సఫారీ సేన తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటుందా అనేది ఆసక్తికరం. సెంచూరియన్: టి20, వన్డేల తర్వాత భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్‌లో ఇరు జట్ల మధ్య నేటినుంచి తొలి టెస్టు జరుగుతుంది. కొంత విరామం తర్వాత రెండు టీమ్‌లూ టెస్టు మ్యాచ్ బరిలోకి దిగుతున్నాయి. భారత జట్టు ఆఖరిసారిగా గత జూలైలో వెస్టిండీస్ గడ్డపై సిరీస్ ఆడగా... దక్షిణాఫ్రికా స్వదేశంలో చివరిసారిగా గత మార్చిలో విండీస్‌తోనే తలపడింది. బలాబలాలను బట్టి చూస్తే ఇరు జట్లూ సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. రెండు టీమ్‌ల నుంచి కూడా టి20, వన్డే సిరీస్‌ల నుంచి విశ్రాంతి తీసుకున్న పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లు కొత్త ఉత్సాహంతో ఇప్పుడు టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో హోరాహోరీ సమరానికి అవకాశం ఉంది. ప్రసిధ్ కృష్ణకు అవకాశం... పుష్కర కాలం... భారత టెస్టు క్రికెట్ గొప్ప విజయాల్లో భాగంగా ఉన్న పుజారా, రహానే ఇద్దరూ తుది జట్టులో లేకుండా జట్టు విదేశీ గడ్డపై టెస్టు ఆడి 12 ఏళ్లు అయింది! 2012 జనవరిలో అడిలైడ్‌లో ఆసీస్‌తో మ్యాచ్ తర్వాత వీరిద్దరూ లేకుండా విదేశాల్లో టెస్టు ఆడని భారత జట్టు ఇప్పుడు కొత్తగా సిద్ధమైంది. వరల్డ్ కప్ ఫామ్‌ను బట్టి చూస్తే కెపె్టన్ రోహిత్, కోహ్లిల బ్యాటింగ్ భారత్‌కు కీలకం కానుంది. రాహుల్‌కు రెండు సిరీస్‌ల అనుభవం ఉండగా, గిల్ తొలిసారి దక్షిణాఫ్రికా గడ్డపై ఆడబోతున్నాడు. వీరితో పోలిస్తే శ్రేయస్, యశస్వి ఇంకా కొత్త ఆటగాళ్ల కిందే లెక్క. ఈ స్థితిలో రోహిత్, కోహ్లిల ప్రదర్శనపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. కఠినమైన ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొని భారత టాప్–6 ఎన్ని పరుగులు సాధిస్తుందనేది చూడాలి. ఆల్‌రౌండర్‌గా జడేజా రాణించాల్సి ఉంది. పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని చూస్తే అశ్విన్‌కంటే శార్దుల్‌కే చాన్స్ దక్కవచ్చు. బుమ్రా, సిరాజ్ ప్రధానంగా పేస్ బౌలింగ్ భారం మోస్తారు. వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన షమీ లేకపోవడం జట్టుకు పెద్ద లోటే. అతని స్థానంలో మూడో పేసర్‌గా ప్రసిధ్, ముకేశ్‌లకు ఒకరికి చాన్స్ ఉంటుంది. పేస్ పదును... టి20, వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను చూస్తే ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి లేదు. గాయాల నుంచి కోలుకున్న ప్రధాన పేసర్లు రబడ, ఎన్గిడి సమరోత్సాహంతో ఉన్నారు. వీరికి తోడుగా కొత్త స్టార్ కొయెట్జీ కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. సొంతగడ్డపై ఈ త్రయం బౌలింగ్ భారత్‌కు పరీక్ష పెట్టవచ్చు. భిన్నమైన శైలి గల జాన్సెన్ కూడా జత కలిస్తే జట్టు బౌలింగ్ మరింత పదునెక్కుతుంది. కెరీర్‌కు ఘనమైన ముగింపు ఇవ్వాలని భావిస్తున్న సీనియర్ ఎల్గర్‌తో పాటు మార్క్రమ్, బవుమా బ్యాటింగ్‌లో కీలకం. కొత్త ఆటగాళ్లు జోర్జి, బెడింగామ్ కూడా ప్రభావం చూపగలరు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెపె్టన్), యశస్వి, గిల్, కోహ్లి, రాహుల్, శ్రేయస్, జడేజా, శార్దుల్, బుమ్రా, ప్రసిధ్, సిరాజ్. దక్షిణాఫ్రికా: బవుమా (కెపె్టన్), ఎల్గర్, మార్క్రమ్, జోర్జి, బెడింగామ్, వెరీన్, జాన్సెన్, మహరాజ్, కొయెట్జీ, రబడ, ఎన్గిడి. పిచ్, వాతావరణం పేస్‌కు బాగా అనుకూలమైన పిచ్. తొలి రెండు రోజులు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించవచ్చు. ఈ వేదికపై దక్షిణాఫ్రికా 28 టెస్టు మ్యాచ్‌లలో 22 గెలిచి, 3 మాత్రమే ఓడింది. -
IND Vs PAK: చలో చిరకాల సమరానికి.. నేడు భారత్,పాక్‌ల మధ్య వరల్డ్‌కప్ మ్యాచ్
ప్రపంచకప్‌లో 51 మ్యాచ్‌లు ఉన్నా, అందరూ ఎదురు చూసేది ‘ఈ’ మ్యాచ్ కోసమే... ఈ మ్యాచ్ కోసమే ప్రసారకర్తలు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు సిద్ధం చేస్తారు... ఈ మ్యాచ్ కోసమే ఫ్లయిట్ టికెట్లు, ప్రకటనల రేట్లు ఆకాశానికి అంటుతాయి... ఈ మ్యాచ్ కోసమే అభిమానులు ఎన్ని కష్టాలకోర్చి అయినా మైదానంలోకి అడుగు పెట్టాలని ఆశపడతారు... ఈ మ్యాచ్ కోసమే ఆస్పత్రి మంచాలు కూడా హోటల్ బెడ్లుగా మారిపోతాయి... ఈ మ్యాచ్ కోసమే సినీ తారలతో ప్రత్యేక సంగీత కార్యక్రమం ఉంటుంది... ఈ మ్యాచ్ అంటే బీసీసీఐ, ఐసీసీ దృష్టిలో ‘నవరాత్రి’ సంబరం... చరిత్ర అంతా ఒక వైపే ఉండవచ్చు... వన్డే ప్రపంచకప్‌లో ఏడుసార్లు తలపడితే ప్రతీసారి భారత్‌నే విజయం వరించి ఉండవచ్చు... ప్రస్తుత బలాబలాలు, ఇటీవలి ప్రదర్శన చూస్తే మరో మాటకు తావు లేకుండా టీమిండియానే ఫేవరెట్ అనవచ్చు... అయినా సరే ఈ పోరుకు ఎక్కడ లేని ఆకర్షణ... సరిహద్దు ఉద్రిక్తతలు, రాజకీయాల కారణంగా ఇది ఆట మాత్రమే కాకుండా అంతకు మించిన భావోద్వేగ సమరం... ఆటగాళ్లు మాకు అన్ని మ్యాచ్‌లాగే ఇదీ ఒకటి అని పైకి చెప్పవచ్చు కానీ వారికీ తెలుసు... మైదానంలో దిగాక తమ గుండె చప్పుడు ఎలా ఉంటుందో... దాదాపు ఏడాది క్రితం అక్టోబర్ 23, 2022న టి20 ప్రపంచకప్‌లో రవూఫ్ బౌలింగ్‌లో కోహ్లి బాదిన రెండు వరుస సిక్సర్లు గుర్తుకొచ్చాయా... నాడు 90 వేల మంది సామర్థ్యం గల మెల్బోర్న్ స్టేడియం దద్దరిల్లింది. ఇప్పుడు 1,32,000 మంది ప్రేక్షకులతో నరేంద్ర మోదీ మైదానం మోతెక్కడం ఖాయం. ఈ రెండింటి మధ్య ఆసియా కప్‌లో తలపడినా వరల్డ్‌కప్ లెక్క వేరు... మన అభిమానులతో స్టాండ్లు ‘నీలి సముద్రం’గా మారబోతుండగా, ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై భారత్‌ను ఎదుర్కొంటూ తమకు మద్దతిచ్చే ఒక్క అభిమానీ లేని పాక్ తట్టుకోగలదా అనేది ఆసక్తికరం. అహ్మదాబాద్: వరల్డ్‌కప్‌లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా సమరానికి రంగం సిద్ధమైంది. ఉత్కంఠ, భారీ అంచనాల నడుమ నేడు నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే లీగ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాక్‌పై వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో భారత్ ఆధిక్యం మరింత పెరుగుతుంది. మరోవైపు ఒక్కసారైనా టీమిండియాను ఓడించి పేలవ గణాంకాలకు ఫుల్స్టాప్ పెట్టాలని పాక్ భావిస్తోంది. టోర్నీలో తమ తొలి రెండు మ్యాచ్‌లలో ఆ్రస్టేలియా, అఫ్గానిస్తాన్‌లపై భారత్ భారీ విజయం సాధించగా... నెదర్లాండ్స్, శ్రీలంకలను ఓడించిన పాక్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఇటీవలి ఆసియా కప్ ప్రదర్శనను బట్టి చూస్తే అన్ని రంగాల్లో భారత్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అనూహ్యంగా ఆడే పాక్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. గిల్ బరిలో దిగుతాడా... భారత్ తుది జట్టు విషయంలో మామాలుగానైతే ఎలాంటి సమస్య లేదు. కానీ డెంగీ జ్వరం కారణంగా గత రెండు మ్యాచ్‌లు ఆడని శుబ్‌మన్ గిల్ బరిలోకి దిగడంపైనే ఉత్కంఠ నెలకొంది. అనారోగ్యం నుంచి కోలుకున్న అతను గురువారం స్వల్ప సమయం పాటు సాధన చేసినా... శుక్రవారం మాత్రం సుదీర్ఘంగా బ్యాటింగ్ చేశాడు. కెపె్టన్ రోహిత్ ‘గిల్ 99 శాతం ఫిట్‌గా ఉన్నాడు’ అని చెప్పడం అతను ఆడే అవకాశాలను మెరుగుపర్చింది. ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉండటంతో పాటు ఐపీఎల్లో ఇది అతని సొంత మైదానం కావడం కూడా మరో కారణం. అయితే ఆ ఒక్క శాతం పూర్తిగా కోలుకోకపోతేనే సమస్య. గిల్ లేకపోతే ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. రోహిత్, కోహ్లి, కేఎల్ రాహుల్‌ల బ్యాటింగ్ ఫామ్ భారత్‌కు పెద్ద బలం. అఫ్గాన్‌పై సెంచరీతో రోహిత్ తన స్థాయిని చూపిస్తే కోహ్లి ప్రశాంతంగా రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. 2015లో కోహ్లి, 2019లో రోహిత్ పాక్‌పై సెంచరీలతో చెలరేగారు. రాహుల్ కూడా తన విలువను ప్రదర్శిస్తుండగా, మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. పాండ్యా, జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనకు సిద్ధం కాగా, కుల్దీప్, సొంతగడ్డపై ఆడనున్న బుమ్రా బౌలింగ్‌ను పాక్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఎనిమిదో స్థానంలో శార్దుల్ ఠాకూర్‌ను తప్పించి అశ్విన్‌కు మళ్లీ అవకాశం ఇవ్వవచ్చు. అయితే రెండు సీజన్లుగా ఈ మైదానంలో ఉత్తమ రికార్డు ఉన్న షమీ కూడా పరిశీలనలో ఉన్నాడు. జోరు కొనసాగేనా... శ్రీలంక బౌలింగ్ బలమైనది కాకపోయినా సరే వరల్డ్‌కప్ మ్యాచ్‌లో 345 పరుగుల లక్ష్యఛేదన అంత సులువు కాదు. కానీ దీనిని సాధించడం కచ్చితంగా పాకిస్తాన్ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ మ్యాచ్‌కు ముందు నెదర్లాండ్స్‌తో తడబడిన తీరుతో పోలిస్తే ఆ జట్టు పరిస్థితి మారింది. హైదరాబాద్‌లో ఆడిన తుది జట్టునే పాక్ ఇక్కడా కొనసాగించవచ్చు. రిజ్వాన్ ఫామ్‌లో ఉండగా, అబ్దుల్లా షఫీక్ రూపంలో దూకుడైన ఓపెనర్ వెలుగులోకి రావడం సానుకూలాంశం. మిడిలార్డర్లో షకీల్, ఇఫ్తికార్ తమ వంతు పాత్ర పోషించగలరు. అయితే ఇమామ్ పేలవ ఆటతో పాటు జట్టు నంబర్‌వన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ విఫలం కావడమే టీమ్‌ను ఆందోళన పరుస్తోంది. గత ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి బాబర్ 71 పరుగులే చేశాడు. అతను తన స్థాయికి తగినట్లుగా ఆడితే జట్టుకు ప్రయోజనం కలుగుతుంది. బౌలింగ్‌లో ఇప్పటికీ ప్రధాన అస్త్రం షాహిన్ అఫ్రిదినే. తన పదునైన లెఫ్టార్మ్ పేస్‌తో ఆరంభ ఓవర్లలో అతను భారత బ్యాటర్లను నిలువరించాలని జట్టు కోరుకుంటోంది. ఆపై రవూఫ్ కూడా కీలకం కానున్నాడు. భారీగా పరుగులిచ్చే హసన్ అలీ స్థానంలో వసీమ్ ఆడే అవకాశం ఉంది. టీమ్‌లో ఒక ప్రధాన స్పిన్నర్ లేకపోవడం పాక్ జట్టు పెద్ద బలహీనత. షాదాబ్, నవాజ్‌లను భారత బ్యాటర్లు అలవోకగా ఎదుర్కోగలరు. పిచ్, వాతావరణం గత రెండేళ్లలో ఇక్కడ జరిగిన నాలుగు వన్డేల్లో 59.8 శాతం వికెట్లు తీసి పేసర్లు ఎక్కువ ప్రభావం చూపించారు. అయితే ఈ మ్యాచ్ కోసం నల్లరేగడి మట్టి ఉన్న పిచ్‌ను ఎంచుకున్నారు. అంటే పిచ్ నెమ్మదిగా మారిపోయి బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. ప్రేక్షకుల కోణంలో పరుగుల వరద కోసమే నిర్వాహకులు సిద్ధమైనట్లు అర్థమవుతోంది. వేడి వాతావరణం, వర్ష సూచన లేదు. మూడో స్పిన్నర్‌ను ఆడించే విషయంపై ఇప్పుడే చెప్పలేను. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం. తుది జట్టులో అవసరమైతే ఒకటి రెండు మార్పులు చేస్తాం. గత నాలుగేళ్లలో నేనేమీ పెద్దగా మారలేదు. బ్యాటర్‌గా చూస్తే ప్రతీ మ్యాచ్‌కు ముందు నా లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా. దాని వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సన్నద్ధతలో లోటు ఉండదు. ప్రతీ రోజు కొత్త సవాలే. అన్నింటికీ సిద్ధంగా ఉంటా. నా ఆటేంటో, జట్టుకు నా అవసరం ఏమిటో బాగా తెలుసు. కెప్టెన్‌గా ఈ మ్యాచ్ కోసం సహచరులకు ప్రత్యేక సూచనలేమీ చేయను. వరల్డ్‌కప్‌లో అన్ని మ్యాచ్‌లలాగే ఇదీ ఒకటి. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ సారథిగా నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. ఒక్క మ్యాచ్ వల్ల నాకు కెప్టెన్సీ రాలేదు. ఈ ఒక్క మ్యాచ్ వల్ల అది పోదు. దేవుడు ఎంత ఇస్తే అంతే దక్కుతుంది. భారీ సంఖ్యలో ఉన్న ప్రేక్షకుల మధ్య గతంలో ఎన్నోసార్లు ఆడాం కాబట్టి ఇదేమీ కొత్త కాదు. పాక్ అభిమానులను అనుమతిస్తే బాగుండేది. కానీ మద్దతు లేకపోయినా మేం దీనికి సిద్ధమయ్యే ఉన్నాం. చరిత్ర గురించి నేను పట్టించుకోను. రికార్డులు ఏదో ఒక రోజు బద్దలవుతాయి. 2021 టి20 ప్రపంచకప్‌లో మేం భారత్‌ను ఓడించాం. అంతకుముందు అదీ లేదు కదా. కాబట్టి దేనికైనా ఎక్కడో ఒక చోట ముగింపు తప్పదు. –బాబర్ ఆజమ్, పాకిస్తాన్ కెప్టెన్ తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్/ఇషాన్ కిషన్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యా, జడేజా, అశ్విన్/షమీ, బుమ్రా, కుల్దీప్, సిరాజ్. పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), షఫీక్, ఇమా మ్, రిజ్వాన్, షకీల్, ఇఫ్తికార్, షాదాబ్, నవాజ్, షాహిన్ అఫ్రిది, హసన్/వసీమ్, రవూఫ్. -
Asia Cup 2023, India vs. Pakistan: నేడే ‘ఆసియా’ అసలు సమరం
పల్లెకెలె: వన్డే ప్రపంచకప్‌కు ఇంకొన్ని రోజులే ఉంది. మెగా ఈవెంట్‌కు ముందు క్రికెట్ ప్రపంచం ఒళ్లంతా కళ్లు చేసుకునే కీలక మ్యాచ్ నేడు జరుగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు సై అంటే సై అనే పోరుకు ఆసియా కప్ వన్డే టోర్నీ వేదికైంది. నంబర్‌వన్ పాక్, ఆసియా కప్ ఫేవరెట్ భారత్ మధ్య జరగబోయే ఈ పోరు టోర్నీకే హైలైట్‌గా నిలవడం ఈపాటికే ఖాయమైంది. కేవలం వన్డే ఫార్మాట్‌నే చూసుకుంటే గత వన్డే ప్రపంచకప్ తర్వాత ఇరు జట్లు తలపడే 50 ఓవర్ల పోటీ ఇదే! గతేడాది జరిగిన టి20 వరల్డ్‌కప్‌లో విరాట్ అద్భుత ప్రదర్శన తర్వాత ఇరు జట్లు ఇప్పుడు తలపడుతున్నాయి. మెల్బోర్న్ తరహాలో లంక గడ్డపై కూడా మరో హోరాహోరీ ఖాయం. కొత్త ఉత్సాహంతో రోహిత్ బృందం గత కొన్నాళ్లుగా స్వదేశంలో జరిగే ప్రపంచకప్ కోసం భారత్ చాలా ప్రయోగాలు చేసింది. రాహుల్, అయ్యర్, బుమ్రావంటి కీలక ఆటగాళ్ల గాయాల నేపథ్యంలో భారత టీమ్ మేనేజ్మెంట్ తగిన జాగ్రత్తలు తీసుకొని సీనియర్లు రోహిత్, కోహ్లిలకు బాగా విశ్రాంతినిస్తూ కాపాడుకుంటూ వచ్చింది. ఇక సమయం, సందర్భం రావడంతో టీమిండియా తురుపుముక్కలు బరిలోకి దిగుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కచ్చితంగా ‘ప్రి ప్రపంచకప్’ పోటీనే! ఇందులో ఏ సందేహం లేదు. దాదాపు వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగే జట్టును ఖాయం చేసేందుకు ఈ ఆసియా టోర్నీని జట్టు వాడుకుంటోంది. రోహిత్, కోహ్లిల ఫిట్నెస్, జట్టులోకి అనుభవజు్ఞడైన ఆల్‌రౌండర్ జడేజా పునరాగమనం, మరో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బౌలింగ్ దళపతి బుమ్రా, ‘హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్’ సిరాజ్ ఇలా చెప్పుకుంటూ పోతే భారత్ పూర్తి స్థాయి ప్రపంచకప్ సైన్యంతో రంగంలోకి దిగుతోంది. దీన్నిబట్టి చూస్తే పాక్ పనిపట్టేందుకు, ఆసియా కప్‌లో ఓడించేందుకు రోహిత్ సేనకు ఏమంత కష్టం కానేకాదు. పుంజుకున్న బలంతో పాక్ కొంత కాలంగా ఇంటాబయటా నిలకడైన విజయాలు, గట్టి ప్రత్యర్థులను ఓడించిన తీరుతో బాబర్ ఆజమ్ సేన మునుపటి కంటే పుంజుకుంది. బ్యాటింగ్‌లో ఫఖర్–ఇమామ్ ఓపెనింగ్ జోడీ నుంచి ఏడో నంబర్ షాదాబ్ ఖాన్ వరకు బ్యాటింగ్ చేసే సత్తా పాకిస్తాన్ పటిష్టంగా నిలుపుతోంది. బౌలింగ్‌లో పేస్ త్రయం షాహిన్ అఫ్రిది, నసీమ్ షా, రవూఫ్ ఆరంభంలో వికెట్లు పడగొట్టడంతో సఫలమవుతున్నారు. స్పిన్‌లో షాదాబ్, నవాజ్ సత్తా చాటుతుండటంతో పాకిస్తాన్ భారత్‌కు దీటుగా ఉంది. నంబర్‌వన్ హోదా అదనపు స్థైర్యాన్ని తెచ్చిపెట్టగా... రెట్టించిన ఉత్సాహంతో ప్రత్యర్థిని ఢీకొనేందుకు రెడీగా ఉంది. గత ఐదు వన్డేల్లో... భారత్, పాక్‌లు తలపడిన గత ఐదు వన్డేల్లో టీమిండియాదే 4–1తో పైచేయిగా ఉంది. 2017 చాంపియన్స్‌ట్రోఫీలో లీగ్ దశలో గెలిచి తుదిపోరులో భారత్ ఓడింది. 2018 ఆసియాకప్‌లో రెండుసార్లు టీమిండియా గెలిచింది. చివరిసారిగా గత వన్డే ప్రపంచకప్(2019)లోనూ భారత్‌దే గెలుపు. పిచ్–వాతావరణం ఇది కొత్త పిచ్. పక్కాగా దీనికే అనుకూలమని చెప్పలేం. లంక, బంగ్లా మధ్య జరిగినట్లే సీమర్లు, స్పిన్నర్లకు చక్కని చాన్స్! అయితే మ్యాచ్‌కు వాన ముప్పు పొంచివుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాన కురిసే అవకాశముండటంతో మ్యాచ్ మొదలయ్యేందుకు ఆలస్యం కావొచ్చు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్ ), శుబ్‌మన్, కోహ్లి, అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జడేజా, శార్దుల్ /షమీ, కుల్దీప్, సిరాజ్, బుమ్రా. పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్ ), ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, రిజ్వాన్, ఆగా సల్మాన్, ఇఫ్తికార్, షాదాబ్‌ఖాన్, నవాజ్, షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా, రవూఫ్. -
‘వయాకామ్ 18’ చేతికి భారత క్రికెట్
మనం ఇంట్లో కూర్చున్నా... షాపుల్లో టీవీ ఆన్ చేసినా... టీమిండియా క్రికెట్ మ్యాచ్‌లు చూడాలంటే టీవీ రిమోట్‌తో ట్యూన్ చేసుకునేది స్టార్ స్పోర్ట్స్ చానెళ్లనే! అంతగా భారత్‌లో స్టార్ నెట్వర్క్ క్రికెట్ ప్రియుల మదిలో 11 ఏళ్లుగా (2012 నుంచి) తిష్ట వేసుకుంది. అయితే ఇప్పుడీ ట్రెండ్ మారనుంది. రిమోట్ తీసుకొని వయాకామ్ 18 నెట్వర్క్ చానెల్ ‘స్పోర్ట్స్ 18’కు మారాల్సిందే! న్యూఢిల్లీ: భారతీయ కార్పొరేట్ దిగ్గజ సంస్థ రిలయన్స్ గ్రూప్ క్రికెట్ హక్కుల్ని కైవసం చేసుకొంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం నిర్వహించిన ఇ–వేలం (ఆన్లైన్)లో స్వదేశంలో జరిగే అంతర్జాతీయ, జాతీయ మ్యాచ్‌ల్ని ప్రత్యక్ష ప్రసారం చేసుకొనే మీడియా హక్కుల్ని ‘వయాకామ్ 18’ దక్కించుకుంది. 2023–28 ఈ ఐదేళ్ల కాలానికి గాను సుమారు రూ. 6,000 కోట్లు చెల్లించేందుకు బిడ్ గెలిచింది. డిస్నీప్లస్ స్టార్, సోనీ నెట్‌వర్క్‌లతో ముక్కోణపు పోటీలో పాల్గొన్న వయాకామ్ 18... టీవీ, డిజిటల్ రైట్స్ కోసం అత్యధికంగా రూ.5,963 కోట్లు (720.60 మిలియన్ డాలర్లు)తో బిడ్ దాఖలు చేసింది. దీంతో పోటీ ప్రసార సంస్థలకు రిలయన్స్ చేతిలో చుక్కెదురైంది. ♦ మీడియా రైట్స్‌లో టెలివిజన్, డిజిటల్ (ఓటీటీ యాప్స్) హక్కులున్నాయి. ఈ రెండింటి కోసం వేర్వేరు బిడ్లను స్వీకరించారు. టీవీ హక్కులకు రూ.2,862 కోట్లు (345.90 మిలియన్ డాలర్లు), డిజిటల్ హక్కులకు రూ.3,101 కోట్లు (374.70 మిలియన్ డాలర్లు) చెల్లించేందుకు వయాకామ్ 18 బిడ్లు వేసింది. ♦ గత 2018–23 కాలానికి ‘స్టార్ నెట్వర్క్’ రూ. 6,138 కోట్లు చెల్లించింది. అయితే గత ఐదేళ్లలో సొంతగడ్డపై భారత్ 102 మ్యాచ్‌లు ఆడింది. కానీ వచ్చే ఐదేళ్లలో 88 మ్యాచ్‌లే ఆడబోతోంది. ♦ గత మీడియా హక్కులతో పోలిస్తే ఇది 12.92 శాతం ఎక్కువ. అప్పుడు మ్యాచ్‌కు రూ. 60 కోట్లు చెల్లించారు. ఇకపై మ్యాచ్‌కు రూ.67.75 కోట్లు చెల్లించాలి. ♦ క్రితంసారి మూడు విభాగాల్లో బిడ్లను స్వీకరించారు. భారత ఉపఖండపు టీవీ రైట్స్–రెస్టాఫ్ వరల్డ్ డిజిటల్ రైట్స్, భారత ఉపఖండపు డిజిటల్ రైట్స్, గ్లోబల్ కన్సాలిడేటెడ్ రైట్స్‌గా వర్గీకరించారు. కానీ ఇప్పుడు అవుట్ రైట్‌గా టీవీ రైట్స్, డిజిటల్ రైట్స్ అని రెండు రకాల గ్లోబల్ రైట్స్‌ను అందుబాటులోకి తెచ్చారు! ♦ ఈ నెల 22 నుంచి భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే సిరీస్‌తో 2023–28 సైకిల్ మొదలవుతుంది. ♦ ఈ ఐదేళ్ల సైకిల్లో టీమిండియా 25 టెస్టులు, 27 వన్డేలు, 36 టి20లు కలిపి మొత్తంగా 88 మ్యాచ్‌లు ఆడనుంది. ఆస్ట్రేలియాతో 21 మ్యాచ్‌లు, ఇంగ్లండ్‌తో 18 మ్యాచ్‌లు, కివీస్‌తో 11 మ్యాచ్‌లు, దక్షిణాఫ్రికాతో 10 మ్యాచ్‌ల్లో తలపడుతుంది. ♦ ‘వయాకామ్ 18’కు స్పోర్ట్స్ హక్కులు కొత్తేం కాదు. ఇంతకుముందే ఐపీఎల్ డిజిటల్ హక్కుల్ని పొందింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్), పారిస్ ఒలింపిక్స్, దక్షిణాఫ్రికా మ్యాచ్ లు, దక్షిణాఫ్రికా లీగ్, టి10 లీగ్ (అమెరికా), రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్, ఎన్బీఏ, డైమండ్ లీగ్ తదితర ప్రపంచవ్యాప్త క్రీడల హక్కుల్ని కైవసం చేసుకుంది. ♦ ‘వయాకామ్ 18’ మీడియాలోని స్పోర్ట్స్ 18 టీవీ చానెల్లో, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి జియో సినిమా యాప్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ప్రసారం అవుతాయి. ‘స్టార్ స్పోర్ట్స్’కు శుభం కార్డు! రిలయన్స్ గ్రూప్ మీడియా హక్కులు దక్కించుకోవడంతో ‘స్టార్ స్పోర్ట్స్’కు శుభం కార్డు పడినట్లయింది. 2012 నుంచి ఇప్పటివరకు అంటే 11 ఏళ్లుగా భారత్‌లో జరిగిన అంతర్జాతీయ, జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు డిస్నీ ప్లస్ స్టార్ నెట్‌వర్క్‌లోనే ప్రసారమయ్యాయి. ఐపీఎల్ మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కులు మాత్రం ‘స్టార్ స్పోర్ట్స్’ వద్దే ఉన్నాయి. -
‘ఆసియా’ పోరుకు రంగం సిద్దం
ముల్తాన్: ప్రపంచ కప్ పోరుకు ముందు మరో ప్రధాన టోర్నీకి రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే ప్రతిష్టాత్మక ఆసియా కప్ సమరంలో ఆరు జట్లు తమ సత్తాను పరీక్షించుకోనున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు వరల్డ్ కప్‌కు ముందు ఇది ట్రయల్‌గా ఉపయోగపడనుండగా... వరల్డ్ కప్ బరిలో లేని నేపాల్ ఆరో టీమ్‌గా తన ఉనికిని ప్రదర్శించే ప్రయత్నం చేయ నుంది. అన్నీ జట్లూ సహజంగానే టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా... ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే సమరాలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. కనీసం రెండు సార్లు ఇరు జట్లు తలపడే అవకాశం ఉండగా, ఫైనల్ చేరితే మరోసారి దాయాదుల మధ్య పోరును చూడవచ్చు. నేడు సొంతగడ్డపై జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టు రోహిత్ కుమార్ సారథ్యంలోని నేపాల్‌తో తలపడుతుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న కొలంబోలో జరుగుతుంది. ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచే రెండేసి జట్లు ముందంజ వేస్తాయి. సూపర్–4 దశలో మిగిలిన మూడు టీమ్‌లను ఎదుర్కొన్న తర్వాత టాప్–2 టీమ్‌లు ఫైనల్లో తలపడతాయి. ఫేవరెట్‌గా రోహిత్ బృందం... ఏడాది క్రితం కూడా యూఏఈలో ఆసియా కప్ జరగ్గా అప్పుడు రాబోయే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని టి20 ఫార్మాట్లో నిర్వహించారు. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్‌కు సరిగ్గా నెల రోజుల ముందు వన్డే ఫార్మాట్లో ఈ టోర్నమెంట్ జరగబోతోంది. అన్ని రకాలుగా పటిష్టంగా ఉన్న భారత్ సహజంగానే ఫేవరెట్‌గా కనిపిస్తుండగా... వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగుతోంది. భారత్ తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 2న క్యాండీలో పాకిస్తాన్ జట్టుతో ఆడుతుంది. అనంతరం సెప్టెంబర్ 4న నేపాల్‌తో రెండో మ్యాచ్‌లో తలపడుతుంది. భారత జట్టు ఇటీవల ప్రదర్శన, వ్యక్తిగతంగా ఆటగాళ్ల రికార్డులు, టీమ్ కూర్పును బట్టి చూస్తే భారత్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా గట్టి పోటీనిచ్చే స్థితిలో ఉండగా, అఫ్గానిస్తాన్ కూడా సంచలనాలు ఆశిస్తోంది. అధికారికంగా ఆసియా కప్ నిర్వహణ హక్కులు పాకిస్తాన్ బోర్డుకే ఉన్నాయి. అయితే పాకిస్తాన్‌కు వెళ్లేందుకు భారత్ అంగీకరించకపోవడంతో హైబ్రీడ్ మోడల్లో టోర్నీని నిర్వహిస్తున్నారు. మొత్తం 13 మ్యాచ్‌లలో 4 మాత్రమే పాకిస్తాన్లో జరుగుతుండగా, శ్రీలంక 9 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. శ్రీలంకలో జరిగే మ్యాచ్‌లకు వాన కొంత అంతరాయం కలిగించే అవకాశం ఉంది. -
'వరల్డ్‌కప్‌కు ముందు ఆసియా కప్ కొట్టండి'.. ప్రోమో అదిరింది
ఆసియాకప్ 2023కి సంబంధించిన హక్కులను బ్రాడ్కాస్ట్ సంస్థ స్టార్‌స్పోర్ట్స్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌కు సంబంధించిన ప్రోమోను శుక్రవారం తన ట్విటర్లో రిలీజ్ చేసింది. ''ఈ ఏడాది చివర్లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్ కొట్టడానికి ముందు ఆసియా కప్ కొట్టండి.. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొండి'' అంటూ టీమిండియాను ఎంకరేజ్ చేస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చిన మాటలు ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఆసియా కప్‌లో పాల్గొననున్న ఆరు జట్లను చూపిస్తూ ప్రోమో కొనసాగుతుంది. చివరగా చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య ఆసక్తికరపోరు ఖాయమని చెబుతూ 31 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 17 వరకు ఉపఖండపు దేశాల మధ్య పోరు రంజుగా ఉంటుంది.. అంటూ ముగించింది. స్టార్‌స్పోర్ట్స్ రిలీజ్ చేసిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. All eyes on Asia as we gear up for an ultimate showdown in the #AsiaCup2023! Join #TeamIndia's exhilarating journey as they intend to conquer first the Asia Cup & then the World Cup #AajAsiaKalDuniya Watch Asia Cup LIVE from Aug 31-Sep 17, only on Star Sports Network pic.twitter.com/b1tcPlZ6dn — Star Sports (@StarSportsIndia) June 17, 2023 ఇక ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు.పాకిస్తాన్లో 4 మ్యాచ్‌లు... శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా (మూడు జట్లు చొప్పున) విభజించారు. ఒక గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్, నేపాల్... మరో గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లున్నాయి. గ్రూప్ దశ తర్వాత రెండు గ్రూప్‌ల నుంచి రెండేసి జట్లు ‘సూపర్ ఫోర్’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్ ఫోర్’ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. పాకిస్తాన్‌లోని నాలుగు మ్యాచ్‌లకు లాహోర్ వేదికగా నిలుస్తుంది. శ్రీలంకలో క్యాండీ, పల్లెకెలెలో మ్యాచ్‌లు ఉంటాయి. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండటంతో ఈసారి ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్నారు. అయితే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తారు. గత ఏడాది టి20 వరల్డ్‌కప్ జరగడంతో ఆసియా కప్ టోర్నీని టి20 ఫార్మాట్లో నిర్వహించగా... ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది. చదవండి: 'వరల్డ్‌కప్ ఆడతామో లేదో'.. పూటకో మాట మారిస్తే ఎలా? ఎట్టకేలకు ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదల -
వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్స్ ఇంగ్లాండ్ లో ఎందుకు వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్స్ ఇంగ్లాండ్ లో ఎందుకు వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్స్ ఇంగ్లాండ్ లో ఎందుకు
-
WTC Final 2023:‘టెస్టు’ కిరీటం కోసం...
సరిగ్గా రెండేళ్ల క్రితం... భారత జట్టు తొలి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరింది. 2019–21 మధ్య 12 టెస్టుల్లో విజయాలు సాధించి అద్భుత ఫామ్‌తో తుది పోరుకు అర్హత సాధించింది. అయితే అసలు సమరంలో చతికిలపడి రన్నరప్‌గా సంతృప్తి చెందింది. మరోవైపు ఆ్రస్టేలియా జట్టు న్యూజిలాండ్కంటే ఒక మ్యాచ్ ఎక్కువే గెలిచినా... స్లో ఓవర్ రేట్ కారణంగా నాలుగు పాయింట్లు కోల్పోయి దురదృష్టవశాత్తూ ఫైనల్ అవకాశాలు చేజార్చుకొని తీవ్ర నిరాశకు గురైంది. ఇప్పుడు ఇరు జట్లకు తొలిసారి చాంపియన్‌గా నిలిచేందుకు మరో అవకాశం వచ్చింది. ఇటీవలే ఇరు జట్లు నాలుగు టెస్టుల సిరీస్‌లో తలపడిన నేపథ్యంలో దానికి కొనసాగింపుగా అన్నట్లు మరో టెస్టు వచ్చేసింది. తటస్థ వేదికలో జరిగే హోరాహోరీ పోరులో ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తికరం. లండన్: రోహిత్, కోహ్లి, అశ్విన్... భారత ప్రపంచకప్ విజయాల్లో భాగస్వాములు... స్మిత్, వార్నర్, స్టార్క్ కూడా అదే తరహాలో ఆసీస్ విశ్వ విజేతగా నిలిచిన జట్టులో సభ్యులు... వీరంతా పరిమిత ఓవర్ల టోరీ్నలో మాత్రమే కాకుండా టెస్టుల్లోనూ వరల్డ్ చాంపియన్‌గా నిలవాలని కోరుకుంటున్న సీనియర్ ఆటగాళ్లు... పుజారా, రహానే, లయన్, ఖ్వాజా తమ టెస్టు టీమ్‌ల తరఫున చిరస్మరణీయ ప్రదర్శనలు చేసినా ఇంకా విశ్వ విజేత టీమ్ సభ్యులు అనిపించుకోని ఆటగాళ్లు... కెరీర్లో కనీసం 50కి పైగా టెస్టులు ఆడి, 33 ఏళ్లు దాటిన వీరందరికి టెస్టు క్రికెట్లో అత్యుత్తమ వేదికపై సత్తా చాటేందుకు చివరి అవకాశం. గత రెండేళ్లుగా ప్రపంచ టెస్టు క్రికెట్లో ఆధిపత్యం ప్రదర్శించిన రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య అతి పెద్ద సమరానికి రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్, ఆ్రస్టేలియా తలపడనున్నాయి. గత ఫైనల్ సౌతాంప్టన్‌లో జరగ్గా, ఈసారి ఓవల్ మైదానం తుది పోరుకు వేదికైంది. ఇందులో విజేతగా నిలిచే జట్టుకు తొలిసారి డబ్ల్యూటీసీ టైటిల్ దక్కుతుంది. బలాబలాల్లో సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయం. కెపె్టన్లు రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్‌లకు ఇది 50వ టెస్టు కావడం విశేషం. ఫైనల్ ‘డ్రా’ అయితే... వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ విజేత జట్టుకు వెండి గదతోపాటు 16 లక్షల డాలర్లు (రూ. 13 కోట్ల 20 లక్షలు), రన్నరప్ జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ. 6 కోట్ల 60 లక్షలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. ఒకవేళ ఫైనల్ ‘డ్రా’గా ముగిస్తే రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, పుజారా, కోహ్లి, రహానే, జడేజా, భరత్/ఇషాన్‌కిషన్, అశ్విన్/శార్దుల్, షమీ, సిరాజ్, ఉమేశ్. ఆ్రస్టేలియా: కమిన్స్ (కెప్టెన్), వార్నర్, ఖ్వాజా, లబుషేన్, స్మిత్, హెడ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, లయన్, బోలండ్. పిచ్, వాతావరణం సాధారణగా పిచ్‌పై మంచి బౌన్స్ ఉంటుంది. అది పేసర్లకు అనుకూలం కాగా, మంచి షాట్లకు కూడా అవకాశం ఉంటుంది. స్వింగ్ ప్రభావం తక్కువ. నిలదొక్కుకుంటే బ్యాటర్లు చక్కగా పరుగులు రాబట్టవచ్చు. అయితే జూన్ నెలలో తొలిసారి టెస్టు జరుగుతుండటంతో ఎవరికీ పిచ్‌పై పూర్తి స్పష్టత లేదు. వర్షం ఇబ్బంది కలిగించకపోవచ్చు. రిజర్వ్ డే కూడా ఉంది. 14 ఓవల్ మైదానంలో భారత జట్టు ఇప్పటి వరకు 14 టెస్టులు ఆడింది. 2 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఐదింటిలో ఓడిపోయింది. 7 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. 38 ఓవల్ మైదానంలో ఆ్రస్టేలియా జట్టు ఇప్పటి వరకు 38 టెస్టులు ఆడింది. 7 మ్యాచ్‌ల్లో నెగ్గింది. 17 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 14 మ్యాచ్‌లను ‘డ్రా’గా ముగించింది. 106 భారత్, ఆస్ట్రేలియా మధ్య ఓవరాల్‌గా 106 టెస్టులు జరిగాయి. 44 టెస్టుల్లో ఆ్రస్టేలియా... 32 టెస్టుల్లో భారత్ గెలుపొందాయి. ఒక టెస్టు ‘టై’గా ముగియగా... 29 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. -
రాజస్తాన్ కెప్టెన్ చాహల్.. మరి శాంసన్ ఎవరు భయ్యా? వీడియో వైరల్
ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ ఆశలను రాజస్తాన్ రాయల్స్ సజీవంగా నిలుపుకుంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన రాజస్తాన్.. ముంబైను వెనుక్కి నెట్టి ఐదో స్థానానికి చేరుకుంది. రాజస్తాన్ ప్లే ఆఫ్స్ భవితవ్యం ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌పై ఆధారపడి ఉంది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. రాజస్తాన్, పంజాబ్ మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ భారీ తప్పిదం చేసింది. టాస్ సమయంలో సంజూ శాంసన్ మాట్లాడుతున్నప్పుడు.. రాజస్తాన్ కెప్టెన్‌గా శాంసన్ పేరుగా బదులుగా యుజ్వేంద్ర చాహల్ పేరును కెప్టెన్‌గా ప్రదర్శించారు. 'యుజ్వేంద్ర చాహల్, రాజస్తాన్ కెప్టెన్' అని బోర్డులో కనిపించింది. కాగా టాస్ ముగిసిన కొద్దిసేపటికే ఈ తప్పిదంపై రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంజైజీ ఫన్నీగా స్పందించింది. చాహల్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "రాజస్తాన్ కొత్త కెప్టెన్ యుజ్వేంద్ర చాహల్ అంటూ" క్యాప్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్టార్‌స్పోర్ట్స్‌ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. రాజస్తాన్ కెప్టెన్ చాహల్ అయితే, మరి శాంసన్ ఎవరు? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో సంజూ, చాహల్ ఇద్దరూ నిరాశపరిచారు. శాంసన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరగా.. చాహల్ తన నాలుగు ఓవర్ల కోటాలో వికెట్ ఏమీ తీయకుండా 40 పరుగులు సమర్పించుకున్నాడు. చదవండి: అదే మా కొంపముంచింది.. చాలా విషయాలు నేర్చుకున్నాం! అందుకే అలా చేశా: ధావన్ 🚨 Toss Update 🚨@rajasthanroyals win the toss and elect to field first against @PunjabKingsIPL. Follow the match ▶️ https://t.co/3cqivbD81R #TATAIPL | #PBKSvRR pic.twitter.com/7j2KjpH0yr — IndianPremierLeague (@IPL) May 19, 2023 -
క్రేజ్ మాములుగా లేదు.. యాడ్ వేయలేని పరిస్థితి!
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి ఫినిషర్ పాత్రను సమర్థంగా పోషించాడు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. 9 బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 20 పరుగుల ధనాదన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ధోని ఆ 20 పరుగులు చేయకుంటే సీఎస్కే ఇన్నింగ్స్ 140 వద్దే ఆగిపోయోదేమే. మాములుగానే ఈ సీజన్లో ధోనికున్న క్రేజ్ చూస్తే మతిపోతుంది. కేవలం అతని బ్యాటింగ్ చూడడం కోసమే అభిమానులు స్టేడియానికి పోటెత్తుతున్నారు. మహీ ఒక్క బంతి ఆడినా చాలు అన్నట్లుగా పరితపించిపోతున్నారు. తాజాగా చెపాక్ స్టేడియంలో మరోసారి అది నిరూపితమైంది. రాయుడు ఔట్ కాగానే ధోని ఎంటరవుతున్న సమయంలో స్టేడియం మొత్తం ధోని అరుపులతో దద్దరిల్లింది. ఇంకో విచిత్రమేంటంటే.. ఒక బ్యాటర్ ఔట్ అవడం లేదా ఓవర్ పూర్తవ్వగానే స్టార్‌స్పోర్ట్స్ యాడ్స్ వేయడం చూస్తుంటాం. కానీ ధోనికున్న క్రేజ్ స్టార్‌స్పోర్ట్స్ యాడ్ వేయలేని పరిస్థితి ఏర్పడింది. కేవలం ధోని కోసం కోట్ల రూపాయల యాడ్‌ను వదులుకుంది. అది ధోనికున్న క్రేజ్. ఇక ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జియో సినిమాలో వీక్షకుల సంఖ్య 1.8 కోట్లు దాటడం విశేషం. నిజంగా ఇది సరికొత్త రికార్డు అని చెప్పొచ్చు. ఇంతకముందు 1.7 కోట్లు అత్యధికం కాగా.. తాజాగా ఆ రికార్డు కూడా బద్దలయ్యింది. Star sports didn't telecast the Ad during MS Dhoni's Entry . pic.twitter.com/0LSCYj0cHh — MAHIYANK ™ (@Mahiyank_78) May 10, 2023 JioCinema viewership peaked at 1.8cr tonight when MS Dhoni was batting. Simply irreplaceable...!! pic.twitter.com/2llDNMsJGs — Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2023 #MSDhoni is out to collect a ton of #Yellove for his explosive batting 🔥 💛#CSKvDC #ThalaDhoni #IPLonJioCinema #IPL2023 #TATAIPL #WhistlePodu |@ChennaiIPL @msdhoni pic.twitter.com/z9nAtWduku — JioCinema (@JioCinema) May 10, 2023 చదవండి: నువ్వు ఆడకపోతివి.. ఆడేటోడిని రనౌట్ జేస్తివి!' -
కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతున్నారు..!
ముంబై: ఐపీఎల్‌కున్న క్రేజ్ ఏటికేడు పెరిగిపోతోంది. లీగ్‌పై కన్నేసే ప్రేక్షకులు అంతకంతకూ పెరిగిపోతున్నారు. స్టార్ స్పోర్ట్స్ చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్న మ్యాచ్‌ల్ని చూసేందుకు కోట్ల మంది టీవీలకు అతక్కుపోతున్నారు. ఈ సీజన్లో తొలి 38 మ్యాచ్‌లకుగాను 26 మ్యాచ్‌లని కనీసం 3 కోట్ల మందికి పైగా చూశారు. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్, మాజీ చాంపియన్ చెన్నైల మధ్య ప్రారంభ పోరునైతే ఏకంగా 5.60 కోట్ల మంది వీక్షించినట్లు స్టార్ స్పోర్ట్స్ గణాంకాల ద్వారా తెలిసింది. ధోని, కోహ్లిలు బరిలోకి దిగిన చెన్నై–బెంగళూరు, చెన్నై–కోల్‌కతా, చెన్నై–లక్నోల మధ్య జరిగిన మ్యాచ్‌లకు 5 కోట్ల మంది పైచిలుకు తిలకించారు. అయితే ఇవీ కేవలం టీవీ ప్రేక్షకులకు సంబంధించిన గణాంకాలే! ఎందుకంటే ‘జియో సినిమా’ యాప్‌లో చూసిన వారిని కలుపుకొంటే ఈ సంఖ్య ఇంకెన్ని కోట్లకు చేరుతుందో! -
ట్రాక్‌లో పడాలంటే ఆలు పరోటాలు చేయాల్సిందేనా!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా శుక్రవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 56 పరుగులు తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 258 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని చేధించే క్రమంలో పంజాబ్ పోరాటం 201 పరుగుల వద్ద ముగిసింది. అయితే పంజాబ్ తరపున 33 బంతుల్లో 66 పరుగులు చేసిన అథర్వ తైదే మాత్రం ఆకట్టుకున్నాడు. ఇక ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలి ఎడిషన్ నుంచి ఉన్న పంజాబ్ కింగ్స్(కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) టైటిల్ కోరిక మాత్రం నెరవేరలేదు. మరి ఈసారైనా పంజాబ్ కింగ్స్ టైటిల్ కొట్టి ప్రీతి జింటా కోరిక నెరవేరుస్తుందేమో చూడాలి. తాజాగా స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రీతి గతంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పింది. తమ జట్టు ప్లేయర్ల కోసం 120 పరోటాలు చేసినట్లు గుర్తు చేసింది. స్టార్ స్పోర్ట్స్ యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. అబ్బాయిలు ఇంతలా తినంటారన్న విషయం తనకు అప్పుడే తెలిసిందని పేర్కొంది. 2009లో ఐపీఎల్ సౌతాఫ్రికాలో జరిగింది. అక్కడ తమ ప్లేయర్లకు మంచి పరోటాలు దొరకలేదని, పరోటాలు చేయడం మీకు నేర్పిస్తానని ప్రీతి అన్నారు. అయితే తమకు ఆలూ పరోటాలు కావాలని ప్లేయర్లు అడిగారని, వచ్చే మ్యాచ్ గెలిస్తే పరోటాలు చేసి ఇస్తానని ప్రీతి హామీ ఇచ్చింది. ఇక పంజాబీ జట్టు ఆ మ్యాచ్‌ను నెగ్గింది. దీంతో ప్రీతి స్వయంగా 120 పరోటాలు చేసిన ప్లేయర్లకు ఇచ్చింది. ప్రీతి ఇచ్చిన సమాధానం విన్న హర్భజన్.. ఇర్ఫాన్ పఠాన్ ఒక్కడే 20 పరోటాలు తిన్నట్లు చెప్పాడు. చివర్లో మా జట్టు ట్రాక్‌లో పడాలంటే మళ్లీ ఆలు పరోటాలు చేయాలేమో అని ప్రీతి జింటా అనడంతో నవ్వులు విరపూశాయి. 🚨 Star Sports Exclusive 🚨 Throwback to when @realpreityzinta discovered that her @PunjabKingsIPL side have an appetite for more than just winning! 🤣 Tune-in to #PBKSvLSG at #IPLonStar Today | Pre-show at 6:30 PM & LIVE action at 7:30 PM | Star Sports Network#BetterTogether pic.twitter.com/XpeYglFUSf — Star Sports (@StarSportsIndia) April 28, 2023 చదవండి: పంజాబ్ ఓడినా తాను గెలిచాడు.. ఎవరీ అథర్వ తైదే? -
‘పదహారేళ్ల’ పండుగ... ఐపీఎల్‌కు మోగిన విజిల్
ధోని చెన్నైలో ఆఖరిసారిగా ఆడి ఇక గుడ్‌బై చెబుతాడా? ఎన్నో రికార్డులు అందుకున్నా ఇంకా చెంత చేరని ఐపీఎల్ ట్రోఫీని ఈ సారైనా కోహ్లి టచ్ చేయగలడా? ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన తర్వాత గత ఏడాది అనూహ్యంగా ఆఖరి స్థానానికి పరిమితమైన ముంబైని ఈసారి రోహిత్ ఎంతవరకు తీసుకెళ్లగలడు? వరుసగా రెండో ఏడాది గుజరాత్ సత్తా చాటగలదా? పదిహేనేళ్లు ఆడినా టైటిల్ అందని ద్రాక్షగానే ఉన్న ఉత్తరాది టీమ్‌ల ఢిల్లీ, పంజాబ్ టీమ్‌ల అదృష్టం ఎలా ఉంటుంది? రేసులో మిగిలిన నాలుగు జట్లు హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, రాజస్తాన్‌లు ఏమాత్రం పోటీనివ్వగలవు? ఈ అన్నింటికి సమాధానం అందించే ధనాధన్ పండుగకు మళ్లీ రంగం సిద్ధమైంది. వేసవి వినోదంలో ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడా సంబరంగా నిలిచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్ 16వ సీజన్ వచ్చేసింది. క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న లీగ్–2023కి నేడు అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్‌తో తెర లేవనుంది. అహ్మదాబాద్: ఐపీఎల్ కొత్త సీజన్‌కు విజిల్ మోగింది. మే 28 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. అన్నింటికి మించి 2019 తర్వాత అన్ని జట్లకూ సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తోంది. కరోనా కారణంగా గత మూడు సీజన్ల పాటు వేదికల విషయంలో షరతుల కారణంగా అందరికీ తమ సొంత మైదానాల్లో ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు భారీ స్థాయిలో, స్థానిక అభిమానుల మద్దతుతో పది జట్లూ హంగామాకు సిద్ధమయ్యాయి. మారిన ఆటగాళ్లు, నిబంధనల్లో స్వల్ప మార్పులతో పదహారో సీజన్ లీగ్ కాస్త కొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జాతీయ జట్లకు ఆడుతున్న కారణంగా దక్షిణాఫ్రికా, శ్రీలంకలకు చెందిన ఆటగాళ్లు కాస్త ఆలస్యంగా తమ ఐపీఎల్ టీమ్‌లతో చేరతారు. గురువారం అహ్మదాబాద్‌లో ఐపీఎల్ ట్రోఫీతో అన్ని జట్ల కెప్టెన్ల ఫొటో సెషన్ నిర్వహించారు. అస్వస్థత కారణంగా ఈ కార్యక్రమానికి ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ హాజరుకాలేదు. కొన్ని మార్పులు... ‘ఇంపాక్ట్ ప్లేయర్’ పేరుతో కొత్త నిబంధనను లీగ్ కౌన్సిల్ తీసుకొచ్చింది. దీని ప్రకారం తాము ముందుగా ప్రకటించిన నలుగురు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లలో ఒకరిని మ్యాచ్ మధ్యలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగవచ్చు. అంటే బ్యాటింగ్ ఒకరు చేసిన తర్వాత అతని స్థానంలో తర్వాతి ఇన్నింగ్స్‌లో మరో బౌలర్‌ను తీసుకునే అవకాశం జట్టుకు ఉంది. అంటే పరిస్థితులను బట్టి ప్లేయర్‌ను మార్చుకునే ఈ సౌకర్యం జట్టుకు అదనపు ప్రయోజనాన్ని ఇస్తుంది. టాస్ తర్వాత తుది జట్టును ప్రకటించడం కూడా తొలిసారి అమలు చేస్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా టి20 లీగ్‌లో దీనిని వాడారు. అంటే టాస్ గెలిస్తే ఒక రకమైన టీమ్, టాస్ ఓడితే మరో రకమైన టీమ్‌తో సిద్ధమై కెప్టెన్ టాస్కు వెళ్లవచ్చు. అలాగే మహిళల ప్రీమియర్ లీగ్ తరహాలో వైడ్లు, నోబాల్స్ కోసం కూడా డీఆర్ఎస్ను వాడుకోవచ్చు. ఫార్మాట్ ఇలా... లీగ్ దశలో ప్రతీ టీమ్ 14 మ్యాచ్‌లు ఆడుతుంది. అయితే పది జట్లు ఉండటంతో గత ఏడాదిలాగే కాస్త భిన్నమైన ఫార్మాట్‌ను అమలు చేస్తున్నారు. 10 టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతీ టీమ్‌లో తమ గ్రూప్‌లోని మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున... మరో గ్రూప్‌లోనే ఐదు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’ లో ముంబై, కోల్‌కతా, రాజస్తాన్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. ఉదాహరణకు ముంబై తమ గ్రూప్‌లోనే కోల్‌కతా, రాజస్తాన్, ఢిల్లీ, లక్నోలతో ఒకేసారి తలపడుతుంది. గ్రూప్ ‘బి’లో ఉన్న చెన్నై, బెంగళూరు, గుజరాత్, పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లను రెండేసి సార్లు ఎదుర్కొంటుంది. అయితే ఎలా ఆడినా ప్రతీ టీమ్‌కు సొంతగడ్డపై 7 మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తోంది. డిజిటల్ మీడియా మారింది... గత సీజన్ వరకు మొబైల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు స్టార్ స్పోర్ట్స్‌కే చెందిన ‘హాట్ స్టార్’లో అవకాశం ఉండేది. అయితే ఈసారి మీడియా హక్కులు మారాయి. టీవీ ప్రసారాలు స్టార్ స్పోర్ట్స్‌లోనే వస్తాయి. డిజిటల్ హక్కులు మాత్రం అంబానీకి చెందిన వయాకామ్ 18 గ్రూప్ కొనుక్కుంది. దాంతో ఈసారి మొబైల్లో ‘జియో సినిమా’లో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడవచ్చు. ప్రారంబోత్సవ వేడుకలు... ఐపీఎల్లో చివరిసారిగా 2018లో ప్రారంబోత్సవ వేడుకలు జరిగాయి. పుల్వామాలో దాడి కారణంగా 2019లో నిర్వాహకులు వేడుకలు రద్దు చేశారు. ఈసారి ఆటతో పాటు తొలిరోజు పాట, నృత్యాల సంబరం కూడా ఉంది. ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ పాటతో పాటు కత్రినా కైఫ్, టైగర్ ష్రాఫ్, రష్మిక మంధాన, తమన్నా డ్యాన్స్‌లతో అలరిస్తారు. బుమ్రా మినహా... ఈసారి లీగ్‌లో భారత రెగ్యులర్ ఆటగాళ్లతో పాటు అంతర్జాతీయ స్టార్లు బరిలోకి దిగుతున్నారు. స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, కాన్వే, రూట్, హ్యారీ బ్రూక్ తదితరులు సత్తా చాటేందుకు సిద్ధమ య్యారు. అయితే గాయంతో అనూహ్యంగా దూరమైన వారిలో బుమ్రా అందరికంటే కీలక ఆటగాడు. అతను లేకుండా ముంబై బరిలోకి దిగుతుండగా, గాయంతో శ్రేయస్ అయ్యర్ కూడా తప్పుకున్నాడు. -
IPL 2023: ‘రన్’రంగం రె‘ఢీ’... ఐపీఎల్ పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ విశేషాలు
కరోనా నేపథ్యంలో గత మూడు సీజన్లు పలు ఆంక్షల మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నీకి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. ఈసారి ఎలాంటి ఆంక్షలు లేకుండా అభిమానులకు పూర్తిస్థాయిలో వేసవిలో పరుగుల విందు అందించడానికి ఐపీఎల్ జట్లు సిద్ధమయ్యాయి. శుక్రవారం అహ్మదాబాద్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్‌తో ఐపీఎల్ 16వ సీజన్‌కు తెర లేవనుంది. మొత్తం 10 జట్ల మధ్య 12 నగరాల్లో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో 70 మ్యాచ్‌లు ఉండగా... ప్లే ఆఫ్ దశలో నాలుగు మ్యాచ్‌లతో (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2, ఫైనల్) టోర్నీ ముగుస్తుంది. రాజస్తాన్ రాయల్స్ జట్టు జైపూర్‌తోపాటు గువాహటిలో... పంజాబ్ కింగ్స్ జట్టు మొహాలితోపాటు ధర్మశాలలో కూడా మ్యాచ్‌లు ఆడతాయి. కరోనా కంటే ముందు ఐపీఎల్లో ఇంటా, బయటా పద్ధతిలో ఆయా ఫ్రాంచైజీల మధ్య మ్యాచ్‌లు జరిగేవి. కరోనా కారణంగా ఈ పద్ధతికి విరామం ఇచ్చారు. ఇప్పుడు అంతా బాగుండటంతో నిర్వాహకులు మళ్లీ పాత పద్ధతిలో ఐపీఎల్‌ను నిర్వహించనున్నారు. నోట్: ప్లే ఆఫ్ (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2) మూడు మ్యాచ్‌ల తేదీలను, వేదికలను తర్వాత ప్రకటిస్తారు. ఫైనల్ మ్యాచ్ మే 28న జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ వేదికను కూడా తర్వాత ప్రకటిస్తారు. మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్ చానెల్స్‌లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
‘వన్డే’ విజేత ఎవరో? భారత్, ఆస్ట్రేలియా చివరి మ్యాచ్.. గెలిచినోళ్లదే సిరీస్
అంతర్జాతీయ క్రికెట్లో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య సమరం చివరి ఘట్టానికి చేరింది. టెస్టు సిరీస్‌ను గెలుచుకొని భారత్ ఆధిక్యం ప్రదర్శించగా, ఒక విజయంతో ఆసీస్ కూడా సంతృప్తిగా ముగించింది. ఇప్పుడు వన్డేల్లో ఇరు జట్లు సమంగా నిలిచిన స్థితిలో సిరీస్ విజేతను తేల్చే ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. విశాఖలో ఎదురైన ఘోర పరాజయానికి బదులు తీర్చుకుంటూ ఘనంగా ముగించాలని టీమిండియా భావిస్తుండగా... భారత్‌లో సిరీస్ సాధించే అరుదైన అవకాశాన్ని వదులుకోరాదని కంగారూలు పట్టుదలగా ఉన్నారు. ఇరు జట్లుసమ ఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆసక్తికర పోరుకు చెన్నై వేదిక కానుంది. చెన్నై: ఆ్రస్టేలియాతో తొలి వన్డేలో ఎంతో శ్రమించి నెగ్గిన భారత రెండో వన్డేలో పూర్తిగా చేతులెత్తేసింది. టెస్టు సిరీస్ ఫలితం ఎలా ఉన్నా మన వన్డే టీమ్ బలహీనతలను గత మ్యాచ్ చూపించింది. వరల్డ్ కప్ ఏడాదిలో ఆస్ట్రేలియాలాంటి పటిష్టమైన జట్టు ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుందనేది మనకు తాజా ఫలితం చూపించింది. ఈ నేపథ్యంలో ఆసీస్‌ను ఓడించి సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవడం భారత జట్టు తక్షణ లక్ష్యం. అయితే గత మ్యాచ్ ఇచ్చి న ఉత్సాహంతో స్మిత్ సేన కూడా సిరీస్ గెలుపుపై దృష్టి పెట్టింది. ఇలాంటి స్థితిలో భారత్, ఆసీస్ నేడు జరిగే చివరి వన్డేలో తలపడబోతున్నాయి. సుందర్‌కు చాన్స్! ‘సూర్యకుమార్‌కు మేం కనీసం 7–10 వన్డేల్లో అవకాశం కల్పిస్తాం’ వరుసగా రెండు మ్యాచ్‌లలో తొలి బంతికే అవుటైన తర్వాత కూడా కెప్టెన్ రోహిత్ చేసిన వ్యాఖ్య ఇది. దీనిని బట్టి చూస్తే భారత బ్యాటింగ్‌కు సంబంధించి టీమ్‌లో మార్పులు ఉండకపోవచ్చు. ఈ బ్యాటింగ్ బలగంతోనే విజయాన్ని అందుకోవాలని రోహిత్ పట్టుదలగా ఉన్నాడు. అయితే వైజాగ్‌లో స్టార్క్ బౌలింగ్‌ను చూస్తే టాప్–5 బ్యాటర్లు చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. స్వయంగా రోహిత్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉండగా, గిల్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. కోహ్లి కూడా సత్తా చాటితేనే భారత్ విజయవంపై ఆశలు పెంచుకోవచ్చు. బౌలింగ్ విషయంలో భారత్ ముందు ఇతర ప్రత్యామ్నాయాలేవీ లేవు కాబట్టి పేసర్లుగా షమీ, సిరాజ్ ఖాయం. పాండ్యా ఆల్‌రౌండర్‌గా తన పాత్ర నెరవేర్చగలడు. అక్షర్, జడేజాలాంటి స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లుకు తోడు గా మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కవచ్చు. పెద్దగా ఆకట్టుకోని కుల్దీప్ యాదవ్ స్థానంలో సుందర్ తన సొంతగడ్డపై తొలి మ్యాచ్ ఆడే అవకాశాలున్నాయి. వార్నర్ సిద్ధం... మరోవైపు సిరీస్ గెలిచే అవకాశాన్ని కోల్పోరాదని భావిస్తున్న ఆ్రస్టేలియా దానికి తగిన వ్యూహరచన చేస్తోంది. స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో ఒక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అబాట్‌ను తప్పించి అతని స్థానంలో మ్యాక్స్‌వెల్‌ను ఆడించనుంది. దూకుడైన బ్యాటర్ వార్నర్ గాయం నుంచి కోలుకోవడం జట్టు బలం పెంచింది. టెస్టుల్లో వార్నర్ విఫలమైనా... పరిమిత ఓవర్ల క్రికెట్లో అతను ఇప్పటికీ స్టార్ బ్యాటరే. మార్ష్ , హెడ్ విజయవంతమైన ఓపెనింగ్ జోడీనే అయినా వార్మర్ ఆడితే మార్ష్ మిడిలార్డర్‌కు మారతాడు. స్టొయినిస్, గ్రీన్‌లాంటి ఆల్‌రౌండర్లతో ఆసీస్ పటిష్టంగా ఉంది. అన్నింటికి మించి స్టార్క్ సూపర్ ఫామ్ జట్టును ముందంజలో నిలుపుతోంది. రెండు మ్యాచ్‌ల లోనూ అతను భారత బ్యా టర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. ఇదే ఒత్తిడిని స్టార్క్ కొనసాగించాలని ఆసీస్ కోరుకుంటోంది. -
Ind Vs Aus: ఆసీస్‌తో వన్డే సమరానికి టీమిండియా సై.. ప్రధాన లక్ష్యం అదే!
సాధారణంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఏ ఫార్మాట్లో పోరు అయినా ఆసక్తిని రేపుతుంది. కానీ బోర్డర్–గావస్కర్ ట్రోఫీకి ఉన్న ప్రాధాన్యత కారణంగా టెస్టు మ్యాచ్‌లపై ఇటీవలి వరకు అందరి దృష్టీ నిలవగా, త్వరలో జరగబోయే ఐపీఎల్‌పై కూడా చర్చ షురూ కావడంతో ఈ వన్డే సిరీస్‌పై హడావిడి కాస్త తక్కువగా కనిపిస్తోంది. పైగా వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో కూడా ఈ సిరీస్ భాగం కాదు. అయితే ఈ ఏడాది చివర్లో భారత్‌లోనే జరిగే వరల్డ్ కప్ కోసం రిహార్సల్‌గా ఆసీస్ ఈ సిరీస్‌ను చూస్తుండగా... భారత్ కూడా మెగా టోర్నీకి తమ అత్యుత్తమ వన్డే జట్టును ఎంచుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో మూడు వన్డేల్లో ఫలితంకంటే వ్యక్తిగత ప్రదర్శనలే కీలకం. ముంబై: టెస్టు సమరం తర్వాత భారత్, ఆ్రస్టేలియా వన్డేల్లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య నేడు వాంఖెడే మైదానంలో తొలి వన్డే జరుగుతుంది. ఈ ఫార్మాట్లో వరుస విజయాలతో టీమిండియా నిలకడ ప్రదర్శించగా...దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత కంగారూ బృందం వన్డే బరిలోకి దిగుతోంది. బలాబలాల దృష్ట్యా ఇరు జట్ల సమంగా కనిపిస్తుండగా, అంతిమ విజేత ఎవరో చూడాలి. మరో వైపు వ్యక్తిగత కారణాలతో రోహిత్ శర్మ తొలి వన్డేకు దూరం కావడంతో హార్దిక్ పాండ్యా తొలి సారి వన్డే కెపె్టన్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు. భారత్‌కు వన్డేల్లో కెపె్టన్‌గా వ్యవహరించిన 27వ ఆటగాడిగా పాండ్యా నిలుస్తాడు. పటిదార్‌కు అవకాశం! భారత జట్టు ఇటీవలి ఫామ్ చూస్తే తుది జట్టు విషయంలో ఎలాంటి సమస్య లేదు. అద్భుతమైన ఆటతో గిల్ తన ఓపెనింగ్ స్థానాన్ని ఖరారు చేసుకోగా, రోహిత్ గైర్హాజరులో కిషన్‌కు మళ్లీ టీమ్‌లో చోటు ఖాయం. వీరిద్దరు శుభారంభం అందిస్తే జట్టు భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. గత ఏడు వన్డేల్లో 3 సెంచరీలు బాదిన కోహ్లి ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన 75 సెంచరీల జాబితాలో మరిన్ని చేర్చుకునేందుకు ఇది అతనికి మరో అవకాశం. మిడిలార్డర్లో మెరుగైన రికార్డు ఉన్న రాహుల్ కూడా సత్తా చాటాల్సి ఉంది. అయితే నాలుగో స్థానంలో రెగ్యులర్‌గా ఆడే శ్రేయస్ గాయం కారణంగా దూరం కావడంతో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరం. సూర్యకుమార్ ఈ స్థానం కోసం అసలైన పోటీదారే అయినా ఆడిన 20 వన్డేల్లో అతని పేలవ రికార్డు సందేహాలు రేకెత్తిస్తోంది. కొత్త ఆటగాడు రజత్ పటిదార్నుంచి అతనికి పోటీ ఎదురవుతోంది. ఆల్రౌండర్లుగా హార్దిక్, జడేజా తమ స్థాయి ఆటను ప్రదర్శిస్తే తిరుగుండదు. ఇద్దరు ప్రధాన పేసర్లుగా షమీ, సిరాజ్ ఉంటే బ్యాటింగ్ బలం కోసం శార్దుల్‌ను ఎంపిక చేయవచ్చు. ఏకైక స్పిన్నర్ స్థానంకోసం అక్షర్, సుందర్ మధ్య పోటీ ఉంది. మ్యాక్స్‌వెల్‌పై దృష్టి... కమిన్స్, హాజల్‌వుడ్‌తో పాటు జాయ్ రిచర్డ్సన్లాంటి పేసర్లు దూరమైనా ఆ్రస్టేలియా జ ట్టుకు ఎలాంటి ఇబ్బంది లేదు. కావాల్సినన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. వరు సగా ఆల్రౌండర్లలో జట్టు నిండి ఉంది. గాయం నుంచి కోలుకొని చాలా రోజుల తర్వాత మ్యాక్స్‌వెల్ బరిలోకి దిగుతుండటం జట్టు బలాన్ని పెంచింది. ఫించ్ రిటైర్మెంట్ తర్వాత ఆడుతున్న తొలి సిరీస్‌లో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు హెడ్ ఉవ్వి ళ్ళూరుతున్నాడు. టెస్టుల్లో చెత్త ప్రదర్శన చూపిన వార్నర్ ఇక్కడైనా రాణించడం కీలకం. ఎప్పటిలాగే స్మిత్, లబుషేన్ బ్యాటింగ్ జట్టుకు కీలకం కానుంది. మిచెల్ మార్ష్ , స్టొయినిస్, సీన్ అబాట్, అస్టన్ అగర్...ఈ నలుగురు ఆల్‌రౌండర్లు తుది జట్టులోని రెండు స్థానాల కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి అవకాశం దక్కినా వారు టీమ్ విలువ పెంచగల సమర్థులు. ప్రధాన పేసర్‌గా స్టార్క్ ముందుండి నడిపించనుండగా యువ ఆటగాడు ఎలిస్‌కు కూడా అవకాశం ఖా యం. లెగ్‌స్పిన్నర్ జంపా భారత బ్యాట ర్లను ఇబ్బంది పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించగలడు. -
T20 World Cup 2022: ఇవాళ మరోసారి భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్
టీ20 వరల్డ్‌కప్-2022 అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లవర్స్‌కు దీపావళి కానుక ఇవ్వనుంది. భారత-పాక్ జట్ల మధ్య నిన్న జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ ఇవాళ (అక్టోబర్ 24) మరోసారి ప్రసారం చేయనుంది. రాత్రి 8 గంటలకు స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1HD, స్టార్ స్పోర్ట్స్ 1 Hindi, స్టార్ స్పోర్ట్స్ 1 HD Hindi ఛానల్స్‌లో ఫుల్ మ్యాచ్‌ను బాల్ టు బాల్ రీ టెలికాస్ట్ చేయనున్నట్లు స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం ప్రకటించింది. స్టార్ స్పోర్ట్స్ చేసిన ఈ ప్రకటనతో క్రికెట్ ప్రేమికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. స్టార్ స్పోర్ట్స్ మాకు నిజమైన దీపావళి కానుక ఇచ్చిందని సంబురపడిపోతున్నారు. కోహ్లి బాంబ్ మరోసారి పేలితే చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నామని అంటున్నారు. Star Sports will be streaming yesterday's India Vs Pakistan ball by ball full match repeat from 8pm tonight. Relive the King Kohli masterclass once again. — Mufaddal Vohra (@mufaddal_vohra) October 24, 2022 ఇదిలా ఉంటే, నిన్న జరిగిన దాయాదలు సమరాన్ని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ప్రత్యక్షంగా లక్ష మంది వరకు వీక్షించారు. డిజిటల్ ప్లాట్‌ఫాం వేదికపై అయితే నిన్నటి మ్యాచ్ గత రికార్డులన్నిటినీ తిరగరాసింది. డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ను ఏకంగా కోటి 80 లక్షల మంది వీక్షించారు. ఇవాళ మ్యాచ్ మరోసారి టెలికాస్ట్ అయితే భారీ సంఖ్యలో వ్యూస్ వస్తాయని స్టార్ స్పోర్ట్స్ అంచనా వేస్తుంది. కోహ్లి పటాకా ఇన్నింగ్స్ బాల్ టు బాల్ చూసేందుకు క్రికెట్ ప్రేమికులు ఎగబడతారని భావిస్తుంది. కాగా, చిరకాల ప్రత్యర్ధుల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి (53 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచితంగా పోరాడి టీమిండియాకు అపురూప విజయాన్నందించాడు. కోహ్లి పోరాటానికి హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన (40, 3/30) కూడా తోడవ్వడంతో టీమిండియా చారిత్రక విజయాన్ని సాధించింది. చదవండి: IND VS PAK: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా -
భారత్-పాక్ మ్యాచ్‌పై స్పందించిన డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం
చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. అక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. గతేడాది టి20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. టి20 ప్రపంచకప్ ఆరంభమైనప్పటికి ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరుతోనే వరల్డ్‌కప్ పీక్‌స్టేజీకి చేరుకోనుందడంలో సందేహం లేదు. తాజాగా హాలీవుడ్ సూపర్‌స్టార్(డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ 'ది రాక్') డ్వేన్ జాన్సన్ టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ డీసీ సూపర్ హీరో ప్రస్తుతం తన సినిమా బ్లాక్ ఆడమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 21న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ తన సినిమా ప్రమోషన్ కోసం స్టార్ స్పోర్ట్స్ చానెల్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే స్టార్‌స్పోర్ట్స్ యాజమాన్యం టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్‌పై డ్వేన్ జాసన్ చేసిన వ్యాఖ్యలను వీడియో రూపంలో విడుదల చేసింది. ప్రస్తుతం రాక్ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ''ఇద్దరు గొప్ప ప్రత్యర్థులు తలపడుతున్నారంటే ప్రపంచం మొత్తం ఆ ఇద్దరినే చూస్తుంది. టీమిండియా, పాకిస్తాన్ మధ్య జరిగేది ఒక మ్యాచ్ కాదు.. అంతకుమించి. ఇట్స్ టైమ్ ఫర్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. డోంట్ మిస్'' అంటూ డ్వేన్ జాసన్(ది రాక్) పేర్కొన్నాడు). ఇక ఐసీసీ మేజర్ టోర్నీల్లో(వన్డే వరల్డ్‌కప్, టి20 ప్రపంచకప్) పాకిస్తాన్‌పై టీమిండియాకు మంచి రికార్డు ఉంది. వన్డే ప్రపంచకప్‌లో ఇరుజట్లు తలపడిన ఏడుసార్లు టీమిండియాదే విజయం. ఇక టి20 ప్రపంచకప్‌లోనూ ఆరుసార్లు తలపడితే టీమిండియా నాలుగుసార్లు, పాక్ ఒక్కసారి మాత్రమే నెగ్గింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇక గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో మాత్రం టీమిండియా పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. .@TheRock is #ReadyForT20WC and will kickstart the #GreatestRivalry in style on 23rd Oct, 7 AM onwards on #CricketLive#IndvPak | #BelieveInBlue | ICC Men’s #T20WorldCup | #Blackadam pic.twitter.com/KawbyLbNGM — Star Sports (@StarSportsIndia) October 18, 2022 చదవండి: 'భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేస్తాం' 'ఎంపిక చేయలేదన్న కోపమా.. కసిని చూపించాడు' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
స్పెషల్ రికార్డు సృష్టించనున్న టీ20 ప్రపంచకప్-2022
ICC T20 World CUP 2022 creates very SPECIAL RECORD: ఐసీసీ టీ20 ప్రపంచకప్-2022 ప్రారంభం కాకముందే ఓ స్పెషల్ రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ మెగా ఈవెంట్.. ఏకంగా 222 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇప్పటి వరకు ఈ క్రికెట్ ఈవెంట్ కూడా ఇన్ని దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కాలేదు. ఇదే తొలి సారి కావడం విశేషం. అదే విధంగా ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి దాదాపు 10,000 గంటల ప్రత్యక్ష ప్రసారాన్ని ఛానెల్‌లు ఇవ్వనున్నాయి. మరోవైపు ప్రపంచకప్ మ్యాచ్ జరిగే అన్ని స్టేడియాల్లో ఐసీసీ దాదాపు 35కు పైగా కెమరాలను ఏర్పాటు చేసింది. అదే విధంగా మ్యాచ్ హైలెట్స్‌ను T20worldcup.com, టీ20 వరల్డ్ కప్ యాప్‌లో గానీ వీక్షించవచ్చు. భారత్‌లో వరల్డ్‌కప్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. స్టార్ స్పోర్ట్స్ ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, మలయాళం వంటి ప్రాంతీయ బాషల్లో కూడా ప్రసారం చేయనుంది. ఇక ఆక్టోబర్ 16న గీలాంగ్ వేదికగా జరగనున్న శ్రీలంక-నమిబీయా మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్-2022కు తెరలేవనుంది. చదవండి: చరిత్ర సృష్టించిన భారత కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి మహిళా క్రికెటర్‌గా -
భారత్-పాక్ మ్యాచ్ సందడి మొదలైంది.. హీటెక్కిస్తున్న హిట్‌మ్యాన్ ప్రోమో
విండీస్ టూర్ ముగిసిందో లేదో అప్పుడే భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ సందడి మొదలైంది. ఆసియా కప్ 2022లో భాగంగా చిరకాల ప్రత్యర్ధులైన ఈ రెండు దేశాలు ఆగస్ట్ 28న తలపడనున్నాయి. దాయాదుల మధ్య హైఓల్టేజీ సమరానికి 20 రోజుల ముందుగానే వాతావరణాన్ని వేడెక్కించేందుకు టోర్నీ ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ ఓ ఆసక్తికర ప్రోమోను విడుదల చేసింది. 𝐂𝐫𝐢𝐜𝐤𝐞𝐭'𝐬 𝐠𝐫𝐞𝐚𝐭𝐞𝐬𝐭 𝐫𝐢𝐯𝐚𝐥𝐫𝐲 returns to deliver a blockbuster with @ImRo45's #TeamIndia! 🤩#BelieveInBlue | #AsiaCup2022 | #INDvPAK | Aug 28, 6 PM | Star Sports & Disney+Hotstar pic.twitter.com/Jf01OLLwYz — Star Sports (@StarSportsIndia) August 8, 2022 ఇందులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాక్‌తో సమరానికి సై అన్నట్లుగా క్రీజ్‌లో కాలుదువ్వుతూ కనిపిస్తాడు. క్రికెట్ పరంగా భారత్-పాక్‌ల మధ్య ప్రత్యేక అనుబంధముందని, పాక్ జట్టులోనూ మంచి ఆటగాళ్లు ఉన్నారని రోహిత్ ఈ ప్రోమోలో ప్రస్తావిస్తాడు. భారత్ ఎనిమిదో సారి ఆసియా కప్ గెలవాలి, విశ్వవేదికపై భారత కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడాలంటూ అభిమానుల్లో ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. 140 crore fans cheering 𝑰𝒏𝒅𝒊𝒂 𝑰𝒏𝒅𝒊𝒂... there is no greater pride than this for @ImRo45. #BelieveInBlue and join us in supporting #TeamIndia at #AsiaCup 2022! Starts Aug 27 | Star Sports & Disney+Hotstar pic.twitter.com/gh2SPFmQEu — Star Sports (@StarSportsIndia) August 4, 2022 స్టార్ స్పోర్ట్స్ కొద్ది రోజుల ముందు కూడా రోహిత్‌ను హైలైట్ చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో హిట్‌మ్యాన్.. 140 కోట్ల మంది భారత అభిమానులు ‘‘ఇండియా.. ఇండియా’’ అని ముక్తకంఠంతో నినదిస్తుంటే వినడం కంటే గొప్ప అనుభూతి ఉండదని, ఆసియా కప్‌లో త్రివర్ణ పతాకం మరోసారి రెపరెపలాడిద్దాం రమ్మని అభిమానులకు పిలుపునిచ్చాడు. ఇదిలా ఉంటే, తాజాగా విండీస్‌తో ముగిసిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: రోహిత్‌కు రెస్ట్.. కెప్టెన్‌గా హార్ధిక్.. మరో కొత్త ఓపెనింగ్ జోడీతో ప్రయోగం -
IND VS PAK: మౌకా.. మౌకా యాడ్‌కు మంగళం పాడిన స్టార్ స్పోర్ట్స్.. కారణం అదేనా..!
Mauka Mauka Ad: 2015 నుంచి ప్రపంచకప్‌లో భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ షెడ్యూలైన ప్రతిసారి మౌకా.. మౌకా అనే యాడ్ టీవీల్లో మార్మోగిపోయేది. అప్పటి నుంచి దాయాదుల సమరం జరిగిన ప్రతిసారి స్టార్ స్పోర్ట్స్ ఈ యాడ్‌ను ప్రసారం చేసేది. ఆసియా కప్-2022లో భాగంగా భారత్-పాక్ మెగా పోరుకు (ఆగస్ట్ 28) ముందు కూడా మౌకా.. మౌకా యాడ్ టీవీల్లో సందడి చేస్తుందని భారత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ యాడ్ జాడ లేకపోవడంతో వారంతా ఈ విషయంపై ఆరా తీయడం మొదలుపెట్టారు. యాడ్‌ను రూపొందించే స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యాన్నే నేరుగా సంప్రదించి విషయం కనుక్కునే పనిలో పడ్డారు. తాజాగా యాడ్ విషయమై స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం స్పందించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి మౌకా.. మౌకా యాడ్ ప్రసారం ఉండదని వారు తేల్చి చెప్పినట్లు సమాచారం. త్వరలో జరుగబోయే టీ20 ప్రపంచకప్‌కు కూడా ఈ యాడ్‌ను రూపొందించే ఉద్దేశం లేనట్టు స్టార్ స్పోర్ట్స్ వర్గాలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో టీమిండియా ఓటమి చెందడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా, మౌకా.. మౌకా యాడ్‌లో పాక్ అభిమాని ప్రపంచకప్‌లో పాకిస్తాన్ భారత్‌ను ఓడించాక బాణసంచా కాల్చి సంబురాలు చేసుకోవాలని భావిస్తుంటాడు. అయితే గతేడాది టీ20 వరల్డ్‌కప్ వరకు ఆ పాక్ అభిమాని కల నెరవేరలేదు. 2021 వరల్డ్‌కప్‌లో పాక్ చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. 1992 వరల్డ్ కప్ నుంచి దాయాదుల పోరు జరిగిన ప్రతిసారి టీమిండియానే విజయం వరించగా.. 2021లో మాత్రం పాక్ గెలుపొందింది. ఈ విజయంతో యాడ్ యొక్క ఉద్దేశం పూర్తి అయినట్లైంది. చదవండి: Ind Vs WI: నిరాశకు లోనయ్యాను... ఇక ముందు: సూర్యకుమార్ -
ఆసియాలో ఆధిపత్యం కోసం యుద్ధం.. ఆసియా కప్ 2022 ప్రోమో అదుర్స్..!
Asia Cup 2022: నాలుగేళ్లుగా క్రికెట్ అభిమానులను ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న ఆసియా కప్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. యూఏఈ వేదికగా ఆగస్ట్ 27 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. మొత్తం 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ జట్లు ఇదివరకే అర్హత సాధించగా.. ఆరో బెర్త్ కోసం హాంకాంగ్, సింగపూర్, కువైట్, యూఏఈలు క్వాలిఫికేషన్ రౌండ్లో తలపడనున్నాయి. The battle for Asian supremacy is 🔛. Get set to #BelieveInBlue as @ImRo45 leads #TeamIndia at the #AsiaCup2022!💙Starts Aug 27 | Star Sports & Disney+Hotstar pic.twitter.com/K2hcfuGeBK— Star Sports (@StarSportsIndia) July 22, 2022 తాజాగా టోర్నీకి సంబంధించిన ప్రోమోను ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ ట్విటర్ వేదికగా విడుదల చేస్తూ.. ఆసియాలో ఆధిపత్యం కోసం యుద్ధం అంటూ క్యాప్షన్‌ను జోడించింది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 45 సెకెన్ల పాటు సాగిన ఈ ప్రోమోలో అత్యధిక భాగం భారత ఆటగాళ్లు దర్శనమివ్వగా.. పాక్ నుంచి బాబర్ ఆజమ్, షాహిన్ అఫ్రిది, బంగ్లాదేశ్ నుంచి షకీబ్ అల్ హసన్, ఆఫ్ఘనిస్తాన్ తరఫున రషీద్ ఖాన్ కనిపించారు. ఈ టోర్నీలో ఆగస్టు 28న భారత్-పాకిస్తాన్ జట్లు గ్రూప్ దశలో తలపడనున్న విషయం తెలిసిందే. చదవండి: టీమిండియా డ్రెస్సింగ్ రూంలో అనుకోని అతిధి.. ఏం చేశాడో చూడండి..!