టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని గుర్తుపట్టలేనంతగా తయారయ్యాడు. అదేంటి ధోనికి ఏమైంది అని కంగారుపడకండి. విషయంలోకి వెళితే.. ఐపీఎల్ 2022 ప్రమోషన్‌లో భాగంగా ధోని న్యూలుక్‌తో దర్శనమిచ్చాడు. ఐపీఎల్‌ను ప్రసారం చేసే స్టార్‌స్పోర్ట్ బ్రాడ్‌కాస్టింగ్ ఈ ప్రమోషన్‌ను రూపొందించింది.
ఖాకీ చొక్కా.. అదే కలర్ ప్యాంటు.. వేసుకొని మెలితిప్పిన మీసంతో ధోని అదరగొట్టాడు. ఇంకా చెప్పాలంటే చెన్నై బస్‌డ్రైవర్ యునిఫామ్ వేసుకొని.. చేతిలో మైక్ పట్టుకొని ఆటకు వేళాయే అన్నట్లుగా లుక్ ఉంది. ఇక చివర్లో కూలింగ్ గ్లాస్ పెట్టుకొని బస్ స్టార్ట్ చేస్తూ ధోని ఇచ్చిన లుక్ హైలెట్‌గా నిలిచింది. సరిగ్గా గమనిస్తే తప్ప ధోనిని గుర్తుపట్టలేం. అంతలా మారిపోయాడు.. ఈ మాస్టర్ మైండ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోనూ స్టార్‌స్పోర్ట్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక ఎంఎస్ ధోని ఐపీఎల్ ఆడడం ఇదే చివరిసారి అని చాలా మంది భావిస్తున్నారు. గత సీజన్‌లో సీఎస్‌కేను నాలుగోసారి చాంపియన్స్‌గా నిలిపిన ధోని.. మరోసారి అదే కసితో బరిలోకి దిగుతున్నాడు. మరి ఐదోసారి సీఎస్‌కేను విజేతగా నిలిపి పర్‌ఫెక్ట్ ముగింపు ఇస్తాడేమో చూడాలి.
కాగా బీసీసీఐ.ఐపీఎల్–15 సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 26 న ప్రారంభమవ్వగా ఫైనల్ మ్యాచ్ మే 29న జరగనుంది. మొత్తం 10 టీమ్‌లు 72 మ్యాచ్‌లు ఆడే విధంగా షెడ్యూల్‌ను రూపొందించింది. ముంబైలోని వాంఖడే (20 మ్యాచ్‌లు), బ్రబౌర్న్ (15), డీవై పాటిల్ (20) స్టేడియాలతో పాటు పుణెలోని ఎంసీఏ స్టేడియం (15)ను వేదికలుగా ఎంపిక చేశారు. ఈ సారి ఏ టీం ఎన్నిసార్లు టైటిల్ గెలిచింది. ఏ టీం ఎన్ని సార్లు ఫైనల్ కు చేరిందనేది దృష్టిలో పెట్టుకుని 10 టీంలను రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు.
గ్రూప్ ‘ఎ’: ముంబై ఇండియన్స్ (సీడింగ్–1), కోల్‌కతా నైట్‌రైడర్స్(3), రాజస్తాన్ రాయల్స్ (5), ఢిల్లీ క్యాపిటల్స్ (7), లక్నో సూపర్ జెయింట్స్ (9).
గ్రూప్ ‘బి’: చెన్నై సూపర్ కింగ్స్ (2), సన్‌రైజర్స్ హైదరాబాద్ (4), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (6), పంజాబ్ కింగ్స్ (8), గుజరాత్ టైటాన్స్ (10).
చదవండి: Rohit Sharma: టి20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొత్త రికార్డు
Harbhajan Singh-Geeta Basra: 'బ్రేకప్ చెప్పేసుకున్నారు.. కానీ పెళ్లి చేసుకున్నారు'
Comments
Please login to add a commentAdd a comment